Model Essays | మహిళలు సామాజిక సమస్యలు
1. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యానికి నైతిక పోలీసింగ్ (Moral Policing) సరికొత్త నిరోధకమా?
ఉపోద్ఘాతం: పురుషులందరూ స్వేచ్ఛతో పుడితే, స్త్రీలందరూ బానిసలుగా ఎలా పుడతారు? మహిళలపై లైంగిక హింస పితృస్వామ్య సమాజంలోని స్త్రీ అణచివేతకు ఆమె లోనయింది.
- ప్రాచీన భారతదేశంలో ద్రౌపదికి జరిగిన హింసను మహాభారతం ఉదహరిస్తుంది. యుధిష్టరుడు తన భార్య ద్రౌపదిని జూదంలో పణంగా పెట్టి ఆమెను పోగొట్టుకున్నాడు. దుర్యోధనుడు తన సోదరుడు దుశ్శాసనున్ని రాజభవనంలో ద్రౌపది చీరను విప్పమని నిండు సభలో అవమానించగా శ్రీ కృష్ణుడు కాపాడాడు.
వివరణ
మొదటి సంఘటన: సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ
(పశ్చిమ బెంగాల్)లో ఇటీవల జరిగిన ఉదంతం. శ్రామిక మహిళలకు చట్టపరమైన రక్షణలు, కార్యాలయాల్లో పనిచేసే సంస్థాగత యంత్రాంగాలు అవసరమని నిరూపించాయి. గతవారం భారతదేశం అంతా శ్రామిక మహిళలు కొత్త చేదు విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. నైతికంగా అభ్యంతరకరమైన ఫొటోలను పోస్ట్ చేయడం వల్ల ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టమని అడగడానికి కారణం కావచ్చు, ఆమె ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మహిళలు కుటుంబ గౌరవానికి బాధ్యత వహించడమే కాకుండా వారు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కూడా వారి యజమానుల గౌరవానికి కూడా సంరక్షకులుగా ఉండాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెయింట్ జేవియర్ టీచర్ తన ఇంట్లో స్విమ్ సూట్లో దిగిన ఫొటోలు తన సొంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు ఆమెను అక్టోబర్ (2022)లో విధుల నుంచి నిష్క్రమించమని కళాశాల ఆదేశాలు జారీ చేసింది. (Having indulged in improper social media behaviour)
- రెండో సంఘటన: ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థినిని (22 ఏండ్లు) ఆమె నివాసం ఉంటున్న గృహసముదాయ అసోసియేషన్ వారు ఆమెను అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయమని కోరారు. అంతేకాకుండా ఒక వీధిలో సంచరించే స్త్రీ లాగా ఉన్నావు అని ఆమెను దూషించారు.
- నైతిక పోలీస్ కారణంగా దేశ ఆర్థికవృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందని వ్యాపారవేత్త ఆది గోద్రెజ్ హెచ్చరించారు.
- 2022, నవంబర్ 25న సుప్రీంకోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఒక న్యాయవాదుల ఫంక్షన్లో మహిళా న్యాయవాదుల గురించి స్పందించారు. మహిళలు వేసవిలో న్యాయవాద వృత్తిలో ధరించే దుస్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా మహిళలను నైతిక పోలీసింగ్‌కు గురి చేయడం వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
- 1990 ప్రారంభంలో జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని దుఖ్తరన్-ఎ-మిల్లత్ అనే ఇస్లామిక్ మహిళా వేర్పాటు వాద సంస్థ మహిళలను వారి ముఖాలను కప్పి ఉంచమని బెదిరించింది, యాసిడ్ దాడులు చేసింది. ఈ సంస్థకు ఆంధ్రాబీ కూడా పురుషులకు ముద్దతు తెలిపింది. కానీ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ అనే సంస్థ మాత్రం మినహాయింపులు ఇచ్చింది. దీని వల్ల కొంత ఉపశమనం కలిగింది.
- ఒక అమెరికన్ జంట బాబిట్ కేసు 1993లో భార్య తన భర్త పురుషాంగాన్ని కత్తితో కోసినప్పుడు జరిగిన సంఘటనతో ఆమె కష్టాన్ని ఏవిధంగా భరించిందో వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం అతని లైంగిక హింస, అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తేవడం అని నిర్ధారించి ఆమెను నిర్దోషిగా గుర్తించారు.
- 1999లో ఒరిస్సాలో ఒక మహిళ కేసు విషయంలో ఆ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ ఆమెపై అత్యాచార ప్రయత్నం చేశారని ఆరోపించింది.
- ప్రాచీన భారత దేశంలోని గార్గి, మైత్రేయి, సులభ లాంటి వారు వేద పండితులుగా పేరుగాంచారు.
2. భారతదేశంలో మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చట్ట పరమైన రక్షణల గురించి వివరించండి?
ప్రభుత్వ సంస్థలు, సదస్సులు
1. దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆఫ్ ఉమెన్ ప్రకారం 85% మంది పురుషులు గత 12 నెలల్లో తమ భార్యలపై హింసాత్మకంగా ప్రవర్తించారని అంగీకరించారు. ఈ సంస్థ ’బోల్’ పేరుతో టెలివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళల్లో అవగాహన కల్పిస్తుంది.
2. యూఎన్వో ఆర్టికల్ 55, 56 సమానత్వం, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.
3. యూఎన్వో 1975 మెక్సికో, 1980 కొపెన్‌హెగెన్ సదస్సులు మహిళల లింగ సమానత్వం, అవకాశాలను ప్రోత్సహించే వ్యూహాలు సమానత్వం, అభివృద్ధి, శాంతి అనే కోణాల్లో లక్ష్యాలు నిర్దేశించారు.
4. సీఈడీఏడబ్ల్యూ (కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎగెనెస్ట్ ఉమెన్) 1981 సదస్సు: దీనిలో 166 దేశాలు చేరాయి.
న్యాయపరమైన రక్షణ
1. దేశంలో ఐపీసీ సెక్షన్ 292 నుంచి 294 వరకు అశ్లీలతతో ఏ విధంగా వ్యవహరించాలని ఉపయోగిస్తారు.
2. సెక్షన్ 292 అశ్లీల పుస్తకాలు, వస్తువుల విక్రయాలకు సంబంధించింది. దీన్ని 1969లో సవరించారు. కండోమ్‌లు, ప్రకటనలు, శాస్త్రీయ అంశాలు, కళ, మతపరమైన వ్యక్తులను మినహాయించడానికి సవరించారు.
3. చలన చిత్ర పోస్టర్లు, హోర్డింగ్‌లు, 20 సంవత్సరాల్లోపు వారికి అశ్లీల వస్తువుల విక్రయం గురించి సెక్షన్ 294 అశ్లీల పాటల నిషేధం గురించి వివరిస్తుంది.
దేశంలోని చట్టాలు
1. కుటుంబ న్యాయస్థానాల చట్టం- 1984
2. గర్భస్రావం-శిశుమరణం:- ఐపీసీ 312 నుంచి 316 వరకు
3. గృహహింస చట్టం 2005- శారీరక, మౌఖిక, భావోద్వేగ, ఆర్థిక, లైంగిక
4. మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం నిషేధం- 1986 చట్టం
5. సతీ నివారణ- 1987
సిఫారసులు
1. క్రానిక్ స్కిజోఫ్రీనియా/ మానసిక బాధల నుంచి రక్షించాలి. ఇది ఒక అనారోగ్య స్థితిగా గుర్తించాలి.
2. మద్యం వినియోగంపై పరిమితి కొనుగోలు వయస్సు 30 ఏండ్లకు పెంచాలి. ప్రత్యేక తనిఖీలు చేయాలి.
3. మీడియా పై నియంత్రణ అశ్లీల సైట్లను నిషేదించాలి.
4. బాలికల వివాహ వయస్సు 20వ దశకం ప్రారంభంలో ఉండాలి. హిందువులు శివ-పార్వతి నమూనాను ప్రోత్సహించాలి.
5. బాధిత మహిళలకు మధ్యంతర ఉపశమనం కలిగించి నేరస్థుడు చెల్లించే పెద్ద మొత్తాన్ని ఆమెకు తక్షణమే అందించేలా, ఆమె పునరావాసానికి వినియోగించేలా చూడాలి.
ముగింపు
- చట్టాలు సాధారణంగా పాతుకుపోయిన సామాజిక సమస్యలను పరిష్కరించలేవు. కాబట్టి ఇతర మార్గాల ద్వారా పరిష్కరించాలి. విద్య, స్త్రీ, పురుషుల మధ్య సానుకూల అవగాహనలు, సత్సంబంధాలు పెంచాలి. ఈ విపత్తు నిర్మూలనకు ఇద్దరూ కలిసికట్టుగా కృషి చేయాలి.
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ, ఏమర్స్ విల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు