Telangana History | తెలుగు సాహిత్య పోషకులు.. అద్భుత కట్టడాలకు ఆద్యులు
కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించినవాడు సుల్తాన్ కులీ కుతుబ్‌షా. దీని రాజధాని గోల్కొండ లేదా మహమ్మద్ నగర్. వీరి భాష పారశీకం. వీరిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్పవాడు. చివరి రాజు అబుల్ హసన్ తానీషా. యావత్ తెలుగు ప్రజలను మొదటగా శాతవాహనులు సమైక్యపరిచారు. రెండోసారి కాకతీయులు, మూడోసారి కుతుబ్ షాహీలు సమైక్యపరిచారు. ఈ కుతుబ్‌షాహీలు దక్షిణ ఇరాన్‌లోని షియా వంశానికి చెందినవారు.
కుతుబ్ షాహీలు (గోల్కొండ సుల్తాన్లు) – 1512 – 1687
- షియా వంశంలో రెండు తెగలు కలవు. అవి:
1. ఆకునేల్ (తెల్లమేక జాతివారు)
2. కారకునేల్ (నల్లమేక జాతివారు) - కారకునేల్ తెగవారు ఆకునేల్ తెగ చేతిలో ఓడి అధికారం కోసం దేశంలోని బహమని సామ్రాజ్యానికి (1347-1512) వచ్చారు.
సుల్తాన్ కులీ కుతుబ్ షా - ఇతని తండ్రి పేరు షేర్కులీ. ఇతడు కుతుబ్‌షాహీ రాజ్య స్థాపకుడు. ఇతనికి కుతుబ్-ఉల్-ముల్క్, ఖావాస్కన్ (ఖావాస్ఖాన్), బడేల్ మాలిక్ (దొడ్డ ప్రభువు), అమర్-ఉల్-ఉమ్రా అనే బిరుదులు కలవు. ఇతని రాజవంశాన్ని ‘హందవ’ అంటారు. దక్షిణ ఇరాన్ నుంచి భారతదేశంలోని బహమని సామ్రాజ్యంలోని 3వ మహమ్మద్ ఆస్థానంలో అంగరక్షకుడిగా చేరాడు. అంచలంచెలుగా ఎదుగుతూ 1496లో గోల్కొండ సామ్రాజ్యంలో ధరామ్దారుడు (సైన్యాధిపతి) అయ్యాడు. 1493లో బహద్దూర్ జిలానిని సుల్తాన్ కులీ కుతుబ్‌షా ఓడించి 3వ మహమ్మద్ నుంచి కుతుబ్-ఉల్-ముల్క్ అనే బిరుదు పొందాడు. 1504లో సీతయ్య చేతిలో ఓడిపోయి వరంగల్‌ను కోల్పోయాడు. తిరిగి రాజైన తర్వాత 1512లో గోదావరి యుద్ధంలో ఓడించి వరంగల్, పానగల్, కోయిలకొండ, ఖబ్బంమెట్ట, బెల్లంకొండ ప్రాంతాలను ఆక్రమించాడు.
- 1517 సంవత్సరంలో జరిగిన గోని యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయల చేతిలో పరాజయం పాలయ్యాడు. 1518లో మహమ్మద్ గవాన్ మరణించిన తర్వాత స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్‌షా సమకాలీన రాజులుగా బార్బర్, శ్రీకృష్ణదేవరాయలు, హుమాయున్ ఉన్నారు. మహమ్మద్గవాన్ 3వ మహమ్మద్ ప్రధాని అయ్యాడు. ఇతడు గోల్కొండ కోట వద్ద రెండు మినార్లతో జామా మసీదును ప్రారంభించాడు. దీన్ని ఇబ్రహీం కులీకుతుబ్ షా పూర్తి చేశాడు. ఈ మసీదు ఆధారంగానే చార్మినార్ నిర్మించారు. ఇతని విజయానికి హైదర్‌ఖాన్, మురారిరావు సేనలు సహకరించాయి. మురారిరావు అహోబిలంలోని నరసింహస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి బంగారం, వెండి దోచుకొని వెళ్లాడు.
- 90 ఏళ్ల వయస్సు కలిగిన సుల్తాన్ కులీ కుతుబ్ షాను మీర్ మహమ్మద్ హదానీతో కలిసి జంషద్ హత్య చేశాడు. కుతుబ్‌షాహీ రాజులందరిలో ఇతడు విశిష్ట సంపన్నుడని, విదేశీకారుడు, చరిత్రకారుడు షేర్వాని అన్నారు.
జంషీద్ కులీ కుతుబ్‌షా
- ఇతడు పితృ హంతకుడు.
- ఇతడు సమర్థుడు. కాని పరమక్రూరుడు అని తెలిపిన చరిత్రకారుడు ‘పెరిస్టా’. చిన్న చిన్న నేరాలకు కూడా కఠినమైన మరణ శిక్షలు విధిస్తాడని తెలిపాడు.
- జంషీద్ సోదరుడు ఇబ్రహిం కులీ కుతుబ్‌షా దేవరకొండ గవర్నర్‌గా (లేదా) దుర్గాధిపతిగా పని చేస్తుండేవాడు.
- ఇబ్రహిం కులీ కుతుబ్‌షా జంషీద్‌పై దాడి చేయగా జంషీద్ తిప్పికొట్టాడు. అప్పుడు ఇబ్రహీం విజయనగర రాజైన అలియరామరాయల వద్ద 7 సంవత్సరాలు విజయనగరంలో ఆశ్రయం పొందాడు. కౌలాస్ యుద్ధంలో బదీర్ మాలిక్‌ను ఓడించాడు. 1550లో క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు.
- జంషీద్ భార్య- బిల్కాస్ జమాన్. కుమారుడు సుభాన్.
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
- జంషీద్ మరణించిన వెంటనే సుభాన్‌ను బల్కస్ జమాన్ సింహాసనం పై కూర్చుండబెట్టి పరిపాలించేవాడు. కాని ఇబ్రహీం విజయనగర రాజుల సాయంతో సుభాన్‌ను చంపాడు.
- గోల్కొండ సుల్తాన్లలో అందరికంటే ఇతడు విశిష్టమైన వ్యక్తి. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను, తెలుగుదనాన్ని పోషించాడు. అందువల్ల ఇతన్ని తెలుగు ప్రజలు ‘ముల్కీభరాముడు’ అన్నారు.
- ఇతడు పోషించిన తెలుగు కవులు- 1. కందుకూరి రుద్రకవి, 2. అద్దంకి గంగాధరుడు, 3. పొన్నగంటి తెలగనాచార్యుడు.
- కందుకూరి రుద్రకవి: సుగ్రీవ విజయం (తొలి యక్షగానం), నిరంకుశోపాఖ్యానం గ్రంథాలు రాశాడు. ఇబ్రహీంను శివుడితో పోల్చాడు. దీంతో ఇబ్రహీం రుద్రకవికి రెంటచింతల ఆగ్రహారాన్ని ఇచ్చాడు.
- అద్దంకి గంగాధరుడు: తపథి సవర్ణోపాక్యం అనే గ్రంథం రాశాడు.
- పొన్నగంటి తెలగనాచార్యుడు: యాయతి చరిత్ర (తెలుగులో అచ్చు వేసిన మొదటి గ్రంథం) అనే గ్రంథం రాశాడు.
ఇబ్రహీం కట్టించిన కట్టడాలు - ఇబ్రహింపట్నం, ఇబ్రహీం చెరువు, ఇబ్రహీంబాద్, పురాణాపూల్ (మూసీనదిపై మొదటి వంతెన), గోల్కొండ చుట్టూ ప్రాకారం, బూల్బాగ్ మొదలైనవి.
- 1562లో ఇతని మేనల్లుడు హుస్సేన్శావలి హుస్సేన్‌సాగర్‌ను కట్టించాడు.
- ఇతడిని ఆదుకొన్న అలియరామరాయుడిని 1565లో తల్లికోట యుద్ధం/రాక్షసతంగడి యుద్ధంలో చంపేశాడు. ఈ యుద్ధంలో ఇబ్రహిం విజయానికి కారణమైనవి- తోప్ ఫిరంగులు
- పిరంగులను భారతీయులకు పరిచయం చేసినది- బాబర్, బార్బర్
మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- మొదటి దేవరాయలకు, బహమనీ రాజులకు మధ్య జరిగిన తల్లికోట యుద్ధంలో మొదటిసారి ఫిరంగులను వాడారు.
- మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఇబ్రహీం కులీ కుతుబ్‌షా మూడో కుమారుడు. ఇతడు 14 సంవత్సరాలకే రాజు అయ్యాడు. కుతుబ్‌షాహీల్లో అందరికన్నా గొప్పవాడు.
- 13 సంవత్సరాలకు రాజు అయినవాడు – అక్బర్
- 12 ఏళ్లకు రాజు అయినవాడు – అబ్దుల్ కుతుబ్‌షా
- ఇతని కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అక్బర్, వెంకటపతిరాయుడు ఇతడికి సమకాలికులు.
- ఈ వంశస్థుల్లో మొత్తం ఆంధ్రదేశాన్ని పాలించిన ఏకైక రాజు మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- మొఘల్ చక్రవర్తి అక్బర్.. మహమ్మద్ కులీ కుతుబ్‌షా దగ్గరికి తన రాయాబారి అయిన మహ్మద్ బేగ్‌ను పంపాడు.
- 1593-94లో ప్లేగు వ్యాధిని నిర్మూలించి, దానికి చిహ్నంగా 1594లో చార్మినార్‌ను కట్టించాడు. టర్కీ, ఇరాన్, అరబిక్, భారతీయ శైలిలను చార్మినార్ నిర్మాణంలో ఉపయోగించారు. దీని ఎత్తు 58 మీటర్లు. కుతుబ్ మినార్ ఎత్తు 225 అడుగులు.
- ఇతడు ఉర్దూ భాషను పోషించాడు. అందుకే ఇతడిని ఉర్దూ భాష పితామహుడు అని అంటారు. గొప్ప పండితుడు. కలం పేరు మనీయత్.
- మహమ్మద్ కులీ కుతుబ్‌షా సంస్థానానికి డచ్చివారు, ఆంగ్లేయులు వచ్చి వ్యాపారం చేశారు. ఇందుకు ఇతడు అనుమతి ఇచ్చాడు.
సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- ఇతడు మహమ్మద్ కులీ కుతుబ్‌షా అల్లుడు. హైదరాబాద్‌కు సుల్తాన్పూర్ అని నామకరణం చేశాడు.
- భార్య పేరు హయత్బేగం. ఈమె విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
- ఇతడు తూనికలు, కొలతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. వీటిని పర్యవేక్షించడానికి మిమిన్ను నియమించాడు.
- మహమ్మద్ మిమిన్ తూనీకలు, కొలతలపై రాసిన గ్రంథం రిసాల మిక్థారియా.
- ఇతడు మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించగా దాన్ని ఔరంగజేబు పూర్తి చేశాడు. ట్రావెర్నియర్ అనే వజ్రాల వ్యాపారి ఈ మసీదును దర్శించి దాని గొప్పతనాన్ని తెలిపాడు. భారతదేశ కట్టడాల్లో మక్కా మసీదు గొప్పదని అన్నాడు. దీని నిర్మాణంలో 2000 రాళ్లు, 2000 తాపీ మేస్త్రీలు, 4000 మంది కూలీలు పాల్గొన్నట్లు తెలిపాడు.
- ఇతడి ఆస్థానానికి జహంగీర్ మీర్ మక్కి అనే రాయబారిని పంపాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా
- ఇతడు 12 సంవత్సరాలకే రాజు అయ్యాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హయత్బేగంల కుమారుడు. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. ఇతడు అత్యధిక కాలం
పాలించిన రాజు. - ఇతడి కాలంలోనే కుతుబ్‌షాహీల వంశం పతనం ప్రారంభమైంది. 1636లో షాజహాన్ గోల్కొండపై దాడి చేశాడు. ఈ దాడిలో అబ్దుల్లా కుతుబ్‌షాహీ ఓటమిపాలై షాజహాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
- షాజహాన్‌కు, అబ్దుల్లా కుతుబ్‌షాహీకి మధ్య శాంతి ఒప్పందం చేసిన వ్యక్తి – అబ్దుల్ లతీఫ్.
ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు:-
1. గోల్కొండ రాజ్యం మొఘలులకు సామంతరాజ్యంగా ఉండాలి.
2. ప్రతి సంవత్సరం 2 1/2 లక్షలు (కప్పం) మొఘలులకు చెల్లించాలి.
3. ప్రతి శుక్రవారం నమాజ్‌లో మొఘల్ బాద్షా పేరును ప్రస్తావించాలి. - అబ్దుల్లా కుతుబ్ షా కాలంలోనే కోహినూర్ వజ్రం దొరికిందని తెలిపిన ప్రెంచ్ వజ్రాల వ్యాపారి- ట్రావెర్నియర్. ఈ వజ్రం కృష్ణా జిల్లా కొల్లూరు వద్ద లభించింది. దీన్ని మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి షాజహాన్‌కు ఇచ్చాడు.
- రెండోసారి 1656లో షాజహాన్ అబ్దుల్లా కుతుబ్‌షాని ఓడించి గోల్కొండ రాజ్యంలో మొఘల్ నాణాలను చెలామణి చేయించాడు.
- 1636లో ఆంగ్లేయులు వ్యాపారం చేసుకోవడానికి అబ్దుల్లా కుతుబ్‌షా పూర్తి అధికారం ఇచ్చాడు.
అబుల్ హసన్‌కు తానిషా
- ఇతని సూఫీ మత గురువు- షారాజుకట్టాల్. అబుల్ హసన్‌కు తానిషా బోగి అనే బిరుదు ఇచ్చాడు. అబుల్ హసన్ తానిషా సింహాసనాన్ని అధిష్టించడానికి సహకరించిన వ్యక్తులు- తిక్కన్న, మాదన్న.
- మాదన్నకు సూర్యప్రకాశ్‌రావు అనే బిరుదు ఇచ్చి ప్రధానమంత్రిగా, తిక్కన్నను సైనికుడిగా నియమించుకున్నాడు.
- కంచర్ల గోపన్న అబుల్హసన్ కాలంలో పాల్వంచ అనే పరిగణనకు తహసీల్దార్‌గా పని చేసేవాడు. గోపన్న ఖజానాకు కట్టాల్సిన డబ్బును చెల్లించకుండా భద్రాచలంలో రాముని ఆలయాన్ని నిర్మించాడు. దీంతో అతడిని గోల్కొండలో బంధించారు.
- 1685లో ఔరంగజేబు కుమారుడు ‘షా అలం’ గోల్కొండ సైన్యాన్ని ఓడించి ఒక శాంతి ఒప్పందం చేసుకున్నాడు. తిక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుంచి తొలగించేలా చేశారు.
- 1686లో ఔరంగజేబు ‘బీజాపూర్’ను ఆక్రమించాడు. క్రీ.శ. 1686 మార్చి 24న తిక్కన్న, మాదన్నలను షేక్మీర్జుమ్లా, షేక్ మన్హాజ్ హత్య చేశారు. ఔరంగజేబు 1687 ఫిబ్రవరి నుంచి 6 నెలలు భీకర యుద్ధం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో గోల్కొండ సేనలో ఒక్కడైన అబ్దుల్లా పానీని ఔరంగజేబు లంచం ఇచ్చి కొన్నాడు. అబ్దుల్లా పాని గోల్కొండ ద్వారం తెరిచాడు. మొఘలుల సైన్యం గోల్కొండ కోటలోకి ప్రవేశించి రాజును చంపివేశారు.
- కాని గోల్కొండ సేనాని అయిన అబ్దుల్ రజాక్ రాహౌరి విరోచితంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 1687 అక్టోబర్ 3న గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది.
కుతుబ్‌షాహీల పరిపాలన
- కుతుబ్‌షాహీలు తమ రాజ్యాన్ని రాష్ర్టాలుగా, రాష్ర్టాలను జిల్లాలుగా (సర్కారులుగా), సర్కారులను పరగణాలుగా (తాలుకా)గాను విభజించారు.
- రాజ్యానికి అధిపతి రాజు. రాజు తర్వాత రాజ్యంలో అత్యున్నత అధికారి- పీశ్వా (ప్రధానమంత్రి).
- గుప్తుల కాలంలో 9 మంది కవులు ఉండేవారు. వీరిని ‘నవరత్నాలు’ అంటారు.
- మీర్ జుమ్లా- ఆర్థిక మంత్రి
- హైల్ముల్క్- యుద్ధమంత్రి
- నాజీత్- పర్యవేక్షణ మంత్రి
- దాటీర్- ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించే వ్యక్తి
- కొత్వాల్- పోలీస్‌శాఖ మంత్రి
- ఔల్దార్- ఆడిటింగ్ మంత్రి
- షాబాద్- రేవులకు ముఖ్య అధికారి
- రాయబారులు- రాజు సందేశాలను యువరాజులకు పంపేవారు
- వీరి పాలనలో చివరి భాగం గ్రామం. గ్రామాల పరిపాలన నిర్వహించే సభలను గ్రామ సభలు అంటారు. కుతుబ్‌షాహీల కాలంలో గ్రామస్థాయిలో 12 మంది ‘ఆయగార్లు’ ఉండేవారు.
ఉదా: కర్ణం, మంగలి, చాకలి, కుమ్మరి, పూజారి మొదలైనవారు.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
Hindustan Shipyard | హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు