BSF Constable | బీఎస్ఎఫ్లో 1284 కానిస్టేబుల్ పోస్టులు
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు 18-25 ఏండ్ల వయస్సు ఉండి.. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎస్ క్యూఎఫ్ లెవల్-1 కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు 27న ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1284 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో 1220 పోస్టులు పురుషులకు, మహిళలకు 64 పోస్టులు కేటాయించారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 1284
పోస్టులు : బీఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్)
విభాగాలు: కోబ్లర్, టైలర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రిషన్, పంప్ ఆపరేటర్, డ్రాట్స్‌మ్యాన్, కుక్ , వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, బార్బర్, స్వీపర్, వెయిటర్, మాలి తదితర పోస్టులు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు.. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎస్క్యూఎఫ్ లెవల్-1 కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : 18-25 ఏండ్లు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏండ్లు వయసు సడలింపు)
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక.
- రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజునుంచి మినహాఇంపు ఇచ్చారు.
చివరితేదీ: మార్చి 27
వెబ్సైట్: https://rectt.bsf.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?