Current Affairs March 08 | అంతర్జాతీయం
డిజిటల్ అసెట్స్ ఒయాసిస్
రస్ అల్ ఖైమా (ఆర్ఏకే) ప్రభుత్వం ‘ఆర్ఏకే డిజిటల్ అసెట్స్ ఒయాసిస్’ను ఫిబ్రవరి 27న ప్రారంభించింది. ఇది డిజిటల్, వర్చువల్ అసెట్ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొదటి ఫ్రీ జోన్ వ్యవస్థ. మెటావర్స్, బ్లాక్‌చెయిన్, యుటిలిటీ టోకెన్, వర్చువల్ వాలెట్, ఎన్ఎఫ్టీ, డీఏవో, డీఈపీపీలతో సహా భవిష్యత్తులో కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణలు చేసే డిజిటల్, వర్చువల్ అసెట్స్ సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే ఏర్పాటు చేసిన ఫ్రీజోన్ ఇది. మెరుగైన భవిష్యత్తును సృష్టించే వెబ్3 మైండ్లను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్ఏకే డిజిటల్ అసెట్స్ ఒయాసిస్ సీఈవో డా. సమీర్ అల్ అన్సారీ పేర్కొన్నారు.
వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే
వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని మార్చి 3న నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న జాతుల వృక్షజాలం, జంతుజాలం గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాలంపై కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండార్జ్డ్ స్పైసీస్ (సీఐటీఈఎస్) 1973, మార్చి 3న నిర్వహించారు. ఈ సీఐటీఈఎస్ థాయిలాండ్‌లో 2013లో సమావేశమై మార్చి 3న వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ దినోత్సవాన్ని మొదటిసారి 2014లో నిర్వహించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?