TSSPDCL JLM | 1553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు నోటిఫికేషన్, అర్హతలివే!
ఏ రాష్ట్ర అభివృద్ధికయినా విద్యుత్తు సరఫరా కీలకం. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలో మిగిలి ఉన్న సమస్యలను అధిగమించేందుకు, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..
జేఎల్ఎం @ 1553
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
వివరాలు
- లిమిటెడ్ రిక్రూట్మెంట్-553, జనరల్ రిక్రూట్మెంట్ – 1000, మొత్తం 1553.
- రాత పరీక్ష తెలుగు, ఆంగ్లంలో ఉంటుంది. 80 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. ఇందులో 65 మార్కులకు ఐటీఐ సబ్జెక్టుల నుంచి మిగతా 15 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి అడుగుతారు. రాత పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. వెయిటేజీ 20 మార్కులు ఉంటాయి.
- మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- అర్హతలు: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
- జీతం: నెలకు రూ.24340- రూ.39405
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష కేంద్రాలు: జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 8 నుంచి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే నెల 28ని దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీగా నిర్ణయించారు.
- దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఏప్రిల్ 30న రాత పరీక్ష ఉంటుంది.
- పరీక్ష ఫీజు: అభ్యర్థులు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 28
- వెబ్సైట్: tssouthernpower.cgg.gov.in
Next article
Top Cities and Universities in Australia
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?