Current Affairs March 27th | క్రీడలు
పంకజ్ అద్వానీ
ఏషియన్ బిలియర్డ్స్ టోర్నీని భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. మార్చి 19న దోహాలో జరిగిన 100-అప్ తుదిపోరులో అద్వానీ భారత్‌కే చెందిన బ్రిజేష్ దమానీపై విజయం సాధించాడు. అద్వానీ స్నూకర్, బిలియర్డ్స్‌లో కలిపి 25 సార్లు ప్రపంచ విజేతగా నిలిచాడు.
అల్కారజ్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కారజ్ ఇండియన్ వెల్స్ (పీఎన్బీ పారిబాస్-2023) ఓపెన్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీని గెలుచుకున్నాడు. అమెరికా, కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్‌లో మార్చి 19న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మహిళల ఫైనల్లో ఎలెని రిబకినా అరినా సబలెంకపై విజయం సాధించింది. విజేతలకు 12,62,220 డాలర్ల (రూ.10.42 కోట్లు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)- మాథ్యూ ఎబ్డన్ (ఆస్ట్రేలియా) జంట సీడ్ వెస్లీ (నెదర్లాండ్స్)-నియల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంటపై గెలిచింది. దీంతో బోపన్న ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ చాంపియన్‌గా నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు డానియల్ నెస్టర్ (42 ఏండ్లు) పేరుతో ఈ రికార్డు ఉంది.
రాణి రాంపాల్
ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని ఎంసీఎఫ్ హాకీ స్టేడియానికి భారత హాకీ స్టార్ రాణి రాంపాల్ పేరు ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ అని మార్చి 21న పెట్టారు. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి రాణి ముఖ్య అతిథిగా హాజరైంది.
ఆసియన్ ఖోఖో
ఆసియన్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. మార్చి 23న అసోంలోని తముల్పుర్లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు రెండు నేపాల్ పురుషులు, మహిళల జట్లపైనే గెలుపొందాయి. పురుషులు ఇన్నింగ్స్, ఆరు పాయింట్ల తేడాతో, మహిళల జట్టు ఇన్నింగ్స్, 22 పాయింట్ల తేడాతో విజయం సాధించాయి. ఈ టోర్నీలో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియాల నుంచి మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి.
రొనాల్డో
పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2024 యూరోపియన్ చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మార్చి 24న లీటెన్స్టెయిన్తో పోర్చుగల్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఇది అతడికి జాతీయ జట్టు తరఫున 197వ మ్యాచ్ దీంతో కువైట్‌కు చెందిన బేడర్ అల్ ముతావా (196) రికార్డును రొనాల్డో వెనక్కి నెట్టాడు. 2021లోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐరోపా ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (118) రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?