Current Affairs March 01 | అంతర్జాతీయం
అంతర్జాతీయం
డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్స్
నేషనల్ జియోగ్రాఫిక్ ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ ఫొటో కంటెస్ట్ వివరాలను ఫిబ్రవరి 19న వెల్లడించింది. దీనిలో డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్స్ ఫొటో పిక్చర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యింది. ఈ ఫొటోను శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కార్తీక్ సుబ్రమణియన్ తీశారు. ఈ ఫొటోను అలస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ ప్రిజర్వ్లో తీశారు. దీనికి ‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్స్’ అని పేరు పెట్టారు. ఈ పోటీకి దాదాపు 5,000 ఫొటోలు వచ్చాయి.
చెత్త, బెస్ట్ డ్రైవర్ల జాబితా
ప్రపంచంలో అత్యంత చెత్త, బెస్ట్ డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాను ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ కంపేర్ ది మార్కెట్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. సుమారు 50 దేశాలపై పరిశోధనలు చేసి, ఈ జాబితాను రూపొందించింది. దీనిలో చెత్త డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో థాయిలాండ్ నిలువగా.. పెరూ 2, లెబనాన్ 3, భారత్ 4వ స్థానాల్లో నిలిచాయి. బెస్ట్ డ్రైవర్లు ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో జపాన్ ఉండగా.. నెదర్లాండ్స్ 2, నార్వే 3, ఎస్తోనియా 4, స్వీడన్ 5వ స్థానాల్లో ఉన్నాయి.
రష్యా
అమెరికా-రష్యా అణు ఒప్పందం ‘న్యూ స్టార్ట్ ట్రీటీ’ నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా ఓడిపోవడమే లక్ష్యమని అమెరికా, నాటో దళాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయన్నారు. అవి ఇలానే వ్యవహరిస్తే అణ్వాయుధాల ప్రయోగాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్ ‘న్యూ స్టార్ట్ ట్రీటీ’ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఈ దేశాలు 1550 అణు వార్హెడ్లు, 700 క్షిపణులు, బాంబర్లకు మించి మోహరించవద్దని పరిమితి విధించుకున్నారు. ఈ ఒప్పందం 2021, ఫిబ్రవరిలో ముగియాల్సి ఉండగా ఐదేండ్ల పాటు పొడిగించాయి.
ఐడీఈఎక్స్
ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఐడీఈఎక్స్)-2023 అబుధాబిలో ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు నిర్వహించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. భూమి, ఆకాశం, సముద్ర భద్రతా రంగానికి సంబంధించి అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ సంస్థ రక్షణ, సైనిక దళాలకు అవసరమైన అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతలున్న కారకల్ ఇంటర్నేషనల్ సంస్థతో టెక్నాలజీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ కంపెనీ.. ఐకామ్ భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?