Sports Current Affairs March 17 | 2023 హాకీ ప్రపంచకప్‌లో భారతదేశ స్థానం?
కరెంట్ అఫైర్స్
క్రీడా రంగం
1. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. వరుసగా ఐదు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఆటగాడిగా పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు
బి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో లీగ్ దశలో, క్వార్టర్స్ దశలో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్స్ చేసిన ఆటగాడిగా కైలియన్ ఎంబాపె నిలిచాడు
1) ఎ సరైనది, బి సరికాదు
2) ఎ, బి లు సరైనవే
3) బి సరైనది
4) ఎ సరైనది కాదు, బి సరైనది
2. 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఇచ్చిన అవార్డులను జతపరచండి.
ఎ. గోల్డెన్ గ్లోవ్ అవార్డు 1. అర్జెంటీనా జట్టు
బి. గోల్డెన్ బాల్ అవార్డు 2. ఎంజో ఫెర్నాండెజ్
సి. గోల్డెన్ బూట్ అవార్డు 3. ఎమిలియానో మార్టెనిజ్
డి. ఉత్తమ యువ ఆటగాడు 4. లియోనల్ మెస్సీ
ఇ. ఫెయిర్ ప్లే అవార్డు 5. ఇంగ్లండ్ జట్టు
6. కైలియన్ ఎంబాపె
1) ఎ-3, బి-6, సి-2, డి-4, ఇ-5
2) ఎ-3, బి-2, సి-4, డి-6, ఇ-5
3) ఎ-3, బి-4, సి-6, డి-2, ఇ-5
4) ఎ-3, బి-2, సి-6, డి-4, ఇ-5
3. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ గురించి సరికాని వాక్యమేది?
1) ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ 22వది
2) ఈ ప్రపంచకప్‌ను ఖతార్‌లో నిర్వహించారు
3) ఈ ప్రపంచకప్‌ను అరబ్ దేశం నిర్వహించడం రెండోసారి, ఆసియా ఖండంలో
నిర్వహించడం ఇదే తొలిసారి
4) తొలి మ్యాచ్‌ను నిర్వహించిన దేశం ఆడుతుంది
4. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నమోదైన గోల్స్ గురించి సరైన వాక్యం?
ఎ. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 172 గోల్స్ నమోదయ్యాయి
బి. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టు ఫ్రాన్స్
సి. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు కైలియన్ ఎంబాపె
డి. ఈ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ ఇంగ్లండ్, ఇరాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదయ్యాయి
1) ఎ, డి 2) బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ
5. 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో పాల్గొన్న దేశాల గురించి సరైన వాక్యమేది?
ఎ. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి
బి. ఈ ప్రపంచకప్‌లో 64 సంవత్సరాల తర్వాత ‘వేల్స్’ దేశ జట్టు అర్హత సాధించింది
సి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న కారణంగా రష్యా జట్టును సస్పెండ్ చేశారు
డి. ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్‌లు గెలిచిన ఇటలీ జట్టు ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు
1) పైవన్నీ 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, సి
6. 2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలిసారి ముగ్గురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. కింది వారిలో ఎవరు ఎంపిక కాలేదు?
1) స్టెఫానీ ఫ్రొప్పర్ట్
2) క్లాడియా రొమానీ
3) సలీమా ముకన్సంగా
4) యోషిమి యమషితా
7. కింది వాక్యాల్లో సరికానిది?
ఎ. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది
బి. అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం ఇది 6వ సారి
సి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా సెమీస్‌లో క్రొయేషియా దేశ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది
డి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ లుసాయిల్ స్టేడియంలో జరిగింది
1) ఎ, బి 2) సి, డి
3) పైవన్నీ సరికానివి 4) పైవన్నీ సరైనవి
8. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు ఫైనల్ చేరాయి
బి. ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించింది
సి. ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది 3వ సారి
డి. 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్ రష్యాలో జరగగా ఫ్రాన్స్ గెలుచుకొంది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
9. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ గురించి సరికాని వాక్యం?
1) ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్టును పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్‌తో ఓడించింది
2) అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలవడం ఇది మూడోసారి
3) ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ చేశాడు
4) ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదవడం ఇదే తొలిసారి
10. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ మస్కట్ పేరు లాయిబ్
బి. లాయిబ్ అనేది అరబిక్ భాషా పదం
సి. లాయిబ్ అంటే అర్థం ‘కల’
డి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు ఒక స్పాన్సర్‌గా రిలయన్స్ ఉంది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి
11. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉపయోగించే బంతి గురించి సరైన వాక్యం?
ఎ. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉపయోగించే ఫుట్‌బాల్ పాకిస్థాన్‌లో తయారవుతుంది
బి. 1970 నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు బాల్ స్పాన్సర్‌గా ‘అడిడాస్’ ఉంది
సి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో వాడిన బాల్‌కు రెండు పేర్లు పెట్టారు
డి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో వాడిన బాల్స్ పేర్లు ‘అల్రిహ్లా’, అల్హిల్మ్’
1) బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
12. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల గురించి సరికాని వాక్యం?
ఎ. 2022 ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొన్నాయి
బి. 2026 ప్రపంచకప్‌లో 48 జట్లు పాల్గొననున్నాయి
సి. 2022 ప్రపంచకప్‌లో 64 మ్యాచ్‌లు ఆడారు
డి. 2026 ప్రపంచకప్‌ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు నిర్వహించనున్నాయి
1) ఎ, సి, డి 2) పైవన్నీ సరికావు
3) పైవన్నీ సరైనవే 4) ఎ, డి
13. 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో విజేత అర్జెంటీనా కాగా రెండో, మూడవ, నాలుగవ స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి?
1) ఫ్రాన్స్, మొరాకో, క్రొయేషియా
2) ఫ్రాన్స్, క్రొయేషియా, మొరాకో
3) ఫ్రాన్స్, క్రొయేషియా, బ్రెజిల్
4) ఫ్రాన్స్, మొరాకో, బ్రెజిల్
14. స్టెఫానీ ప్రాప్పర్ట్ అనే మహిళ తొలిసారిగా ప్రపంచకప్ చరిత్రలో డిసెంబర్1, 2022న ఏ జట్ల మధ్య మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించారు?
1) ఖతార్ X కోస్టారికా
2) కోస్టారికా X అర్జెంటీనా
3) అర్జెంటీనా X ఖతార్
4) కోస్టారికా X జర్మనీ
15. కింది వాక్యాలను గమనించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి.
ఎ. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని దీపికా పదుకొణె ఆవిష్కరించింది
బి. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉపయోగించే బాల్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు
సి. బాల్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన సంస్థ ‘స్పేస్ ఎక్స్’
1) పైవన్నీ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
16. మొదటి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఏ సంవత్సరంలో జరిగింది, ఏ దేశం విజేతగా నిలిచింది, ఏ దేశం నిర్వహించింది?
1) 1930, ఉరుగ్వే, ఉరుగ్వే
2) 1930, ఉరుగ్వే, అర్జెంటీనా
3) 1930, ఉరుగ్వే, బ్రెజిల్
4) 1930, ఉరుగ్వే, జర్మనీ
17. ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో ప్రపంచయుద్ధం కారణంగా ఏయే సంవత్సరాల్లో నిర్వహించలేదు?
1) 1940, 1944 2) 1942, 1946
3) 1944, 1948 4) 1943, 1947
18. 2023 హాకీ ప్రపంచకప్ విజేత ఎవరు?
1) బెల్జియం 2) స్పెయిన్
3) జర్మనీ 4) నెదర్లాండ్స్
19. 2023 హాకీ ప్రపంచకప్ గురించి సరైన వాక్యం?
ఎ. ఈ హాకీ ప్రపంచకప్ 15వది
బి. ఇది 2023 జనవరి 13 నుంచి 29 వరకు జరిగింది
సి. ఈ ప్రపంచకప్ భువనేశ్వర్, రూర్కెలా నగరాలు నిర్వహించాయి
డి. ఈ ప్రపంచకప్‌ను వరుసగా భారత్
నిర్వహించలేదు
1) ఎ, బి, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
20. 2023 హాకీ ప్రపంచకప్ గురించి సరికాని వాక్యమేది?
ఎ. పాల్గొన్న జట్ల సంఖ్య- 16
బి. మస్కట్ పేరు- ఓలీ
సి. ఆడిన మ్యాచ్‌ల సంఖ్య- 32
డి. ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం- కళింగ స్టేడియం
21. 2023 హాకీ ప్రపంచకప్‌లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 9వ 2) 5వ 3) 6వ 4) 8వ
22. 2022 మహిళల హాకీ ప్రపంచకప్ విజేత, పరాజిత జట్లు ఏవి?
1) నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా
2) నెదర్లాండ్స్, అర్జెంటీనా
3) నెదర్లాండ్స్, జర్మనీ
4) నెదర్లాండ్స్, స్పెయిన్
23. 2022 మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు స్థానం ఎంత?
1) 8వ 2) 7వ 3) 9వ 4) 10వ
24. 2022 మహిళల హాకీ ప్రపంచకప్ నిర్వహించినది?
1) స్పెయిన్ 2) నెదర్లాండ్స్
3) స్పెయిన్, జర్మనీ
4) స్పెయిన్, నెదర్లాండ్స్
25. 2026 పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్‌లను నిర్వహించే దేశాలు?
1) స్పెయిన్, నెదర్లాండ్స్
2) బెల్జియం, నెదర్లాండ్స్
3) స్పెయిన్, బెల్జియం
4) బెల్జియం, జర్మనీ
26. ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 గురించి సరైన వాక్యం?
ఎ. ఇది 7వ ప్రపంచకప్
బి. ఇది భారతదేశంలో జరిగింది
సి. ఇది భారత్‌లో ఒడిశా, గోవా, ముంబైలలో జరిగింది
డి. ఫిఫాకు సంబంధించి భారత్ ఒక ప్రపంచకప్ నిర్వహించడం ఇది రెండోసారి
1) పైవన్నీ 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, బి
27. 2022 ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ గురించి సరైన వాక్యం?
ఎ. ఈ ప్రపంచకప్ మస్కట్ పేరు ‘ఇభా’
బి. ఇభా అనేది ఆసియా సింహం
సి. ఇభా అనేది ‘నారీశక్తి’ని తెలియజేస్తుంది
డి. ఈ ప్రపంచకప్ నినాదం ‘కిక్ ఆఫ్ ది డ్రీమ్’
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
28. 2022 ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఎవరు?
1) కొలంబియా 2) నైజీరియా
3) స్పెయిన్ 4) జర్మనీ
29. R: 2022 ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో భారత జట్టు 16వ స్థానంలో నిలిచింది.
S: 2022 ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో పాల్గొన్న జట్లు 16
1) R సరైనది, S కాదు
2) R సరైనది కాదు, S సరైనది
3) R, S సరైనవి కావు
4) R, S రెండూ సరైనవి
30. 2022 పురుషుల హాకీ ఆసియా కప్ విజేత జట్టు ఏది?
1) దక్షిణకొరియా 2) జపాన్
3) భారతదేశం 4) పాకిస్థాన్
31. 2023 అండర్-19 మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ గురించి సరైన వాక్యం?
ఎ. ఇది మొదటి సారిగా నిర్వహించబడింది
బి. దీన్ని నిర్వహించిన దేశం దక్షిణాఫ్రికా
సి. ఈ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకొంది
డి. ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయింది
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
32. 2023 అండర్-19 మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ గురించి సరైనది?
ఎ. పాల్గొన్న జట్లు- 16
బి. భారత్ జట్టు కెప్టెన్- షెఫాలీవర్మ
సి. అత్యధిక పరుగులు చేసింది- శ్వేతా షెహ్రావత్ (భారత్)
డి. అత్యధిక వికెట్లు తీసింది- మాగీ క్లార్క్ (ఆస్ట్రేలియా)
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి 4) బి, సి, డి
33. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 2022 గురించి సరైన వాక్యం?
ఎ. ఇవి 18వ చాంపియన్‌షిప్స్
బి. ఇవి అమెరికాలోని యుగునె లో జరిగాయి
సి. ఈ చాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌చోప్రా రజతం గెలిచాడు
డి. ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఒక పతకం గెలవడం ఇదే తొలిసారి
1. ఎ, బి, సి 2. బి, సి
3. బి, సి, డి 4. పైవన్నీ
34. 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పతకాల పట్టికలో అమెరికా మొత్తం 33 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. భారత్ స్థానం ఎంత?
1) 31వ 2) 32వ
3) 33వ 4) 34వ
టి. రవి,
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?