ECONOMY | దేశంలో స్మార్ట్‌కార్డ్‌ను మొదట పరిచయం చేసిన బ్యాంక్ ?
1. కింది వాటిలో ఆర్బీఐ ముఖ్య కార్యనిర్వహణ విధి ఏమిటి?
ఎ) అంతిమ రుణదాత
బి) క్లియరింగ్‌హౌస్
సి) ప్రభుత్వానికి సలహాదారు ఏజెంటుగా
డి) పైవన్నీ
2. ఆర్బీఐ క్లియరింగ్ హౌస్‌లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది?
ఎ) కలకత్తా, బెంగళూర్
బి) న్యూఢిల్లీ, హైదరాబాద్
సి) కాన్పూర్, పాట్నా, నాగపూర్
డి) పైవన్నీ
3. క్లియరెన్స్ హౌస్‌లు లేనిచోట ఆర్బీఐకి ప్రతినిధిగా పనిచేసే బ్యాంకు ఏది?
ఎ) వాణిజ్య బ్యాంకు బి) ఎస్బీఐ
సి) యూబీ డి) పైవన్నీ
4. వాణిజ్య బ్యాంకులు సృష్టించే ద్రవ్యం ఏది?
ఎ) పరపతి ద్రవ్యం
బి) సమీప ద్రవ్యం
సి) నిజ ద్రవ్యం డి) మార్పిడి ద్రవ్యం
5. ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ స్థితిని నియంత్రించడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించే బ్యాంకు ఏది?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీఐ
సి) ఐఆర్బీడీ
డి) యూనియన్ బ్యాంక్
6. కిందివాటిలో ఆర్బీఐ విధి?
ఎ) పరపతి నియంత్రణ చేయడం
బి) విదేశీ మారక ద్రవ్య సంరక్షణ
సి) ఇతర బ్యాంకులపై పర్యవేక్షణ
డి) పైవన్నీ
7. సీఆర్ఆర్ అంటే ?
ఎ) క్యాష్ రిజర్వ్ రేషియో
బి) క్యాష్ రెవెన్యూ రేషియో
సి) క్రెడిట్ రెవెన్యూ రేట్
డి) క్రెడిట్ రిజర్వ్ రేట్
8. ఎస్ఎల్ఆర్ అంటే?
ఎ) స్టేట్ లిక్విడిటీ రేషియో
బి) స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో
సి) స్టేట్ లెవెల్ రేట్
డి) స్టాట్యూటరీ లెవెల్ రేషియో
9. కేంద్ర బ్యాంకు కొనే, అమ్మే సెక్యూరిటీల వ్యవహారాలను ఏమంటారు?
ఎ) ఓవర్‌డ్రాఫ్ట్
బి) నగదు నిల్వల నిష్పత్తి
సి) ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు
డి) మార్జిన్
10. ఖాతాదారుడు తమ ఖాతాలో ఉన్న సొమ్ముకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి బ్యాంకు అనుమతిస్తే దాన్ని ఏమంటారు?
ఎ) నగదు నిల్వల నిష్పత్తి
బి) ఓవర్‌డ్రాఫ్ట్ సి) ఎస్ఎల్ఆర్
డి) ఓపెన్ మార్కెట్ వ్యవహారం
11. వాణిజ్య బ్యాంకులు తమవద్ద ఉన్న డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద కొంత నగదు రూపంలో నిల్వ ఉంచవలసిన మొత్తాన్ని ఏమంటారు?
ఎ) నగదు నిల్వల నిష్పత్తి
బి) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి
సి) ఓవర్ డ్రాఫ్ట్ డి) పైవన్నీ
12. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న ఆస్తుల్లో కొంత మొత్తాన్ని తమవద్దే నిల్వ ఉంచవలసిన మొత్తాన్ని ఏమంటారు.
ఎ) సీఆర్ఆర్ బి) ఎస్ఎల్ఆర్
సి) ఓవర్ డ్రాఫ్ట్ డి) ఓపెన్ మార్కెట్
13. ఆర్థిక స్థిరత్వాన్ని, విదేశీ మారక ద్రవ్యం క్రమబద్ధీకరణ చేసే బాధ్యత ఎవరిది?
ఎ) ఎస్బీఐ బి) ఆర్బీఐ
సి) యూబీ, వాణిజ్యబ్యాంకు
డి) పైవన్నీ
14. తనకా వస్తువుల వాస్తవిక విలువకు, రుణ విలువకు మధ్యగల తేడాను ఏమంటారు?
ఎ) పరపతి క్రమబద్ధీకరణ
బి) క్రమబద్ధీకరణ
సి) మార్జిన్ డి) చట్టబద్ధత
15. ఆర్బీఐ తమ దిశ నిర్దేశాలను, పాటించమని వాణిజ్య బ్యాంకులను కోరడాన్ని ఏమంటారు?
ఎ) నైతికోద్బోద బి) చట్టబద్ధం
సి) క్రమబద్దీకరణ డి) పైవన్నీ
16. ఆర్బీఐ రుణలిచ్చే పద్ధతుల్లో మార్పులు తేవడాన్ని ఏమంటారు?
ఎ) క్రమబద్ధీకరణ
బి) పరపతి క్రమబద్దీకరణ
సి) చట్టబద్ధత డి) పైవన్నీ
17. వినిమయ మాద్యంగా చట్టబద్ధంగా అందరూ అంగీకరించే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) ఆర్బీఐ ద్రవ్యం
బి) చట్టబద్ధ ద్రవ్యం
సి) పరపతి ద్రవ్యం డి) పైవన్నీ
18. ద్రవ్య విధాన సాధనాల్లో అతి పురాతనమైనది ఏది?
ఎ) రెపోరేటు బి) రివర్స్ రెపోరేటు
సి) బ్యాంకు రేటు డి) మార్జిన్
19. ఓపెన్ మార్కెట్ చర్యలు ఏ రోజున జరుగుతాయి?
ఎ) సోమవారం బి) మంగళవారం
సి) బుధవారం డి) శుక్రవారం
20. సహకార బ్యాంకుల విస్తరణ ఏ విధంగా ఉంటుంది?
ఎ) దేశీయంగా, విదేశీయంగా
బి) దేశీయంగా మాత్రమే
సి) వివిధ ప్రాంతాలకు మాత్రమే
డి) పైవన్నీ
21. సీఆర్ఆర్ ను ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
ఎ) 1929 బి) 1934
సి) 1935 డి) 1949
22. ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ ?
ఎ) అమ్ముతుంది బి) కొంటుంది
సి) నిల్వ చేస్తుంది డి) పైవన్నీ
23. సీఆర్ఆర్ పైన ఆర్బీఐ వడ్డీ?
ఎ) చెల్లిస్తుంది బి) చెల్లించదు
సి) కాలంపై ఆధారపడుతుంది
డి) ఎ, సి
24. ఆర్థిక మాంద్యం కాలంలో సీఆర్ఆర్ను ?
ఎ) పెంచుతుంది బి) తగ్గిస్తుంది
సి) అమ్ముతుంది డి) కొంటుంది
25. ఎస్ఎల్ఆర్ అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది?
ఎ) విదేశీ కరెన్సీ రూపంలో
బి) బంగారం రూపంలో
సి) ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో
డి) పైవన్నీ
26. ప్రస్తుతం ఎస్ఎల్ఆర్ విలువ ఎంత ఉంది?
ఎ) 12 శాతం బి) 15 శాతం
సి) 18 శాతం డి) 25 శాతం
27. రెపోరేటు భావనను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1992 బి)1993
సి) 1995 డి) 1996
28. రెపోరేటు అనగా
ఎ) Short Term Lending Rate
బి) Short Term borrowing Rate
సి) Long Term Lending Rate
డి) Long Term borrowing Rate
29. భారతదేశంలో డెబిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టిన మొదటి బ్యాంక్ ఏది?
ఎ) దీనా బ్యాంక్ బి) సిటీ బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్
డి) యూనియన్ బ్యాంక్
30. ఒక బ్యాంకింగ్ సంస్థకు ముందుగా కొంత చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని వాడుకోవడానికి ఆ బ్యాంక్ జారీ చేసే కార్డ్‌ను ఏమంటారు?
ఎ) క్రెడిట్ కార్డ్ బి) డెబిట్ కార్డ్
సి) స్మార్ట్‌కార్డ్ డి) పైవన్నీ
31. దేశంలో స్మార్ట్‌కార్డ్‌ను ఎక్కడి బ్యాంక్ మొదట పరిచయం చేసింది?
ఎ) ముంబైలోని దేనా బ్యాంక్
బి) కోల్‌కతలోని దేనా బ్యాంక్
సి) మద్రాస్‌లోని దేనా బ్యాంక్
డి) న్యూఢిల్లీలోని దేనా బ్యాంక్
32. గృహరుణాలు, వినియోగరుణాలు అందించడానికి వాణిజ్యబ్యాంకులు ఏ బ్యాంకింగ్ విధానం అనుసరిస్తున్నాయి?
ఎ) చందాపూచి సేవలు
బి) మార్చెంట్ బ్యాంకింగ్ సేవలు
సి) రిటైల్ బ్యాంకింగ్
డి) మ్యూచవల్ ఫండ్
33. అండర్ రైటింగ్ సర్వీసెస్ అంటే?
ఎ) చందాపూచి సేవలు
బి) మార్చెంట్ బ్యాంకింగ్ సేవలు
సి) రిటైల్ బ్యాంకింగ్ సేవలు
డి) మ్యూచువల్ ఫండ్ సేవలు
34. బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత బ్యాంక్ ఏది?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
35. ప్రాధాన్యత రంగ రుణాలు అనే భావన ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది?
ఎ) 1955 బి) 1969
సి) 1980 డి) 1982
36. విచక్షణాత్మక వడ్డీరేటు విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1969 మార్చి 15
బి) 1972 మార్చి 15
సి) 1980 మార్చి 15
డి) 1982 మార్చి 10
37. 1969లో జీడీపీలో మొత్తం బ్యాంకు డిపాజిట్లు ఎంత శాతం ఉండేవి?
ఎ) 9 శాతం బి) 10 శాతం
సి) 11 శాతం డి) 18 శాతం
38. బ్యాంకుల జాతీయీకరణ తరువాత గ్రామాల్లో బ్యాంకు బ్రాంచీల సంఖ్య ఎంత శాతం పెరిగింది?
ఎ) 22.5 నుంచి 35 శాతం
బి 25 నుంచి 35 శాతం
సి) 10 నుంచి 18 శాతం
డి) 20 నుంచి 30 శాతం
39. మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ ఎన్ని కోట్లరూపాయలకు మించి డిపాజిట్లు కలిగిన బ్యాంకులను జాతీయం చేశారు?
ఎ) 40 కోట్లు బి) 50 కోట్లు
సి) 60 కోట్లు డి) 70 కోట్లు
40. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పు వచ్చిందనడానికి ఉదాహరణ?
ఎ) మొబైల్ బ్యాంకింగ్
బి) వాల్ బ్యాంకింగ్
సి) ఇంటర్నెట్ బ్యాంకింగ్ డి) పైవన్నీ
41. గాడ్గిల్ కమిటీ తన సూచనలను ఏ పథకం ద్వారా సూచించింది?
ఎ) గాడ్గిల్ పథకం బి) నారిమన్ పథకం
సి) లిడ్ బ్యాంక్ పథకం
డి) బ్యాంకింగ్ పథకం
42. రెండోసారి ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు?
ఎ) 6 బి) 8 సి) 10 డి) 12
43. సెకెండరీ డిపాజిట్లకు మరొక పేరు?
ఎ) ఉత్పన్న డిపాజిట్లు
బి) రికరింగ్ డిపాజిట్లు
సి) కరెంట్ డిపాజిట్లు
డి) పొదుపు డిపాజిట్లు
44. ఒక వాణిజ్య బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకు లకు, విత్త సంస్థలకు ఇచ్చే రుణాలు ఏవి?
ఎ) స్వల్పకాలిక రుణాలు
బి) డిమాండ్ రుణాలు
సి) పిలుపు రుణాలు డి) బి, సి
45. డిమాండ్ డిపాజిట్లపై వడ్డీరేటు ఎలా ఉంటుంది?
ఎ) వడ్డీరేటు ఉంటుంది
బి) వడ్డీరేటు ఉండదు
సి) స్వల్పంగా ఉంటుంది
డి) అధికంగా ఉంటుంది
46. ఖాతాదారుడు తమఖాతాలో ఉన్న సొమ్ముకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతిస్తే దాన్ని ఏమంటారు?
ఎ) నగదు జమలు బి) ద్రవ్య పరపతి
సి) ఓవర్‌డ్రాఫ్ట్ డి) పైవన్నీ
47. ఏ రకమైన చెక్కును బ్యాంకుకు ఇచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తారు?
ఎ) క్రాస్డ్ చెక్ బి) బేరర్ చెక్
సి) ఎ, బి డి) క్రెడిట్ చెక్
48. బ్యాంకులు రుణాలు అడ్వాన్సులను ఇచ్చేటప్పుడు సృష్టించే డిపాజిట్లు
ఎ) సెకెండరీ డిపాజిట్లు
బి) ఉత్పన్న డిపాజిట్లు
సి) ప్రాథమిక డిపాజిట్లు డి) ఎ, బి
49. వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల నుంచి సెకెండరీ డిపాజిట్లు సృష్టించే ప్రక్రియను ఏమంటారు?
ఎ) డిపాజిట్ల సృష్టి బి) పరపతి సృష్టి
సి) పొదుపు సృష్టి డి) చెక్కుల సృష్టి
50. ఏ రకమైన చెక్కును బ్యాంకుకు ఇచ్చిన తరువాత ఆ చెక్ మొత్తాన్ని చెక్కుదారు పేర జమ అవుతుంది?
ఎ) బేరర్ చెక్ బి) క్రాస్డ్ చెక్
సి) టాస్క్చెక్ డి) బ్లాంక్‌చెక్
51. ప్రజలు, సంస్థల నుంచి బ్యాంకులకు నేరుగా వచ్చే నగదు డిపాజిట్లను ఏమంటారు?
ఎ) ప్రాథమిక డిపాజిట్లు
బి) ఉత్పన్న డిపాజిట్లు
సి) ద్వితీయశ్రేణి డిపాజిట్లు
డి) పొదుపు డిపాజిట్లు
52. షెడ్యూల్డ్ బ్యాంకులపై అధికార నియంత్రణ ఎవరికి ఉంటుంది.
ఎ) ఎస్బీఐ బి) ఆర్బీఐ
సి) యూనియన్ బ్యాంక్
డి) ఐసీఐసీఐ
53. భారతదేశంలో మొట్టమొదటి సహకార బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1904 మార్చి 5
బి) 1912 మార్చి 25
సి) 1908 ఏప్రిల్ 5
డి) 1904 ఏప్రిల్ 5
54. కలిసి పనిచేయడం అనే ప్రాతిపదికన ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది?
ఎ) వాణిజ్యబ్యాంకు
బి) సహకార బ్యాంక్
సి) యూనియన్ బ్యాంక్ డి) పైవన్నీ
55. ప్రపంచ సహకార ఉద్యమ పితామహుడు ఎవరు?
ఎ) రైఫిజాన్ బి) రాబర్ట్ ఓవెన్
సి) ఫెడరిక్ నికల్సన్ డి) లార్డ్కర్జన్
56. భారతదేశంలో సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?
ఎ) ఎడ్వర్డ్ లా కమిటీ
బి) గోర్వాలా కమిటీ
సి) హజరీ కమిటీ డి) మోహతాకమిటీ
57. సహకార వ్యవస్థను ఏ సంవత్సరంలో రాష్ట్రజాబితాలో చేర్చారు?
ఎ) 1904 బి) 1912
సి) 1906 డి) 1919
58. నెహ్రూ సూచించిన ప్రజాస్వామ్యానికి మూడు స్థంభాలు ఏవి?
ఎ) సహకార సంఘాలు, పంచాయతీ, పాఠశాల
బి) సహకార సంఘాలు, పంచాయతీ, పత్రికలు
సి) సహకార సంఘాలు, బ్యాంకులు, పత్రికలు
డి) పత్రికలు, పాఠశాలలు, పార్లమెంటు
59. సింగిల్ విండో పద్ధతి /ఏక గవాక్షా పద్ధతిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1985 బి) 1986
సి) 1987 డి) 1988
సమాధానాలు
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు