Polity | భారతదేశంలో పంచాయతీరాజ్‌తో సంబంధం ఉన్న కమిటీలు?
స్థానిక ప్రభుత్వాలు
1. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) విస్తరణ అధికారి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి)
2) మండల పరిషత్ అభివృద్ధి అధికారి
3) సర్పంచి
4) మండల పరిషత్ ప్రెసిడెంట్
2. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని సిఫారసు చేసిన కమిటీ?
1) బల్వంతరాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) నరసింహం కమిటీ
4) వెంగళరావు కమిటీ
3. జతపరచండి
ఎ. సామాజిక అభివృద్ధి పథకం 1. 1959 అక్టోబర్ 2
బి. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం 2. 1993 ఏప్రిల్ 24
సి. పంచాయతీరాజ్ వ్యవస్థ 3. 1952 అక్టోబర్ 2
డి. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ 4. 1953
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
4. కింది వాటిని జతపరచండి
ఎ. అధికరణ 243 (ఎ) 1. గ్రామసభ
బి. అధికరణ 243 (సి) 2. నిర్మాణం
సి. అధికరణ 243 (డి) 3. రిజర్వేషన్లు
డి. అధికరణ 243 (ఇ) 4. పదవీకాలం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
5. పెసా చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1) గిరిజన తెగల ప్రజలకు స్వయం పాలనాధికారం
2) గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలను, తగాదాల పరిష్కార పద్ధతులను కాపాడటం
3) గ్రామసభకు నిర్ణయాధికారం
4) పైవన్నీ
6. కింది కమిటీలను సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో రాయండి.
ఎ. దంత్వాలా కమిటీ
బి. ఎల్.ఎం సింఘ్వీ కమిటీ
సి. జి.వి.కె. రావు కమిటీ
డి. తుంగన్ కమిటీ
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, బి, డి
3) ఎ, డి, సి, బి 4) డి, సి, బి, ఎ
7. గ్రామ సర్పంచ్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
2) వార్డు మెంబర్లు కలిసి ఎన్నుకుంటారు
3) కలెక్టర్ నియమిస్తాడు
4) ఏదీకాదు
8. Assumption: గ్రామ పంచాయతీకి గ్రామసభ అనేది ప్రాతిపదికగా పని చేస్తుంది
Reason: గ్రామంలోని ఓటర్లందరూ దీని లోని సభ్యులు
1) Aకు R సరైన వివరణ
2) Aకు R సరైన వివరణ కాదు
3) A మాత్రమే సరైనది
4) R మాత్రమే సరైనది
9. భారత రాజ్యాంగ చట్టంలో 73వ, 74వ సవరణల ద్వారా సాధ్యమైంది ఏది?
1) అన్ని ఉన్నత స్థానాల్లో మహిళల నియామకాలు
2) గ్రామ పంచాయతీల, పురపాలక సంఘాల్లో మహిళల ప్రవేశం
3) చాలా మంది స్త్రీలు చిన్న దుకాణాలు ప్రారంభించటం
4) వ్యవసాయ రంగంలో మహిళా కూలీల సంఖ్యను పెంచటం
10. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు
బి. పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామసభకు అత్యంత ప్రాముఖ్యం కల్పించారు
సి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి
1) ఎ 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
11. 73వ రాజ్యాంగ సవరణ అధికరణానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సమాధానం ఇవ్వండి.
ఎ. పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు
బి. నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలను రద్దు చేయకూడదు
సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి ఫైనాన్స్ కమిషన్‌ను నియమిస్తుంది
డి. ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందించేలా పంచాయతీలను పరిపుష్టి చేయడం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
12. 73వ రాజ్యాంగ సవరణ దేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రముఖంగా తీసుకువచ్చిన మార్పు ?
1) బహురూప వ్యవస్థ
2) రిజిడ్ వ్యవస్థ
3) వ్యవస్థను రాష్ర్టాలు నిర్ణయించుకోవచ్చు
4) ఏకరూప వ్యవస్థ
13. పంచాయతీరాజ్‌కు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ కింది వాటిలో దేన్ని ప్రతిపాదించలేదు?
1) పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33.33 శాతం సీట్లు కేటాయించాలి
2) పంచాయతీరాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ర్టాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి
3) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైనవారికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారి పదవులను కోల్పోతారు
4) రాష్ట్ర ప్రభుత్వంతో పంచాయతీరాజ్ సంస్థ రద్దు అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి
14. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వర్గం వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండవు?
1) మైనారిటీలు 2) మహిళలు
3) వెనుకబడిన వర్గాలు
4) ఎస్సీ, ఎస్టీ
15. జిల్లా పరిషత్‌లో మొత్తం స్థాయీ సంఘాలు?
1) 5 2) 7 3) 9 4) 11
16. ఎల్.ఎం.సింఘ్వి కమిటీ (1986) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. పంచాయతీలకు కొత్తగా ఒక భాగాన్ని ఏర్పాటు చేయాలి
బి. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి
సి. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
డి. సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకోవాలి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
17. పంచాయతీలకు రాజ్యాంగ హోదా కోసం సిఫారసు చేసిన కమిటీ ఏది?
1) బల్వంతరాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
4) తుంగన్ కమిటీ
18. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం-రాజస్థాన్
2) మండల వ్యవస్థను అమలు చేసిన
తొలి రాష్ట్రం- కర్ణాటక
3) నూతన పంచాయతీరాజ్ చట్టం (1993) తొలిసారి అమల్లోకి వచ్చిన రాష్ట్రం-
ఆంధ్రప్రదేశ్
4) స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం- బీహార్
19. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి?
1) 2 2) 3 3) 5 4) 4
20. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1) సామాజిక న్యాయం, మహిళా సాధికారత
2) రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం
3) సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత
4) సామాజిక సాధికారత, సామాజిక న్యాయం
21. జతపరచండి
ఎ. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ 1. ఎల్.ఎం.సింఘ్వి
బి. మూడంచెల స్థానిక సంస్థలు 2. జి.వి.కె.రావు
సి. రెండంచెల స్థానిక సంస్థలు 3. పంచాయతీరాజ్
డి. గ్రామీణాభివృద్ధి-పేదరిక నిర్మూలన 4. బల్వంతరాయ్ మెహతా
ఇ. ప్రజాస్వామ్యం, అభివృద్ధికి స్థానికసంస్థల బలోపేతం 5. అశోక్‌మెహతా
1) ఎ-3, బి-4, సి-5, డి-2, ఇ-1
2) ఎ-4, బి-3, సి-1, డి-5, ఇ-2
3) ఎ-2, బి-1, సి-5, డి-3, ఇ-4
4) ఎ-5, బి-4, సి-2, డి-3, ఇ-1
22. 1960-70 దశకాల మధ్య పంచాయతీరాజ్ సంస్థల క్షీణతకు కారణం కానిది?
1) సామాజిక, ఆర్థిక ప్రాబల్యం కలిగిన సమూహ ఆధిపత్యం
2) గ్రామాల్లో అక్షరాస్యులు లేకపోవడం
3) నిధులు సరిగా అందకపోవడం
4) ఈ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవటం
23. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
1) 64వ సవరణ 2) 72వ సవరణ
3) 73వ సవరణ 4) 74వ సవరణ
24. పంచాయతీరాజ్ చట్టం (73వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మినహాయింపు
ఉన్న ప్రాంతాలు/రాష్ర్టాలేవి?
ఎ. మణిపూర్ కొండ ప్రదేశాలు
బి. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ
సి. మిజోరం, మేఘాలయ, నాగాలాండ్
డి. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
25. అధికరణ 243(S) ప్రకారం వార్డు కమిటీల ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరైన అంశాలేవి?
ఎ. మూడు లక్షలు (లేదా) అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలు ఉంటాయి
బి. ఒక వార్డు కమిటీ పరిధిలోని వార్డు ప్రతినిధి ఆ వార్డు కమిటీలో సభ్యుడిగా ఉండాలి
సి. వార్డు కమిటీ.. ఒకే వార్డుకు ఏర్పడినప్పుడు ఆ వార్డు ప్రతినిధి ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉంటాడు
డి. వార్డు కమిటీకి అధ్యక్షుడిగా మున్సిపల్ చైర్మన్ ఉంటారు
26. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పూర్వపు శాసనాలు ఎంతకాలం పాటు అమల్లో ఉంటాయి?
1) 6 నెలలు
2) రాష్ట్ర శాసనసభ నిర్ణయం మేరకు
3) సంవత్సరం 4) రెండేళ్లు
27. కింది వాటిని పరిశీలించి సమాధానమివ్వండి.
ఎ. జిల్లా ప్రణాళిక బోర్డు 243 ZD అధికరణం ప్రకారం ఏర్పాటు చేస్తారు
బి. ప్రతి జిల్లా పరిషత్‌లో 7 స్థాయీ సంఘాలు ఉంటాయి
సి. స్థాయీ సంఘాల సమావేశాల కోసం
1/2 వంతు
1) ఎ, బి, సి లు సరైనవి
2) ఎ, సి సరైనవి, బి సరికాదు
3) ఎ సరైనది
4) ఎ, బి సరైనది, సి సరైనది కాదు
28. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు చేసినది?
1) బ్లాకు విధాన ఏర్పాటు
2) గ్రామ పంచాయతీల ఏర్పాటు
3) జిల్లా స్థాయిలో ప్రజాస్వామిక వికేంద్రీకరణ
4) జిల్లా కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు
29. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయించాలంటే ఎవరి
అనుమతి పొందాలి?
1) సంబంధిత రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్
2) భారత రాష్ట్రపతి
3) పార్లమెంట్
4) కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల అభిప్రాయం
30. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను పెంపొందించే లక్ష్యంతో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం కింది వాటిలో దేన్ని సమకూరుస్తుంది?
ఎ. జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటు
బి. అన్ని రకాల పంచాయతీ ఎన్నికలను నియంత్రించడానికి రాష్ర్టాల ఎన్నికల సంఘాలు
సి. రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటు
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
31. గ్రామ సభను ఏర్పాటు చేయమని గ్రామ సభ సభ్యులు కోరవచ్చా? అయితే ఎంత మంది రాతపూర్వకంగా సర్పంచ్‌ను అభ్యర్థించాల్సి ఉంటుంది?
1) కోరవచ్చు, గ్రామ సభ సభ్యుల్లో 10%
2) అవసరం లేదు, 50 మంది
3) కోరవచ్చు, 100 మంది
4) కోరవచ్చు, గ్రామసభ సభ్యుల్లో 10% (లేదా) 50 మంది
32. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ. అశోక్‌మెహతా కమిటీ – రెండంచెల వ్యవస్థ
బి. ఎల్.ఎం.సింఘ్వి కమిటీ- న్యాయ పంచాయతీలు
సి. హనుమంతరావు కమిటీ- జిల్లా ప్రణాళిక
డి. దంత్వాలా కమిటీ- బ్లాక్ లెవల్ ప్రణాళిక
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
33. భారతదేశంలో పంచాయతీరాజ్‌తో సంబంధం ఉన్న కమిటీ?
1) ఎల్.ఎం.సింఘ్వి కమిటీ
2) జి.వి.కె. రావు కమిటీ
3) బల్వంతరాయ్ కమిటీ
4) పైవన్నీ
34. గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎంపీటీసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు, కాని ఓటు హక్కు ఉండదు
2) స్వయం సహాయక గ్రూపు నుంచి ఒక సభ్యుడిని కో ఆప్ట్ చేస్తారు
3) స్థానిక శాసనసభ్యుడు హోదారీత్యా సభ్యుడిగా ఉంటాడు
4) పైవేవీ కావు
35. జి.వి.కె. రావు కమిటీ (1985) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. జిల్లా పరిషత్‌లను పటిష్టపరచాలి
బి. ఉద్యోగస్వామ్యాన్ని పెంచాలి
సి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి
డి. క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు