Telangana History | వ్యవసాయాభివృద్ధికి నాణాలు … నూతన సంప్రదాయాలు
శాతవాహనుల సామ్రాజ్యం విచ్చిన్నమైన తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. శాతవాహనులకు సామంతులైన ఇక్షాకులు విజయపురి రాజధానిగా 100 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్షాకు అనగా చెరకు అని అర్థం. వీరు రాముని వంశానికి చెందినవారమని ప్రకటించుకున్నారు. ఇక్షాకుల జన్మ స్థలం గురించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఇక్ష్వాకులు
- ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలడు. వీరపురుష దత్తుడు గొప్పవాడు. చివరివాడు రుద్ర పురుష దత్తుడు. వీరి రాజ్య చిహ్నం సింహం. రాజభాష ప్రాకృతం. వైష్ణవం, బౌద్ధమతాలను ఆరాధించారు. వీరి కాలంలో బౌద్ధమతం ఉన్నత స్థాయికి చేరింది. జగ్గయ్యపేటలోని మాంధాత శిల్పం అతి ముఖ్యమైనది.
- నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనాలు వేయించారు.
రాజకీయ చరిత్ర
- ఇక్షాకులు శ్రీపర్వతీయులుగా, ఆంధ్రభృత్యులుగా, అయోధ్యను ఏలిన సూర్యవంశీయులుగా, శ్రీరాముని వంశస్థులుగా ప్రసిద్ధి.
వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు (క్రీ.శ. 225-245)
- ఇక్షాక వంశ మూలపురుషుడు, రాజ్య స్థాపకుడు. శాతవాహన చివరి పాలకుడు 3వ పులోమావిని ఓడించి రాజ్యం స్థాపించాడు. కార్తికేయుడిని ఆరాధించాడు.
- అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ క్రతువులు నిర్వహించాడు.
- రెంటాల, దాచేపల్లి, కేశానుపల్లి శాసనాలు వేయించాడు.
- శతసహస్ర హాలక, మహాదానాధిపతి, దక్షిణపథ సామ్రాట్ బిరుదులున్నాయి. ఇతను వ్యవసాయాభివృద్ధికి బంగారు నాణేలు, గోవులు, నాగళ్లను దానం చేశాడు. ఇతడి కుమార్తె అడవి శాంతిశ్రీ నాగార్జున కొండలోని బౌద్ధ ఆరామ విరామాన్ని నిర్మించింది.
వీర పురుష దత్తుడు (క్రీ.శ. 245-265)
- ఇతడి కాలాన్ని బౌద్ధమత స్వర్ణయుగంగా పేర్కొంటారు. దక్షిణాది అశోకుడు అనే బిరుదు కలవాడు.
- అల్లూరి శాసనం, నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట
శాసనాలు వేయించాడు. - శైవ మతాన్ని ద్వేషిస్తున్నట్లు, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి. బౌద్ధమతాన్ని ఆరాధించాడు.
- ఇక్షాక రాజుల్లో బౌద్ధమతం స్వీకరించిన ఏకైకరాజు వీరపురుష దత్తుడు. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. (భారతదేశంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం). ఇతని అధికారి ఎలిసిరి పేరు మీద ఏలేశ్వరం ఆలయం నిర్మించాడు.
- ఉపాసిక బోధిశ్రీ అమరావతిలో రాజబాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. ఈమె బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసింది.
- ప్రముఖ మాధ్యమిక వాద బౌద్ధ పండితుడు, స్వతంత్రవాద స్థాపకుడు అయిన భావవివేకుడు విజయపురిలో నివసించినట్లు హుయాన్‌త్సాంగ్ రచనల ద్వారా తెలుస్తుంది.
- కొండపై బౌద్ధవిహారం, చైత్యం నిర్మించింది. పుష్పగిరి శిలామండపం నిర్మించింది. ఆనందుడు శ్రీపర్వత విహారానికి మరమ్మతులు చేశాడు.
వాసిష్టీపుత్ర ఎహువల శాంతమూలుడు (క్రీ.శ.265-290)
- బౌద్ధ చైత్యాలకు మండపాలు నిర్మించాడు. ఇతని సోదరి కొడబలిసిరి నాగార్జునకొండలో బౌద్ధ విహారం నిర్మించింది.
- దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు.
- పుష్పభద్ర, నారాయణ స్వామి, కార్తికేయుని, నవగ్రహ, నందికేశ్వర, హారితి ఆలయాలు నిర్మించాడు.
- ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి ఆలయం నిర్మించాడు. అభిర రాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజనారాయణ స్వామి ఆలయం కట్టించాడు.
- నాగార్జున కొండ శాసనం (సంస్కృత శాసనం), గుమ్మడి దుర్రు (ప్రాకృత శాసనం/స్థూప శాసనం) శాసనాలు వేయించాడు.
రుద్ర పురుష దత్తుడు (క్రీ.శ. 290-300)
- రుద్ర పురుష దత్తుడు పల్లవ రాజు సింహవర్మచే వధించబడినట్లు మంచికల్లు శాసనం తెలుపుతుంది. ఇక్షాకుల అంతం గురించి మైదవోలు శాసనం తెలియజేస్తుంది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ర్టాలుగా ఆహారాలుగా, పదాలుగా విభజించారు.
- రాష్ట్ర పాలకులుగా మహా తలవరులు, మహాసేనాపతులు, మహా దండనాయకులను నియమించారు. ప్రధాన న్యాయమూర్తిని ‘మహాతలవరి’ అన్నారు.
ఆర్థిక వ్యవస్థ
- రోమన్ల బంగారు నాణేలను నాగార్జున కొండ, జగ్గయ్యపేటలో కనుగొన్నారు. ఈ కాలంలో వర్తక శ్రేణులు పూసిన శ్రేణి (మిఠాయి వ్యాపారుల సంఘం) గా ప్రసిద్ధి. పర్హిక శ్రేణిని తమలపాకుల వ్యాపార సంఘం అనేవారు. వృత్తి పన్నులు విధించినట్లు ‘విషవట్టి శాసనం’ తెలుపుతుంది.
సామాజిక వ్యవస్థ
- ఇక్షాకులు తల్లి పేరు తమ పేర్లతో కలిపి ఉపయోగించారు. మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం ఉంది.
సాంస్కృతిక వ్యవస్థ
- భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొదటివారు ఇక్షాకులు. శాసనాల్లో మొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరం, మాసం, తేదీలను ప్రస్తావించే సంప్రదాయం ఇక్షాకుల కాలం నుంచి మొదలైంది.
మత పరిస్థితులు
- రాజులు బ్రాహ్మణ మతం, రాణులు బౌద్ధమతాన్ని ఆధరించారు.
విష్ణుకుండినులు
- వీరి రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ. (మహారాజేంద్రవర్మ). వీరిలో 2వ మాధవవర్మ గొప్పవాడు. చివరివాడు మంచన భట్టారకుడు.
- వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం కీసర రాజధానిగా, పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి రాజచిహ్నం పంజా ఎత్తిన సింహం. రాజభాషగా సంస్కృతం ఉండేది. వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు. ఉండవల్లి గుహలు వీరి శిల్పకళా నైపుణ్యాన్ని తెలుపుతాయి.
- ‘ఘటికలు’ అనే హిందూ విద్యా సంస్థలు ప్రారంభించిన తొలి రాజవంశం వీరిదే. నరబలిని ప్రోత్సహించారు. కీసర గుట్టలోని రామలింగేశ్వరాలయాన్ని నిర్మించారు.
రాజకీయ చరిత్ర
ఇంద్రవర్మ
- ఇతడు ఇంద్రపురం అనే రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం దీన్ని ఇంద్రపాల నగరంగా పిలుస్తున్నారు. (ఇంద్రపాల నగరం నల్లగొండ జిల్లాలోనిది)
మాధవ వర్మ
- వాస్తవంగా విష్ణుకుండినుల అధికార స్థాపకుడు. విక్రమమహేంద్ర అనే బిరుదు ఉన్నట్లు పోలమూరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఉండవల్లి, భైరవకోన, మొగల్ రాజపురం గుహలు చెక్కించారు.
గోవిందవర్మ
- విక్రమశ్రమ అనే బిరుదు కలవాడు. ఇతని పట్టమహిషి మహాదేవి. బౌద్ధమతాభిమాని. ఇంద్రపాలపురంలో బౌద్ధ భిక్షువులకు మహాదేవి తన పేరు మీద మహావిహారం నిర్మించింది.
- గోవిందవర్మ ఈ మహావిహారానికి పెన్కపుర అనే గ్రామం దానం చేశాడు.
2వ మాధవ వర్మ
- పోలమూరు శాసనం ప్రకారం త్రికూట మలయాధిపతి, త్రివరనగర యువతి ప్రియుడు అనే బిరుదులున్నాయి.
- రాజధానిని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి మార్చాడు. ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. అదే ప్రస్తుతం అనంత పద్మనాభస్వామి ఆలయం.
- రెండో మాధవవర్మ ఉండవల్లి గుహలపై చెక్కించిన పూర్ణకుంభం ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నంగా తీసుకోబడింది.
- రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, నరమేథ యాగం మొదలైనవి జరిపించాడు. వేల్పూరు శాసనం, ఈపూరు శాసనం-1, ఖానాపూర్ శాసనాలు వేయించాడు.
- అమరేశ్వరాలయం (ఇంద్రపాలనగరం), జడల రామలింగేశ్వరాలయం (చెరువుగట్టు), మల్లికార్జున ఆలయం (ఇంద్రపాలనగరం), కేసరి రామలింగేశ్వర ఆలయం (కీసరగుట్ట) నిర్మించాడు.
3వ మాధవవర్మ
- 2వ మాధవవర్మ కుమారుడు దేవవర్మ. అతని కుమారుడు 3వ మాధవవర్మ. జనాశ్రయ, అవసిత వివిధ దివ్య అనే బిరుదులున్నాయి.
విక్రమేంద్ర వర్మ
- 3వ మాధవ వర్మను ఓడించాడు. ఇంద్రపాల నగరం తామ్ర శాసనం ప్రకారం మహాకవి అనే బిరుదు ఉంది.
ఇంద్రభట్టారక వర్మ
- కీసరగుట్ట సమీపంలో ఘట్కేశ్వర ఘటికాస్థానాన్ని స్థాపించాడు. ఘటికలు అనే వైదిక విద్యాలయాలను స్థాపించినట్లు ఉద్దంకుడు రాసిన సామవేదం తెలుపుతుంది.
విక్రమేంద్ర భట్టారక వర్మ
- అమరావతి నుంచి దెందులూరుకు రాజధానిని మార్చాడు. తుమ్మలగూడెం శాసనం, ఇంద్రపాలనగర తామ్ర శాసనం, చిక్కుళ్ల తామ్ర శాసనాలు వేయించారు.
- ఉత్తమాశ్రయ అనే బిరుదు ఉంది. ఇంద్రపాలపురంలో గోవిందమ్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామం దానం చేశాడు.
4వ మాధవవర్మ
- పోలమూరు-2, ఈపూరు-2 శాసనాలు వేయించాడు. ఈపూరు శాసనం ప్రకారం న్యాయశాస్త్ర విశారదుడు, సూక్ష్మగ్రాహి అనే బిరుదులున్నాయి.
- గుణస్వామి అనే కవి ‘జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి’ గ్రంథం రాశాడు.
మంచన భట్టారక వర్మ
- ఇతన్ని పృథ్వీమూల మహారాజు ఓడించినట్లు తాండివాడ శాసనం తెలుపుతుంది.
పరిపాలన వ్యవస్థ
- రాజ్యాన్ని రాష్ర్టాలుగా, విషయాలుగా విభజించారు. విషయాధిపతులను అధికార పురుషులు, మహోత్తరులు ‘వీరకోశ’ అని అంటారు.
- భూమిని కొలిచే విధానం -వివర్తనం
ఇతర ఉద్యోగులు
- రజ్జుకులు- భూములను పగ్గాలతో కొలిచేవారు
- ఫలదారుడు- పండిన పంటలో రాజభాగాన్ని నిర్ణయించే అధికారి
- సెట్టి- ప్రభుత్వానికి చెందాల్సిన
- ధాన్యం కొలిచే అధికారి
- అక్షపటలక- ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు
- శాసన ఆజ్ఞప్తులు- రాజాజ్ఞలను రాయించేవారు
- గుల్మికుడు- సరిహద్దు రాష్ర్టాలపై నియమించిన సైనిక రాజప్రతినిధి
సాంఘిక మత పరిస్థితులు
- దక్షిణ భారతదేశంలో మొదటగా హిందూ గుహాలయాలు విష్ణుకుండినులు నిర్మించారు.
- విష్ణుకుండినుల కాలంనాటి గొప్ప బౌద్ధక్షేత్రం- బొజ్జన్న కొండ
- వైదిక మతాభిమానులు (శ్రీపర్వత స్వామి భక్తులు) విష్ణుకుండినులు బౌద్ధమతాన్ని కూడా పోషించారు.
ఆర్థిక పరిస్థితులు
- ఇక్షాకుల తర్వాత విష్ణుకుండినులు నాణేలు ముద్రించారు.
- రాగి, ఇనుముతో కూడిన లోహంతో శంఖువు, సింహం గుర్తు ఉన్న నాణేలను ముద్రించారు.
విద్య
- చిక్కుళ్ల తామ్ర శాసనంలో ‘విజయరాజ్య సంవత్సరంబుల్’ అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తెలుగులో తొలి వాక్యం.
- తొలి తెలుగు జంట కవులు అయిన నంది మల్లయ్య, ఘంట సింగన విష్ణుకుండినుల ఆస్థానంలోనివారే. వీరు ‘ప్రబోధ చంద్రోదయం’ అనే గ్రంథాన్ని రచించారు.
న్యాయ పాలన
- 3వ మాధవవర్మ పోలమూరు శాసనంలో న్యాయపాలన ప్రస్తావన ఉంది. నేర నిర్ణయానికి దివ్య పరీక్షలు జరిపేవారు. న్యాయపాలనకు రాజు అత్యున్నత న్యాయాధికారి.
- శిల్పకళ
ఉండవల్లి గుహాలయాలు 4 అంతస్థులు. గోవిందవర్మ నిర్మించాడు. మొదటి అంతస్థులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్థులో అనంతశయన విష్ణువు దేవాలయాలు ఉన్నాయి. మూడో అంతస్థులో త్రికూట ఆలయం ఉంది. నాలుగో అంతస్థులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. - ఈ గుహల్లో పూర్ణకుంభం ఉంది. అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. ఉండవల్లి గుహలపై ‘ఉత్పత్తి పిడుగు’ అనే లేఖనం ఉంది.
- భైరవకొండ 8 గుహలున్న సముదాయం. ఇది శివునికి అంకితం చేశారు. అష్టభుజ నటరాజమూర్తి, త్రివిక్రమావతార విగ్రహాలు మొగల్రాజపురం గుహాలయంలో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు