TS Gurukulam Notification | గురుకుల కొలువులు.. 9,231 పోస్టుల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్ విడుదల
Telangana Gurukulam Notification 2023 | తెలంగాణ కొలువుల మేళాలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో ఈ పోస్టుల భర్తీకి సిద్ధమైన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ట్రిబ్).. మరో పక్షం రోజుల్లో మిగిలిన 1,444 పోస్టులకు రెండో విడత నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే శాఖలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాల యాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న వాటిలో తొలిదఫాగా 9,231 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగా ణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ మల్లయ్యభట్టు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనుండగా, 17వ తేదీ నుంచి పోస్టులవారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నదని ఆ ప్రకటనలో వెల్లడించారు. అన్ని గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం 11,687 పోస్టులను మంజూరు చేసిం ది. అందులో బోధనా సిబ్బందికి సంబంధించినవి 10,675 పోస్టులు, కాగా, 1,012 బోధనేతర పోస్టులు. బోధనా సిబ్బంది పోస్టులను
ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బోధనేతర సిబ్బంది పోస్టుల్లో స్టాఫ్‌నర్స్ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ 3, ఇతర గ్రూప్ 4 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. అందులో ప్రస్తుతం గురుకులాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్ చేపట్టింది. మొత్తంగా 10,675 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, అందులో తొలి విడతలో ప్రస్తుతం 9,231 పోస్టుల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
15 రోజుల్లో మరో 1,444 పోస్టులకు..
ప్రస్తుతం 9,231 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన ట్రిబ్ రెండో విడతగా మిగిలిన 1,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని, సర్వీస్ రూల్స్‌లో ఉన్న పోస్టుల భర్తీని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని గురుకులాల్లో పలు విభిన్న కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఫ్యాషన్ డిజైనింగ్, అగ్రికల్చర్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభిన్న, ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెడుతున్నది. ప్రస్తుతం ఆయా పోస్టులకు సంబంధించి ఎలాంటి సర్వీస్ రూల్స్‌ను రూపొందించలేదు. మెస్ ఇన్చార్జివంటి పలు నూతన పోస్టులు కూడా మంజూరయ్యాయి. వాటికి కూడా సర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉండడంతోపాటు పలు పోస్టులకు సంబంధించి కొన్ని న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ సమస్యలన్నీ 15 రోజుల్లో పరిషరించి రెండో విడతలో మిగిలిన 1,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ట్రిబ్ సన్నాహాలు చేస్తున్నది.
పకడ్బందీగా ప్రణాళికలు
ఇటీవల గ్రూప్-1 పేపర్ లీకేజీ నేపథ్యంలో గురుకుల నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. పరీక్ష నిర్వహణకు సమగ్ర ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలైంది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన పోస్టుల రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం ఏ విధంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే అంశంపై బోర్డు వర్గాలు సుదీర్ఘ కసరత్తు చేశాయి. పరీక్ష తేదీల ఖరారు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలైంది. ముందుగా ఏ పోస్టుల భర్తీని చేపట్టాలనే అంశంపై ట్రిబ్ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా తొలుత పైస్థాయి పోస్టుల భర్తీతో మొదలుపెట్టి కిందిస్థాయి పోస్టుల భర్తీకి క్రమానుగతంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అందుకు అనుగుణంగానే నోటిఫికేషన్ విడుదల చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?