Current Affairs | గుస్తావో పెట్రో ఏ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు?
కరెంట్ అఫైర్స్
1. ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 11 2) ఆగస్టు 12
3) ఆగస్టు 13 4) ఆగస్టు 14
2. మొదటి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండర్-16 పోటీలు జరిగిన మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం ఎక్కడ ఉంది?
1) భువనేశ్వర్ 2) న్యూఢిల్లీ
3) ముంబయి 4) గురుగ్రామ్
3. ఏ మంత్రిత్వ శాఖ SMILE-75 చొరవను ప్రారంభించింది?
1) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
4) సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ
4. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీస్ అప్లికేషన్ సెంటర్ (IVAC)ను కింది వాటిలో ఏ బ్యాంక్ మరో రెండేళ్లపాటు నిర్వహిస్తుంది?
1) ఎస్బీఐ 2) హెచ్డీఎఫ్సీ
3) కెనరా బ్యాంకు
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
5. నాలుగు రోజుల ద్వైపాక్షిక వ్యాయామం ‘ఉదార శక్తి’లో భారత వైమానిక దళం బృందం పాల్గొంది. అయితే ఈ వ్యాయామం ఎక్కడ జరిగింది?
1) నేపాల్ 2) శ్రీలంక
3) జపాన్ 4) మలేషియా
6. అత్యున్నత కమిషన్‌లో పోప్ ఫ్రాన్సిస్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ఏ దేశ అధ్యక్షుడు ప్రతిపాదించాడు?
1) స్పెయిన్ 2) మెక్సికో
3) అమెరికా 4) జపాన్
7. ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1 మార్చి 2021 2) 1 మార్చి 2022
3) 1 మార్చి 2023 4) 1 మార్చి 2024
8. ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2022 థీమ్ ఏమిటి?
1) అవయవాలను దానం చేసి ప్రాణాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేద్దాం
2) అవయవ దానం అంటే ప్రాణాన్ని బహుమతిగా ఇవ్వడం లాంటిది
3) అవయవ దానంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలి
4) మీ అవయవాలను స్వర్గానికి తీసుకెళ్లకండి. ఎందుకంటే మనకు అవి ఇక్కడ అవసరమని స్వర్గానికి తెలుసు
9. లిస్బన్ ట్రియోనానల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తి ఎవరు?
1) రువానీ రణసిన్హా
2) రుక్సానా అహ్మద్
3) తస్లీమా నస్రీన్
4) మెరీనా తబస్సుమ్
10. ఇంటర్నేషనల్ లెఫ్ట్‌హ్యాండర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 11 2) ఆగస్టు 12
3) ఆగస్టు 13 4) ఆగస్టు 14
11. ఏటా అంతర్జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 11 2) ఆగస్టు 12
3) ఆగస్టు 13 4) ఆగస్టు 14
12. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 10 2) ఆగస్టు 11
3) ఆగస్టు 12 4) ఆగస్టు 13
13. 2022 UEPA సూపర్ కప్‌ను ఏ జట్టు గెలుచుకుంది?
1) రియల్ మాడ్రిడ్
2) బార్సిలోనా
3) మిలన్
4) ఐస్ట్రాచ్డ్ ఫ్రాంక్‌ఫర్డ్
14. జేమ్స్ మరావ్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు?
1) న్యూజిలాండ్ 2) బార్సిలోనా
3) పపువా న్యూ గినియా
4) సైప్రస్
15. 2022 అంతర్జాతీయ యువజన దినోత్సవం థీమ్ ఏమిటి?
1) ఇంటర్ జనరేషన్ సాలిడారిటీ క్రియేటివ్ ఎ వరల్డ్ ఫర్ ఆల్ ఏజెస్
2) సేఫ్ స్పేసెస్ ఫర్ యూత్
3) యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్
4) టేకింగ్ యూత్ ఫర్ ఫ్యూచర్ స్టోర్స్
16. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు ఎంతగా అంచనా వేశారు?
1) 6 శాతం 2) 7.5 శాతం
3) 6.5 శాతం 4) 7 శాతం
17. 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ శ్రీపతి రవీంద్ర భట్
2) జస్టిస్ ఎ.ఎం.ఖాన్సిల్కర్
3) జస్టిస్ వినీత్ శరణ్
4) జస్టిస్ డి.వై. చంద్రఛూడ్
18. ఇటీవల మరణించిన కె.మాయ తేవర్ ఏ రాజకీయ పార్టీ మొదటి, మాజీ ముఖ్యమంత్రి?
1) సీపీఐ 2) ఆర్జేడీ
3) ఏఐఏడీఎంకే 4) ఎన్సీపీ
19. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది ఎన్నోసారి?
1) 6వ సారి 2) 11వ సారి
3) 8వ సారి 4) 10వ సారి
20. రష్యా.. దక్షిణ కజకిస్థాన్ నుంచి ఇరాన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది అయితే ఆ ఇరాన్ ఉపగ్రహం పేరేమిటి?
1) హోప్ 2) బాబర్
3) నూరి 4) ఖయ్యామ
21. ఆప్.బి.ఐ రూపే కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ముంబయి 2) జోధ్‌పూర్
3) జైపూర్ 4) పుణె
22. 2021-22 ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) మనీషా కల్యాణ్ 2) బాలాదేవి
3) అదితి చౌహాన్ 4) దలీమా చిబ్బర్
23. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ది లిజియన్ ఆఫ్ హానర్‌కు ఎవరు ఎన్నికయ్యారు?
1) అజీమ్ ప్రేమ్‌జీ 2) సౌమిత్ర ఛటర్జీ
3) రతన్ టాటా 4) శశిథరూర్
24. జగదీప్ ధన్‌ఖడ్ ఎన్నో భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు?
1) 11వ 2) 12వ
3) 13వ 4) 14వ
25. 2021-22 ఆల్ ఇండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ పురుషుల ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) సందేశ్ జింగావ్
2) సహల్ సమద్
3) గురుప్రీత్ సింగ్ సంధు
4) సునీల్ ఛెత్రి
26. ఎక్స్ వజ్ర ప్రహార్ 2022 అనేది ఏ దేశంతో కలిసి భారత్ ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం నిర్వహించింది?
1) రష్యా 2) శ్రీలంక
3) సింగపూర్ 4) అమెరికా
27. డిజిటల్ ఇండియా RISC-V (DIR-V) ప్రోగ్రామ్‌ను ఎవరు ఆవిష్కరించారు?
1) దర్శన విక్రమ్ జర్దోష్
2) సుశ్రీ శోభా కరంద్లాజే
3) రాజీవ్ చంద్రశేఖర్
4) వి. మురళీధరన్
28. అంతర్జాతీయ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 11 2) ఆగస్టు 17
3) ఆగస్టు 8 4) ఆగస్టు 10
29. ఆసియా, ఓషియానియా-2022 ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ రీజినల్ స్టాండైర్డెజేషన్ ఫోరం ఎక్కడ జరిగింది?
1) సింగపూర్ 2) జకార్తా
3) న్యూఢిల్లీ 4) మస్కట్
30. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 10 2) ఆగస్టు 9
3) ఆగస్టు 8 4) ఆగస్టు 7
31. ఇండియన్ ఫార్మా లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సంస్థ?
1) పాలి మెడిక్యూర్ లిమిటెడ్
2) జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్
3) మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్
4) సిప్లా లిమిటెడ్
32. కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపు వేడుకలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులు ఎవరు?
1) లక్ష్య సేన్, వినేష్ ఫోగట్
2) నిఖత్ జరీన్, శరత్ కమల్
3) అమిత్ పంఘల్, మీరాబాయి చాను
4) భావినా పటేల్, చిరాగ్ శెట్టి
33. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిమ్ డ్రోన్ ఆథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేనితో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఇండియన్ కోస్ట్‌గార్డ్
2) ఇండియన్ నేవీ
3) ఇండియన్ ఆర్మీ
4) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
34. 2022లో కారు ప్రమాదంలో మరణించిన అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ ఎవరు?
1) స్టీవ్ బక్నోర్ 2) అలీమ్ దార్
3) రిచర్డ్ కెటిల్‌బరో 4) రూడి కోర్ట్జెన్
35. యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ లెజెండ్ రిటైర్మెంట్ ఎక్కడ ప్రకటించింది?
1) ఫ్రాంక్ పార్కర్ 2) బిల్ జాన్సల్
3) సెరెనా విలియమ్స్ 4) జిమ్ కొరియర్
36. ప్రధాని నరేంద్ర మోదీ రెండో తరం ఇథనాల్ ప్లాంట్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ జాతికి అంకితం చేశారు?
1) రాజస్థాన్ 2) హర్యానా
3) పంజాబ్ 4) ఉత్తరాఖండ్
37. సొసైటీ ఫర్ పర్సనాలిటీ, సోషల్ సైకాలజీకి చెందిన యూఎస్ హెరిటేజ్ వాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందిన మొదటి భారతీయ సామాజిక మనస్తత్వవేత్త ఎవరు?
1) రామదత్ జోషి
2) విజయ్‌కుమార్ శంకర్
3) సౌరభ్ సింగ్
4) రామధర్ సింగ్
38. రస్టీ స్కైస్, గోల్డెన్ విండ్స్ అనే పుస్తక రచయిత ఎవరు?
1) దివ్యా శర్మ 2) రోష్ని అరోరా
3) సాన్నిధ్య శర్మ 4) సంగీతా గుప్తా
39. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లక్ష్య సేన్ ఏ గేమ్‌లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించాడు?
1) టెన్నిస్ 2) జూడో
3) స్కాష్ 4) బ్యాడ్మింటన్
40. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి చివరి బంగారు పతకాన్ని ఎవరు అందించారు?
1) బజరంగ్ పూనియా 2) సుధీర్
3) శరత్ కమల్
4) దీపక్ పూనియా
41. గుస్తావో పెట్రో ఏ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు?
1) కొలంబియా 2) గ్రీస్
3) జాంబియా 4) టర్కీ
42. 2022 ఆగస్టులో భారత సైన్యం దాని హైటెక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కార్యాచరణ సంసిద్ధతను, పటిష్టతను పరీక్షించడానికి పాన్ ఇండియా శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యాయామాన్ని నిర్వహించింది.
ఈ వ్యాయామం పేరేమిటి?
1) శాటిలైట్ 2) మూన్లైట్
3) స్పేస్‌లైట్ 4) స్కైలైట్
43. ప్రపంచ స్థానిక ప్రజల అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 5 2) ఆగస్టు 6
3) ఆగస్టు 7 4) ఆగస్టు 9
44. ఏ దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నాగసాకి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది?
1) మంగోలియా 2) చైనా
3) జపాన్ 4) దక్షిణ కొరియా
45. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో 100 శాతం జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకిటించింది?
1) త్రిపుర 2) పశ్చిమ బెంగాల్
3) అసోం 4) గోవా
టోర్నడోలు
- నేలకు, మేఘాలకు అనుసంధానమై ఉండి త్రీవ వేగంతో సుడులు తిరిగే పెను సుడిగాలినే టోర్నడో అంటారు. టోర్నడోలు కచ్చితంగా నేల మీది నుంచి మేఘాల వరకు వ్యాపించి ఉంటాయి. టోర్నడో అనే పదం స్పానిష్ భాష నుంచి ఉద్భవించింది. Tornado అంటే Thunderstrom అని అర్థం.
- టోర్నడోలు నేలపై, నీటిపై ఏర్పడుతూ ఉంటాయి.
- టోర్నడోలు ఎక్కువగా 76 మీటర్ల లోపు విస్తీర్ణంలో ఏర్పడి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
- కొన్ని బలమైన టోర్నడోలు 3.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడి 100 కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తాయి. ఇవి ఎక్కువగా భూమధ్య రేఖకు సమీపంలోని ఉష్ణ మండల ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి.
- అమెరికాలో ఎక్కువగా ఏప్రిల్- మే నెలల్లో ఏర్పడుతుంటాయి.
- అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 1300 టోర్నడోలు వస్తుండగా సగటున సంవత్సరానికి 60 మంది వరకు చనిపోతున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?