Biology | జీన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దేనికి సంబంధించినది?
31 మార్చి 2023 తరువాయి
25. నిపా వైరస్‌కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఇది జెనెటిక్ వ్యాధి
2. చికిత్స కోసం నిర్దిష్ట వైరస్ నిరోధక ఔషధం(యాంటీ వైరల్ డ్రగ్) ఏదీ లేదు
పైన పేర్కొన్న వాటిలో సరైనది/సరైనవి
ఏది/ఏవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
26. తరచూ వార్తల్లో కనిపించే ‘వంశావళి’ దేనికి సంబంధించినది?
ఎ)వృద్ధాప్య ప్రక్రియను అధ్యయనం చేయడం
బి) వంశ వృక్షాలను రూపొందించడం, వంశాలను/మూలాలను గుర్తించడం
సి) జనన సంబంధిత ప్రక్రియలపై రసాయనాల ప్రభావాల అధ్యయనం
డి) వారసత్వ సూత్రాలపై అవగాహన
27. జంతు శరీర భాగ ప్రతిరూపణ(జీన్ ట్రాన్స్ ప్లాంటేషన్) దేనికి సంబంధించినది?
ఎ) ఒకే జాతికి చెందిన సభ్యుల మధ్య అవయవాల మార్పిడి
బి) విభిన్న జాతుల మధ్య అవయవాల మార్పిడి
సి) గ్రహీతను పోలి ఉన్న దాత నుంచి అవయవాన్ని అంటుకట్టడం
డి) కృత్రిమంగా వృద్ధి చేసిన అవయవాన్ని మూలకణ సాంకేతికతను ఉపయోగించి అంటుకట్టడం
28. ఫాస్టాగ్‌కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఫాస్ట్‌ట్యాగ్: ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడీ సాంకేతికతను ఉపయోగించి వాహనం కదులుతూ ఉండగానే నేరుగా టోల్ చెల్లింపులు చేసే పరికరం
2. దీన్ని ఒక వాహనం నుంచి మరో వాహనానికి బదిలీ చేయవచ్చు పై వ్యాఖ్యల్లో సరైనది/సరైనవి ఏది/ఏవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
29. కృత్రిమ చంద్రుడి రూపంలో ఇటీవల చైనా ఒక తక్కువ గురుత్వాకర్షణ సౌలభ్యాన్ని దేన్ని ఉపయోగించి సాధించింది?
ఎ) అధిక పీడన కోష్ఠాలు
బి) అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా వాయుస్తంభనం
సి) అణు విచ్ఛేదన
డి) కాంతి పరావర్తకాలు
30. కొత్త కొవిడ్ ఔషధం ‘విన్కోవ్-19’ భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం పొందింది. ఇది ఈ సాంక్రమిక వ్యాధికి దేన్ని ఉపయోగించి చికిత్స అందిస్తుంది?
ఎ) ప్రతిరోధకాలను (యాంటీబాడీలు) తటస్థీకరించి
బి) వైరస్ వ్యాప్తిని నిరోధించే ఎంజైములు
సి) వైరస్ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చిన్న రసాయన అణువులు
డి) వైరస్ చుట్టుముట్టకుండా ఉండేందుకు ఔషధ అణువులు
31. ద్విసభా విధానం ఉన్న రాష్ర్టాల్లో శాసన ప్రక్రియకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
1. శాసనసభ- శాసన మండలి మధ్య బిల్లుల ఆమోదంపై ప్రతిష్టంభన ఏర్పడిన పరిస్థితుల్లో గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు
2. శాసనమండలి పునర్విచారణ సభ; కాబట్టి కౌన్సిల్లో ఏ బిల్లునూ ప్రవేశపెట్టరు
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
32. భారత పార్లమెంటుకు సంబంధించి కింది వాటిలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
1. తాత్కాలిక పార్లమెంటు (1950 జనవరి 26 నుంచి స్వాతంత్య్రం తర్వాత మొదటి ఎన్నికల వరకు) ఏకసభగా ఉండేది.
2. రాజ్యసభ సభ్యుల పదవీకాలం యూఎస్ సెనెట్ సభ్యుల పదవీకాలం మాదిరిగానే ఉంటుంది.
పైన పేర్కొన్న అంశాల్లో ఏది/ఏవి సరైనది/
సరైనవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
33. కేంద్రానికి సంబంధించిన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను…
1. రాష్ట్రపతికి సమర్పిస్తారు
2. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పరిశీలించవచ్చు
3. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలనకు ఆధారం
సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ) 1, 2 బి) 3
సి) 1, 3 డి) 1, 2, 3
34. కిందివాటిలో దేన్ని భారత రాజ్యాంగంలో ‘దోపిడీకి వ్యతిరేక హక్కు’గా భావిస్తారు?
1. మానవ అక్రమ రవాణా, నిర్బంధ శ్రామిక వ్యవస్థపై నిషేధం
2. అస్పృశ్యత నిషిద్ధం
3. ఫ్యాక్టరీలు, గనుల్లో పిల్లలు పనిచేయడం నిషిద్ధం కింది కోడ్లలో సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ) 1, 2 బి) 3
సి) 1, 3 డి) 1, 2, 3
35. సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించి భారత రాజ్యాంగంలోని నిబంధనలను దేని ద్వారా సవరించవచ్చు?
ఎ) పార్లమెంటు ఆమోదించిన చట్టం
బి) పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ చట్టం
సి) పార్లమెంటు ఆమోదించిన, కనీసం 50% రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ చట్టం
డి) పార్లమెంటు ఆమోదించి, సుప్రీంకోర్టు ధ్రువీకరించిన రాజ్యాంగ సవరణ చట్టం
36. భారత ప్రధానమంత్రికి గల కింది అధికారాల్లో వేటిని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు?
1. ఇతర మంత్రుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం
2. మంత్రుల మధ్య విధి నిర్వహణల కేటాయింపు
3.మంత్రుల హోదాలను నిర్ణయించడం
4. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 2, 3 డి) 1, 2, 4
37. భారతదేశంలో రిజర్వేషన్‌కు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
1. రాష్ట్ర విశ్వవిద్యాలయం/కళాశాలలో నివాసం ప్రాతిపదికన విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వొచ్చు
2.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నివాసం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వొచ్చు పైన పేర్కొన్న అంశాల్లో ఏది/ఏవి సరైనది/ సరైనవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
38. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది/ ఏవి సరైనది/సరైనవి?
1. సివిల్ సర్వీస్ పరీక్ష తుది మెరిట్ జాబితా వంటి యూపీఎస్సీ సిఫార్సులకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు
2. సివిల్ సర్వీసెస్ నియామకాలకు సంబంధించిన అన్ని విషయాలపై యూపీఎస్సీని కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. అయితే, ఏదైనా వెనుకబడిన తరగతి పౌరులకు అనుకూలంగా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం
సంప్రదింపు తప్పనిసరికాదు పైన పేర్కొన్న అంశాల్లో ఏది/ఏవి సరైనవి/ సరైనది?
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) ఏదీ కాదు
39. భారతదేశానికి సంబంధించి, కింది ప్రకటనలను పరిగణించండి.
1. ఒకే పౌరసత్వం, ఒకే నివాసం
2. పుట్టుక ద్వారా పౌరులైనవారు మాత్రమే దేశాధినేత పదవికి అర్హులు
3. ఒకసారి పౌరసత్వం పొందిన విదేశీయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని కోల్పోకూడదు
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ) 1 బి) 2 సి) 1, 3 డి) 2, 3
40. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకానికి (ఎంపీ ల్యాడ్స్) సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1.లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గాల్లో మాత్రమే పనులను సిఫారసు చేయవచ్చు
2.రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు తాము ఎన్నికైన రాష్ట్రంలో ఎక్కడైనా పనులను సిఫారసు చేయవచ్చు
3.రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు దేశం లో ఎక్కడైనా పనులను సిఫారసు చేయవచ్చు
పైన పేర్కొన్న అంశాల్లో ఏది/ఏవి సరైనది/
సరైనవి?
ఎ) 1 బి) 2 సి) 1, 3 డి) 1, 3
సమాధానాలు
25. సి 26. బి 27. బి 28. ఎ
29. బి 30. ఎ 31. డి 32. సి
33. సి 34. సి 35. సి 36. బి
37. సి 38. సి 39. ఎ 40. డి
విసర్జక వ్యవస్థ
- శరీరంలో వివిధ పదార్థాల జీవక్రియల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించడాన్ని విసర్జన అంటారు.
- విసర్జక వ్యవస్థ గురించిన అధ్యయనం- యూరాలజీ
- మన శరీరంలో ముఖ్యమైన విసర్జక అవయవాలు- చర్మం, మూత్రపిండాలు
- యూరియా వంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను శరీరం బయటకు పంపడాన్ని విసర్జన అంటారు.
- కృత్రిమ మూత్రపిండాలను మొదటిసారి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త విలియం జె.కాఫ్. 1943లో కృత్రిమ మూత్రపిండాలను రూపొందించారు. ఈయన నెదర్లాండ్స్ దేశస్థుడు.
విసర్జన ముఖ్య లక్షణాలు - శరీరంలో అయాన్ల తులస్థితిని కాపాడటం.
- విసర్జక పదార్థాల్లో ఎక్కువగా నత్రజని సంబంధ పదార్థాలుంటాయి. అవి అమ్మోనియా, యూరియా, యూరికామ్లంతో పాటు నీరు, కొన్ని రకాల లవణాలు, కర్బన, అకర్బన పదార్థాలు ఉంటాయి.
- అమైనో ఆమ్లాల న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి.
మూత్రపిండాలు - మూత్రపిండాల అధ్యయనం- నెఫ్రాలజీ
- మూత్రపిండాలు రెండు ఉండి చిక్కుడు గింజ ఆకారంలో, ముదురు ఎరుపు రంగులో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి.
- మూత్రపిండాల్లో ఎడమ వైపుది పెద్దదిగా ఉంటుంది. ఇది కొంచెం పైకి ఉంటుంది. కుడివైపు మూత్రపిండం కిందికి ఉంటుంది. దీనికి కారణం దీనిపైన కాలేయం ఉండటం.
- మూత్రపిండాల బాహ్యతలం కుంభాకారంగా, లోపలితలాలు పుటాకారంగా ఉంటాయి.
- మూత్రపిండాల బయటి భాగాన్ని వల్కలం అని, లోపలి ప్రదేశాన్ని దవ్వ అని అంటారు.
మూత్రపిండ వ్యాధులు
- డయాబెటిస్ మెల్లిటస్: మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం జరుగుతుంది.
డయాబెటిస్ ఇన్సిపిడస్: అధిక మూత్ర విసర్జన (వాసోప్రెసిన్ హార్మోన్ లోపం).
ఆల్కాప్టోన్యూరియా: గాలి తగలగానే మూత్రం నల్లగా మారుతుంది. ఇది జన్యు సంబంధిత వ్యాధి.
హెమటూరియా వ్యాధి: మూత్రంలో రక్తం పడటం.
పీ విష్ణువర్ధన్
విష్ణు
ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
7702170025
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు