Current Affairs March 15th | క్రీడలు
ఇరానీ కప్
ఇరానీ కప్‌ను రెస్టాఫ్ ఇండియా జట్టు గెలుచుకుంది. మార్చి 5న గ్వాలియర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టు మధ్యప్రదేశ్‌పై 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (రెస్టాఫ్ ఇండియా)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పీవీఎల్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 5న కొచ్చిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ 3-2తో బెంగళూరు టార్పెడోస్పై విజయం సాధించింది.
షాన్ మార్ష్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు మార్చి 10న రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టీ20ల్లో కొనసాగనున్నాడు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2019లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2,265, వన్డేల్లో 2,773 పరుగులు చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?