ప్రణాళిక సంఘం – జాతీయాభివృద్ధి మండలి ప్రాక్టీస్ బిట్స్
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రజాప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) ఎస్.ఎన్. అగర్వాల్
బి) ఎం.ఎన్. రాయ్
సి) జె.పి. నారాయణ డి) వినోబా భావే
2. గాంధేయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1943 బి) 1944
సి) 1945 డి) 1946
3. స్వాతంత్య్రానికి పూర్వం రూపొందించిన ప్రణాళికలను ఏమంటారు?
ఎ) ప్రజా ప్రణాళికలు
బి) పోరాట ప్రణాళికలు
సి) పేపర్ ప్రణాళికలు
డి) ఉద్యమ ప్రణాళికలు
4. ప్రజా ప్రణాళికను ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి, ఎంత పెట్టుబడితో రూపొందించారు?
ఎ) 10 సంవత్సరాలు – రూ.15000 కోట్లు
బి) 15 సంవత్సరాలు – రూ.10000 కోట్లు
సి) 5 సంవత్సరాలు – రూ.10000 కోట్లు
డి) 10 సంవత్సరాలు- రూ.10000 కోట్లు
5. గాంధేయ ప్రణాళిక ఏ లక్ష్యంతో రూపొందించారు?
ఎ) వ్యవసాయం- వినియోగవస్తువులు
బి) వ్యవసాయం- చిన్న పరిశ్రమలు
సి) వ్యవసాయం – మౌలిక సౌకర్యాలు
డి) పైవన్నీ
6. సర్వోదయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1950 జనవరి1
బి) 1947 ఆగస్టు 15
సి) 1950 జనవరి 26
డి) 1945 జనవరి 1
7. భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరం అని మొదట సూచించినది ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) దాదాభాయ్ నౌరోజీ
సి) నేతాజీ సుభాష్ చంద్రబోస్
డి) జయప్రకాశ్ నారాయణ
8. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షులు?
ఎ) నేతాజీ సుభాష్ చంద్రబోస్
బి. జవహర్లాల్ నెహ్రూ
సి) కేటీ షా డి) వినోబా భావే
9. భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఎవరు?
ఎ) అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు
బి) అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముగం షెట్టి
సి) అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
డి) అప్పటి జాతీయ ప్రణాళిక కమిటీ కార్యదర్శి కె.టి. షా
10. ప్రణాళిక సంఘం?
ఎ) రాజ్యాంగేతర సంస్థ
బి) శాసనేతర సంస్థ
సి) ఎ, బి డి) ఆర్థికేతర సంస్థ
11. ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి..
ఎ) ఒక రాజ్యాంగబద్ధ సంస్థ
బి) ఒక శాసన బద్ధ సంస్థ
సి) ఒక సలహా పూర్వక సంస్థ
డి) పైవన్నీ
12. సర్వోదయ ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) వినోబా భావే
సి) జయప్రకాష్ నారాయణ
డి) శ్రీమన్నారాయణ
13. ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రు
బి) గుల్జారిలాల్ నందా
సి) దాదాభాయ్ నౌరోజీ డి) పైవేవీకావు
14. ప్రణాళిక సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) ముంబై
సి) మద్రాస్ డి) బెంగళూర్
15. స్వాతంత్య్రం తరువాత రూపొందించిన మొదటి ప్రణాళిక ఏది?
ఎ) గాంధేయప్రణాళిక
బి) సర్వోదయ ప్రణాళిక
సి) పంచవర్ష ప్రణాళిక డి) పైవన్నీ
16. కేంద్ర ప్రణాళిక సంఘంలో రాష్ర్టాలకు ప్రాతినిధ్యం?
ఎ) ఉంటుంది బి) ఉండదు
సి) ఎ, బి డి) ఏదీకాదు
17. ప్రణాళికలు ఏ జాబితాలో భాగం?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్రజాబితా
సి) ఉమ్మడి జాబితా డి) పైవన్నీ
18. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1947 జనవరి 1 బి) 1950 ఆగస్టు 15
సి) 1950 మార్చి 15
డి) 1951 ఏప్రిల్ 1
19. ప్రణాళిక సంఘం భవనం పేరు?
ఎ) రాజ్ భవన్ బి) ప్రగతి భవన్
సి) యోజన భవన్ డి) అధికార భవన్
20. ప్రణాళిక సంఘం నుంచి ప్రచురించే అధికారిక పత్రిక ఏది?
ఎ) టైమ్స్ ఆఫ్ ఇండియా బి) యోజన
సి) ఇండియాటుడే డి) పైవన్నీ
21. ప్రణాళికా సంఘానికి చివరి ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) మన్మోహన్ సింగ్
బి) నరేంద్రమోదీ
సి) మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా
డి) సోనియాగాంధీ
22. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను ఎవరు ఆమోదిస్తారు?
ఎ) పార్లమెంట్ బి) లోక్సభ
సి) జాతీయాభివృద్ధి మండలి
డి) రాష్ట్రపతి
23.జాతీయాభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
ఎ) 1950 మార్చి 15
బి) 1952 ఆగస్టు 6
సి) 1952 ఆగస్టు 8
డి) 1955 మార్చి 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు