Current Affairs March 31 | చీతాల రక్షణ.. ఏనుగుల బాధ్యత
కరెంట్ అఫైర్స్
- చీతాల తరలింపు కార్యక్రమాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) నిర్వహించింది.
- చీతాలు అంతరించిపోవడంతో భారత్‌కు మరికొన్ని తీసుకురావడానికి సుప్రీంకోర్టు 2020 జనవరిలో అనుమతించింది.
- ఈ చీతాల తరలింపునకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 2022, జనవరి 7న విడుదల చేశారు.
- 2022, ఆగస్టు 2న ‘ప్రాజెక్ట్ చీతా’ కోసం NTCAతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం వచ్చే నాలుగు సంవత్సరాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద రూ.50.22 కోట్లు అందించనుంది.
- ఈ 8 చీతాల తరలింపు కోసం భారతీయ వైమానిక దళం ఒక ప్రత్యేక విమానాన్ని 2022, సెప్టెంబర్ 15న నమీబియాకు పంపింది. దాని పేరు బోయింగ్ 747-400 జంబో.
- ఈ విమానం ద్వారా ఎనిమిది చీతాలను నమీబియా రాజధాని విండ్‌హాక్ విమానాశ్రయం నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తరలించారు.
- వీటిని 2022, సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ విడుదల చేశారు. మొత్తం ఎనిమిది చీతాల్లో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నాయి.
- ఈ చీతాలతో మగవాటి సరాసరి వయస్సు 4.5 నుంచి 5.5 సంవత్సరాలు కాగా ఆడ చీతాల వయస్సు 2 నుంచి 5 సంవత్సరాలు. వీటిని మధ్యప్రదేశ్‌లోని ‘కునో జాతీయ పార్కు’లో విడుదల చేశారు.
- వీటి విడుదల సందర్భంగా ప్రధాని మోదీ వీటికి వివిధ రకాల పేర్లు పెట్టారు. ఆడవాటికి బిజివి, షాషా, సవానా, సియాయ, ఆశా.. మగవాటికి ఫ్రెడ్డీ, ఎల్టన్, ఒబన్ అని పేర్లు పెట్టారు.
- 2022, సెప్టెంబర్ 20న ఈ చీతాల రక్షణ బాధ్యతలను చూసుకోవడానికి రెండు ఏనుగులు లక్ష్మి, సిద్ధాంత్లను తీసుకొచ్చారు. ఈ రెండు ఏనుగులను మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం సాత్పూరా టైగర్ రిజర్వ్ నుంచి తీసుకొచ్చారు.
- కునో జాతీయ పార్కు 748 చదరపు కి.మీ ల విస్తీర్ణంతో ఉంటుంది. ఇక్కడ చీతాలకు అవసరమైన ఆవాసం, తగిన ఆహారం ఉండటం వల్ల ఈ పార్కును ఎంచుకొన్నారు.
- ఛీతాలు భారత్‌లో ఆవాసాల నష్టం, వాటి విలక్షణమైన మచ్చలు, కోతుల కోసం వేటాడటం కారణంగా అంతరించిపోయాయి.
దక్షిణాఫ్రికా నుంచి 12 రాక
- దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. 2023, ఫిబ్రవరి 18న వాటిని విడుదల చేశారు.
- భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ వీటిని దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లోకి తీసుకొచ్చింది.
- ఈ 12 చీతాల్లో ఏడు మగవి, ఐదు ఆడవి ఉన్నాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని ‘కునో జాతీయ పార్కు’లో విడిచి పెట్టారు.
- ఇప్పటికే 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను కునో జాతీయ పార్కులో ప్రధాని విడుదల చేశారు. వీటితో భారత్‌లో చీతాల సంఖ్య 20కి చేరింది. అంటే 10 మగవి, 10 ఆడవి అయ్యాయి.
- దేశంలో చీతాలు అంతరించినట్లుగా 1952లో ప్రకటించారు. దీంతో 2009లో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరాం రమేష్ ‘ప్రాజెక్ట్ చీతా’ను దేశంలో తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రారంభించారు.
- చీతాలు తీసుకురావడం కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం దేశంలో జన్యువైవిధ్యంతో ఆరోగ్యకరమైన చీతాల జనాభాను పెంచటానికి వచ్చే ఐదు నుంచి పదేళ్లలో ఆఫ్రికా దేశాల నుంచి ఏటా 10-12 చీతాలను దిగుమతి చేసుకుంటారు.
లక్ష్యాలు
1. చీతాల సంతానోత్పత్తి పెంచడం
2. బహిరంగ అటవీ, గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించటానికి వనరులను సేకరించేందుకు చీతాలను ప్రధాన జాతిగా ఉపయోగించడం.
3. పర్యావరణ అభివృద్ధి, పర్యావరణ పర్యాటకం ద్వారా స్థానికులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం.
- దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకురావడానికి 2023 జనవరిలో రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దక్షిణాఫ్రికా వీటిని భారత్‌కు దానం చేసింది. కానీ భారత్ ఒక్కొక్క చీతాకు సుమారు 3000 డాలర్లు చెల్లించింది.
- భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం జంతువులను దిగుమతి చేసుకుంటే నెల రోజులు వాటిని క్వారంటైన్ (నిర్బంధం)లో ఉంచాలి. దేశంలోకి వచ్చిన తర్వాత వాటిని మరో 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి.
- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 12 చీతాల్లో మగ చీతా ఎనిమిది సంవత్సరాల మూడు నెలల పెద్ద వయస్సు కలిగి ఉన్నది. ఆడ చీతా రెండు సంవత్సరాల నాలుగు నెలలతో చిన్న వయస్సు కలిగి ఉంది. ఈ 12 చీతాల సరాసరి జీవితకాలం 8-12 సంవత్సరాలు.
- చీతా శాస్త్రీయనామం అసినోనిక్స్ జుబాటస్. ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే క్షీరదం.
- భారతదేశంలో మూడు చీతాలు చివరగా 1947లో ఇప్పటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని అడవుల్లో కనిపించాయి. వీటిని వేటాడినట్లుగా ప్రకటించారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- దీనిని గతంలో ‘ట్రెయిన్ 18’ అని పిలిచేవారు.
- 2018 సంవత్సరంలో భారత్‌లో వేగవంతమైన శతాబ్ది రైళ్ల స్థానంలో ‘ట్రైయిన్ 18’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
- 2019 జనవరి 27న అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‘సెమీ హైస్పీడ్ రైళ్లు’ అయిన ట్రెయిన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు అధిక పనితీరు కలిగిన విద్యుత్ బహుళ యూనిట్ రైళ్లు. ఇది 16 బోగీలు, 64 చక్రాలతో నడుస్తుంది. ఈ రైళ్లు భారతీయ రైల్వేల ద్వారా నిర్వహిస్తున్నారు.
వీటిని డిజైన్ చేసినది: Research Designs, Standards Organisation (RDSO) లక్నో. వీటిని తయారు చేస్తున్నది: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై - ఈ రైళ్లు పూర్తిగా భారత స్వదేశీ పరిజ్ఞానంతో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తయారు చేయబడినవి. ఈ రైళ్లు Mainline Electric Multiple Unit (MEMU) గా పని చేస్తాయి. అంటే ప్రత్యేకంగా ఇంజిన్ అమర్చవలసిన అవసరం లేదు.
- తొలి ప్రయోగాత్మక పరీక్ష 2018, అక్టోబర్ 29న చెన్నైలో జరిగింది. వందే భారత్ గరిష్ఠ వేగం గంటకు: 160 కి.మీలు
తొలి రైలు: న్యూఢిల్లీ-వారణాసి మధ్య 2019, ఫిబ్రవరి 15న ప్రారంభించారు.
రెండో రైలు: న్యూఢిల్లీ- శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా మధ్య 2019, అక్టోబర్ 3న ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో తొలి రైలు: ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-మైసూరు మధ్య 2022, నవంబర్ 11న ప్రారంభించారు.
తెలుగు రాష్ర్టాలకు తొలి వందే భారత్ రైలు: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య 2023, జనవరి 15న ప్రారంభించారు. 2023, ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 10 వందే భారత్ రైళ్లు దేశంలో వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. - 2022 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని ప్రకటించారు.
- 2022 మే నెలలో భారతీయ రైల్వే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) ద్వారా దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి వందే భారత్ రైళ్లకు అవసరమైన 2,50,000 చక్రాలను ఉత్పత్తి చేయనుందని ప్రకటించింది.
- 2026 నాటికి వందేభారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. భారతీయ రైల్వే 16 బిలియన్ డాలర్లకు 36,000 వందే భారత్ రైలు చక్రాలు కొనుగోలుకు ఉక్రెయిన్‌కు చెందిన ఒక సంస్థకు ఇచ్చింది. కాని ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఇది ఆలస్యమైంది.
- భారత్‌లో 200 వందే భారత్ రైళ్లను, 12800 చక్రాలు తయారు చేయడానికి భారత్, రష్యా దేశాల కన్సార్టియం ఎంపికైంది. ఈ కన్సార్టియంలో రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ (TMH), భారత్‌కు చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) లు ఉన్నాయి.
- ఈ కన్సార్టియం ఒక్కొక్క వందేభారత్ రైలును రూ.120 కోట్లకు, మొత్తం 200 రైళ్లకు రూ.24,000 కోట్లకు బిడ్ దక్కించుకుంది.
- 2023, ఆగస్టు 15 నాటికి దేశం మొత్తం మీద 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
- వందే భారత్ రైళ్లలో విమానాల మాదిరి సీట్ల నిర్మాణం ఉంటుంది. వైఫై సదుపాయం, స్టేషన్ల సమాచారం, ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, సెన్సార్ ఆధారిత నీటి కొళాయిలు, బయో వాక్యూమ్ మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఉంటాయి.
రాజ్యాంగం – అర్థం
రాజ్యాంగం అనేది ప్రజాస్వామిక దేశాల్లో సర్వోన్నత శాసనం, మౌలిక చట్టం. అందుకే రాజ్యాంగాన్ని ‘బేసిక్ లా’ లేదా ‘ఫండమెంటల్ లా’ అంటారు. దేశంలోని పరిపాలనా వ్యవస్థలు, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు.
- ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం రాజ్యాంగ పాలన. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త అరిస్టాటిల్. రాజ్యాంగ పాలన కింద ప్రజలు కొనసాగడం చైతన్యానికి ప్రతీకే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్నాడు. రాజ్యాంగంలో వివిధ ప్రభుత్వ అంగాల నిర్మాణం, వాటి అధికార పరిధులు, వాటి మధ్య గల సంబంధం, ప్రజల హక్కులు, వాటి పరిరక్షణ, పరిపాలనా స్వభావం నిర్దిష్టమైన రూపంలో క్రోడీకరించబడి ఉంటాయి. దేశంలో అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం.
- భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేశాయి. రాజ్యాంగ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను సమగ్రంగా తెలుసుకోవాలి.
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన (1773-1857) - ఈ దశలో దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార, ఇతర వ్యవహారాలను నిర్వహించింది. దీన్ని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అంటే ఒక సంస్థకు లేదా సంఘానికి తన కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రం.
రెగ్యులేటింగ్ చట్టం-1773
రెగ్యులేటింగ్ చట్టానికి రాజ్యాంగ వికాసపరంగా చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొదటి చట్టం. దీన్ని భారతదేశానికి సంబంధించి ‘మొదటి లిఖిత చట్టం’గా పేర్కొంటారు. వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టాన్ని 1773, మే 18న అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఉద్దేశింపబడినందున దీన్ని రెగ్యులేటింగ చట్టం అంటారు.
ముఖ్యాంశాలు - బెంగాల్ గవర్నర్ హోదాను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’ గా మార్చి ఇతడికి సలహా ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఆ విధంగా మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్‌ను నియమించారు.
- కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సర్ ఎలిజా ఇంఫే మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
టీ రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
NEEPCO Recruitment | నీప్కో మేఘాలయాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?