Competitive Exams Special | ఒక్క డాలర్.. 24కె పూత..‘ఆస్కార్’
ఆస్కార్ అవార్డులు – 2023
- ఇవి 95వ అవార్డులు
- 2022లో విడుదలైన సినిమాలకు అందజేశారు.
- ప్రకటించి, ప్రదానం చేసిన రోజు- 2023, మార్చి 12 (భారత కాలమానం ప్రకారం 2023, మార్చి 13)
- వీటిని అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ప్రదానం చేశారు. ఈ థియేటర్‌ను గతంలో ‘కొడక్ థియేటర్’ అనేవారు.
- ఈ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన సినిమా- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11)
- అత్యధిక అవార్డులు పొందిన సినిమా- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (7)
విజేతలు
- ఉత్తమ చిత్రం-ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ఉత్తమ నటుడు-బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్ సినిమాకు)
- ఉత్తమ నటి-మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ దర్శకుడు-డానియల్ క్వాన్,
- డానియల్ షీనర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ సహాయ నటుడు- కీ హుయ్ ఖ్వాన్ (11)
- ఉత్తమ సహాయ నటి – జేమీ లీ కర్టిస్ (11)
- ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్-ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ షార్ట్ సబ్జెక్ట్ – ది ఎలిఫెంట్ విస్పరర్స్
- ఈ వేడుకల్లో ఉష్ణోగ్రతల దృష్ట్యా రెడ్ కార్పెట్‌కు బదులు షాంపైన్ రంగు కార్పెట్‌ను ఏర్పాటు చేశారు.
- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనేది జర్మన్ భాషా సినిమా. ఎడ్వర్డ్ బెర్జర్ దర్శకత్వం వహించారు.
- ఈ సినిమా మొదటి ప్రపంచ యుద్ధంపై రాసిన నవల ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ నుంచి తీసుకున్నారు.
- ది వేల్ సినిమా 2022లో విడుదలైన సైకలాజికల్ డ్రామా.
- ఆసియా నుంచి మొదటిసారి ఉత్తమ నటి అవార్డు పొందిన వారిగా మిషెల్ యో చరిత్ర సృష్టించింది.
- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేది సైన్స్ ఫిక్షన్ సినిమా. ఎలివన్ క్వాడ్ అనే చైనీస్ వలసదారుల కుటుంబం అమెరికాలో లాండ్రీషాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తనలాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొంది? అనే కథతో రూపొందింది.
- భారతదేశం 2023లో రెండు ఆస్కార్ అవార్డులు పొందింది.
1. ఎలిఫెంట్ విస్పరర్స్ (ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో)
2. నాటు నాటు పాట (ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పొందాయి)
ఎలిఫెంట్ విస్పరర్స్ - ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుములైలో బొమ్మన్, బెల్లీ అనే జంట ‘ముదుములై శాంక్చురీ’లో ఏనుగుల సంరక్షకులుగా పని చేస్తూ రఘు అనే గున్న ఏనుగుతో పెంచుకున్న అనుబంధంపై రూపొందింది.
- రఘుతో పాటు ‘అమ్ము’ అనే మరో ఆడ ఏనుగు పిల్లను బాధ్యతగా చూసుకుంటారు.
- ఏనుగులు, బొమ్మన్-బెల్లీ జంట భావోద్వేగ అనుబంధాన్ని సున్నితంగా ఆవిష్కరించారు. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించగా గునీత్ మోంగా చిత్రాన్ని నిర్మించారు.
- ఇది తమిళ భాషా సినిమా. ఈ చిత్రం నిడివి 39 నిమిషాలు. కార్తికి గోన్సాల్వేస్‌కు ఇది దర్శకురాలిగా తొలి సినిమా. ఈమె ఫొటో జర్నలిస్ట్.
- ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి ఆస్కార్ పొందిన తొలి సినిమా ఇది.
‘నాటు నాటు’ పాట - ఇది ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలోనిది. చంద్రబోస్ రచించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకులుగా వ్యవహరించారు. దాసరి వీర వెంకట దానయ్య నిర్మించారు.
- ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు పొందగా రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి అవార్డులు అందుకున్నారు.
- భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన, అవార్డు పొందిన తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది.
- ఒక పూర్తిస్థాయి భారతీయ సినిమా ఆస్కార్ అవార్డు పొందడం ఇదే తొలిసారి.
- 2009 లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన జయ హో పాట కూడా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు పొందింది. కాని అది ఇంగ్లండ్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయింది.
నాటు నాటు పాట పొందిన అవార్డులు
1. ఆస్కార్ అవార్డు- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో (12.3.2023)
2. క్రిటిక్స్ చాయిస్ అవార్డు- ఉత్తమ గీతం విభాగంలో (15.1.2023)
3. గోల్డెన్ గ్లోబ్ అవార్డు- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో (10.1.2023)
4. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు – ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో (24.2.2023)
5. హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు-ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో (18.2.2023)
6. ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు- ఒరిజినల్ సాంగ్ విభాగం (23.1.2023) - ఈ పాటను ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనమైన ‘మారిస్సీ ప్యాలెస్’ వద్ద చిత్రీకరించారు.
ఆస్కార్ అవార్డుల విశేషాలు
- వీటినే ‘అకాడమీ అవార్డులు’ అని పిలుస్తారు.
- 1927లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఎంజీఎం (మెట్రో గోల్డ్విన్ మేయర్) చీఫ్ లూయీస్ బి.మేయర్ ఇంట్లో ఓ సాయంత్రం విందు భోజన సమయంలో ఈ అవార్డుల ప్రతిపాదన జరిగింది.
- చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా ఒక వ్యవస్థీకృత సమూహాన్ని సృష్టించాలని లూయీస్ బి.మేయర్ విందుకు హాజరైన అతిథులతో చర్చించారు. ముఖ్యంగా అమెరికా చలనచిత్ర రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు.
- 1927లో సినీ పరిశ్రమలోని అన్ని సృజనాత్మక శాఖల నుంచి 36 మంది ఆహ్వానితులు లాస్ ఏంజెల్స్‌లోని అంబాసిడర్ హోటల్లో సమావేశమయ్యారు.
- ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)ను స్థాపించే ప్రతిపాదనను చర్చించారు.
- 1927లో AMPAS ఏర్పాటు చేసి అకాడమీ బోర్డ్ ఏర్పాటు చేశారు. దీని తొలి అధ్యక్షుడిగా డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ నియమితులయ్యారు.
- 1928లో అకాడమీ బోర్డ్ ఏర్పాటు చేసిన తొలి కమిటీల్లో ఒక కమిటీ ‘అవార్డు ఆఫ్ మెరిట్’. ఇందులో ఏడుగురు సభ్యులు ఉండగా వారు 12 విభాగాల్లో అవార్డులు అందజేయాలని సూచించారు.
- మొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 1929, మే 16న రూజ్వెల్ట్ హోటల్లోని బ్లోసమ్ రూమ్‌లో జరిగింది.
- ఈ మొదటి ప్రదానోత్సవానికి 270 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి మూడు నెలల ముందే విజేతల పేర్లు ప్రకటించారు.
- 1930 నుంచి విజేతల పేర్లు ముందే ప్రకటించకుండా అవార్డుల ప్రదానోత్సవం వరకు రహస్యంగా ఉంచారు. అయితే వేడుక రోజు రాత్రి 11:00 గంటల కల్లా వార్తా పత్రికల్లో ప్రచురించేందుకు వీలుగా మీడియా సంస్థలకు విజేతల పేర్లు ముందే ఇచ్చేవారు.
- 1940 వరకు ఈ పద్ధతి కొనసాగింది. 1940లో లాస్ఏంజిల్స్ టైమ్స్ అనే పత్రిక సాయంత్రం పేపర్ ప్రచురించింది. దాంతో ముందే అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి విజేతల పేర్లను కవర్లో పెట్టి సీల్ వేసే పద్ధతి ప్రారంభమైంది. ఇప్పటికీ ఇదే పద్ధతి అమల్లో ఉంది.
- ఆస్కార్ అవార్డులు రేడియోలో 1930 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. టీవీల్లో 1953 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 1966 నుంచి కలర్ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. ఈ అవార్డులు అంతర్జాతీయంగా ప్రసారం చేయడం 1969లో మొదలైంది.
ప్రస్తుత కేటగిరీలు 24 - ఈ అవార్డులు కేవలం ఆంగ్ల సినిమాలకే ఇచ్చేవారు. 1947లో తొలిసారిగా ‘షూ-షైన్’ అనే ఇటాలియన్ సినిమాకు విదేశీ భాషా చిత్రాల విభాగంలో అందించారు.
- 1956 నుంచి ఏటా ‘విదేశీ భాషా చిత్రం’ అనే కేటగిరీలో ఇస్తున్నారు. 2019 వరకు ‘విదేశీ భాషా చిత్రం’ అని ఈ కేటగిరీని పిలిచేవారు. కానీ 2020 నుంచి దీన్ని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా మార్చారు.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ (లేదా) విదేశీ భాషా చిత్రాల ఎంపికకు నిబంధనలు - సినిమా నిడివి 40 నిమిషాల కంటే ఎక్కువ ఉండాలి.
- ఆ సినిమా ఇంగ్లిష్ భాష సినిమా అయ్యి ఉండొద్దు.
- అమెరికాలో ఆ సినిమా నిర్మించి ఉండొద్దు.
- ఇంగ్లిష్ భాషలో సబ్ టైటిల్స్ ఇవ్వాలి
- యానిమేటెడ్ సినిమాలు, డాక్యుమెంటరీ సినిమాలు కూడా పోటీకి పంపవచ్చు.
- ఒక దేశం నుంచి అధికారికంగా ఒక సినిమా మాత్రమే పోటీకి పంపించాలి.
- 2017లో నిబంధనల ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలే పోటీకి పంపించాలి. కానీ 2023 నిబంధనలు ప్రకారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో విడుదలైన సినిమాని కూడా పోటీకి పంపించవచ్చు.
అవార్డు ప్రతిమ
- ఈ ప్రతిమ కంచుతో చేయబడి, 24 క్యారట్ల బంగారు పూత పూయబడి ఉంటుంది. దీని ఎత్తు 13 1/2 అంగుళాలు/ 34.3 సెం.మీ లు
- దీని బరువు- 8 1/2 పౌండ్లు / 3.856 కిలోలు. దీని విలువ ఒక అమెరికా డాలర్.
- 50 ఆస్కార్ ప్రతిమలు తయారు చేయాలంటే మూడు నెలల సమయం పడుతుంది.
- ప్రతిమ డిజైనర్- సెడ్రిక్ గిబ్బన్స్
- ప్రతిమ శిల్పి- జార్జ్ స్టాన్లీ
- తయారు చేసే సంస్థ- పోలిచ్ టాలిక్స్, న్యూయార్క్
- ఈ ప్రతిమ ఐదు స్పోక్స్ కలిగిన ఒక సినిమా రీలుపై ఓ క్రూసేడర్ (యోధుడు) కత్తి పట్టుకొని నిల్చుని ఉన్నట్లు ఉంటుంది. ఈ ఐదు స్పోక్స్ సినిమాకు కీలకమైన ఐదు ప్రధాన విభాగాలైన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలను తెలియజేస్తాయి.
ఆస్కార్ అందుకొన్న భారతీయులు
- ఆస్కార్ పొందిన తొలి భారతీయ వ్యక్తి భాను అథయా. ఈమె 1982లో మహాత్మాగాంధీ జీవిత చరిత్రపై ‘రిచర్డ్ అటెన్‌బరో’ తెరకెక్కించిన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ పొందారు. గాంధీ సినిమాలో ‘బెన్స్లీ కింగ్’ గాంధీ పాత్ర వేశారు. కాగా కస్తూరీబాయి పాత్రను ‘రోహిణి హట్టంగడి’ పోషించారు.
- ఆస్కార్ పొందిన రెండో వ్యక్తి సత్యజిత్‌రే. ఈయన 1992లో భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను హాననరీ పురస్కారం పొందారు.
- 2009లో ప్రకటించిన 81వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌లో షూటింగ్ జరుపుకొన్న స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా 8 ఆస్కార్లు గెలుపొందగా అందులో ముగ్గురు భారతీయులు నాలుగు అవార్డులు దక్కించుకున్నారు.
1. ఏఆర్ రెహమాన్ -(ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ గీతం)
2. గుల్జార్- (ఉత్తమ ఒరిజినల్ గీతం)
3. రసూల్ పోకుట్టి- (ఉత్తమ సౌండ్ మిక్సింగ్) - 2019లో గునీత్‌మోంగా నిర్మించిన ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కు ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డు దక్కింది.
- 2023లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల్లో మూడు కేటగిరీలకు భారతీయ సినిమాలు నామినేట్ అవ్వగా రెండు అవార్డులు దక్కించుకున్నాయి.
- మూడో సినిమా సౌనక్సేన్ తీసిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీకి నామినేట్ అయినా అవార్డు రాలేదు.
ఆస్కార్ పొందిన మహిళా దర్శకులు
- ఇప్పటివరకు ముగ్గురు మహిళలు దర్శకత్వ అవార్డులు పొందారు.
1. క్యాథరిన్ బిగెలో -2009 – ది హార్ట్ లాకర్ సినిమాకు
2. చో జావో – 2021 – నో మ్యాడ్ లాండ్ సినిమాకు
3. జేన్ కాంపియన్-2022-ది పవర్ ఆఫ్ ది డాగ్ - అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తి – వాల్ట్ డిస్నీ (22)
- అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన మహిళ- ఎడిత్హెడ్ (8) (కాస్ట్యూమ్ డిజైనర్)
- విదేశీ భాషా/అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో అత్యధిక అవార్డులు పొందిన సినిమాలు- ఇటాలియన్ (14)
- ఉత్తమ చిత్రం కేటగిరీకి ఎంపికైన తొలి 3డీ సినిమా- అవతార్ (2009)
- పూర్తిగా నల్లజాతి నటీనటులు, సాంకేతిక నిపుణులతో తీసి ఉత్తమ చిత్రం అవార్డు పొందిన తొలి సినిమా- స్లమ్‌డాగ్ మిలియనీర్ (2009)
అంతర్జాతీయ చిత్రాలకు ఆస్కార్ ఎంట్రీ నిబంధనలు-2023
- థియేటర్లలో లేదా పేరున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా ప్రదర్శించి ఉండాలి
- సినిమా తీసిన దేశంలో విడుదల కాకపోయినా ఇతర దేశాల్లో విడుదలైనా ఎంట్రీకి పంపొచ్చు. కాకపోతే కనీసం వారం రోజులు వరుసగా సినిమా ఆడాలి. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్లకు లాభాలు వచ్చి ఉండాలి.
- 35 ఎంఎం లేదా 70 ఎంఎం సినిమా అయి ఉండాలి. కనీసం 2048X1080 రెజల్యూషన్ ఉండాలి
- థియేటర్లలో విడుదల కాకముందు టీఎక్స్, డీవీడీ, ఆన్లైన్ మొదలైన వంటి వాటి రూపంలో సినిమాను ప్రదర్శించొద్దు. సినిమా తీసిన దేశం క్రియేటివ్ హక్కులను ధ్రువీకరించాలి. ఆస్కార్ అవార్డులు అత్యధికంగా పొందిన సినిమాలు
- ఇప్పటివరకు మూడు సినిమాలు అత్యధికంగా ఆస్కార్లు దక్కించుకున్నాయి.
1. బెన్హర్- 1959 – 11 అవార్డులు
2. టైటానిక్- 1997 – 11 అవార్డులు
3. లార్డ్ ఆఫ్ ది రింగ్స్:రిటర్న్ ఆఫ్ ది కింగ్ – 2004 – 11 అవార్డులు - ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు ఈ ఘనత సాధించారు.
ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి పొందినవారు
1. జార్జ్ బెర్నార్డ్ షా (ఐర్లాండ్) 1925 లో నోబెల్ సాహిత్య బహుమతి, 1938లో ఆస్కార్ పొందారు. 2. బాబ్ డిలాన్ (అమెరికా) 2000లో ఆస్కార్ అవార్డు, 2016లో నోబెల్ సాహిత్య బహుమతి పొందారు.
- ఇప్పటివరకు ఒకే ఒక వ్యక్తి ఆస్కార్ అవార్డు, ఒలింపిక్ పతకం గెలుచుకున్నారు. కోబ్ బ్రయాంట్ 2008, 2012 ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు, 2017లో ‘డియర్ బాస్కెట్‌బాల్’కు ఆస్కార్ పొందారు.
- కోబ్ బ్రయాంట్ అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ ఆటగాడు. ఇతడు 2020, జనవరి 26న కాలిఫోర్నియా సమీపంలో కుటుంబంతో సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.
చిన్న వయస్సులో ఆస్కార్ పొందినది- టాటుమ్ డీనీల్ (10 సంవత్సరాలు) 1973లో - పెద్ద వయసులో పొందినవారు – ఆంథోని హాప్కిన్స్ (83 సంవత్సరాలు) 2021లో
ఆ పేరెలా వచ్చింది? - అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ లైబ్రేరియన్‌గా పనిచేశారు. ఈ విజేతలకు ఇచ్చే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు దీని ఆకృతి తన అంకుర్ ఆస్కార్‌లా ఉంది అన్నారు. అలా ఆస్కార్ అవార్డు పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా తీసుకున్నారు.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?