Telangana History March 27 | ఓడ బేరం పదం దేనికి సంబంధించింది?
గతవారం 3వ పేజీ తరువాయి..
51. ఆధునిక తెలంగాణ చరిత్రకు సంబంధించి అబిద్ హసన్ సఫ్రానీ, డాక్టర్ సురేశ్ చంద్ర ఎవరు?
a) ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు
b) రాజ్యాంగ సభ సభ్యులు
c) ప్రఖ్యాత వైద్యులు
d) నిజాం తరఫున భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు జవాబు: (a)
వివరణ: వీరిద్దరే కాకుండా అలీ సుల్తాన్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్ఏ)లో చేరినట్లు తెలుస్తుంది. ప్రముఖ జాతీయవాది, విప్లవకారుడు చంపకరామన్ పిైళ్లె ‘జై హింద్’ నినాదం ఇచ్చారు. దీన్ని అబిద్ హసన్ సఫ్రానీ సూచన మేరకు ఐఎన్ఏ నినాదంగా గ్రహించారు.
52. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే ప్రయత్నం చేసినందుకు నిజాం ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసింది?
a) స్వామి రామానంద తీర్థ
b) సరోజినీ నాయుడు
c) రావి నారాయణ రెడ్డి
d) పద్మజా నాయుడు జవాబు: (d)
53. నిజాం పరిపాలనా వ్యవస్థకు సంబంధించి కార్యనిర్వాహక సంస్థను ఏమని పిలిచేవారు?
a) సదర్ నిజామత్ అదాలత్
b) బాబ్ ఎ హుకుమత్
c) సదర్-ఎ-రియాసత్
d) సదర్-ఎ-ఆజమ్ జవాబు: (b)
54. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమయ్యేనాటికి చెలామణిలో ఉన్న నాణెం ఏది?
a) కల్దార్ నాణెం b) రూపాయి
c) హోలీ సిక్కా d) దీనార్
జవాబు: (c)
వివరణ: 1955, ఏప్రిల్ 1న హోలీ సిక్కా పూర్తిగా రద్దయింది.
55. కింది వారిలో ‘హైదరాబాద్ అంబేడ్కర్’గా ప్రసిద్ధిచెందింది ఎవరు?
a) అరిగె రామస్వామి b) భాగ్యరెడ్డి వర్మ
c) బీఎస్ వెంకట్రావు d) ఎస్బీ గౌతమ్
జవాబు: (c)
వివరణ: వెంకట్రావు ‘ఆదిద్రావిడ సంఘం’ (1922), ‘ఆదిహిందూ మహాసభ’ (1927) స్థాపించాడు. ఎం గోవిందరాజులు, ఎం వెంకటస్వామితో కలిసి హైదరాబాద్‌లో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషిచేశాడు.
56. 1947లో మీర్ లాయక్ అలీ మంత్రివర్గంలో బీఎస్ వెంకట్రావు ఏ శాఖను చేపట్టారు?
a) న్యాయ శాఖ b) విద్యా శాఖ
c) రెవెన్యూ శాఖ d) సంక్షేమ శాఖ
జవాబు: (b)
57. హైదరాబాద్‌లో 1920లో కార్ఖానా జిందా తిలిస్మాత్‌ను ఎవరు స్థాపించారు?
a) హకీం మొహమ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ
b) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
c) వజీర్ సుల్తాన్ d) సాలార్ జంగ్
జవాబు: (a)
58. హైదరాబాద్ రాజ్య మొదటి పోస్ట్ మాస్టర్ జనరల్ (నాజిమ్) ఎవరు?
a) మెహిదీ నవాజ్ జంగ్
b) షా సావర్ జంగ్
c) పింగళి వెంకటరామారెడ్డి
d) సర్ అక్బర్ హైదరీ జవాబు: (b)
వివరణ: మొదటి సాలార్జంగ్ కాలంలో హైదరాబాద్‌లో 1869లో తపాలా శాఖ ఏర్పాటైంది. 1866లోనే తొలిసారి అణా తపాలా బిళ్లను విడుదల చేశారు.
59. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమై నప్పుడు హైదరాబాద్ నిజాం ఎవరు?
a) నాసిరుద్దౌలా b) సలాబత్ జంగ్
c) అఫ్జలుద్దౌలా
d) మీర్ మహబూబ్ అలీ ఖాన్
జవాబు: (c)
60. సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి రాజ్య సరిహద్దులను దాటి వెళ్లడానికి నిరాకరించిన ఔరంగాబాద్‌లోని హైదరాబాద్ కంటింజెంట్ సిపాయిలు ఎవరు?
a) అమీర్ ఖాన్, మీర్ ఫిదా అలీ
b) తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్
c) తుర్రెబాజ్ ఖాన్, కుర్బాన్ అలీ
d) అమీర్ ఖాన్, భాగోజీ నాయక్
జవాబు: (a)
వివరణ: మీర్ ఫిదా అలీని ఉరితీశారు. అమీర్ ఖాన్ తప్పించుకున్నాడు.
61. సిపాయిల తిరుగుబాటులో భాగంగా పట్టుబడి 1884లో అండమాన్‌లో మరణించిన తిరుగుబాటుదారుడు ఎవరు?
a) తుర్రెబాజ్ ఖాన్
b) జమేదార్ చీదా ఖాన్
c) జమేదార్ అమీర్ ఖాన్
d) మౌల్వీ అల్లావుద్దీన్ జవాబు: (d)
వివరణ: మౌల్వీ అల్లావుద్దీన్ బెంగళూరు పారిపోతుండగా మంగళ్‌పల్లి దగ్గర పట్టుబడ్డాడు. ఆయనపై విచారణ జరిపి 1859లో అండమాన్ దీవులకు ద్వీపాంతర వాస శిక్ష విధించారు. 1884లో ఆయన అక్కడే మరణించాడు.
62. రుద్రమదేవి.. త్రిపురాంతకం యుద్ధంలో మరణించినట్లు తెలుపుతున్న శాసనం?
a) విలస తామ్ర శాసనం
b) చందుపట్ల శాసనం
c) బయ్యారం చెరువు శాసనం
d) హనుమకొండ శాసనం జవాబు: (b)
వివరణ: 1289 నాటి ఈ శాసనం నల్లగొండ జిల్లా చందుపట్లలో దొరికింది. దీన్ని వేయించింది రుద్రమదేవి సేవకుడైన పువ్వుల ముమ్మడి. ఇందులో కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణచివేసే క్రమంలో త్రిపురాంతకం యుద్ధంలో రుద్రమ, ఆమె సేనాని మల్లికార్జున నాయకుడు మరణించినట్లు ఉంది.
63. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ‘ఓదయంత్రికులు’ దేన్ని తెలియజేస్తుంది?
a) ఓడలను నడిపే యంత్రాలు చేసేవారు
b) పత్తిని వడికే రాట్నం తయారు చేసేవారు
c) నీటిని తోడే పరికరాలు చేసేవారు
d) వెదురుకు నగిషీలు పెట్టేవారు
జవాబు: (c)
64. శాతవాహనుల కాలంలో రాజుల అధీనంలో ఉండే భూములను ఏమని పిలిచేవారు?
a) రాచదొడ్డి b) రాచవీడు
c) దేయమేయం d) రాజకంఖేట
జవాబు: (d)
65. హైదరాబాద్ రాజ్యం (తెలంగాణ)లో రాజకీయ చైతన్యం మొదలుకావడానికి కారణమైన సంఘటనగా దేన్ని పేర్కొంటారు?
a) అరవముత్తు అయ్యంగార్ కమిటీ ఏర్పాటు
b) చాందా రైల్వే స్కీమ్
c) 1857 సిపాయిల తిరుగుబాటు
d) నిజాం కాలేజీ స్థాపన జవాబు: (b)
వివరణ: ఇది హైదరాబాద్‌లో రైలు మార్గాల విస్తరణకు సంబంధించింది. రైలు మార్గాన్ని హైదరాబాద్ నుంచి బొగ్గు గనులు ఉన్న మహారాష్ట్రలోని చాందా వరకు వేయాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. దీని వివరాలు ప్రజలకు అంతగా తెలపలేదు. దాంతో ఈ పథకంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ వంటి విద్యావంతులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అఘోరనాథ్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరించారు.
66. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అంకురార్పణ జరిగింది?
a) 1921 నాగపూర్ కాంగ్రెస్
b) 1929 లాహోర్ కాంగ్రెస్
c) 1937 హరిపుర కాంగ్రెస్
d) 1938 త్రిపుర కాంగ్రెస్ జవాబు: (c)
67. మహిళా సంక్షేమం కోసం హైదరాబాద్‌లో ‘ఆంధ్రయువతి మండలి’ని ఏ సంవత్సరం లో స్థాపించారు?
a) 1935 b) 1936
c) 1930 d) 1937
జవాబు: (a)
వివరణ: డా. లక్ష్మీనరసమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి, సంగం లక్ష్మీబాయమ్మ తదితరులు ‘ఆంధ్ర యువతి మండలి’ని స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు సతీమణి అనంతలక్ష్మి కూడా మండలి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీన్ని తెలంగాణ యువత మండలిగా మార్చారు. దీని తొలి అధ్యక్షురాలు గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవి.
68. రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
a) ఇబన్ బటూటా b) నికోలో మానుక్కి
c) టావెర్నియర్ d) మార్కోపోలో
జవాబు: (d)
వివరణ: మార్కోపోలో 1293లో మోటుపల్లి రేవును సందర్శించాడు. అక్కడి నుంచి వజ్రాలు, నాజూకైన వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని పేర్కొన్నాడు. కాకతీయ రాజ్య వైభవం గురించి ప్రశంసించాడు.
69. కాకతీయుల కాలం నాటి చెరువులకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. పాకాల చెరువు: జగదల ముమ్మడి
2. బయ్యారం చెరువు: గణపతిదేవుడు
3. రామప్ప చెరువు: రేచర్ల రుద్రుడు
4. కేసరి సముద్రం: రెండో ప్రోలరాజు
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1, 2, 3 b) 1, 3
c) 2, 3, 4 d) అన్నీ సరైనవే
జవాబు: (b)
వివరణ: బయ్యారం, ధర్మసాగర్ చెరువులను గణపతిదేవుడి సోదరి మైలాంబ నిర్మించింది. కేసరి సముద్రం చెరువును మొదటి ప్రోలరాజు నిర్మించాడు. గణపతిదేవుడి మరో సోదరి కుందాంబ కుంద సముద్రం చెరువు నిర్మించింది. పాకాల చెరువును జగదల ముమ్మడి, రామప్ప చెరువును రేచర్ల రుద్రుడు నిర్మించారు. జగదల ముమ్మడి గణపతి దేవుడి మంత్రి, బయ్యన నాయకుడి కొడుకు. ఈ చెరువుల కింద ప్రయోజనం పొందిన రైతులు పండిన పంటలో 10వ వంతు చెరువుల మరమ్మతు కోసం శిస్తు చెల్లించాలి. దీన్ని ‘దశవంద మాన్యం’ అని పిలిచేవారు.
70. కోటగుళ్లుగా ప్రసిద్ధి చెందిన గణపురంలోని ‘గణపేశ్వరాలయాల’ సముదాయం నిర్మాత ఎవరు?
a) గణపతిదేవుడు b) రేచర్ల రుద్రుడు
c) జాయప సేనాని d) రేచర్ల గణిపి రెడ్డి
జవాబు: (d)
వివరణ: రామప్ప గుడి నిర్మించిన రేచర్ల రుద్రుడి కొడుకే గణిపి రెడ్డి. ఈ ఆలయాలు ములుగు జిల్లాలో ఉన్నాయి.
71. హైదరాబాద్‌లో 1886లో అబ్దుల్ ఖయ్యూం, మౌల్వీ సయ్యద్ హుసేన్ బిల్‌గ్రామీ, ఇమాద్ ఉల్ ముల్క్ కలిసి ఏర్పాటుచేసిన గ్రంథాలయం ఏది?
a) ఖుదాబక్ష్ ఓరియంటల్ లైబ్రరీ
b) ఆసఫియా స్టేట్ లైబ్రరీ
c) మహబూబియా స్టేట్ లైబ్రరీ
d) ఉస్మానియా స్టేట్ లైబ్రరీ జవాబు: (b)
వివరణ: ప్రస్తుతం దీన్ని ‘స్టేట్ సెంట్రల్ లైబ్రరీ’ (అఫ్జల్‌గంజ్) అని పిలుస్తున్నారు.
72. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు?
a) కొమర్రాజు లక్ష్మణరావు
b) మాడపాటి హనుమంతరావు
c) వట్టికోట ఆళ్వారుస్వామి
d) సురవరం ప్రతాపరెడ్డి జవాబు: (c)
73. హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర (ప్రస్తుతం తెలుగు) భాషా నిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు?
a) 1901 b) 1902
c) 1900 d) 1903
జవాబు: (a)
వివరణ: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజా నాయని వెంకట రంగారావు ముఖ్యపాత్ర పోషించారు. ఇది రావిచెట్టు రంగారావు ఇంట్లో ఏర్పాటైంది.
74. కుతుబ్‌షాహీల ఆర్థిక పరిస్థితులకు సంబంధించి విదేశీ వ్యాపారాన్ని సాహిత్యంలో ఏమని పేర్కొన్నారు?
a) నౌకాయానం b) ద్వీపాంతరం
c) నానాదేశం d) ఓడబేరం
జవాబు: (d)
వివరణ: ఓడ బేరం అంటే నౌకా వ్యాపారం అని అర్థం.
75. హైదరాబాద్ నగర నిర్మాణంలో మహమ్మద్ కులీ కుతుబ్‌షాకు సహకరించిన వ్యక్తి ఎవరు?
a) మీర్ మోమిన్ మహమ్మద్ అస్ర్తాబాదీ
b) మీర్ జుమ్లా c) మహమ్మద్ గవాన్
d) షారాజు కట్టాల్ జవాబు: (a)
76. హైదరాబాద్ నగర నిర్మాణానికి ఇరాన్ (పర్షియా)లోని ఏ నగరాన్ని నమూనాగా తీసుకున్నారు?
a) టెహ్రాన్ b) అస్ర్తాబాద్
c) ఇస్ఫహాన్ d) జలాలాబాద్
జవాబు: (c)
77. కింది వారిలో ఏ రాజు ‘యోగిగా, భోగి (రాజు)గా, బందీగా’ జీవితాన్ని వెళ్లదీశాడు?
a) కాకతీయ ప్రతాపరుద్రుడు
b) కాకతీయ గణపతిదేవుడు
c) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
d) అబుల్ హసన్ తానీషా జవాబు: (d)
వివరణ: అబుల్ హసన్ తానీషా 15 ఏండ్లు యోగిగా, 15 ఏండ్లు రాజుగా, 15 ఏండ్లు బందీగా జీవించాడు.
78. ఔరంగజేబు దండయాత్రలో గోల్కొండ కోట ద్వారం తెరిచి రాజద్రోహానికి పాల్పడ్డ సైన్యాధిపతి ఎవరు?
a) అబ్దుల్ రజాక్ లారీ b) అబ్దుల్లా పాని
c) సయ్యద్ మహమ్మద్ మీర్ జుమ్లా
d) రజాక్ కులీ నెక్నాం ఖాన్
జవాబు: (b)
79. గోల్కొండను ఆక్రమించిన తర్వాత తానీషాను ఔరంగజేబు ఎక్కడ బందీగా ఉంచాడు?
a) ఔరంగాబాద్ b) ఆగ్రా
c) దౌలతాబాద్ d) ఢిల్లీ
జవాబు: (c)
వివరణ: దౌలతాబాద్ కోటలో బందీగా ఉన్న తానీషా 1699లో అక్కడే మరణించాడు. దగ్గరలో ఉన్న ఖుల్దాబాద్‌లో సమాధి చేశారు.
80. భాగవతులకు కూచిపూడిని అగ్రహారంగా దానం ఇచ్చిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
a) అబుల్ హసన్ తానీషా
b) అబ్దుల్లా కుతుబ్ షా
c) మహమ్మద్ కులీ కుతుబ్ షా
d) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
జవాబు: (a)
81. హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి గ్రంథాలయాన్ని ఎవరు స్థాపించారు?
a) సోమసుందరం మొదలియార్
b) కొమర్రాజు లక్ష్మణరావు
c) అంబటిపూడి వెంకటరత్నం
d) భాగ్యరెడ్డి వర్మ జవాబు: (a)
వివరణ: సోమసుందరం మొదలియార్ 1872లో సికింద్రాబాద్‌లో గ్రంథాలయం ఏర్పాటుచేశారు.
82. కింది వారిలో శంకరానంద గ్రంథాలయం వ్యవస్థాపకులు ఎవరు?
a) ముదిగొండ వీరభద్రయ్య
b) రావిచెట్టు రంగారావు
c) ముదిగొండ శంకరారాధ్యులు
d) సురవరం ప్రతాపరెడ్డి జవాబు: (c)
వివరణ: కవాడిగూడలో ఏర్పాటుచేశారు.
83. హైదరాబాద్‌లో 1879లో యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని ఎవరు స్థాపించారు?
a) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
b) విలియం పామర్
c) జేమ్స్ కిర్క్‌పాట్రిక్
d) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
జవాబు: (d)
వివరణ: ఇందులో గ్రంథాలయం కూడా ఉండేది.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు