BIOLOGY | వర్ణాంధత్వాన్ని కలిగించే క్రోమోజోమ్‌ను గుర్తించే పరీక్ష?
బయాలజీ (మార్చి 16 తరువాయి)
153. ‘ఎరిత్రోబ్లాస్టోఫీటాలిస్’ ను నయం చేసేది?
1) Anti-Rh Vaccine
2) Anti-D Vaccine
3) Gamma-D Vaccine
4) alpha-Beta Vaccine
154. కింది వాటిలో రక్తదాత, రక్త గ్రహీతలు వరుసగా?
1) O, B 2) AB, O
3) O, AB 4) O, A
155. కింది వాటిలో ప్రతిరక్షకాల మార్పిడికి తోడ్పడేవి?
1) ఆల్ఫా గ్లాబ్యులిన్
2) హెపారిన్
3) గామా గ్లాబ్యులిన్
4) థ్రాంబిన్
156. అసాధారణంగా ఆర్బీసీ సంఖ్య పెరిగి ఎముక మజ్జ క్యాన్సర్‌కు దారితీసే లక్షణం?
1) పాలీసైధీమియా
2) ల్యుకేమియా
3) హైపోఎనీమియా
4) పెర్నీషియస్ ఎనీమియా
157. ఒక వ్యక్తి హైపోటెన్షన్, మరో వ్యక్తి హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. ఆ విలువ వరుసగా?
1) 140/100, 110/70
2) 120/80, 140/100
3) 110/70, 120/80
4) 110/70, 140/100
158. మానవ హృదయాన్ని కప్పుతూ ఉండే 2 పొరలు?
1) ప్లూరాత్వచాలు 2) మెనింజస్
3) పెరీకార్డియం 4) ఉల్బుపొరలు
159. WBC ఉత్పత్తి తక్కువ కావడం?
1) ల్యుకేమియా
2) హీమోలైటిక్ ఎనీమియా
3) థ్రాంబోసైటోపీనియా
4) ఎగ్రాన్యులోసైటోసిస్
160. అలైంగిక ప్రత్యుత్పత్తిని జతపరచండి.
ఎ. Apple 1. పునరుత్పత్తి
బి. Blackberry 2. లేయరింగ్
సి. Grape 3. ఛేదనం
డి. Pineapple 4. అంటుకట్టుట
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
161. ఏకకణ శిలీంధ్రాలు ప్రత్యుత్పత్తి రకం?
1) కోరకీభవనం 2) విచ్ఛిత్తి
3) అంటుకట్టుట 4) సిద్ధబీజాలు
162. ప్రతిజనకాల ముఖ్యవిధి?
1) శరీరేతర భాగాలను చంపడం
2) అధికంగా ఉన్న హిమోగ్లోబిన్ విచ్ఛిత్తి
3) ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించడం
4) ఇతర ప్రతిజనకాలను ప్రతిరక్షకాలుగా ఏర్పరచడం
163. క్షీరదాలు కాకుండా ఇతర సకశేరుకాల్లో పొడవైన ఎముకలు కలిగినవి?
1) పసుపు మజ్జ 2) ఎరుపు మజ్జ
3) గులాబీ మజ్జ 4) గోధుమ మజ్జ
164. వేర్లపై గల మూలకేశాల ప్రాథమిక విధి?
1) వేర్లను మృత్తికలో నాటి మొక్కను నిలబెట్టడం
2) భూమి నుంచి నీరు, ఖనిజ లవణాల శోషణ
3) సూక్ష్మ జీవుల నుంచి వేరును రక్షించడం
4) వేర్లు భవిష్యత్‌లో పెరగడానికి కావాల్సిన ప్రదేశాన్ని ఇవ్వడం
165. మలిన రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు సరఫరా చేసేది?
1) మహాధమని 2) పుపుస ధమని
3) పుపుస సిర 4) అధోమహాసిర
166. మానవశరీర రక్త ప్రసరణ మార్గం?
1) కుడి కర్ణిక – కుడి జఠరిక – ఊపిరితిత్తులు – ఎడమ జఠరిక
2) కుడి కర్ణిక – ఎడమ కర్ణిక – కుడిజఠరిక – ఊపిరితిత్తులు – ఎడమ జఠరిక
3) కుడి కర్ణిక – కుడి జఠరిక – ఊపిరితిత్తులు – ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక
4) కుడి కర్ణిక – కుడి జఠరిక – ఊపిరితిత్తులు – ఎడమ జఠరిక – ఎడమ కర్ణిక
167. 4 గదుల గుండె కలిగిన సరీసృపం?
1) పావురం 2) మానవుడు
3) తాబేలు 4) మొసలి
168. కొండలపై, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే జీవుల్లో బుగ్గల ఎరుపునకు కారణం?
1) ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ శాతం పెరుగుదల
2) ఆక్సిజన్ తక్కువ కావున ఆర్‌బీసీల సంఖ్య సాధారణంగా కంటే ఎక్కువగా ఉండడం
3) చర్మంలో రక్తప్రసరణ పెరగడం
4) ఆక్సిజన్ తక్కువ వల్ల హృదయ స్పందన ఎక్కువ కావడం
169. హిమోలైటిక్ ఎనీమియాకు ప్రధాన కారణం?
1) ప్లీహం ఆర్బీసీలను ఎక్కువగా విచ్ఛిత్తి చేయడం
2) Fe లోపం
3) B12 విటమిన్ లోపం
4) RBC ఉత్పత్తి చేసే ఎముక మజ్జ అంత క్రియావంతంగా ఉండకపోవడం
170. జతపరచండి.
ఎ. ఇనుము 1. రికెట్స్
బి. అయోడిన్ 2. ఎనీమియా
సి. కాల్షియం 3. ఫ్లోరోసిస్
డి. ఫ్లోరిన్ 4. గాయిటర్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
171. ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు అతని బ్లడ్‌గ్రూప్ (బి) అయితే అతనికి రక్తాన్ని ఇచ్చేవారు?
1) A 2) A, B
3) AB 4) O
172. ఏ ఇద్దరి Rh కారక కలయిక వల్ల ‘ఎరిత్రోబ్లాస్టోఫీటాలిస్’ వ్యాధి కలుగుతుంది?
1) తండ్రి Rh-, తల్లి Rh+, శిశువు Rh+
2) తండ్రి Rh+, తల్లి Rh-, శిశువు Rh+
3) తండ్రి Rh-, తల్లి Rh+, శిశువు Rh-
4) తండ్రి Rh+, తల్లి Rh-, శిశువు Rh-
173. ప్రోథ్రాంబిన్, థ్రాంబోకైనేజ్ సమక్షంలో థ్రాంబిన్‌గా మారి రక్తం గడ్డకట్టుటకు కారణం?
1) Ca+2 ion 2) Mg ion
3) మాంగనీస్ అయాన్
4) Na ion
174. ప్రోథ్రాంబిన్ ఏర్పడి రక్తం గడ్డకట్టాలంటే కావాల్సిన విటమిన్?
1) A 2) B
3) C 4) K
175. రక్తఫలకికలు ఏర్పడే ప్రదేశం?
1) ప్లీహం
2) మెగాకారియోసైట్స్
3) లింఫ్ కణుపులు 4) కాలేయం
176. జతపరచండి.
ఎ. RBC 1. 3-10 రోజులు
బి. రక్తఫలకికలు 2. 120 రోజులు
సి. WBC 3. 12-13 రోజులు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-2, బి-1, సి-3
177. జతపరచండి.
ఎ. మోనోసైట్స్ 1. అతిచిన్నవి, వ్యాధినిరోధక శక్తిని పెంచేవి
బి. లింఫోసైట్స్ 2. అతి ఎక్కువ సంఖ్య, గాయాలు మాన్పుట
సి. ఎసిడోఫిల్స్ 3. అతి పెద్దవి, గాయాలు మానుట
డి. న్యూట్రోఫిల్స్ 4. ఎలర్జీ నిరోధకం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
178. ముసలివారిలో మూత్రవిసర్జన నియంత్రణ కోల్పోవడానికి కారణం?
1) సంవరిణి కండరాల క్రియారహితం
2) మూత్రాశయం విశాలమయ్యే సామర్థ్యం తగ్గడం
3) మూత్రాశయం సామర్థ్యం తగ్గడం
4) ప్రసేక కండరాలు సాధారణంగా పనిచేయకపోవడం
179. మూత్రంలో లేని వ్యర్థ పదార్థం?
1) యూరియా, యూరిక్ యాసిడ్
2) యూరియా, కార్బన్ డై ఆక్సైడ్
3) యూరియా, కార్బన్ డై ఆక్సైడ్, క్రియాటినైన్
4) యూరియా, హెచ్‌సీఎల్, అమ్మోనియా
180. జతపరచండి.
ఎ. పత్రం 1. క్లోరోఫిల్
బి. చర్మం రంగు 2. మెలనిన్
సి. మూత్రం 3. యూరోక్రోమ్
డి. పైత్యరసం 4. బైలిరూబిన్, బైలివర్డిన్
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
181. విలియం కోల్ఫ్ 1943లో తయారు చేసిన డయాలసిస్ కింది వాటిలో ఏవి పనిచేయకపోవడం వల్ల ఉపయోగిస్తారు?
1) కాలేయం 2) మూత్రపిండాలు
3) పిత్తాశయం 4) క్లోమం
182. మానవునిలో ఫలదీకరణం జరిగే ప్రదేశం?
1) స్త్రీ బీజకోశాలు
2) ఫాలోపియన్ నాళం
3) గర్భాశయ కుడ్యం
4) కార్పస్ట్యూటియం
183. స్త్రీలలో రుతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) HCTH
3) ప్రొజెస్టిరాన్ 4) ఈస్ట్రోజన్
184. జీవ సామ్రాజ్యంలో పొడవైన, పెద్ద కణాలు వరుసగా?
1) శుక్రకణం, సైకస్ అండం
2) నాడీ కణం, సైకస్ అండం
3) ఆస్ట్రిచ్ అండం, శుక్రకణం
4) నాడీ కణం, ఆస్ట్రిచ్ అండం
185. జతపరచండి.
ఎ. అరటి 1. అనృతఫలం
బి. ఆపిల్, జీడిమామిడి
2. హెస్పరీడియం
సి. పైనాపిల్ 3. సోరోసిస్
డి. నిమ్మ/సిట్రస్ 4. మృదుఫలం
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
186. జతపరచండి.
ఎ. అయోడిన్ 1. శిలాజాల వయస్సు నిర్ధారణ
బి. కోబాల్ట్ 2. థైరాయిడ్ సంబంధ వ్యాధులు (గాయిటర్)
సి. పాస్ఫరస్ 3. క్యాన్సర్ నివారణ
డి. కార్బన్ 4. చర్మవ్యాధులు
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-4, సి-3, డి-2
187. ఎద్దు గుర్తించే రంగు?
1. తెలుపు 2. నలుపు
3. ఎరుపు 4. బూడిద
1) 1, 2 2) 1, 2, 4
3) 1, 2, 3 4) 1, 2, 3, 4
188. 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, బలహీన శైలికా కండరాల వల్ల కలిగే కంటి వ్యాధి?
1) మెట్రోపియా 2) అస్టిగ్మాటిజం
3) ప్రెస్బయోపియా
4) హైపర్‌మెట్రోపియా
189. మానవునిలో రంగు గుర్తింపునకు కారణమయ్యే జన్యువు ఏ క్రోమోజోమ్‌పై ఉంటుంది?
1) 22వ జత ‘x’ క్రోమోజోమ్
2) 22వ జత ‘y’ క్రోమోజోమ్
3) 23వ జత ‘x’ క్రోమోజోమ్
4) 23వ జత ‘y’ క్రోమోజోమ్
190. కింది వాటిలో వర్ణాంధత్వాన్ని కలిగించే క్రోమోజోమ్‌ను గుర్తించే పరీక్ష?
1) అలెస్సియా 2) ఇషిహర
3) డాట్బ్లాటింగ్ 4) ELISA
191. పుట్టిన ఆడశిశువులో వర్ణాంధత్వం అనే జన్యుసంబంధ వ్యాధి రావడానికి అవకాశం?
1) 0 శాతం 2) 25 శాతం
3) 75 శాతం 4) 50 శాతం
192. మానవుని అధిక దృష్టిదూరం ఎంత ?
1) 920 2) 980
3) 1080 4) 1280
193. తల్లి గనేరియా అనే లైంగిక వ్యాధితో బాధపడినా, జన్మనిచ్చిన శిశువులో కలిగే వ్యాధి?
1) కంజెంక్టివైటిస్ 2) ట్రాకోమా 3) గ్లూకోమా 4) ఆప్తాల్మియా నియెనటోరం
194. చనిపోయిన జంతు, వృక్ష సంబంధ ఆహార పదార్థాలపై పెరిగి ఆహారాన్ని గ్రహించే బ్యాక్టీరియా?
1) స్వయంపోషకం 2) పూతికాహారి
3) కిరణజన్యసంయోగక్రియ
4) పరాన్నజీవి
195. (ఎ) – వైరల్ వ్యాక్సిన్ మొక్కలకు ఉపయోగపడదు
(ఆర్) – మొక్కలు యాంటీబాడీస్‌ను తయారు చేయవు
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఆర్) నిజం కానీ (ఎ) తప్పు
196. కింది వాటిలో వైరస్‌కు, బ్యాక్టీరియాకు సంధానకర్త?
1) రికెట్సియె 2) పక్సీనియా
3) క్లావిషియా 4) బాల్-విల్లిస్
197. వైరస్ లక్షణం కానిది?
1) కణ నిర్మాణం లేదు
2) స్పటిక రూపంలో సేకరించవచ్చు
3) స్వతహాగా ఏ జీవక్రియ జరపదు
4) అతిథేయి బయట నివసిస్తుంది
198. బ్యాక్టీరియా లేని ప్రదేశం?
1) వేడిచేసిన పాలు
2) క్షీరదాల పేగు
3) క్షీరదల పాలు
4) సూక్ష్మజీవరహిత డబ్బాల్లోని ఆహారం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు