Physics Groups Special | అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి?
భౌతిక శాస్త్రం
1. సాధారణంగా ఆడవారి కంఠస్వరం స్థాయి ?
ఎ) మగవారి కంటే ఎక్కువ
బి) మగవారి కంటే బాగా తక్కువ
సి) మగవారికంటే కొంచెం తక్కువ
డి) మగవారితో సమానం
2. డాప్లర్ ఫలితం అనువర్తనం కానిది?
ఎ) వాహనాల వేగాన్ని లెక్కించే ‘స్పీడ్ గన్’ అనే పరికరం పనిచేయుట
బి) తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకోవటం
సి) సూర్యుని ఆత్మభ్రమణదిశ, శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి
డి) శరీరంలోని ఎముకలను పరిశీలించుట
3. కింది వాటిలో ఏ పదార్థంలో ధ్వనివేగం ఎక్కువ?
ఎ) హైడ్రోజన్ వాయువు
బి) నీరు సి) రబ్బరు
డి) గాలి
4. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీసదూరం?
ఎ) 16 మీ. బి) 17 మీ.
సి) 18 మీ. డి) 19 మీ.
5. గబ్బిలాలు చీకటిలో దేన్ని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణం? అవి వినగలిగే ధ్వనులు?
ఎ) పరశ్రావ్యాలు బి) శ్రావ్య ధ్వనులు
సి) అతిధ్వనులు
డి) చీకటిలో చూసే దృష్టి అభివృద్ధి చెందడం
6. కింది వాటిలో రాడార్ ఉపయోగం ఏది?
ఎ) సౌర వికిరణాన్ని శోధించడానికి
బి) విమానాలు, క్షిపణుల ఉనికి, వాటి గమనాన్ని శోధించడం
సి) గ్రహాలను పరిశీలించడం
డి) భూకంపాల తీవ్రతలు కొలవడానికి
7. మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం?
ఎ) కాలిడోస్కోప్ బి) సోనార్
సి) రాడార్ డి) పెరిస్కోప్
8. కింది వాటిలో పరశ్రావ్య ధ్వని?
ఎ) 18 Hz బి) 180 Hz
సి) 1800 Hz డి) 18000 Hz
9. సినిమా హాల్ గోడలు, పైకప్పు రంపపు పొట్టుతో కప్పడానికి కారణం?
ఎ) హాల్‌కు మరింత సౌందర్యం ఇవ్వడం
బి) అనునాద నివారణ
సి) ప్రతిధ్వని నివారణ
డి) అధిక పౌనఃపున్యం గల ధ్వనిని శోషించడం
10. జతపరచండి.
ఎ. సోనార్ 1. క్రిస్టియన్ డాప్లర్
బి. డాప్లర్ ప్రభావం 2. వాట్సన్ వాట్
సి. రాడార్ 3. నిక్సన్
డి. ధ్వని రికార్డ్, పునరుత్పత్తి 4. పౌల్సన్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-3, బి-1, సి-2, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
11. ధ్వని స్థాయి కింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది?
ఎ) ధ్వనిపౌనఃపున్యం
బి) కంపన పరిమితి
సి) తరంగదైర్ఘ్యం డి) పైవన్నీ
12. పిల్లనగ్రోవి, విజిల్, రేడియో పనిచేసే ధర్మం?
ఎ) ప్రతిధ్వని బి) అనునాదం
సి) డాప్లర్ ప్రభావం డి) సోనార్
13. ధ్వని తీవ్రతల దృష్ట్యా జతపరచండి.
ఎ. గుసగుసలు 1. 60db
బి. టెలిఫోన్ 2. 20-30 db
సి. జెట్ విమానం 3. 80-90 db
డి. ట్రాఫిక్ 4. 100-200 db
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-4, బి-2, సి-1, డి-3
14. కింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని జనించదు, ప్రయాణించదు?
ఎ) గాలి బి) రబ్బరు
సి) హైడ్రోజన్ డి) ఉప్పునీరు
15. ఆడవారి గొంతు మగవారికన్నా ‘కీచు’గా ఉండటానికి కారణం?
ఎ) తక్కువ పౌనఃపున్యం
బి) తక్కువ తరచుదనం
సి) ఎక్కువ పౌనఃపున్యం
డి) ఎక్కువ తరచుదనం
16. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. సముద్ర అంతర్భాగంలో గల సబ్‌మెరైన్ ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుగొనడానికి తోడ్పడే ‘సోనార్’ డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది
2. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్‌క్రాఫ్ట్స్, రాకెట్స్, క్షిపణుల ఉనికిని తెలుసుకొనే రాడార్ డాఫ్లర్ ఫలితం ఆధారంగా
పనిచేస్తుంది
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 సరికాదు, 2 సరైనది
సి) రెండూ సరైనవి
డి) రెండూ సరికాదు
17. సరైనవి గుర్తించండి.
1. కుక్కలు 50,000 Hz వరకు, గబ్బిలాలు లక్ష Hz వరకు ధ్వనిని వింటాయి
2. డాల్ఫిన్స్ లక్ష Hz పౌనఃపున్యంగల ధ్వనిని ఉత్పత్తి చేసి గుర్తిస్తాయి
ఎ) రెండూ సరైనవే
బి) 1 సరైనది, 2 తప్పు
సి) రెండూ సరికాదు
డి) 2 సరైనది, 1 తప్పు
18. గాలిసాంద్రత తగ్గితే దానిలో ధ్వని వేగం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) ఏ మార్పు ఉండదు
డి) పైవేవీ కావు
19. కింది వాటిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది?
ఎ) గాలి బి) నీరు
సి) పాదరసం డి) ప్లాస్టిక్
20. ‘ధ్వని బహుళపరావర్తనం’ అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం?
ఎ) ఈసీజీ బి) రాడార్
సి) స్టెతస్కోప్ డి) అల్ట్రాసోనోగ్రాఫ్
21. కింది వాటిలో ఏ రోజు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది?
ఎ) 00C ల వద్ద పొడిరోజు
బి) 300C ల వద్ద పొడిరోజు
సి) 00C ల వద్ద తడిరోజు
డి) 300C ల వద్ద తడిరోజు
22. సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం?
ఎ) ధ్వని వక్రీభవనం బి) ధ్వని వివర్తనం
సి) అనునాదం
డి) ధ్వని రుజువర్తనం
23. సరైనది గుర్తించండి.
1. లోతైన లోయలు, గనుల లోతును కనుగొనేది
2. రెండు ఎత్తయిన భవనాలు, పర్వతాల మధ్య దూరాన్ని కనుగొనడానికి ఉపయోగించే ధ్వని ధర్మం
ఎ) అతిధ్వనులు బి) ప్రతిధ్వని
సి) సోనార్ డి) అనునాదం
24. కింది వాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది ఏది?
1. పాల నుంచి కొవ్వును వేరుపరచడం
2. పాత్రలలోని పగుళ్లను గుర్తించడం
3. సోనోగ్రఫీలో ఉపయోగించడం
4. దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 4 డి) పైవన్నీ
25. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు?
1. ఘనపదార్థం
2. ద్రవ పదార్థం
3. వాయు పదార్థం
4. శూన్య ప్రదేశం
ఎ) 1 బి) 4
సి) 3, 4 డి) 2, 4
జవాబులు
1.ఎ 2.బి 3.డి 4.బి
5.సి 6.బి 7.బి 8.ఎ
9.డి 10.సి 11.ఎ 12.బి
13.బి 14.బి 15.సి 16.సి
17.ఎ 18.ఎ 19.సి 20.సి
21.డి 22.సి 23.బి 24.సి
25.బి
కాంతి
1. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
ఎ) అనుదైర్ఘ్య బి) తిర్యక్
సి) యాంత్రిక డి) స్థావర
2. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. కాంతి దాని ధర్మాల అధ్యయనం – ఆప్టిక్స్
2. కాంతిని కొలిచే శాస్త్రం – ఫొటోమెట్రీ
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైనది
సి) రెండూ సరైనవే
డి) రెండూ తప్పు
3. పిడుగుపడే సమయంలో మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినపడటం ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ఎ) కాంతివేగం, ధ్వనివేగం కన్నా ఎక్కువని
బి) ధ్వని వేగం, కాంతి వేగం కన్నా ఎక్కువని
సి) ధ్వని వేగం, కాంతి వేగం రెండూ సమానమని
డి) కాంతి వేగం అప్పుడప్పుడు ధ్వని వేగం కంటే ఎక్కువని
4. స్వచ్ఛమైన నీరు?
ఎ) పారదర్శక పదార్థం
బి) అర్థపారదర్శక పదార్థం
సి) అపారదర్శక పదార్థం
డి) పైవేవీ కావు
5. సరైనవి గుర్తించండి.
1. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగుతుంది
2. తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైనది
సి) రెండూ సరైనవే
డి) రెండూ తప్పు
6. వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?
ఎ) పరావర్తనం బి) వ్యతికరణం
సి) సంపూర్ణాంతర పరావర్తనం
డి) వితరణం
7. సముద్రం నీలి రంగులో కనబడటానికి కారణం?
ఎ) ఎక్కువ లోతు
బి) నీలిరంగు కాంతి పరావర్తనం
సి) నీరు నీలిరంగులో ఉంటుంది
డి) ఊర్థ్వ పొర మాత్రమే
8. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేకాలం?
ఎ) 8 సెకన్లు బి) 8 నిమిషాలు
సి) 8 గంటలు డి) 8 సంవత్సరాలు
9. సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణం?
ఎ) కాంతి రుజువర్తనం బి) వక్రీభవనం సి) ధృవణం డి) వివర్తనం
10. కాంతి పరావర్తనానికి సంబంధించినది?
ఎ) దర్పణాలు ఈ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
బి) కటకాలు ఈ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
సి) మానవునిలో దృష్టిజ్ఞానానికి కారణం
డి) వస్తు ఉపరితలం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుంది
11. చంద్రుని నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమికి చేరటానికి పట్టేకాలం?
ఎ) 1 సెకను బి) 8 సెకనులు
సి) 8 నిమిషాలు డి) 1 నిమిషం
12. రెండు వస్తువులు కాంతివేగానికి సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్షవేగం?
ఎ) కాంతి వేగానికి రెట్టింపు
బి) కాంతి వేగంలో సగం
సి) కాంతి వేగానికి సమానం
డి) కాంతి వేగానికి 4 రెట్లు
13. సర్ సీవీ రామన్ తన రామన్ ఫలిత నిరూపణకు ఏ సిద్ధాంతంపై ఆధారపడ్డారు?
ఎ) కణసిద్ధాంతం బి) క్వాంటం సిద్ధాంతం
సి) తరంగ సిద్ధాంతం
డి) విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం
14. అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి?
ఎ) ఏనుగులు బి) కుక్కలు
సి) గబ్బిలాలు డి) తేనెటీగలు
15. వాహనాల్లో డ్రైవర్లకు పక్కన అమర్చే దర్పణం?
ఎ) పుటాకార దర్పణం
బి) కుంభాకార దర్పణం
సి) స్థూపాకార దర్పణం
డి) సమతల దర్పణం
16. దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) పెరిగి తగ్గుతుంది
డి) ఏ మార్పు ఉండదు
17. కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని పనిచేసే పరికరం ఏది?
ఎ) సూక్ష్మదర్శిని బి) కెమెరా
సి) లాంతర్ డి) ప్రొజెక్టర్
18. దంతవైద్యులు ఉపయోగించే దర్పణం?
ఎ) పుటాకార దర్పణం
బి) కుంభాకార దర్పణం
సి) సమతల దర్పణం
డి) స్థూపాకార దర్పణం
19. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. LASER- Light Amplification by Stimulated Emission of Radiation
బి. RADAR – Radio Detection and Ranging
సి. SONAR – Sound Navigation and Ranging
డి. CFL – Compact Flourescent Lamp
ఎ) ఎ, బి బి) ఎ, సి
సి) ఎ, సి, డి డి) ఎ, బి, సి, డి
20. పరారుణ కిరణాల అనువర్తనం కానిది ?
ఎ) రాకెట్, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా
బి) రహస్యసంకేతాల ప్రసారానికి
సి) మురిగిన కోడిగుడ్ల నుంచి, మంచివాటిని గుర్తించడానికి
డి) పొగమంచులో స్పష్టంగా ఫొటో తీయడానికి
జవాబులు
1.బి 2.సి 3.ఎ 4.ఎ
5.బి 6.సి 7.బి 8.బి
9.ఎ 10.బి 11.ఎ 12.సి
13.డి 14.డి 15.బి 16.బి
17.బి 18.ఎ 19.డి 20.డి
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు