ECONOMY | పరపతి విధానం ప్రకటించేది.. నష్టాలను తగ్గించేది
ద్రవ్య విధానం
- ద్రవ్యం వల్ల వచ్చే ప్రయోజనాలను గరిష్ఠం చేయటం, నష్టాలను కనిష్ఠం చేయటం కోసం ఆర్బీఐ అనుసరించే ప్రక్రియనే ద్రవ్యవిధానం/పరపతి విధానం అంటారు.
- ద్రవ్య సప్లయ్‌ని పెంచటం (లేదా) తగ్గించటానికి సంబంధించి ఆర్బీఐ అనుసరించే పద్ధతినే ద్రవ్య విధానం అంటారు.
- ద్రవ్య సప్లయ్‌ని నియంత్రించే విధానమే ద్రవ్య విధానం. ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పద్ధతిని తెలిపేదే ద్రవ్య విధానం.
- ద్రవ్య విధానాన్ని అమలు చేసేది కేంద్రబ్యాంకు. కోశ విధానాన్ని అమలు పరిచేది కేంద్ర ప్రభుత్వం.
- ద్రవ్య విధాన కర్త- కేంద్రబ్యాంకు. కోశ విధాన కర్త- కేంద్ర ప్రభుత్వం.
- భారత్‌లో ఆర్బీఐ ప్రతి ఆర్థిక సంవత్సరానికి తన ద్రవ్య విధానాన్ని/పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. ప్రతి 3 నెలలకోసారి (లేదా) అత్యవసర సమయంలో దాన్ని సమీక్షిస్తుంది.
లక్ష్యాలు
1. ధరల స్థిరీకరణ (అభిలషణీయ ధరల స్థాయి)
2. గరిష్ఠ ఆర్థికాభివృద్ధిని సాధించటం
3. సంపూర్ణ ఉద్యోగిత సాధించటం
4. ఆదాయ, సంపదల సమ పంపిణీ
5. మారకపు రేట్ల స్థిరత్వం
6. భారత పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలను సాధించటం - ద్రవ్య విధాన సాధనాలు/పరపతి నియంత్రణా సాధనాలు 2 రకాలు
1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు
2. గుణాత్మక/విచక్షణాత్మక/ఎంపిక చేయబడిన పరపతి నియంత్రణ సాధనాలు
1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు
- పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా దేశంలో అందుబాటులో ఉండే పరపతి పరిమాణాన్ని ప్రభావితం చేయవచ్చు. అనగా పరపతి పరిమాణాన్ని పెంచవచ్చు (లేదా) తగ్గించవచ్చు.
- పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు కింది విధంగా ఉంటాయి.
- బ్యాంకు రేటు
- బహిరంగ మార్కెట్ చర్యలు
- నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)
- లోటు ద్రవ్య విధానం
- చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి
బ్యాంకు రేటు: వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటును, లేదా వాణిజ్య బ్యాం కులు డిస్కౌంట్ చేసిన బిల్లుల గడువును ఆర్బీఐ రీ-డిస్కౌంట్ చేసే రేటునే బ్యాంకు రేటు అంటారు. బ్యాంకు రేటునే రీ-డిస్కౌంట్ రేటు అని కూడా అంటారు. - దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుంది. ప్రతి దవ్యోల్బణ మాంద్య కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును తగ్గిస్తుంది.
- కఠిన ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుంది. సులభ ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ బ్యాంకు రేటును తగ్గిస్తుంది.
బహిరంగ మార్కెట్ చర్యలు: ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకర్‌గా, ఏజెంట్‌గా ప్రభుత్వ బాండ్లు (లేదా) సెక్యూరిటీలను ప్రజలకు, బ్యాంకులకు ఇతర ద్రవ్య సంస్థలకు అమ్మటాన్ని (లేదా) కొనటాన్ని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. - దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. (OMPS- Open Market Purchases of Securities)
- భారత్‌లో బిల్ మార్కెట్ అభివృద్ధి చెందనందున, బ్యాంకులకు అనేక పునర్విత్త సౌకర్యాలు ఉండటం వల్ల బ్యాంకు రేటు స్వతంత్ర పాత్ర తక్కువ.
- బహిరంగ మార్కెట్ చర్యల్లో నగదు ప్రత్యక్ష బదిలీలు జరుగుతాయి. అందువల్ల బ్యాంకురేటు కన్నా బహిరంగ మార్కెట్ చర్యలు సమర్థమైనవి.
నగదు నిల్వల నిష్పత్తి (CRR- Cash Reserve Ratio) - వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల నూతన డిపాజిట్లలో కొంత శాతం ఆర్బీఐ వద్ద నగదు రూపంలో ఉంచాలి. ఆ శాతాన్ని (లేదా) నిష్పత్తినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు.
- దీన్ని 1956లో ప్రవేశపెట్టారు. బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడటానికి, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించటానికి ప్రవేశపెట్టారు. ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ సీఆర్ఆర్ను 3 శాతం నుంచి 15 శాతం వరకు మార్చవచ్చు.
- దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సీఆర్ఆర్ను పెంచుతుంది. CRR నగదు CR MS D Price level
- ప్రతి ద్రవ్యోల్భణ మాంధ్య కాలంలో ఆర్బీఐ సీఆర్ఆర్ను తగ్గిస్తుంది. CRR నగదు CR MS D Price level
- బహిరంగ మార్కెట్ చర్యల ఫలితం ప్రజలు, బ్యాంకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది.
- CRR తప్పనిసరి కావడంతో వాణిజ్య బ్యాంకుల పరపతిపై CRR ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ చర్యల కన్నా CRR ప్రభావశీలమైంది. CRR > OMO > BR
లోటు ద్రవ్య విధానం - లోటు బడ్జెట్‌ను పూరించటానికి కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించటాన్నే లోటు ద్రవ్య విధానం అంటారు. దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ లోటు ద్రవ్యాన్ని తగ్గిస్తుంది. ప్రతి దవ్యోల్బణ మాంద్య కాలంలో ఆర్బీఐ లోటు ద్రవ్యాన్ని పెంచుతుంది.
చట్టబద్ధమైన ద్రవ్యత్వరాశి (SCR – Statutary Liquidity Ratio) - SCR ను 1962లో ప్రవేశపెట్టారు. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో చట్టబద్ధంగా కొంతశాతం ప్రభుత్వ సెక్యూరిటీలు ఇతర ద్రవ్యత్వ ఆస్తుల రూపంలో పెట్టుబడి పెట్టాలి. ఈ శాతాన్నే చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి అంటారు.
- SCR లో చేతిలో నగదు, ఇతర బ్యాంకుల వద్ద నగదు డిపాజిట్, ఆర్బీఐ వద్ద నగదు డిపాజిట్, బంగారం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉంటాయి. SCR ను ఆర్బీఐ 15-35 శాతం మధ్య మార్చవచ్చు.
- దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ SCR ను పెంచుతుంది. ప్రతి దవ్యోల్బణ/మాంద్య కాలంలో ఆర్బీఐ SCR తగ్గిస్తుంది. SCR ఒకవైపున బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడుతూనే మరోవైపు ప్రభుత్వానికి ద్రవ్య వనరులను సమకూరుస్తుంది.
- SCR పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనంగాను, అంతకన్నా ప్రధానంగా గుణాత్మక పరపతి నియంత్రణ సాధనంగాను పని చేస్తుంది.
రెపోరేటు/రివర్స్ రెపోరేటు
- బహిరంగ మార్కెట్ చర్యల్లో భాగంగా ఆర్థిక సంస్కరణల కాలంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన పరపతి నియంత్రణ సాధనాలే రెపో రేటు/రివర్స్ రెపోరేటు
- Repo Rate:- Rate of Repurchase/ Repurchase Option Rate
- రెపోరేటును 1992 డిసెంబర్ 10 నుంచి ప్రవేశపెట్టారు.
- వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటునే రెపోరేటు అంటారు.
- వాణిజ్య బ్యాంకులకు నగదు కొరతగా ఉన్నప్పుడు బ్యాంకుల వద్ద గల గడువు తీరని తక్కువ వ్యవధి గల (గరిష్ఠంగా 14 రోజులు) ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ పునఃకొనుగోలు (Re Purchase) చేయడం ద్వారా సహాయం చేస్తుంది. ఇలాంటప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలపై బ్యాంకులకు వచ్చే వడ్డీలో ఆర్బీఐ ఏ రేటు తీసుకుంటుందో దాన్నే రెపోరేటు అంటారు.
- వాణిజ్య బ్యాంకుల వద్దగల ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ పునఃకొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటునే రెపోరేటు అంటారు. రెపోరేటు పెరిగితే బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలు తగ్గుతాయి. అందువల్ల బ్యాంకుల వద్ద నగదు తగ్గుతుంది. దీంతో బ్యాంకుల వద్ద నగదు తగ్గుతుంది. బ్యాంకులు ఇచ్చే పరపతి తగ్గుతుంది.
- ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రెపోరేటును పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్భణ కాలంలో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తుంది.
- 2016 అక్టోబర్ 4న ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య విధానంలో…
రెపోరేటు- 6.25 % (6.50 నుంచి తగ్గింది)
రివర్స్ రెపోరేటు- 5.75 % (6.00 నుంచి తగ్గింది)
బ్యాంకు రేటు- 6.75 %
CRR – 4.00 % (2013 ఫిబ్రవరి 9 నుంచి మార్పు లేదు)
SCR- 20.75 % (2016 అక్టోబర్ 1 నుంచి 21 % తగ్గింది)
MSF – 6.75 % - ఒక బ్యాంకు తన వద్ద గల మొత్తం డిపాజిట్లలో 1 శాతం వరకు రుణం పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని ‘MSF’ అంటారు. 2012 ఏప్రిల్ నుంచి 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. ఈ రుణంపై వసూలు చేసే వడ్డీ రేటునే ‘MSF’ రేటు అంటారు.
2. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు
- గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అందించే పరపతి ప్రవాహ దిశను ప్రభావితం చేసి వనరులను అభిలషణీయ రంగాలవైపు మరలించవచ్చు.
- దేశ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతి సౌకర్యాలు కల్పించి హానికరమైన రంగాలకు పరపతిని తగ్గించేందుకు ఉపయోగించే సాధనాలే ఎంపిక చేసిన పరపతి నియంత్రణ సాధనాలు.
చట్టబద్ధమైన ద్రవ్యత్వరాశి (SCR) - మార్జిన్లను నిర్ణయించుట (Fixing of Margins)
- విచక్షణాత్మక వడ్డీరేటు (Discriminatory Interest Rate)
- వినియోగదారుల పరపతి నియంత్రణ (Controlling of Consumers Credit)
- ఉత్తర్వుల ద్వారా పరపతి నియంత్రణ (Credit Control Through Directives)
- నైతికోద్బోధ (Moral Suasion)
- పరపతి రేషనింగ్ (Credit Rationing)
- ప్రత్యక్ష చర్య (Direct Action)
మార్జిన్లను నిర్ణయించుట: బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు హామీగా ఉంచుకునే వస్తువు విలువకు, బ్యాంకు ఇచ్చే రుణానికి మధ్యగల వ్యత్యాసాన్ని మార్జిన్ అంటారు. ఏ వస్తువుకు ఎంత మార్జిన్ ఉండాలో ఆర్బీఐ నిర్ణయిస్తుంది. - బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించటానికి అంచనా వ్యాపారాన్ని అరికట్టడానికి, కొరత గల వస్తువులు, నిత్యావసర వస్తువులు, కీలక వస్తువుల ధరలను నియంత్రించటానికి ఆర్బీఐకి ఈ సాధనం బాగా ఉపయోగపడుతుంది.
- దవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ మార్జిన్లను పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్భణం/ మాంద్య కాలంలో ఆర్బీఐ మార్జిన్లను తగ్గిస్తుంది.
విచక్షణాత్మక వడ్డీరేటు: విచక్షణాత్మక వడ్డీరేటును 1975 నవంబర్ 1 నుంచి ప్రవేశపెట్టారు. సన్నకారు రైతులు, కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, చిల్లర వర్తకులు, చేతి వృత్తులవారు, వికలాంగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి పథకాలు మొదలగు రంగాలకు ఇచ్చే రుణాలపై ఇతర రుణాలతో పోల్చితే తక్కువ వడ్డీరేటు ఉండటాన్ని విచక్షణాత్మక వడ్డీరేటు అంటారు. దవ్యోల్బణ రహిత వృద్ధిని సాధించే రంగాలకు విచక్షణాత్మక వడ్డీరేటు వర్తిస్తుంది.
వినియోగదారుల పరపతి నియంత్రణ: విలాస వస్తువులు, విలువైన వస్తువులు, దీర్ఘకాలం మన్నిక గల వస్తువులు కొనుగోలు చేయటానికి వినియోగదారులు బ్యాంకుల వద్ద తీసుకునే రుణాల విషయంలో ముందుగా చెల్లించవలసిన డౌన్‌పేమెంట్ (ప్రాథమిక చెల్లింపు), వాయిదాల సంఖ్యను మార్చటం ద్వారా ఆర్బీఐ వినియోగదారుల పరపతిని నియంత్రణ చేస్తుంది. - దవ్యోల్బణ కాలంలో ప్రాథమిక చెల్లింపును పెంచి, వాయిదాల సంఖ్యను తగ్గిస్తుంది. ప్రతి దవ్యోల్బణ/మాంద్య కాలంలో ప్రాథమిక చెల్లింపును తగ్గించి, వాయిదాల సంఖ్యను పెంచుతుంది. తద్వారా కొనుగోళ్లను, పరపతిని ప్రోత్సహిస్తుంది.
ఉత్తర్వుల ద్వారా పరపతి నియంత్రణ: దేశ శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇబ్బందికరమైన రుణాలను మంజూరు చేయవద్దని, ఒక బ్యాంకుకు కాని, కొన్ని బ్యాంకులు కాని ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఆర్బీఐ పరపతి నియంత్రణ చేస్తుంది.
నైతికోద్బోధ: రుణ వితరణ అధికంగా చేసే బ్యాంకు డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆర్బీఐ నైతికోద్బోధ చేస్తుంది. 1949 నుంచి నైతికోద్బోధను ప్రవేశపెట్టినప్పటికీ 1969 బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇది సత్ఫలితాలు ఇస్తుంది. నైతికోద్బోధ ఫలితం బ్యాంకులకు ఆర్బీఐపై ఉండే గౌరవంపై ఆధారపడి ఉంటుంది.
పరపతి రేషనింగ్: బ్యాంకులిచ్చే రుణాలకు ఒక గరిష్ఠ హద్దును నిర్ణయించటమే పరపతి రేషనింగ్.
ప్రత్యక్ష చర్య: ఇతర చర్యలు సత్ఫలితాలను ఇవ్వనప్పుడు తుదిచర్యగా ఆర్బీఐ ప్రత్యక్ష చర్యను తీసుకుంటుంది. భారత్‌లో ఇప్పటివరకు ఎక్కువ సార్లు ఉపయోగించబడిన సాధనం ప్రత్యక్ష చర్య కావడం విశేషం.
ప్రత్యక్ష చర్యలో భాగంగా ఆర్బీఐ….. - వాణిజ్య బ్యాంకులకు రుణాన్ని నిరాకరించటం
- రీ-డిస్కౌంట్లను నిరాకరించటం
- అదనపు బ్రాంచిలకు అనుమతించకపోవటం
- బ్యాంకు నిర్వహణలో మార్పు తేవడం
- ఒక బ్యాంకును మరో బ్యాంకులో విలీనం చేయటం
- బ్యాంకు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి మూసివేయటం చేయవచ్చు.
- 1993 సెప్టెంబర్ 4న ‘హర్షద్ మెహతా’ స్టాక్ మార్కెట్ కుంభకోణం కారణంగా న్యూ బ్యాంకు ఆఫ్ ఇండియా ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు.
వెంకట్
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు