Indian History | స్వతంత్ర కాంక్ష… అతివాద చైతన్య ఉద్యమాలు
గోపాలకృష్ణ గోఖలే
- బిరుదులు: జాతీయోద్యమ పితామహుడు
- దేశభక్తుల్లో రారాజు
- ఎం.హెచ్ సోక్రటీస్
పత్రికలు : రాష్ట్ర సభ సమాచార్
2) సుధారణ్
3) క్వార్టర్లీ
సంస్థలు: సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దక్కన్ సభ. - 1911లో బ్రిటిష్‌వారితో ఉచిత విద్యను కొరారు.
- ఇతడు గాంధీకి రాజకీయ గురువు. కమర్షియల్ కీపర్‌గా పేరు గాంచెను.
సురేంద్రనాథ్ బెనర్జీ
- బిరుదులు: దేశోత్తమ, ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమస్తనీస్, జాతి గురు.
- పత్రిక: బెంగాలి
- పుస్తకం : ది నేషన్ ఇన్ ది మేకింగ్
- ఇతడు నాయకత్వం వహించిన ఉద్యమం – వందేమాతరం / స్వదేశీ ఉద్యమం
- 1902లో జరిగిన అహ్మదాబాద్, 1895లో జరిగిన పుణె భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించాడు .
- కె.కె. మిశ్రా పత్రిక అయిన సంజీవనిలో Bycott/ బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారి వాడారు.
అబుల్ కలాం ఆజాద్
- ఇతడు నవంబర్ 11న మక్కాలో జన్మించాడు.
- పత్రికలు : ఆల్‌హిలాల్, బిల్హిలాల్, ఆల్ బలాద్
- పుస్తకం: ‘ఇండియా విన్స్ ఫ్రీడం’
- ఇతడు నవంబర్ 11న జన్మించాడు. ఇతడు భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి. అందుకే నవంబర్ 11న జాతీయ విద్యా దినం జరుపుకొంటారు.
ఫిరోజ్‌షా మెహతా
- బిరుదులు: సర్, మకుటం లేని బొంబాయి మహారాజు
- పత్రిక: బొంబాయి క్రానికల్
- ఇతడు బొంబాయి యూనివర్సిటీకి 1915 లో వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
అతివాదులు (1905-1919)
లక్ష్యాలు : 1) బహిష్కరణ 2) స్వరాజ్ 3) ఉత్సవాలు, ఊరేగింపులు
బాలగంగాధర్ తిలక్
- మహారాష్ట్రలోని రత్నగిరి అనే గ్రామంలో 1856 చిత్పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు
- బిరుదులు: భారత అశాంతి జనకుడు
2) లోకమాన్య. 3) అలజడి పితామహుడు
4) భారతదేశ మకుటంలేని మహారాజు - పత్రికలు : మరాఠీ (ఇంగ్లిష్), కేసరి (మరాఠీ)
- గ్రంథాలు: గీతా రహస్యం, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్
- 18 లాఠీ క్లబ్‌లను ఏర్పాటు చేసెను. వీటినే ‘అఘఖానా’లు అంటారు.
- ఆర్యులు – ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి వచ్చారన్నారు.
- 1893లో గణేష్ ఉత్సవాలు, 1895లో శివాజీ ఉత్సవాలు నిర్వహించారు.
- 1897లో ర్యాండ్ కమిషన్ (ప్లేగు వ్యాధిపై వేసిన కమిషన్) అధ్యక్షుడు ర్యాండ్ను హత్య చేశారు.
- దీంతో ఇతన్ని బర్మాలోని మాండలే జైలులో 18 నెలలు బంధించారు.
- రెండోసారి 1908-14 వరకు దేశ ద్రోహచర్య కింద బర్మాలోని మాండలే జైలులో 6 సంవత్సరాలు బంధించారు.
- 1915-16 మధ్య కాలంలో హోమ్‌రూల్ లీగ్‌ను ప్రారంభించారు.
- దీనికి అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్ట్, కార్యదర్శి- ఎ. సి. కెట్కర్. దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది.
- ఇతని నినాదాలు – ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతా’
- కాంగ్రెస్ సంవత్సరానికి ఒకసారి కప్పల్లా అరిస్తే ఏమీ సాధించలేరు.
లాలా లజపతిరాయ్
- ఇతడు పంజాబ్‌లో 1865లో జన్మించారు.
- బిరుదులు: పంజాబ్ కేసరి share-e-punjab
- పత్రికలు: పంజాబీ, పీపుల్స్, వందేమాతరం
- పుస్తకాలు: Unhappy India, Aray Samaj
- నినాదాలు: ఆర్యసమాజం నా తల్లి, వైదిక ధర్మం నాతండ్రి
- 1927లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో తిరుగుబాటు చేశారు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠిచార్జీ, కాల్పుల్లో లాల్ మరణించాడు. ఈ కాల్పులు జరిపించిన వాడు సాండర్స్.
- దీనికి వ్యతిరేకంగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు చంద్రశేఖర్ ఆజాద్‌లు సాండర్స్‌ను హత్య చేశారు. దీనినే లాహోర్ కుట్ర అంటారు.
బిపిన్ చంద్రపాల్
- ఇతడు గొప్పవక్త. ఇతడు బెంగాల్ వాసి
- బిరుదులు 1) బెంగాల్ డాన్టన్
- 2) విప్లవకారుల పితామహుడు
- పత్రికలు-వందేమాతరం, న్యూ ఇండియా, ఇండిపెండెంట్, పారదర్శక్
- ఇతడు వందేమాతర కాలంలో తెలుగు రాష్ర్టాలను సందర్శించాడు. ఇతని ప్రసంగాన్ని (స్పీచ్) తెలుగులో అనువదించింది. – చిలకమర్తి లక్ష్మీనర్సింహం
అరబిందో ఘోష్
- బిరుదు – స్వామి
- పత్రికలు – వందేమాతరం, ఆర్య
- పుస్తకాలు: సావిత్రి, న్యూలాప్స్ ఆఫ్ ద ఓల్డ్
- లైఫ్ డివైన్, భవాని రుందిర్
- ఇతని ఆశ్రమం- ఆరావళి పర్వతాల్లోని పాండిచ్చేరి లో కలదు.
- ఇతడు 14 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 1893లో విడుదలయ్యారు.
వందేమాతర ఉద్యమం\ స్వదేశీ ఉద్యమం(1905-11)
- బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమమే వందేమాతర / స్వదేశీ ఉద్యమం
- స్వదేశీ ఉద్యమానికి -వందేమాతరం అని పేరు పెట్టింది అశ్విని కుమార్ దత్
- వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించినది సురేంద్రనాథ్ బెనర్జీ, కె.కె. మిశ్రా
- కె.కె. మిశ్రా స్థాపించిన సంజీవని అనే పత్రికలో బహిష్కరణ/ బాయ్‌కాట్ అనే పదాన్ని సురేంద్రనాథ్ మొదటి సారిగా వాడారు.
- భారతీయుల్లో ఐక్యత పెరగడాన్ని చూసిన ఆంగ్లేయులు, బెంగాల్‌ను విభజించాలని 1903లో నిర్ణయం తీసుకున్నారు.
- చివరగా 1905 జూలై 19న హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్‌గా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)గా విభజిస్తున్నట్లు లార్డ్ కర్జన్ ప్రకటన చేశాడు.
- దీంతో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో వందేమాతర / స్వదేశీ ఉద్యమం ప్రారంభమయ్యెను.
- 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది.
- విభజనకు ముందు, సమైక్య బెంగాల్ మొత్తం జనాభా – 8 కోట్ల 50 లక్షలు
- విభజన తర్వాత పశ్చిమ బెంగాల్ జనాభా 5 కోట్లు
- తూర్పు బెంగాల్ జనాభా 3.5 కోట్లు
- అక్టోబర్ 16న భారతీయులను రవీంద్రనాథ్ ఠాగూర్ కింది విధంగా పాటించమని తెలిపారు/ సలహ ఇచ్చారు.
- బెంగాల్ ప్రజలంతా సరస్సులు కొలనుల్లోకి వెళ్ళి స్నానాలు ఆచరించి, అర్ధనగ్నంగా వీధుల్లో ప్రదర్శనలు చేస్తూ రాఖీలు కట్టించుకొని సోదర భావాన్ని తెలపండి అని సూచించారు.
- వందేమాతర ఉమ్యమకాలంలో 1906లో బెంగాల్లో వంగలక్ష్మీ కాటన్ మిల్‌ను స్థాపించారు.
- ఈ మిల్లును ఆర్థికంగా సహయం చేసింది మునీంద్ర నంది
- స్వదేశీ / వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రను పర్యటించిన అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్
- బెంగాల్ విభజనను రద్దు చేసుకోమని 1905లో జార్జ్-5, హార్డింజ్ను సూచించాడు
- ఈ విధంగా భారత్‌ను సందర్శించిన ఏకైక బ్రిటిష్ చక్రవర్తి /రాజు -5 జార్జ్.
- ఢిల్లీ దర్బార్‌ను జార్జ్-5 కోసం ఏర్పాటు చేసింది -హార్డింజ్-2
- 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసింది
- దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చమని కోరిన పార్టీ ముస్లింలీగ్ పార్టీ
- దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది హార్డింజ్-2
రవీంద్రనాథ్ ఠాగూర్
- 1905లో అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని ఠాగూర్ బెంగాల్లో రాశారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ జాతీయ గీతం.
- 1991లో బెంగాల్ విభజన రద్దు అయినపుడు జనగణమన ను సంస్కృతంలో అనువదించారు.
- 1919 ఫిబ్రవరిలో మదనపల్లిలో ఠాగూర్ జనగణమనను The Morning Song of India పేరుతో ఆంగ్లంలో అనువదించారు.
- జనగణమనకు స్వరకల్పన చేసింది మార్గరెట్ కజిన్స్.
- రవీంద్రనాథ్ఠాగూర్కు బ్రిటిష్‌వారు ఇచ్చిన బిరుదు సామూహిక ఆందోళన పితామహుడు.
సుభాష్ చంద్రబోస్
- 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జన్మించారు.
- బిరుదులు: నేతాజీ, దేశ భక్తుల్లో యువరాజు, దేశ్‌నాయక్
- పత్రిక: స్వరాజ్
- పుస్తకం: ద ఇండియన్ స్ట్రగుల్
- రాజకీయ గురువు: చిత్తరంజన్ దాస్ (దేశబంధు)
- 1919లో ఐసీఎస్‌కు ఎన్నికయ్యారు. 1919లోనే కాంగ్రెస్‌లో చేరారు.
- 1937లో హెలిషంకి అనే ఆస్ట్రియా యువతిని వివాహం చేసుకొన్నాడు.
- 1938లో హరిపూర్ ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు
- 1942లో వీరికి అనితా బోస్ జన్మించింది.
- 1939లో త్రిపుర ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు. సమావేశంలో అధ్యక్షుడిగా పట్టాభి సీతారామయ్య (గాంధీ శిష్యుడు) పోటీ పడ్డారు.
- పట్టాభి పత్రికలు నెగిటివ్ పీపుల్, జన్మభూమి
- పట్టాభి రాసిన గ్రంథం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చరిత్ర
- పట్టాభి నినాదం – గాంధీ మరణించాడు కానీ గాంధీయిజం మరణించలేదు.
- 1923లో పట్టాభి సీతారామయ్య ఆంధ్రబ్యాంక్‌ను స్థాపించారు. 1980లో దీన్ని జాతీయం చేశారు.
- 1941లో సుభాష్‌ను కలకత్తాలో గృహనిర్బంధం చేశారు.
- అక్కడ నుంచి కాబులీ వేషంలో రష్యా మీదుగా జర్మనీ చేరుకొని హిట్లర్‌ను కలిసారు.
- సుభాష్ చంద్రబోస్‌ను హిట్లర్ మొదటిసారి నేతాజీ అని పిలిచారు.
- హిట్లర్ సలహామేరకు జపాన్ చేరుకున్నారు.
- 1942లో మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్‌లో స్థాపించారు.
- 1943లో సుభాష్ చంద్రబోస్ దీనికి అధ్యక్షుడు అయ్యారు.
- సుభాష్ తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
1) గాంధీ రెజిమెంట్ (దళం/ గ్రూప్)
2. నెహ్రూ రెజిమెంట్
3) సుభాష్ రెజిమెంట్
4) మహిళల రెజిమెంట్ - మహిళల రెజిమెంట్‌కు ఝాన్సీ రెజిమెంట్ అని పేరు పెట్టారు. దీనికి లక్ష్మీసెహగల్ నాయకత్వం వహించారు.
- 1940లో ఢిల్లీ ఛలో వ్యక్తిగత సత్యాగ్రహం చేశారు.
- నినాదాలు: జై హింద్, ఛలో ఢిల్లీ, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేనుమీకు స్వేచ్ఛను ఇస్తాను
- 1943లో రంగూన్ చేరుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- 1944 కొహిమాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అండమాన్, నికోబార్ దీవులను ఆక్రమించుకొని నికోబార్‌ను స్వరాజ్ దీవులు, అండమాన్‌కు షాహిద్ దీవులు అని నామకరణం చేశారు.
- 1945 ఆగస్టు 18న బ్యాంకాక్ నుంచి టోక్యో వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించాడని పేర్కొంటారు.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
Next article
PHYSICS | చలనంలో ఉన్న బస్సు నుంచి ఏ విధంగా దిగాలి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు