INDIAN POLITY | రాజ్యసభకు ప్రత్యేక అధికార పరిధి దేనిలో ఉంటుంది?
15 ఫిబ్రవరి తరువాయి..
16. లోక్ సభ సచివాలయం ఎవరి ప్రత్యక్ష పర్యవేక్షణకు లోబడి ఉంటుంది?
a) లోక్ సభ స్పీకర్
b) గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
c) ప్రధానమంత్రి కార్యాలయం
d) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
17. పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన ద్రవ్యతర బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పార్లమెంటుకు తిప్పి పంపితే దాన్ని పార్లమెంట్ ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదిస్తే ?
a) రాష్ట్రపతి తన ఆమోదం ను మళ్లీ నిలిపి ఉంచవచ్చు
b) బిల్లు తనంతట తానే కాలదోషం చెందును
c) బిల్లును సుప్రీంకోర్టుకు నిర్దేశించును
d) రాష్ట్రపతి తన ఆమోదం ఇచ్చును.
18. కింది వాటిలో సరిగా జతచేయనిది? రాష్ట్రం రాజ్యసభలో సభ్యుల సంఖ్య .?
a) మహారాష్ట్ర 19
b) తమిళనాడు 18
c) బీహార్ 15
d) పశ్చిమబెంగాల్ 16
19. కింది రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయడానికి గల కారణాల్లో సరైనవి?
1. రైల్వేల విత్త నిర్వహణలో సరళతను ప్రవేశ పెట్టుటకు
2. రైల్వే విధానానికి వ్యాపార దృక్పథం చేకూర్చుటకు
3. సాధారణ ఆదాయానికి రైల్వే ఆదాయంలో నుండి కొంత భరోసా కలిగిన సంవత్సరం ఆదాయమును కల్పించుట ద్వారా సాధారణ ఆదాయంలో సుస్థిరతను కాపాడుటకు
4. రైల్వేలు తమ లాభాలను తమ అభివృద్ధికి కలిగి ఉండేందుకు వెసులుబాటుకు
a) 2, 3, 4 మాత్రమే
b)1, 4 మాత్రమే
c) 1, 2, 3 మాత్రమే
d)1, 2, 3, 4
20. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. పార్లమెంట్ శాసనం ద్వారా ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఉంటే దానిని రద్దు చేయవచ్చు లేదా విధాన పరిషత్ లేకపోతే ఏర్పాటు చేయవచ్చు
2. ఒక రాష్ట్ర విధాన పరిషత్ లోని మొత్తం సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి మించరాదు
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a) 1 మాత్రమే b) 2 మాత్రమే
c) 1, 2 d) 1 కాదు, 2 కాదు
21. ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు ఒక బిల్లును రిజర్వ్ చేశారు. ఆ బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం?
1. ఆ బిల్లుకు ఆమోదం తెలుపవచ్చును
2. ఆ బిల్లుకు ఆమోదాన్ని నిలిపి ఉంచవచ్చును
3. ఆ బిల్లును విటో చేయవచ్చును
4. ఆ బిల్లును సభా పునర్ పరిశీలనకు పంపవలసిందిగా గవర్నర్కు సూచించవచ్చు
a) 1, 2, 3 b) 3, 4
c) 1, 2, 3 d) 1, 2, 3, 4
22. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
a) బీహార్ b) రాజస్థాన్
c) మహారాష్ట్ర d) తెలంగాణ
23. గవర్నర్ నియామకానికి కింద పేర్కొన్న అర్హతల్లో తప్పుగా ఉన్నది ఏది?
a) అతడు లేదా ఆమె భారత పౌరులై ఉండాలి
b) అతడు లేదా ఆమె వయస్సు 30 సంవత్సరాలకు తక్కువ ఉండరాదు
c) అతడు లేదా ఆమె పార్లమెంటులోని ఏ సభలోనైనాగాని రాష్ట్ర శాసనసభల్లో గాని సభ్యులుగా ఉండరాదు
d) అతడు లేదా ఆమె ఆదాయం లభించే పరపతి కలిగి ఉండరాదు.
24. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం?
a) స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
b) రాష్ట్ర శాసనసభలో అతి చిన్న రాజకీయ పార్టీ
c) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత
d) అతి పెద్దదైన అనేక పార్టీల కూటమి
25. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక బిల్లు విషయంలో గవర్నర్ ఎక్కువ అధికారాలకు సంబంధించి సరికానిది?
a) బిల్లుకు ఆమోదాన్ని తెలపవచ్చు
b) బిల్లును నిలిపి ఉంచవచ్చును
c) బిల్లును రాష్ట్రపతి పరిశీలకు ప్రత్యేకించవచ్చును
d) బిల్లుకు ఆమోదం తెలపడం తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు
26. ప్రతిపాదన (A) :రాష్ట్ర మంత్రి మండలిలోని మంత్రుల సంఖ్య భారత రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పబడలేదు
హేతువు ( R ) : మంత్రిమండలి ఎక్కువ సంఖ్యను నిర్ణయించడంలో అనేక ఒత్తిడులు పనిచేస్తాయి
a) A, R రెండూ విడివిడిగా సరైనవి. R, A కు సరైన వివరణ
b) A, R రెండూ విడివిడిగా సరైనవి. R, A కు సరైన వివరణ కాదు
c) A సరైనది కానీ R తప్పు
d) A తప్పు కానీ R సరైనది.
27. కింది వాటిలో దేన్ని భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు?
1. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి
2. రాష్ట్ర మంత్రి మండలి సమష్టి బాధ్యత
3. రాష్ట్ర మంత్రుల రాజీనామా
4. ఉప ముఖ్యమంత్రి పదవి
a) 1, 2 b) 2, 3
c) 3, 4 d) 1, 3
28. రాజ్యాంగంలోని ప్రకరణ 163 ప్రకారం, గవర్నర్కు మంత్రులు ఇచ్చిన సలహా మాన్యతకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనది?
a) దాన్ని ఏ న్యాయ స్థానంలోనూ విచారించరాదు
b) దాన్ని సుప్రీంకోర్టులో విచారించవచ్చును
c) దాన్ని అన్ని న్యాయస్థానాల్లో విచారించవచ్చును
d) దాన్ని హైకోర్టులో విచారించరాదు
29. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు రాష్ట్ర మంత్రి మండలితో గవర్నర్కు గల సంబంధంతో వ్యవహరించే రాజ్యాంగ నిబంధనలను విశ్లేషించడానికి సంబంధించినవి?
a) ప్రకరణలు 161,165, 166
b) ప్రకరణలు 162,163, 168
c) ప్రకరణలు 164,165, 169
d) ప్రకరణలు 163,164, 167
30. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మంత్రి మండలిలోని మంత్రులను నియమించేది?
a) పార్టీ అధ్యక్షుడు b) ముఖ్యమంత్రి
c) గవర్నర్
d) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
31. కింది వారిలో ఒక బిల్లును ద్రవ్య బిల్లు నిర్ణయించేది ఎవరు?
a) లోక్ సభ స్పీకర్ b) ఆర్థిక మంత్రి
c) ప్రధానమంత్రి d) రాజ్యసభ చైర్మన్
32. రాజ్యసభ అధికారాల్లో భారత రాజ్యాంగంలో పొందుపరిచింది?
a) ద్రవ్య బిల్లును సవరణ లేదా తిరస్కరణ చేయుటకు
b) ఒక బిల్లును ద్రవ్య బిల్లు అని నిర్ణయించుటకు
c) ప్రభుత్వ వ్యయానికి ఓటు వేయుటకు
d) ద్రవ్య బిల్లును 14 రోజుల వ్యవధి దాటకుండా నిలిపి ఉంచుటకు
33. ప్రతిపాదన ( A ) : ద్రవ్య బిల్లు కేవలం పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే
ప్రారంభించబడును.
హేతువు ( R ) : పార్లమెంట్ దిగువ సభ ప్రజలు ఎన్నుకున్న సంఘం.
a) A, R రెండూ విడివిడిగా సరైనవి. R, A కు సరైన వివరణ
b) A, R రెండు విడివిడిగా సరైనవి కానీ R, A కు సరైన వివరణ కాదు
c) A సరైనది కానీ R తప్పు
d) A తప్పు కానీ R సరైనది
34. రాజ్యసభకు ప్రత్యేక అధికార పరిధి దేనిలో ఉంటుంది?
a) అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించటం
b) రాష్ర్టాల ఏర్పాటు, రద్దు
c) ఉపరాష్ట్రపతి ఎన్నిక
d) రాష్ట్ర జాబితా అంశంపై పార్లమెంట్ శాసనం చేయుటకు అధికారమిచ్చుట.
35. కాలదోష నియమం (Rule of Lapse ) అంటే అర్థం ఏమిటి?
a) పార్లమెంటులో గల ఆ నిర్ణీత బిల్లులు సభ దీర్ఘకాలిక వాయిదాతో అన్ని బిల్లులు కాల దోషం చెందును
b) పార్లమెంటు ద్వారా ఓటింగ్ చేయబడిన వినియోగాధికారాలన్నీ ఆర్థిక సంవత్సరంతో కాల దోషం చెందును
c) ఒక మంత్రిత్వ శాఖ నిధులకు డిమాండ్లు దాని విధానాలపై ప్రతిపక్షాల విమర్శతో
కాల దోషం చెందును
d) వినియోగాధికార బిల్లు రాజ్యసభ ద్వారా 14 రోజుల వ్యవధిలో తిప్పి పంపించకుంటే అది కాల దోషం చెందును
36. ప్రతిపాదన (A ) : భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయానికి సంబంధించిన అంచనాలను పార్లమెంట్ ఓటింగుకు సమర్పించబడును
హేతువు (R ): భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయంను చర్చించే అధికారం పార్లమెంటుకు లేదు
a) A, R రెండూ విడివిడిగా సరైనవి. R, A కు సరైన వివరణ
b) A, R రెండూ విడివిడిగా సరైనవి కానీ R, A కు సరైన వివరణ కాదు
c) A సరైనది కానీ R తప్పు
d) A తప్పు కానీ R సరైనది
37. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. రాజ్యసభ చైర్మన్ లేదా లోక్సభ స్పీకర్ లేదా అలా వ్యవహరిస్తున్న వ్యక్తి పార్లమెంట్ ఏదైనా సభలో ఏ సమయంలో అయినా లేదా సంయుక్త సమావేశంలో మొదటి పర్యాయం ఓటు వేయడం జరగదు. కానీ సమాన ఓట్లు పొందిన సందర్భంలో తనకు గల నిర్ణయాక ఓటును వినియోగిస్తాడు
2. ఒక వ్యక్తి 25 సంవత్సరాలకు తగ్గని వయస్సు కలిగి ఉంటే రాజ్యసభ లేదా లోక్ సభలో స్థానం భర్తీ చేయడానికి అర్హుడు
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a) 1 b) 2 c) 1, 2
d) 1 కాదు, 2 కాదు
38. భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయం?
a) పార్లమెంట్ ఓటు కోసం సమర్పించబడును
b) రాజ్యసభ ఓటుకు సమర్పించబడును
c) రాష్ట్రపతి అనుమతికి సమర్పించబడదు
d) పార్లమెంట్ ఓటుకు సమర్పించబడదు
39. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభలో మౌఖిక రూపంలో ప్రశ్న అడిగితే దాన్ని ఏమని పిలుస్తారు?
a) అనుబంధ ప్రశ్న
b) స్వల్ప వ్యవధి ప్రశ్న
c) నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు
d) నక్షత్ర గుర్తులేని ప్రశ్నలు
40. ద్రవ్య బిల్లు దేనితో వ్యవహరిస్తుంది?
1. భారత ప్రభుత్వ ఖాతాపై ద్రవ్య స్వీకరణ
2. భారత ప్రభుత్వం ద్రవ్య రుణం కోసం ఏదైనా హామీ ఇచ్చుట
3. భారత సంచిత నిధి సంరక్షణ
4. భారత ఆగంతుక నిధి నుంచి ద్రవ్యం విడుదల
a)1, 2 b) 2, 3
c) 3, 4 d) 1, 2, 3, 4
సమాధానాలు
16. a 17. d 18. c 19. d
20. a 21. c 22. b 23. b
24. a 25. d 26. a 27. c
28. a 29. d 30. c 31. a
32. d 33. a 34. d 35. b
36. a 37. a 38. d 39. a
40. d
ధరావత్ సైదులు నాయక్
సీనియర్ ఫ్యాకల్టీ,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జహీరాబాద్ 9908569970
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు