Geography Groups Special | ‘రెడ్ డేటా బుక్’లో వేటి జాబితా ఉంటుంది?
1. సవన్నా రకపు శీతోష్ణస్థితికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1. శీతాకాలం, వర్షాకాలం; వేడిపొడి కాలాలుగా వర్గీకృతం కావడం ద్వారా సూడాన్ రకం శీతోష్ణస్థితి ఏర్పడుతుంది
2. సవన్నా భూముల్లో నివసించే ఏకైక సంచార తెగ మసాయి కింది వాటి నుంచి సరైన జవాబును ఎంపిక చేయండి
ఎ) 1 బి) 2
సి) 1, 2 రెండూ
డి) ఏదీ కాదు
2. భారత రుతుపవన వ్యవస్థకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి.
1. 40-60 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూమధ్యరేఖను దాటిన తర్వాత ఆగ్నేయ వ్యాపార పవనాలు భారత ఉపఖండం వైపు మళ్లుతాయి
2. పశ్చిమ జెట్ ప్రవాహం ఈ ప్రాంతం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే ముందు తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది
3. నైరుతి రుతుపవనాల బంగాళాఖాతశాఖ హిమాలయాల ప్రభావంతో రెండుగా చీలుతుంది పై వ్యాఖ్యల్లో సరైనది?
ఎ) 1, 2
బి) 1
సి) 1, 3
డి) 1, 2, 3
3. ప్రకటన (అ): సమశీతోష్ణ అడవుల మాదిరిగా కాకుండా, ఉష్ణమండల వర్షారణ్యాలను చదును చేస్తే రసాయన ఎరువుల అవసరం లేకుండా అనేక ఏళ్ల పాటు వ్యవసాయయోగ్యమైన అత్యుత్పాదక భూములను అందించగలవు
హేతువు (ఆర్): సమశీతోష్ణ అడవులతో పోలిస్తే ఉష్ణమండల వర్షారణ్యాల ప్రాథమిక ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది
ఎ) అ, ఆర్ రెండూ ఒక్కొక్కటిగా సరైనవి ఆర్ అనేది అ కు సరైన వివరణ
బి) అ, ఆర్ రెండూ ఒక్కొక్కటిగా సరైనవి కానీ, ఆర్ అనేది అ కు సరైన వివరణ కాదు.
సి) అ సరైనదే; కానీ, ఆర్ సరైనది కాదు
డి) అ సరైనది కాదు; కానీ, ఆర్ సరైనది
4. అంతర్జాతీయ దినరేఖకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. తూర్పు నుంచి పడమరకు దినరేఖను దాటితే ప్రయాణికుడు ఒక రోజును కోల్పోతాడు. పశ్చిమం నుంచి తూర్పునకు దినరేఖను దాటినప్పుడు అతడు ఒక రోజును పొందుతాడు.
2. దినరేఖ మధ్యఅట్లాంటిక్ మహాసముద్రం గుండా వెళ్తుంది
పై ప్రకటనల్లో ఏవి/ఏది సరైనవి/ సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
5. ముడత పర్వతాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. ముడత పర్వతాలు చాలా పొడవుగా విస్తరించి ఉంటాయి. అయితే వాటి వెడల్పు చాలా తక్కువ.
2. ముడత పర్వతాలు భూమిపైన పురాతన పర్వత సమూహానికి చెందినవి పైన పేర్కొన్న ప్రకటనల్లో ఏవి/ఏది సరైనవి/ సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
6. కింది వాటిలో క్రియాశీల అగ్ని పర్వతాలు ఏవి?
1. హవాయి కిలౌయా 2. మౌనలోవా
3. మౌంట్ ఎంటా 4. తాల్ అగ్నిపర్వతం
5. మౌంట్ యాసుర్
పైన పేర్కొన్న ప్రకటనల్లో ఏవి/ఏది సరైనవి?
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 2 డి) పైవన్నీ
7. తీర ప్రాంతాలతో పోలిస్తే ఖండాల అంతర్భాగంలో వార్షిక ఉష్ణోగ్రతల పరిధి ఎక్కువగా ఉంటుంది. అందుకు గల కారణం/కారణాలు ఏమిటి?
1. భూమి- నీటి మధ్య ఉష్ణ వ్యత్యాసం
2. ఖండాలు- మహాసముద్రాల మధ్య ఎత్తు లో వైవిధ్యం
3. లోపలి భాగంలో బలమైన గాలులు ఉండటం
4. తీర ప్రాంతాలతో పోలిస్తే అంతర్గత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం
కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ఎ) 1 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3, 4
8. ప్రవాళ బిత్తికలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1.ఫ్రింజింగ్ రీఫ్ (అంచులో ఏర్పడినది) అన్నది ప్రధాన భూభాగం నుంచి వెలుపలి వైపు విస్తరించి, తీరానికి దగ్గరగా ఉన్న పగడపు వేదిక
2. పగడపు దిబ్బ (బారియర్ రీఫ్) నీటి మట్టానికి పైన ఉంటుంది. దానిపై ఇసుక పేరుకుపోతుంది. కొద్దిపాటి వృక్షసంపద సాధ్యమవుతుంది
పైన పేర్కొన్న వాటిలో ఏవి/ఏది సరైనవి?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
9. కింది అంశాలను పరిగణించండి.
1. భూభ్రమణం
2. వాయుపీడనం, పవనం
3. సముద్రపు నీటి సాంద్రత
4. భూ పరిభ్రమణం
పైవాటిలో సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసే కారకాలు ఏవి?
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 4 డి) 2, 3, 4
10. కేంద్రగామి(రేడియల్) నీటిపారుదల నమూనాకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. ఈ విధానంలోప్రధాన ప్రవాహాన్ని తర్వాతి చిన్న ప్రవాహాలు లంబకోణంలో కలుస్తాయి. మృదువైన శిలల ద్వారా అవకలన కోత ఉపనదులకు మార్గం సుగమం చేస్తుంది
2. అమరకంఠక్ పర్వతాల్లో ఉద్భవించిన నర్మద, సోన్, మహానది వంటి నదులు ఈ నమూనాకు మంచి ఉదాహరణలు
పైన పేర్కొన్న ప్రకటనల్లో ఏవి/ఏది సరైనవి/ సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
11. వర్షారణ్యాలు, ఉష్ణమండల అడవులు భూమికి ఊపిరితిత్తులైతే, చిత్తడి నేలలు కిడ్నీల్లాగా పనిచేస్తాయి. చిత్తడి నేలల కింది విధుల్లో పై వ్యాఖ్యను ఏ అంశం మెరుగ్గా ప్రతిబింబిస్తుంది?
ఎ) ఉపరితల ప్రవాహాలు, భూగర్భంలో అంతఃస్రవణం, బాష్పీభవనం చిత్తడి నేలల్లోని జలచక్రంలో ఉంటాయి
బి) చేపలు,పెంకుగల జంతువులు (క్రస్టేషియన్లు), మృదు శరీరవంతమైన ప్రాణులు (మొలస్కాలు), పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు వృద్ధి చెందడానికి ఆల్గే పోషకాధారాన్ని అందిస్తుంది.
సి) అవక్షేపన సమతౌల్యం, నేల స్థిరీకరణను నిర్వహించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తాయి
డి) నీటి మొక్కలు అదనపు పోషకాలను గ్రహిస్తాయి
12. కింది వాటిలో ఏది ఆవాస విధ్వంసానికి కారణమవుతుంది?
1. ఆవాస విచ్ఛిన్నత
2. కొత్త జాతుల ప్రవేశం
3. అగ్నిపర్వత విస్ఫోటనం
పైన పేర్కొన్న వాటిలో ఏవి/ఏది సరైనవి/ సరైనది?
ఎ) 1, 2 బి) 1
సి) 2, 3 డి) 1, 2, 3
13. ఐయూసీఎన్ విడుదల చేసే ‘రెడ్ డేటా బుక్’లో వేటి జాబితా ఉంటుంది?
1. చిత్తడి నేలలు
2. ప్రమాదంలో ఉన్న జంతువులు
3. ప్రమాదంలో ఉన్న మొక్కలు
పై అంశాల్లో ఏది/ఏవి సరైనవి/సరైనది?
ఎ) 1, 2 బి) 1
సి) 2, 3 డి) 1, 2, 3
14. ‘బ్లూ కార్బన్’కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. ఇది ప్రపంచ మహాసముద్రాలు, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలు సంగ్రహించిన కార్బన్
2. బ్లూ కార్బన్ భావన మడ అడవులు, లవణీయ చిత్తడి నేలలు, సముద్రపుగడ్డిపై దృష్టి పెడుతుంది
3. బ్లూ కార్బన్ ప్రత్యేకీకరణ, నిల్వ సామర్థ్యాలను ఉష్ణమండల వర్షారణ్యాలు, పీట్ భూములతో పోల్చవచ్చు; చాలా మేరకు అవి అధికంగా ఉంటాయి
కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ఎ) 1, 2 బి) 1
సి) 2, 3 డి) 1, 2, 3
15. జీవవైవిధ్య అంచనాకు సంబంధించిన నిబంధనలపై కింది ప్రకటనలను పరిగణించండి.
1. నిర్దిష్ట పర్యావరణ వ్యవస్థలో జాతుల సంఖ్యను బట్టి పేర్కొన్న వైవిధ్యాన్ని ఆల్ఫా వైవిధ్యం సూచిస్తుంది
2. పర్యావరణ వ్యవస్థల మధ్యజాతుల పరిమాణంలో మార్పును బీటా వైవిధ్యం సూచిస్తుంది
3. ఒక ప్రాంతంలోని వివిధ పర్యావరణ వ్యవస్థల్లో మొత్తం వైవిధ్యపు కొలమానాన్ని గామా వైవిధ్యం సూచిస్తుంది
పైన పేర్కొన్న అంశాల్లో ఏవి/ఏది సరైనవి/సరైనది?
ఎ) 1, 3 బి) 2, 3
సి) 1, 2 డి) 1, 2, 3
16. కింది వాటిలో మీథేన్‌కు ఆధారాలు ఏవి?
1. జీవద్రవ్య దహనం
2. వరి పొలాలు
3. బొగ్గు గనుల తవ్వకం
4. వాయు పరిస్థితులు
కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
17. జీవ వైవిధ్యానికి సంబంధించి కింది వ్యాఖ్యానాలను పరిగణించండి.
1. తూర్పు హిమాలయాల్లో పశ్చిమ హిమాలయాల కన్నా ఎక్కువ జాతులున్నాయి
2. ఎత్తైన ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ఎత్తులో జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది
3. చల్లని ప్రాంతాల కన్నా వెచ్చని ప్రాంతాలు ఎక్కువ జాతులకు నిలయం
పైన పేర్కొన్న అంశాల్లో ఏది/
ఏవి సరైనవి/సరైనది?
ఎ) 3 బి) 1, 2 సి) 2, 3 డి) 1, 2, 3
18. ‘వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్’ అనే పరిరక్షణ సంస్థకు సంబంధించి, కింది వాటిలో ఏది/ఏవి సరైనది/సరైనది?
1) ఇది రామ్సర్ ఒడంబడికపై సంతకం చేసిన దేశాలు ఏర్పాటు చేసిన అంతర ప్రభుత్వ సంస్థ
2) ఇది పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి, సమీకరించడానికి; మెరుగైన విధానాల రూపకల్పన కోసం ఆచరణాత్మక అనుభవాన్ని ఉపయోగించడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది
సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
19. కింది జతలను గమనించండి.
రక్షిత ప్రాంతం దాన్నుంచి ప్రవహించే నది
1. భిత్తరకనిక-బ్రాహ్మణి
2. మానస్-మానస్
3. కార్బెట్-గంగ
పైన పేర్కొన్న జతల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ) 1 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
20. కార్బన్ క్రెడిట్లకు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది సరైనది కాదు?
ఎ) క్యోటో ప్రోటోకాల్ ద్వారా కార్బన్ క్రెడిట్ పద్ధతిని ప్రవేశపెట్టారు
బి) కర్బనోద్గారాలను తగ్గించినందుకు కార్బన్ క్రెడిట్లను పొందుతారు
సి) కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను పరిమితం చేయడమే కార్బన్ క్రెడిట్ లక్ష్యం
డి) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) కార్బన్ క్రెడిట్లను జారీచేస్తుంది
21. అగ్ని-5 క్షిపణికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. అగ్ని-5 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగేలా నేర్పుతో రూపొందించిన అధునాతన బాలిస్టిక్ క్షిపణి
2. ఇది దాడి చేసి విస్మరించగల (ఫైర్ అండ్ ఫర్గెట్) క్షిపణి. అవరోధ/అంతర్వర్తిత(ఇంటర్సెప్టార్) క్షిపణి లేకుండా దీన్ని ఆపలేరు
3. అగ్ని శ్రేణిలో ఇది అతి పొడవైనది; 5 వేల కిలోమీటర్ల పరిధితో కూడిన ఖండాంతర ఉపరితల క్షిపణి
పైన పేర్కొన్న ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?
ఎ) 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
22. లిథియం-అయాన్ బ్యాటరీలకు సంబంధించి కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.
1. భారతదేశపు తొలి లిథియం సెల్ ప్లాంట్ తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ప్రారంభం కాబోతోంది
2. లిథియం-అయాన్ బ్యాటరీలు మొబైల్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకూ అన్నింటికీ ఉపయోగకరంగా ఉంటాయి. సౌర, పవన శక్తిని భారీగా నిల్వ చేయవచ్చు
పైన పేర్కొన్న అంశాల్లో ఏవి/ఏది సరైనవి/సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
23. ఐఎన్ఎస్ విక్రాంత్‌కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. కేవలం 50% సామగ్రి, పరికరాలు మాత్రమే దేశీయమైనవి
2. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత నావికాదళ నౌకా నిర్మాణ నిర్దేశక కార్యాలయం (డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్) రూపొందించి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (ఇది నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ నౌకానిర్మాణ కేంద్రం)లో నిర్మించారు
3. ఎయిర్ క్రాఫ్టులను ప్రారంభించడానికి స్కీజంప్ను ఉపయోగించే స్టోబార్ (ఎస్టీవోబీఏఆర్- షార్ట్ టేకాఫ్ బట్ అసిస్టెడ్ రికవరీ) అనే నిర్వహణ విధానాన్ని ఇది ఉపయోగించుకుంటుంది
పైన పేర్కొన్న వాటిలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ) 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
24. మూలకణాలకు సంబంధించి, కింది వాక్యాల్లో ఏది/ఏవి సరైనవి?
1. మూలకణాలను అవి ఉత్పన్నమయ్యే క్షీరదాల నుంచి మాత్రమే స్వీకరిస్తారు
2. మూలకణ మార్పిడి హెచ్ఐవీ వ్యాధిని నయం చేయగలదు
3. మూలకణాలను ప్రయోగశాలల్లో తయారు చేయలేరు
కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును ఎంచుకోండి.
ఎ) 1, 2 బి) 2
సి) 2, 3 డి) 1, 2, 3
జవాబులు
1. డి 2. సి 3. డి 4. ఎ
5. ఎ 6. డి 7. ఎ 8. సి
9. బి 10. బి 11. డి 12. బి
13. సి 14. డి 15. డి 16. సి
17. డి 18. బి 19. బి 20. డి
21. సి 22. సి 23. సి 24.
పీ విష్ణువర్ధన్
విష్ణు
ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
7702170025
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు