Indian Polity | రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌ను సంరక్షించిన చట్టాలుగా పేర్కొంటారు?
164. మత స్వాతంత్య్రపు హక్కుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 25 భారతీయులు తమ అంతరాత్మకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు
బి) ఆర్టికల్ 26- మతాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మతధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు
సి) ఆర్టికల్ 27 మతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయవచ్చు
డి) ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాసంస్థల్లో మత బోధన నిషేధం
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
165. హిందూ మతంలో అంతర్భాగంగా సిక్కులు, జైనులు బౌద్ధులను పేర్కొనవచ్చునని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 25(1)(ఎ)
2) ఆర్టికల్ 25(2)(ఎ)
3) ఆర్టికల్ 25(2)(బి)
4) ఆర్టికల్ 25(3)(ఎ)
166. మనదేశంలో బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం చేసిన తొలిరాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర (1961)
2) తమిళనాడు (1959)
3) ఉత్తరప్రదేశ్ (1963)
4) ఒడిశా (1967)
167. విద్య, సాంస్కృతిక హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 29- అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు.
బి) ఆర్టికల్ 30 అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు
సి) మనదేశంలో చట్టబద్ధంగా మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల విభజన ఉన్నది
డి) భారత రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాల (Minorities)కి సంబంధించి నిర్వచనం ఉంది?
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
168. కింద పేర్కొన్న వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్థారించేందుకు దేశాన్ని యూనిట్‌గా తీసుకున్నారు
బి) భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్ధారించేందుకు దేశాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు.
సి) ప్రజాప్రయోజనాల రీత్యా మతపరమైన వ్యవహారాలపై ప్రభుత్వం హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు
డి) మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలులేదు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
169. మైనారిటీ విద్యా సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే సందర్భం, జోక్యం చేసుకోకూడని సందర్భాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పును వెలువరించింది?
1) బల్లర్షా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
2) ఎస్.పి. మిట్టల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) సూరత్ రెహ్మాన్ బర్మతి Vs స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు
4) టీఎంఏ పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
170. తమకు నచ్చిన భాషలో విద్యను అభ్యసించే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) దయానంద్ ఆంగ్లోవేదిక్ కళాశాలVs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
2) ప్రమతి ఎడ్యుకేషనల్ సొసైటీ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
3) 1, 2
4) పి.ఎ. ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
171. టీఎంఏ పాయ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో మైనారిటీ విద్యా సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే ఏ సందర్భాన్ని సుప్రీం కోర్టు పేర్కొంటుంది.
ఎ) ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహణ సందర్భం
బి) విద్యా ప్రమాణాలను సంరక్షించే సందర్భం
సి) ప్రభుత్వం జారీచేసే నియమనిబంధనలను ఉల్లంఘించిన సందర్భం
డి) విద్యాసంస్థ నిర్వహణలో అక్రమాలు జరిగిన సందర్భం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
172. మైనారిటీ స్థాయిని నిర్ధారించేందుకు భారతదేశం అంతటినీ కాకుండా రాష్ట్ర జనాభాను యూనిట్‌గా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
1) టీఎంఏ పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
2) సెయింట్ జేవియర్ కాలేజీ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు
3) పి.ఏ. ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
4) 2, 3
173. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌ను సంరక్షించినచట్టాలుగా (Saving if certain Laws) పేర్కొంటారు?
1) ఆర్టికల్స్ 30(ఎ), 30(బి), 30(సి)
2) ఆర్టికల్స్ 31(ఎ), 31(బి), 31(సి)
3) ఆర్టికల్స్32(ఎ), 32(బి), 33(సి)
4) ఆర్టికల్స్ 29(ఎ), 29(బి), 29(సి)
174. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రారంభ రాజ్యాంగంలో ఆర్టికల్ 31లో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించారు
బి) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మొరార్జీదేశాయ్ ప్రభుత్వం తొలగించింది
సి) 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్స్ 31(ఎ), 31(బి) చేర్చబడినది
డి) 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31(సి) చేర్చారు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
175. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు
బి) రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300(ఎ) నందు ఆస్తిహక్కును సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు
సి) ఆర్టికల్ 31(ఎ)ను కేశవానందభారతి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది
డి) ఆర్టికల్ 31(సి)ను 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971ద్వారా రాజ్యాంగానికి చేర్చారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
176. ఆర్టికల్ 31(సి) లోని మొదటి అంశాన్ని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా సమర్థించింది?
1) గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
2) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
3) జగ్జీత్సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) పీఏ ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
177. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి), 39(సి) లకు మాత్రమే ప్రాథమిక హక్కులపై ఆధిపత్యం ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది.
1) మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) సజ్జన్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
3) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
4) ఎస్ఆర్ బొమ్మై Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
178. ఆర్టికల్ 31(సి)లోని మొదటి అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విస్తృత పరిచారు?
ఎ) 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
బి) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
179. చట్టబద్ధమైన హక్కుగా మారిన తర్వాత ఆస్తిహక్కును కింది విధంగా పరిగణించవచ్చును?
ఎ) పార్లమెంటు సాధారణ శాసనం ద్వారా మార్పులు చేర్పులకు గురిచేయవచ్చు
బి) కార్యనిర్వాహక చర్యల నుంచి ప్రైవేట్ ఆస్తిని కాపాడవచ్చు
సి) శాసనపరమైన చర్యల నుంచి ప్రైవేట్ ఆస్తిని కాపాడవచ్చు
డి) ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలులేదు
1) 1, 2, 3 2) 1, 2, 4
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
180. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే హక్కుగా పేరొందినది
బి) భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు
సి) ఆర్టికల్ 32లో వివరణ గలదు
డి) రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని పార్లమెంటు పూర్తిగా తొలగించదు
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
181. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 32(1) – హక్కులను కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు
బి) ఆర్టికల్ 32(2) – ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తుంది
సి) ఆర్టికల్ 32(3) – సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారాలకు భంగం కలుగకుండా రిట్స్ జారీచేసే అధికారాన్ని ఇతర న్యాయస్థానాలకు కల్పిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది
డి) ఆర్టికల్ 32(4) – రాజ్యాంగం సూచించిన పద్ధతిలో తప్ప మరే విధంగాను రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్ చేయరాదు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
182. జాతీయ అత్యవసర పరిస్థితి(National Emergency) కాలంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్ 32ను సస్పెండ్ చేయగలడు?
1) ఆర్టికల్ 353 2) ఆర్టికల్ 355
3) ఆర్టికల్ 357 4) ఆర్టికల్ 359
183. రిట్స్(writs)కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) న్యాయస్థానం జారీచేసే తప్పనిసరిగా పాటించాల్సిన అత్యున్నత ఆదేశం
బి) ఇంగ్లండ్‌లో రిట్స్‌ను ‘Preorogative’ అభివర్ణిస్తారు.
సి) Preorogative అంటే అసాధారణ ప్రత్యామ్నాయాలు
డి) ప్రస్తుతం ఇంగ్లండ్ రాజు/ రాణి హక్కుల రక్షణకు రిట్స్ జారీచేస్తున్నారు?
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
184. మనదేశంలో రాజ్యంగం అమల్లోకి రాకముందు రిట్స్‌ను ఏ హైకోర్టులు జారీ చేసేవి?
1) కలకత్తా, మద్రాస్,
అలహాబాద్ హైకోర్టులు
2) కలకత్తా, మద్రాస్, బాంబే హైకోర్టులు
3) ఢిల్లీ, బాంబే, కలకత్తా హైకోర్టులు
4) బాంబే, అలహాబాద్, కలకత్తా హైకోర్టులు
185. హెబియస్ కార్పస్ (Habeas Corpus) రిట్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఉదారమైన రిట్‌గా పేరొందింది.
బి) అతిపురాతన రిట్‌గా పేరొందింది.
సి) వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా పేరొందింది.
డి) హెబియస్ కార్పస్ అనేది గ్రీకుభాష నుండి ఆవిర్భవించింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
186. నీవు నిర్భంధించిన వ్యక్తిని మొత్తం శరీరంతోసహా నాముందు హాజరు పరచు అని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్ ఏది?
1) మాండమస్ (Mandamus)
3) ప్రొహిబిషన్ (Prohibition)
4) సెర్షియోరరి (Certiorari))
4) హెబియస్ కార్పస్ (Habeas Corpus)
187. హెబియస్ కార్పస్(Habeas Corpus)కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా? కాదా? అని న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి
బి) హెబియస్ కార్పస్ అనే పదం ‘లాటిన్భాష’ నుంచి ఆవిర్భవించింది
సి) ఈ రిట్‌ను గవర్నర్స్‌కు వ్యతిరేకంగా జారీచేయవచ్చును.
డి) ఈరిట్ను ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులపై కూడా జారీ చేయవచ్చును
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
188. హెబియస్ కార్పస్ రిట్‌ను కింద పేర్కొన్న ఏ సందర్భంలో జారీ చేయడానికి అవకాశం లేదు?
ఎ) చట్టబద్ధత గల నిర్బంధం విషయంలో
బి) శాసనలేదా కోర్టు ధిక్కరణ విషయంలో
సి) న్యాయస్థానం ఆజ్ఞమేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో
డి) న్యాయస్థానం అధికార పరిధిలో లేని నిర్బంధం విషయంలో
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4 ) ఎ, బి, సి, డి
189. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించడానికి ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ ఏది?
1) హెబియస్ కార్పస్ (Habeas Corpus)
2) మాండమస్ (Mandamus)
3) కో వారెంటో (Quo warranto)
4 ) సెర్షియోరరి (Certiorari))
190. మాండమస్ (Mandamus) రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఈ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నయంగా మాత్రమే జారీ చేస్తారు
బి) ఈ రిట్‌ను జారీ చేయడం అనేది న్యాయస్థానాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది
సి) ఈ రిట్‌ను కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా జారీ చేయరాదు
డి) అధికారి విచక్షణాపూర్వకమైన విధులకు ఈ రిట్ వర్తించదు
1) ఎ, బి, డి
2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి
4) బి, సి, డి
191. మాండమస్ రిట్ (Mandamus)ను కింద పేర్కొన్న ఎవరిపై జారీచేసే అవకాశం ఉన్నది?
1) ప్రైవేట్ వ్యక్తులు
2) రాష్ట్రపతి, గవర్నర్లు
3) డిపార్ట్మెంట్ సూచనలు
4) ట్రిబ్యునల్స్
కె.శ్రీనివాసరావు
పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు