Physics Groups Special | సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్యభాగం?
ద్రవపదార్థాలు (మార్చి 29 తరువాయి)
10. సూది, తుపాకీ గుండు, కత్తి, గునపం మొదలైన వాటిలో ముందు భాగాలు మొన తేలుతున్నట్లు చేయడం వల్ల వాటి?
ఎ) ఘన పరిమాణం తగ్గుతుంది
బి) భారం తగ్గుతుంది
సి) పీడనం తగ్గుతుంది
డి) పైవన్నీ
11. గాజు పలకపై ఉన్న పాదరసం స్పష్టమైన ద్రవ బిందువుల్లా కనిపించడానికి కారణం?
ఎ) పాదరసంలో సంసంజన బలాలు గరిష్టంగా ఉంటాయి.
బి) పాదరసంలో అసంజస బలాలు గరిష్టంగా ఉంటాయి
సి) పాదరసంలో సంసంజస, అసంజస బలాలు సమానంగా ఉంటాయి
డి) ఏదీకాదు
12. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గితే అది తుఫాను రాకను సూచిస్తుంది
2. పాదరస మట్టం క్రమక్రమంగా తగ్గితే రాబోవు వర్షసూచనను సూచిస్తుంది
ఎ) 1, 2 సరైనవి బి) రెండూ తప్పు
సి) 1 సరైనది, 2 తప్పు
డి) 1 తప్పు, 2 సరైనది
13. నిలకడగా ఉన్న నీటిపైన కిరోసిన్‌ను వెదజల్లినప్పుడు దేనిలో మార్పు జరిగి దోమల గుడ్లు, లార్వాలు మునగడానికి కారణం?
ఎ) నీటి తలతన్యత తగ్గుతుంది
బి) నీటి తలతన్యత పెరుగుతుంది
సి) నీటి స్నిగ్ధత పెరుగుతుంది
డి) నీటి స్నిగ్ధత తగ్గుతుంది
14. ద్రవపదార్థాలు ప్రదర్శించే ధర్మం?
ఎ) తలతన్యత బి) కేశనాళికీయత
సి) స్నిగ్ధత డి) పైవన్నీ
15. టారిసెల్లి కనుగొన్న భారమితి దేన్ని కొలుస్తుంది?
ఎ) సాంద్రత
బి) వాతావరణ పీడనం
సి) స్నిగ్ధత
డి) నీటి అసంగత వ్యాకోచం
16. కేశనాళికీయత అనువర్తనం కానిది?
ఎ) కిరోసిన్ స్టవ్, దీపం, మైనపు క్యాండిల్ పనిచేయడం
బి) ఇసుకనేలలు తేమగా ఉండటం
సి) ఎడారులలో ఒయాసిస్‌లు ఏర్పడటం
డి) మొక్కలు దారువు ద్వారా పీల్చుకున్న నీరు పైకి ఎగబాకడం
17. జతపరచండి.
ఎ. బలం 1. పాయిజ్
బి. ప్రచోదనం 2. పాస్కల్
సి. స్నిగ్ధత 3. న్యూటన్
డి. పీడనం 4. న్యూటన్-సెకన్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
18. జతపరచండి.
ఎ. పాదరసం 1. 0౦
బి. స్వచ్ఛమైన నీరు 2. 8౦-9౦
సి. వెండితో నీరు 3. 90౦
డి. సాధారణ నీరు 4. 135౦-140౦
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-4, బి-1, సి-3, డి-2
సి) ఎ-1, బి-4, సి-2, డి-3
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
19. ద్రవపదార్థానికి సంబంధించిన ధర్మం?
ఎ. తలతన్యత బి. స్నిగ్ధత
సి. కేశనాళికీయత డి. ద్రవపీడనం
ఎ) ఎ, సి బి) ఎ
సి) ఎ, బి, సి డి) పైవన్నీ
20. స్నిగ్ధత అనువర్తనం?
ఎ. వర్షపు చినుకులు, పారాచూట్ వేగం తగ్గడం
బి. సముద్రపు ఆటుపోటులు క్రమంగా క్షీణించడం
సి. మట్టిరేణువుల నుంచి బంగారపు కణాలను వేరుచేయడం
డి. రసాయనశాస్త్రంలో ప్రొటీన్స్, సెల్యులోజ్ అణుభారం నిర్ధారించడం
ఎ) ఎ బి) బి
సి) ఎ, సి డి) పైవన్నీ
21. వర్షపు చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం?
ఎ) పీడనం బి) కేళనాళికీయత
సి) తలతన్యత డి) స్నిగ్ధత
22. బారోమీటర్‌లో పాదరస మట్టం క్రమేపి పెరగడం దేన్ని సూచిస్తుంది?
ఎ) అనుకూల వాతావరణం రాకను
బి) వెంటనే తుఫాను రాకను
సి) వర్షం వచ్చే సూచన
డి) చెప్పుకోదగ్గ మార్పును ఏదీ సూచించదు
23. తలతన్యత ఆధారపడని లక్షణం?
ఎ) ఉపరితలవైశాల్యం
బి) ద్రవాల స్వభావం
సి) ఉష్ణోగ్రత
డి) మాలిన్యాలు
24. జలాంతర్గామి పరిచేయుటలో ఉపయోగించే సూత్రం?
ఎ) బాయిల్ నియమం
బి) పాస్కల్నియమం
సి) బెర్నౌలీ నియమం
డి) ఆర్కెమెడిస్ ప్లవన సూత్రం
25. నదిలో తేలుతున్న పడవ సముద్రంలో ప్రవేశించినప్పుడు పడవ మట్టం?
ఎ) మారదు
బి) కొంచెం పైకి వెళ్తుంది
సి) కొద్దిగా కిందికి వస్తుంది
డి) పైకి కానీ, కిందికి గానీ, పడవ భారంపై ఆధారపడి ఉంటుంది
జవాబులు
10. సి 11. ఎ 12. ఎ 13. ఎ
14. డి 15. డి 16. బి 17. బి
18. బి 19. డి 20. డి 21. సి
22. ఎ 23. ఎ 24. డి 25. డి
విశ్వం
1. ఆస్ట్రానమీలో ఒక శాఖ?
1) ఆస్ట్రోఫిజిక్స్ 2) ఆస్ట్రోడైనమిక్స్
3) ఆస్ట్రోబయాలజీ 4) పైవన్నీ
2. గ్రహగతుల నియమాలను ప్రతిపాదించినది?
1) న్యూటన్ 2) కెప్లర్
3) గెలీలియో 4) కొపర్నికస్
3. కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన మొదటిదేశం?
1) USSR 2) USA
3) బ్రిటన్ 4) జర్మనీ
4. మొదటగా వ్యోమగామిని ప్రవేశపెట్టిన దేశం?
1) USSR 2) USA
3) బ్రిటన్ 4) జర్మనీ
5. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం?
1) రోహిణి 2) ఆర్యభట్ట
3) ఆపిల్ 4) భాస్కర-1
6. క్రయోజనిక్ యంత్రాలను ఉపయోగించుకొనేది?
1) జలాంతర్గాములు 2) రిఫ్రిజిరేటర్
3) రాకెట్ టెక్నాలజీ
4) సూపర్ కండక్టర్ల ప్రయోగాల్లో
7. క్రయోజనిక్ యంత్రాల్లో ఉపయోగించే ఇంధనం?
1) ద్రవ హీలియం 2) ద్రవ నైట్రోజన్
3) ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్
4) ద్రవ మీథేన్
8. అంతరిక్ష యాత్రికునికి అంతరిక్షం ఏ రంగులో కనిపిస్తుంది?
1) తెలుపు 2) నల్లగా
3) నీలం 4) ఎరుపు
9. సూర్యుడిలో శక్తికి కారణం?
1) కేంద్రక విచ్ఛిత్తి 2) కేంద్రక సంలీనం
3) పరమాణు అభిఘాతాలు
4) రసాయన చర్యలు
10. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్యభాగం?
1) కరోనా 2) క్రోమోస్పియర్
3) ఫొటోస్పియర్ 4) ఏదీకాదు
11. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం పడిపోదు, దీనికి కారణం భూమి గురుత్వాకర్షణ..
1) అంత దూరంలో ఉండదు
2) చంద్రుడి ఆకర్షణ చేత తుల్యం అవుతుంది
3) దీని స్థిర గమనానికి కావాల్సిన వడినిస్తుంది
4) దీని గమనానికి తగిన త్వరణాన్నిస్తుంది
12. ఒక వ్యోమగామి భూమి మీదకంటే చంద్రుడి మీద ఎక్కువ దూరం ఎగరగలడు కారణం?
1) చంద్రుడిపై అతను భారరహితంగా ఉంటాడు
2) చంద్రుడిపై వాతావరణం లేదు
3) భూమిపై కంటే చంద్రుడిపై గురుత్వాకర్షణ తక్కువ
4) చంద్రుడు సూర్యుడు కంటే చిన్నగా ఉండటం
13. అంతరిక్షనౌకలో ప్రయాణిస్తున్న వ్యక్తి భారరహిత స్థితిలో ఉండటానికి కారణం ఏది?
1) గురుత్వాకర్షణ లోపం
2) శక్తి రాహిత్యం
3) నౌక బయట గురుత్వాకర్షణ శక్తి ఉండి, లోపల లేకపోవడం
4) నౌక కక్ష్యలోని త్వరణం గురుత్వ త్వరణానికి సమానంగా ఉంటుంది
14. జెట్ ఇంజిన్‌లో ఉపయోగించే ఇంధనం ఏది?
1) ద్రవ హైడ్రోజన్ 2) ఘన కార్బన్‌డైఆక్సైడ్
3) టారాఫిన్ 4) ద్రవ సోడియం
15. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం దేన్ని వివరిస్తుంది?
1) విశ్వ ఆవిర్భావం 2) నక్షత్రాల కదలిక
3) గ్రహాల్లో శక్తి ఉద్గారం
4) అగ్ని పర్వతాల ఆవిర్భావం
16. సౌరకుటుంబం ఏ గెలాక్సీలో ఉంది?
1) పాలపుంత 2) టాడ్‌పోల్
3) కాన్క్రి 4) హెలస్కి
17. కోపర్నికస్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ ఆకారం గల కక్ష్యలో పరిభ్రమిస్తాయి?
1) వృత్తాకారం 2) దీర్ఘవృత్తాకారం
3) పరావలయం 4) అతిపరావలయం
18. క్రయోజనిక్ ఇంజిన్లు వేటిలో ఉపయోగపడుతాయి?
1) జలాంతర్గాములలో
2) రిఫ్రిజిరేటర్లలో
3) రాకెట్లలో
4) సూపర్ కండక్టివిటీలో
19. ఉపగ్రహాలను ఏ దిశ నుంచి, ఏ దిశకు ప్రయోగిస్తారు?
1) పశ్చిమం-తూర్పుకు
2) తూర్పు-పశ్చిమానికి
3) ఉత్తరం-దక్షిణానికి
4) దక్షిణం-ఉత్తరానికి
20. న్యూటన్ మొదటి సూత్రం ఏ సిద్ధాంతంపై ఆధారపడుతుంది?
1) గెలీలియో 2) కెప్లర్
3) టాలమీ 4) కోపర్నికస్
జవాబులు
1.1 2.2 3.1 4.1
5.2 6.3 7.3 8.2
9.1 10.2 11.4 12.3
13.4 14.1 15.1 16.1
17.1 18.3 19.1 20.1
ఆధునిక భౌతిక శాస్త్రం
1. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం?
ఎ) ప్లుటోనియం బి) ఫెర్మియం
సి) స్ట్రాన్షియం డి) యురేనియం
2. మానవుడు కనుగొన్న తొలికణం?
ఎ) న్యూట్రాన్ బి) ఎలక్ట్రాన్
సి) ప్రోటాన్ డి) పాజిట్రాన్
3. న్యూక్లియర్ రియాక్టర్‌లోని న్యూట్రాన్ల వేగం తగ్గించి గొలుసుచర్యలను అదుపుచేయటానికి ఉపయోగించే మితకారి కానిది?
ఎ. భారజలం బి. గ్రాఫైట్
సి. దృఢమైన ప్లాస్టిక్ డి. పాదరసం
ఎ) సి బి) డి
సి) సి, డి డి) పైవన్నీ
4. ఓటోహాన్, స్ట్రాస్‌మన్‌లు కనుగొన్న ప్రక్రియ?
ఎ) అర్ధజీవితకాలం బి) కేంద్రక సంలీనం
సి) కేంద్రక విచ్ఛిత్తి
డి) కృత్రిమ రేడియోధార్మికత
5. న్యూక్లియర్ రియాక్టర్‌లోని న్యూట్రాన్ శోషించుకొని గొలుసుచర్యలను పూర్తిగా ఆపడానికి ఉపయోగించే నియంత్రకం?
ఎ) కాడ్మియం బి) బోరాన్ కడ్డీ
సి) స్టీల్కడ్డీ డి) పైవన్నీ
6. జీర్ణాశయాన్ని X-ray తీయడానికి ముందు పేషెంట్‌కు ఇచ్చే రసాయన ద్రావణం?
ఎ) హైపో బి) బేరియం మీల్
సి) క్విక్ సిల్వర్ డి) యెల్లో కేక్
7. రాళ్లు (లేదా) శిలల వయస్సును నిర్ధారించే రేడియో డేటింగ్లో ఉపయోగించే ఐసోటోప్?
ఎ) U235 బి) P32
సి) C14 డి) C060
8. న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించినది?
1. సాధారణ ఉష్ణోగ్రత వద్ద భారజలాన్ని కానీ, నీటిని కానీ కూలెంట్‌గా ఉపయోగిస్తారు
2. అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవసోడియంను కూలెంట్‌గా ఉపయోగిస్తారు
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైనది
సి) రెండూ సరైనవే
డి) రెండూ తప్పు
9. కింది వాటిలో కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్త?
ఎ) విక్రమ్ సారాభాయ్
బి) హెచ్ జే బాబా సి) సీవీ రామన్
డి) పైవన్నీ
10. మొదటి అణు రియాక్టర్‌ను నిర్మించింది?
ఎ) ఫారెస్ట్ బి) ఫెర్మి
సి) ఫారడే డి) అండర్సన్
జవాబులు
1.డి 2.బి 3.బి 4.సి
5.డి 6.బి 7.ఎ 8.సి
9.డి 10.బి
విన్నర్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు