Job Notifications | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. నేడే చివరితేదీ
నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. టీఎస్ఎస్పీడీసీఎల్లో 48 అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు
TSSPDCL టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత, అసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 48
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)
అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.320 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్
చివరితేదీ : మార్చి 15
వెబ్సైట్ : TSSPDCL
2.CCS NIAM: ఎన్ఐఏఎం, జైపుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ప్రొఫెసర్ (మార్కెటింగ్ మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్ (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్) తదితర పోస్టుల భర్తీకి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపుర్ కేంద్రంగా నిర్వహిస్తున్న చౌధరీ చరణ్‌సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఎన్ఐఏఎం) ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: ప్రొఫెసర్ (మార్కెటింగ్ మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్ (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్)
అసిస్టెంట్ ప్రొఫెసర్(అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్) తదితరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 08
అర్హతలు: ఎంబీఏ, పీజీడీఎం-ఏబీఎం, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయస్సు : 68 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15
3. IPR: ఐపీఆర్-గాంధీనగర్‌లో 51 సైంటిఫిక్ అసిస్టెంట్లు
Institute for Plasma Research | సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాంధీనగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 51
పోస్టులు : సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏండ్లు ఉండాలి.
జీతం : నెలకు రూ.35400
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: మార్చి 15
4.HAL Recruitment | హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఖాళీలు
hindustan aeronautics limited | సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ / అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 6
పోస్టులు : సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ / అసిస్టెంట్ ఆఫీసర్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 15
వెబ్సైట్: www.hal-india.co.in
5.IIAC Recruitment | ఐఐఏసీలో 9 ఖాళీలు
india international arbitration centre | రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఐఏసీ) కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 9
పోస్టులు : రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. 2-16 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా (India International Arbitration Centre, Plot No. 6, Vasant Kunj Institutional Area, New Delhi-110070.)
చివరితేదీ : మార్చి 15
వెబ్సైట్ : www.indiaiac.org
6.IIP: ఐఐపీలో నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) ప్రకటన విడుదల చేసింది.
1.నాన్ టెక్నికల్ స్టాఫ్ ఖాళీలు.
పోస్టులు: లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్, యంగ్ ప్రొఫెషనల్, లైబ్రరీ అసిస్టెంట్, రిసెర్చ్ అసోసియేట్, గార్డెనర్, సెక్యూరిటీ గార్డ్ తదితరాలు.
అర్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ బీడిజైన్/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మార్చి 15
7.UOH Recruitment | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కన్సల్టెంట్ పోస్టులు
University of Hyderabad | కన్సాలిడేటెడ్ ఫీజు ప్రాతిపదికన ఇంటర్నల్ ఆడిట్ కార్యాలయంలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు: 02
పోస్టుల వివరాలు:
కన్సల్టెంట్: 02 పోస్టులు
అర్హతలు : ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40 వేలు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (దరఖాస్తులను డిప్యూటీ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూవోహెచ్, హైదరాబాద్) చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: మార్చి 15
వెబ్సైట్: https://uohyd.ac.in/
8.SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 05
పోస్టులు : మేనేజర్(రిటైల్ ప్రొడక్ట్స్): 05 పోస్టులు
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 28 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి.
పని ప్రదేశం: ముంబయి
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్ కమ్-ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మార్చి 15
9.CPPRI Recruitment | ఉత్తర్‌ప్రదేశ్ సీపీపీఆర్ఐలో 34 పోస్టులు
Central Pulp & Paper Research Institute | కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ స్టాఫ్, నాన్ సైంటిఫిక్ స్టాఫ్ తదితర పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సెంట్రల్ పల్ఫ్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPPRI) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ, డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, టెస్ట్ ఇంటర్వ్యూ, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు: కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ స్టాఫ్, నాన్ సైంటిఫిక్ స్టాఫ్ తదితర పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ, డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 50 ఏండ్లు మించకుడదు
జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.42000 వరకు
ఎంపిక: స్క్రీనింగ్, టెస్ట్, ఇంటర్వ్యూ, రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 15
అడ్రస్ : డైరెక్టర్, సీపీపీఆర్‌ఐ, హిమ్మత్‌నగర్, పేపర్‌మిల్ రోడ్, సహరన్పూర్-247001 ఉత్తర్‌ప్రదేశ్.
చివరి తేది: ప్రకటన విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
10.TEACHERS: కళాక్షేత్ర ఫౌండేషన్-చెన్నైలో 09 పోస్టులు
పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 09
పోస్టులు: పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ/ బీఈడీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: 2-3 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.19000-రూ.34000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Director, Kalakshetra Foundation, Thiruvanmiyur, Chennai-600041.
చివరి తేది: మార్చి 31
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?