BIOLOGY | మొదటి నాళికాయుత, పిండయుత మొక్కలు?
బయాలజీ (మార్చి 21 తరువాయి)
244. థైరాయిడ్ గ్రంథి వాపు వల్ల కలిగే గాయిటర్ను నివారించడానికి తీసుకునే ఉప్పులో ఉండే అయోడిన్ రూపం?
1) Na Iodate
2) Mg Iodate
3) Ca Iodate
4) K Iodate
245. మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి?
1) పారాథైరాయిడ్ 2) పీనియల్
3) అడ్రినల్ 4) పిట్యూటరీ
246. జంతువుల్లో ప్రజనన కాలాన్ని (బ్రీడింగ్ సీజన్) నియంత్రించే హార్మోన్?
1) మెలటోనిన్ 2) మెటాట్రోపిన్
3) మమ్మోట్రోపిన్ 4) పిట్యూటరిన్
247. రుతువులకు అనుగుణంగా దేహంలో కలిగే మార్పులకు కారణమయ్యే హార్మోన్?
1) థైరాక్సిన్ 2) కార్టిసోన్
3) అడ్రినలిన్ 4) మెలటోనిన్
248. ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్రవిసర్జన కలిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది?
1) అడ్రినలిన్ 2) ఆల్డోస్టిరాన్
3) ఆక్సిటోసిన్ 4) వాసోప్రెస్సిన్
249. ప్రసవం జరిగిన తరువాత పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్?
1) మమ్మోట్రోఫిన్ 2) మెలటోనిన్
3) FSH 4) ఈస్ట్రోజన్
250. మాస్టర్/ప్రధాన గ్రంథిగా పిలిచే పీయూష గ్రంథి అన్ని గ్రంథులను నియంత్రిస్తుంది. కానీ దీని ఆధీనంలో లేని గ్రంథి?
1) థైరాయిడ్ 2) పారా థైరాయిడ్
3) అడ్రినల్ 4) క్లోమం
251. కింది వాటిలో స్టెరాయిడ్ లైంగిక హార్మోన్ కానిది?
1) ఈస్ట్రోజన్ 2) టెస్టోస్టిరాన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఆల్డోస్టిరాన్
252. అమైనో ఆమ్ల హార్మోన్ కానిది?
1) మెలటోనిన్ 2) అడ్రినలిన్
3) థైరాక్సిన్ 4) ఇన్సులిన్
253. పప్టైడ్ హార్మోన్ కానిది?
1) వాసోప్రెసిన్ 2) ఆక్సిటోసిన్
3) ఇన్సులిన్ 4) థైరాక్సిన్
254. నత్రజని వ్యర్థపదార్థమైన యూరిక్ ఆమ్ల స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోవడం వల్ల కలిగే కీళ్లనొప్పి?
1) గౌట్ 2) బ్రైట్స్
3) నెఫ్రైటిస్ 4) ఆస్టియో ఆర్థరైటిస్
255. ప్రపంచంలో అధిక జీవవైవిధ్యం గల ప్రాంతాలు 34 ఉండగా మన దేశంలో 3 ఉన్నాయి. వాటిలో కింది రెండు?
1) పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు
2) తూర్పు కనుమలు, మధ్యభారత ఆకురాల్చే ప్రాంతం
3) పశ్చిమ కనుమలు, ఈశాన్య హిమాలయ ప్రాంతం
4) తూర్పు కనుమలు, ఈశాన్య హిమాలయ ప్రాంతం
256. జతపరచండి.
ఎ. ఛార్లెస్ డార్విన్ 1. ఆర్జితగుణాల అనువంశికత, జీవశాస్త్రం అనే పదం
బి. లామార్క్ 2. జాతుల ఉత్పత్తి, జీవ పరిణామం
సి. హ్యూగో డివ్రీస్ 3. ఉత్పరివర్తన సిద్ధాంతం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-1, సి-2
257. జతపరచండి.
ఎ. వాట్సన్ & క్రిక్ 1. డీఎన్ఏ నిర్మాణం (1953)
బి. రాబర్ట్ హుక్ 2. కణం (1665)
సి. పాట్రిక్ స్టెప్టో 3. టెస్ట్ట్యూబ్ బేబీ (1978)
డి. ఇయాన్ విల్మట్ 4. క్లోనింగ్ (డాలీ గొర్రెపిల్ల)
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
258. జతపరచండి.
ఎ. క్రిస్టియన్ బెర్నార్డ్ 1. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్
బి. విలియం కోల్ఫ్ 2. జన్యుశాస్త్ర (లేక) అనువంశిక సూత్రాలు
సి. గ్రెగర్ మెండల్ 3. కృత్రిమ మూత్రపిండం
డి. అలెక్ జెఫ్రీ 4. మొదటి గుండె మార్పిడి చికిత్స
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
259. సరికానిది గుర్తించండి.
1) ట్రైకాలజీ – వెంట్రుకలు, రోమాల అధ్యయనం
2) జెరంటాలజీ – వృద్ధుల అధ్యయనం
3) ఆంధ్రోపాలజీ – మానవ పరిణామ అధ్యయనం
4) ఓటాలజీ – నాలుక అధ్యయనం
260. సరికానిది గుర్తించండి.
1) ఆర్థ్రాలజీ – కీళ్ల అధ్యయనం
2) ఒడెంటాలజీ – దంతాల అధ్యయనం
3) హెపటాలజీ – కాలేయ అధ్యయనం
4) కార్డియాలజీ – మెదడు అధ్యయనం
261. జతపరచండి.
ఎ. హెమటాలజీ 1. రక్తం
బి. ఆంకాలజీ 2. క్యాన్సర్
సి. ఇమ్యునాలజీ 3. వ్యాధి నిరోధకత
డి. ఫ్రినాలజీ 4. మెదడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
262. జతపరచండి.
ఎ. ఎడపాలజీ 1. మృత్తిక
బి. లిమ్నాలజీ 2. కళ్లు
సి. ఆప్తాల్మాలజీ 3. చర్మం
డి. డెర్మటాలజీ 4. మంచినీరు
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
263. 100 కేజీలుగల మానవునిలో సుమారుగా నీటి శాతం లీటర్లలో ?
1) 80 శాతం, 50 లీటర్లు
2) 70 శాతం, 50 లీటర్లు
3) 80 శాతం, 45 లీటర్లు
4) 70 శాతం, 45 లీటర్లు
264. గుడ్లలో లేని పదార్థం?
1) పిండి పదార్థం 2) ప్రొటీన్స్
3) కొవ్వులు 4) విటమిన్స్
265. మొక్కల్లోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలుగా మార్చి డాల్డా (లేక) వనస్పతిని తయారు చేసే ప్రక్రియ?
1) ఆక్సీకరణ 2) విచ్ఛిన్నం
3) కార్బాక్సిలేషన్ 4) హైడ్రోజినేషన్
266. మొక్కల వేర్లపై పెరిగి నేలలోని పాస్ఫేట్ను గ్రహించి మొక్కలకు అందించి జీవ ఎరువులుగా ఉపయోగపడే AM జీవులు?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్రయోఫైట్స్ 4) బ్యాక్టీరియా
267. జీవ ఎరువులకు సంబంధించి సరికానిది?
1) రైజోబియం అనే బ్యాక్టీరియా ఫాబేసి సమూహపు మొక్కల వేర్లతో సహజీవనం చేయును
2) నాస్టాక్, అనబీనా అనే నీలిఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి
3) అజటోబాక్టర్ అనే శిలీంధ్రం వరిపంటలో జీవ ఎరువుగా ఉపయోగిస్తారు
4) సుబాబుల్ అనే మొక్కను కూడా ఎరువుగా ఉపయోగిస్తారు
268. మొదటి నాళికాయుత, పిండయుత మొక్కలు?
1) బ్రయోఫైటా 2) టెరిడోఫైటా
3) వివృతబీజాలు 4) ఆవృతబీజాలు
269. లివర్వర్ట్స్ , హార్న్వర్ట్స్ , మాస్ మొక్కలు ఏ సమూహం?
1) శిలీంధ్రాలు 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) ఆవృతబీజాలు
270. జతపరచండి.
ఎ. XeroPhytes 1. రాళ్లు
బి. Lithophytes 2. ఎడారి
సి. Hydrophytes 3. మొక్కలపై
డి. Apiphytes 4. నీరు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-4, సి-3, డి-1
271. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) ఇండియాలో అతివెడల్పయిన మర్రి Indian Botanical Garden (Howrah)లో ఉంది
2) ఆహారపదార్థాలను ఉత్పత్తిని చేసి
‘దుంపవేర్లు’గా మారి ద్వివార్షికాలుగా జీవించే మొక్కలు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి (ర్యాడిష్)
3) ఉప్పునీటిలో పెరిగే మాంగ్రూవ్ అడవుల్లో (సుందర్ బన్స్) శ్వాసించే వేర్లు ఉంటాయి
4) బొడిపెలు గల వేర్లు సిట్రస్ జాతి మొక్కల్లో ఉంటాయి
272. ఒక మొక్క వయస్సు 80 సంవత్సరాలు అయిన దాని కాండాన్ని అడ్డంగా కోసినప్పుడు దానిలో ఎన్ని వార్షిక వలయాలు (లేక) వృద్ధివలయాలు ఉంటాయి?
1) 80 2) 40
3) 120 4) 160
273. జతపరచండి.
ఎ. దుంపకాండం 1. అల్లం, పసుపు
బి. కొమ్ము 2. చేమ, కంద
సి. corm 3. బంగాళదుంప
డి. bulb 4. ఉల్లి, వెల్లుల్లి
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2
274. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడని అంగాలు?
1) రక్షక, ఆకర్షణ పత్రాలు
2) రక్షక పత్రాలు, అండకోశం
3) అండకోశం, కేసరావళి
4) ఆకర్షణ పత్రాలు, కేసరావళి
275. దీర్ఘకాలిక, ఆకుపచ్చ రక్షక పత్రాలు కలిగిన మొక్క కానిది?
1) టమాటా 2) వంకాయ
3) మిరప 4) బెండ
276. జతపరచండి.
ఎ. ఎనిమోఫీలి 1. వరి, గోధుమ
బి. ఆర్నిధోఫీలి 2. బిగ్నోనియా
సి. ఎంటమోఫీలి 3. నైట్క్వీన్
డి. కైరోప్టిరోఫీలి 4. కదంబం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
277. యాపిల్, జీడిమామిడిలో తినగలిగే భాగాలు వరుసగా?
1) పుష్పాసనం, బాహ్య ఫలకవచం
2) పుష్పవృంతం, పుష్పగుచ్ఛాలు
3) పుష్పాసనం, పుష్పవృంతం
4) పైవేవీకావు
278. కింది వాటిలో నిజం కానిది?
1) టమాటా, జామ, బొప్పాయి, అరటిలో ఫలం- మృదుఫలం
2) సిట్రస్ మొక్కల్లో ఫలం – హెస్పరీడియం
3) పైనాపిల్, పనసలో ఫలం – సోరోసిస్
4) కొబ్బరి, మామిడిలో ఫలం – కవచ బీజకం
279. నిల్వ చేయని ఆహారపదార్థాల్లో బ్యాక్టీరియా పెరిగి ఆహారాన్ని విషతుల్యం చేయడానికి ఏ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది?
1) ఫార్మిక్ ఆమ్లం 2) లాక్టిక్ ఆమ్లం
3) ఆక్జాలిక్ ఆమ్లం 4) బ్యూటరిక్ ఆమ్లం
280. కింది వాటిలో ఏ శైవలం తాగునీటికి చెడువాసన, రుచిని ఇచ్చి వ్యాప్తి చెందుతుంది?
1) ఆకుపచ్చ శైవలం
2) నీలి ఆకుపచ్చ శైవలం
3) ఎరుపు శైవలం
4) గోధుమ శైవలం
281. జతపరచండి.
ఎ. అగార్-అగార్ 1. క్లోరెల్లా
బి. ఆగ్జాలిక్ ఆమ్లం 2. నీలిఆకుపచ్చ శైవలాలు
సి. జీవ ఎరువులు 3. గోధుమ శైవలాలు
డి. తినదగు శైవలాలు 4. ఎరుపు శైవలాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
282. ‘పెన్సిలిన్’ అనే ప్రపంచ మొదటి యాంటీబయోటిక్, అద్భుత ఔషధాన్ని 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వేటి నుంచి తయారుచేశారు?
1) బ్యాక్టీరియా 2) శైవలాలు
3) శిలీంధ్రాలు 4) లైకెన్స్
283. తినదగు శైవలం?
1) పిధియం 2) క్లోరెల్లా
3) పక్సీనియా 4) అమనిటా
284. ఏ మొక్కలు భూమిపై పెరిగి, లైంగిక ప్రత్యుత్పత్తి కోసం నీరు అవసరమై ఉభయచరాలుగా పిలువబడుతున్నాయి?
1) టెరిడోఫైటా 2) ఆవృత బీజాలు
3) వివృతబీజాలు 4) బ్రయోఫైటా
285. కింది వాటిలో వైరస్ వ్యాధి కానిది?
1) గవద బిల్లలు 2) టైఫాయిడ్
3) ఫ్లూ 4) పచ్చకామెర్లు
286. ఔషధంగా ఉపయోగించే సూక్ష్మజీవనాశిని విధి?
1) బ్యాక్టీరియాను చంపడం
2) బ్యాక్టీరియా భవిష్యవృద్ధిని పరీక్షించడం
3) బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే WBC కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం
4) యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించడం
287. జురాసిక్ యుగంలో భూమిపై ఎక్కువగా విస్తరించిన డైనోసార్స్?
1) చేపలు 2) క్షీరదాలు
3) మార్సుపియేల్స్ 4) సరీసృపాలు
288. బ్యాక్టీరియాలోని క్రోమోజోమ్ సంఖ్య?
1) 1 2) 2
3) 4 4) 6
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు