NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో 325 పోస్టులు
NPCIL Recruitment 2023 | ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ తదితర విభాగాలలో ఖాళీలను ఎన్పీసీఐఎల్ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ఏప్రిల్ 11న ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 325 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గేట్ 2021, 2022, 2023 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 325
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్.
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : గేట్ 2021, 2022, 2023 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
దరఖాస్తు ఫీజు : రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
వయస్సు : ఏప్రిల్ 28 నాటికి 26 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.56,100
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఏప్రిల్ 11
చివరితేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://www.npcil.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






