World Geography | ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు
- అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఈ ప్రకృతి సిద్ధ మండలాలను 7 రకాలుగా విభజించారు.
1) భూమధ్య రేఖా ప్రకృతి సిద్ధ మండలం
- దీన్నే ‘ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతం, డోల్డ్రమ్స్’ అని పిలుస్తారు.
- ఉనికి- 0o-5o/10o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తరణ - దక్షిణ అమెరికా- అమెజాన్ నది పరీవాహక ప్రాంతం
- ఆఫ్రికా- కాంగో నది పరీవాహక ప్రాంతం
- ఆగ్నేయాసియా- ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, బ్రూనై, న్యూగినియా
శీతోష్ణ స్థితి లక్షణాలు
- సంవత్సరమంతా అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం గల ఏకైక శీతోష్ణ స్థితి ప్రాంతం
- ఇక్కడ సంవత్సరమంతా వేసవికాలం ఉంటుంది. శీతాకాలాలు ఉండవు.
- ఈ ప్రాంత ప్రజలు రాత్రి సమయాలనే శీతాకాలంగా భావిస్తారు. కారణం ఇక్కడ పగటి ఉష్ణోత్రలతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు 2o-3oC వరకు తక్కువగా ఉండటమే.
- ఇక్కడ సంభవించే వర్షపాతం సంవహన రకానికి చెందినది.
- బారోక్ (ఇండోనేషియా ప్రాంతంలో సంవత్సరంలో 322 రోజులు ఉరుముల శబ్దాలు వినిపిస్తాయి.
- ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 200 సెం.మీ. కంటే ఎక్కువ.
వృక్ష సంపద
- సతత హరిత అరణ్యాలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి.
- అమెజాన్ నది పరీవాహక ప్రాంతంలోని ఈ అరణ్యాలను ప్రాంతీయంగా ‘సెల్వాలు’ అని పిలుస్తారు.
- ఈ అరణ్యాల్లో పెరిగే వృక్షాలు 40-50 మీ. ఎత్తు కలిగి వెడల్పాటి ఆకులతో గట్టి కలపనిస్తాయి.
- ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షాల అగ్రభాగంలోని ఆకులు ఒకదానికొకటి పెనవేసుకొని మల్లె పందిరిలా ఏర్పడి ఉంటాయి. దీన్నే ‘కెనోపీ’ అంటారు. దీని కారణంగా ఈ ప్రాంత నేలపై సూర్య రశ్మి ప్రసరించకపోవడం వల్ల అవి ఎల్లప్పుడూ తేమగా, బురదగా ఉంటాయి. దీనివల్ల గడ్డి జాతి మొక్కలు ఈ ప్రాంతాల్లో పెరగవు.
- ఈ అరణ్య వృక్షాల కాండాల చుట్టూ, కాండాల మధ్య అల్లుకొని (ఊయల లాగా) ఉన్న తీగలాంటి మొక్కలే లయనాలు.
వృక్ష జాతులు
- ఎబోని- ఐరన్‌వుడ్- చెస్ట్ నట్స్
- మహాగని- ఎయిని- వాల్ నట్స్
- రోజ్‌వుడ్- తెత్సార్- సింకోనా
జంతు సంపద
- చెట్లపై నివసించే పక్షులు, కోతులు, చింపాంజీలు,
గొరిల్లాలు, సరీసృప వర్గానికి చెందిన పాములు, తొండలు, కొండ చిలువలు, అనకొండలు - నీటిలో నివసించే మొసళ్లు, తాబేళ్లు, నీటి గుర్రాలు, చేపలు
- పెద్ద పెద్ద శాకాహార, మాంసాహార జంతుజాతులకు
అనువైన శీతోష్ణస్థితి పరిస్థితులు ఇక్కడ లేవు.
వ్యవసాయరంగం
- విస్తాపన వ్యవసాయ విధానం అమల్లో ఉంది.
- దీన్ని మలేషియా- లడాంగ్, ఫిలిప్పీన్స్- మిలాప్, శ్రీలంక- చెన్నా, భారత్‌లోని అసోం, ఈశాన్య రాష్ర్టాలు- జామ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్- బేవార్, పెండా, పెషా, రాజస్థాన్- వాత్రా, పశ్చిమ కనుమలు- కుమారి, కేరళ- పోనమ్, ఏపీ, ఒడిశా- పోడో అని పిలుస్తారు.
ముఖ్యమైన పంటలు
- రబ్బరు: 1) థాయిలాండ్, 2) ఇండోనేషియా, 3) మలేషియా, 4) భారత్. రబ్బరు జన్మస్థలం బ్రెజిల్.
- కాఫీ: 1) బ్రెజిల్ (కాఫీ తోటలను ఫజెండాస్ అని పిలుస్తారు), 2) కొలంబియా, 3) ఈక్వెడార్,
4) ఇథియోపియా (కాఫీ జన్మస్థలం), 5) ఇండోనేషియా, 6) భారతదేశం.
కోకో: 1) ఘనా (కోకో ఎస్టేట్‌గా పిలుస్తారు) ఆదిమ తెగలు (ప్రిమిటివ్ పీపుల్) - 1) అమెజాన్ రెడ్ ఇండియన్స్- అమెజాన్ నది పరీవాహక ప్రాంతం
- 2) పిగ్మీలు లేదా బంటూ నీగ్రోలు- కాంగో నది పరీవాహక ప్రాంతం (ఆఫ్రికా). భూమధ్య రేఖా ప్రాంత శీతోష్ణస్థితిలో అత్యంత వెనుకబడిన ఆదిమ తెగలు
- 3) సెమాంగ్, సెకాయ్- మలేషియా
- 4) దయాక్స్ (హెడ్ హంటర్స్)- బోర్నియా ద్వీపం
- 5) పపౌ (హెడ్ హంటర్స్)- న్యూగినియా
- 6) కాబూలు- సుమత్రా దీవులు (ఇండోనేషియా)
- 7) వెడ్డాలు- శ్రీలంక
- ప్రపంచంలో అత్యధిక వర్షపాతం- 1) వయలీలి శిఖరం (హవాయి)- 1233.6 సెం.మీ.
2) మాసిన్రామ్- 1141 సెం.మీ.
3) చిరపుంజి- 1081 సెం.మీ.
4) కమోరన్ శిఖరం- 1016 సెం.మీ. (ఆఫ్రికా)
2) ఉష్ణమండల ఎడారి శీతోష్ణస్థితి
- ఇసుక పొరతో కప్పబడి అత్యధిక ఉష్ణోగ్రత అతి తక్కువ వర్షపాతం కలిగి మానవ నివాసానికి అంతగా అనుకూలం లేనటువంటి భౌగోళిక ప్రాంతాలు.
- ఉనికి- 15o-30o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ ప్రాంతంలో మాత్రమే విస్తరించి ఉంది.
కారణం
1) వ్యాపార పవనాలు ఖండాల తూర్పు భాగంలో మాత్రమే వర్షాన్నిచ్చి పశ్చిమ ప్రాంతాల్లో ఇవ్వకపోవడం
2) ఖండాల పశ్చిమ ప్రాంతాల్లో గాలులు నిమజ్జనం చెందడం
3) ఖండాల పశ్చిమ తీరం వెంబడి శీతల సముద్ర ప్రవాహాలు కదలడం
4) ఖండాల పశ్చిమ తీరం వెంబడి ఎత్తయిన, పొడవైన పర్వతశ్రేణులు విస్తరించడం
విస్తరణ
- ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో పశ్చిమం నుంచి తూర్పునకు 6400 కి.మీ. పొడవునా విస్తరించి ఉన్న సహారా ఎడారి. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి.
- ఇది ఏర్పడటానికి కారణమైన సముద్ర ప్రవాహం- కెనరీ శీతల ప్రవాహం
- ఆఫ్రికా నైరుతి భాగం కలహారి ఎడారి. ఇది ఏర్పడటానికి కారణం బెనిగ్యులా శీతల ప్రవాహం.
- చిలీ, పెరూ దేశాల్లో అటకామా ఎడారి. ఇది ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి. ఇది ఏర్పడటానికి కారణం పెరూవియన్/హంబోల్డ్ శీతల ప్రవాహం
కాలిఫోర్నియా, అరిజోనా రాష్ర్టాలు
- మెక్సికో వాయవ్య ప్రాంతం- సోనారన్ ఎడారి (కాలిఫోర్నియా శీతల ప్రవాహం)
- అరేబియన్ ఎడారి (సోమాలియన్ శీతల ప్రవాహం)
- థార్ ఎడారి- భారతదేశం (రాజస్థాన్, దక్షిణ పంజాబ్, హర్యానా, ఉత్తర గుజరాత్), పాకిస్థాన్
- గిబ్బన్, విక్టోరియన్ ఎడారులు- ఆస్ట్రేలియా (పశ్చిమ ఆస్ట్రేలియన్ శీతల ప్రవాహం). రెండింటిని కలిపి పశ్చిమ ఆస్ట్రేలియన్ ఎడారి అంటారు.
శీతోష్ణ స్థితి
- సంవత్సరం అంతా అత్యధిక ఉష్ణోగ్రత, అతి తక్కువ
వర్షపాతం గల ఏకైక శీతోష్ణస్థితి ప్రాంతం. - వేసవిలో సహారా ఎడారి ప్రాంతాల్లో జనించే ఇసుక
తుఫాన్లను ‘సైమూన్లు’ అంటారు.
వృక్ష సంపద
- ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షాల ఆకులు చాలా చిన్నవిగా గాని లేదా ముళ్ల మాదిరిగా రూపాంతరం చెంది వేళ్లు బలంగా ఎక్కువ లోతుకు విస్తరించి వాటి కాండాల చుట్టూ మైనపు పూత లాంటి బెరడు ఉంటుంది. కారణం బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడం కోసం. ఇటువంటి లక్షణాలు గల వృక్ష జాతులను ‘గ్జెరోఫైటిక్ వృక్ష జాతులు’ అంటారు. అవి..
- బ్రహ్మజెముడు- తుమ్మ- చింత
- నాగజెముడు- బలుస- ఈత
- రేగు- వేప
జంతు సంపద
- ఒంటె (ఉష్ణమండల ఎడారి ఓడ), గుంట నక్కలు, చీమలు, తొండలు, బల్లులు, పాములు
వ్యవసాయ రంగం
- ఒయాసిస్ ప్రాంతాల్లో- పత్తి, వేరుశనగ, చెరకు, ఖర్జూరం
- పొడుగు గింజ పత్తి (క్వాలిటీ) ఉత్పత్తి- 1) ఈజిప్ట్, 2) యూఎస్ఏ
- పత్తి ఉత్పత్తి (అన్ని రకాలు)- 1) చైనా, 2) భారత్, 3) యూఎస్ఏ
- పత్తిని తెల్లబంగారం అంటారు. జన్మస్థలం భారత్.
ఖనిజ సంపద
- ముడి చమురు- అరేబియన్ ఎడారి (సౌదీ అరేబియా)
- కాపర్, నైట్రేట్స్- చిలీలోని అటకామా ఎడారి
- బంగారం- విట్‌వాటర్స్ ర్యాండ్ (దక్షిణాఫ్రికా), కాల్గూర్లి, కూల్గార్డి (ఆస్ట్రేలియా)
- వజ్రాలు- కింబర్లీ (దక్షిణాఫ్రికా)
ఆదిమ తెగలు
1) టౌరేగులు- సహారా ఎడారి (పశుపోషణ)
2) బిడౌనియన్లు- అరేబియన్ ఎడారి (గుర్రాల వ్యాపారం)
3) బుష్మెన్లు- కలహారి ఎడారి. ఉష్ణమండల ప్రాంతంలో అత్యంత వెనుకబడి ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి.. వేట.
4) బిండిబాలు- ఆస్ట్రేలియన్ ఎడారి - నైలు నది పరీవాహక ప్రాంతంలో నివసించే వ్యవసాయదారులు ‘ఫెల్లాహిన్స్’.
3) మధ్యధరా శీతోష్ణస్థితి మండలం
- ఆహ్లాదకర శీతోష్ణస్థితికి, అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగానికి, ఘనమైన చరిత్ర, సంస్కృతి, నాగరికతలకు నిలయమైన ప్రాంతాలు.
- ఉనికి- 30o-40o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తరణ
- మధ్యధరా సముద్ర ఉత్తర తీరాన్ని ఆనుకొని ఉన్న ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, మధ్యధరా సముద్రంలోని సార్డీనియా, సిసిలీ దీవులు.
- మధ్యధరా సముద్ర దక్షిణ తీరాన్ని ఆనుకొని ఉన్న మొరాకో, ట్యునీషియా, అల్జీరియా
- మధ్యధరా సముద్ర తూర్పు తీరం- లెబనాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్
- దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్
- కాలిఫోర్నియాలోని తూర్పు ప్రాంతం
- చిలీనిలో మధ్య ప్రాంతం (శాంటియాగో పట్టణం)
- ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాలు.
శీతోష్ణస్థితి
- భూమిపై గల అన్ని శీతోష్ణస్థితి ప్రాంతాల్లో తడి వేసవిలు, పొడి శీతాకాలాలు ఉంటాయి. కానీ మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతంలో వాటికి భిన్నంగా పొడి వేసవికాలాలు, తడి శీతాకాలాలు ఉంటాయి.
- కారణం: రుతువుననుసరించి పీడన మేఖలలు స్థానాంతర చలనం చెందడం. దీనివల్ల మధ్యధరా ప్రాంతాలు వేసవిలో అపతీర వ్యాపార పవనాల తాకిడికి లోనవడం వల్ల వాతావరణం పొడిగా ఉండి వర్షాలు సంభవించవు. కానీ శీతాకాలంలో ఈ ప్రాంతాలు అభితీర (ఆన్ షోర్) పశ్చిమ పవనాల తాకిడికి లోనవడం వల్ల ఈ ప్రాంత వాతావరణం తడిగా ఉండి వర్షాలు సంభవిస్తాయి.
వృక్ష సంపద
- మిశ్రమ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
- ఇందులో పెరిగే వృక్ష జాతులు
- ఆలివ్- సువాసన గల లావెండర్ పొద వృక్షాలు
- కార్క్- ఈ వృక్షాల సమూహమే మాచీస్
- ఓక్- వీటిని సుగంధ పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుతారు.
- ఆస్ట్రేలియాలోని మధ్యధరా ప్రాంతాల్లో పెరిగే యూకలిప్టస్
- వాణిజ్యపరంగా విలువైన కర్రా, జర్రా వృక్షాలు
- కాలిఫోర్నియా మధ్యధరా ప్రాంతాల్లో రెడ్‌వుడ్, చప్రాల్ వృక్షాలు.
వ్యవసాయ రంగం
సాంద్ర వ్యవసాయం (ఇంటెన్సివ్)
ముఖ్య పంటలు
- గోధుమ- 1) చైనా, 2) భారత్, 4) యూఎస్ఏ
- ద్రాక్ష- 1) ఇటలీ, 2) ఫ్రాన్స్ (ద్రాక్ష తోటల సాగు విటి కల్చర్)
- వరి (పో నదిలోయ ప్రాంతం: ఇటలీ, కాలిఫోర్నియా)
- సిట్రస్ జాతి పండ్ల తోటలు
- ఈ ప్రాంతాలను ‘ప్రపంచ పండ్ల తోటల ప్రాంతాలు’ అంటారు.
- చిలీలోని పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ‘హోషియాండాలు’.
ఖనిజ సంపద
- పాదరసం- 1) ఇటలీ
- కరారా పాలరాయి (విగ్రహాల కోసం) ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఇటలీ ఉంది.
పరిశ్రమలు
- ఫ్రాన్స్‌లోని గ్రాసే అనే ప్రాంతం పుష్పాల నుంచి సుగంధ పరిమళ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.
- ద్రాక్ష సారాయి ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఫ్రాన్స్ (బరుండి, షాంపేన్ ప్రసిద్ధి), ఎగుమతిలో అల్జీరియా.
- మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంత ప్రజలు అందమైన సూర్యరశ్మిని, సన్నని సముద్ర తీరాలను అమ్ముకుంటారనే భావన ప్రపంచ ప్రజల్లో ఉంది.
- అభివృద్ధి చెందిన నాగరికతలు గ్రీకు, రోమన్ నాగరికతలు.
Previous article
Indian History | భారతదేశంలో గాంధీజీ తొలి అనుభవాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు