దేశంలో అత్యధికంగా వాయు శక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం.?
1. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. రెండు (లేదా) అంతకంటే ఎక్కువ చిన్న పరమాణు కేంద్రకాలు కలిసి ఒక పెద్ద పరమాణు కేంద్రకంగా ఏర్పడటాన్ని కేంద్రక సంలీనం అంటారు
2. హైడ్రోజన్ బాంబు కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా పని చేస్తుంది
3. నక్షత్రాల్లో శక్తికి కారణం కేంద్రక సంలీనం
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) పైవన్నీ
2. యురేనియం శుద్ధి చేయడంలో కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. శుద్ధి చేసిన యురేనియంను అణువిద్యుత్ ఉత్పత్తి, సైనిక అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు
2. శుద్ధి చేసిన యురేనియం నియంత్రణ, పర్యవేక్షణ సరఫరాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పూర్తి హక్కులను కలిగి ఉంటుంది
3. U235 అనేది వాతావరణంలో ఉన్న ఒకే ఒక నూైక్లెడ్ రూపం. ఇది ఉష్ణ న్యూట్రాన్ల తాడనంలో విచ్ఛిత్తికి లోనవుతుంది
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవన్నీ
3. దేశంలో అణురియాక్టర్ల కాలానుక్రమ అమరిక?
1. థోరియం ఆధారిత రియాక్టర్లు
2. అధిక పీడన భార జల రియాక్టర్లు
3. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు
ఎ) 1, 2, 3 బి) 2, 3
సి) 1, 3 డి) 3, 2, 1
4. కింది వాటిని జతపరచండి.
ఎ. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ 1. ముంబై
బి. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ 2. కలకత్తా
సి. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ 3. కల్పకం
డి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4. జాదుగూడ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
5. భారత్ అణు పరీక్షలకు సంబంధించి సరైనవి?
1. మొదటి అణుపరీక్షలను జరిపిన తేదీ 18.5.1974. ఈ పరీక్ష పేరు స్మైలింగ్ బుద్ధ
2. పోఖ్రాన్ 2 అణుపరీక్షల పేరు ఆపరేషన్ శక్తి
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
6. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. 1945 ఆగస్టులో హిరోషిమాలో వేసిన బాంబు పేరు ‘లిటిల్ బాయ్’
2. క్రూడ్ యురేనియం ఆక్సైడ్ యెల్లో కేక్ అంటారు
3. హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీన సూత్రం ఆధారంగా పనిచేస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) పైవన్నీ డి) పైవేవీ కావు
7. కింది వాటిలో CTBT (Comprehensive Nuclear Test Ban Treaty) గురించి సరికానిది గుర్తించండి.
1. సీటీబీటీ 1996లో ఆమోదించింది, కాని ఇప్పటికీ అమలులోకి రాలేదు
2. ఈ ఒప్పందాన్ని భారతదేశం,
పాకిస్థాన్‌లు అంగీకరించలేదు
3. చైనా, అమెరికాలు అంగీకరించాయి, కానీ అమలు చేయలేదు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) పైవన్నీ
8. కింది వాటిలో అణువ్యాప్తిరహిత ఒప్పందానికి సంబంధించి సరైనవి?
1. అణ్వాయుధాల విస్తరణను అరికట్టడం (లేదా) నియంత్రించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం
2. ఈ ఒప్పందం 1968లో ఆమోదించబడింది. కానీ 1970లో అమలులోకి వచ్చింది
3. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉండి ఈ ఒప్పందాన్ని అంగీకరించని 4 దేశాలు – భారతదేశం, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సుడాన్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
9. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. పృథ్వీ ఒక అల్ప శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి
2. త్రిశూల్ ఒక అల్పశ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి
3. ఆకాష్ ఒక మధ్యంతర శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి
4. నాగ్ అనేది మూడో తరానికి చెందిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) పైవన్నీ
10. కింది వాటిలో ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి సరైనవి గుర్తించండి.
1. ఇది రెండు ఇంటర్ సెప్టర్ మిసైల్స్ కలిగిన రెండు అంచెల విధానం
2. పృథ్వీ గగనతల రక్షణ క్షిపణిని ఎక్కువ ఎత్తులోని శత్రు క్షిపణులను అడ్డుకోడానికి ఉపయోగిస్తారు
3. ఆధునిక గగనతల రక్షణ క్షిపణిని తక్కువ ఎత్తులోని శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) పైవన్నీ
11. కింది వాటిలో అస్త్ర క్షిపణి గురించి సరైనవి గుర్తించండి.
1. DRDOచే తయారు చేసిన ఇది దృశ్య అవధి కంటే ఎక్కువ పరిధి ఉత్తేజిత రాడార్, గగనతలం నుంచి గగనతల క్షిపణి
2. 300 కి.మీ.ల పరిధిని కలిగి ఉంటుంది
3. ఇది ఒక ఘన ఇంధన రాకెట్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
12. కింది వాటిలో నాగ్ క్షిపణి గురించి సరికానిది గుర్తించండి.
1. ఇది మూడవ తరానికి చెందిన ఫైర్ అండ్ పర్గెట్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి
2. దీన్ని భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడానికి D అనే వాహనాన్ని ఉపయోగిస్తారు
3. దీన్ని 20-25 కి.మీ.ల పరిధిలో గల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 4 డి) 1, 2, 4
13. జతపరచండి.
ఎ. సాగరిక 1. ఇది 350 కి.మీ.ల పరిధి గల పృధ్వి రకానికి చెందిన వినూత్న క్షిపణి
బి. షార్గ 2. అణు సామర్థ్యం గల
జలాంతర్గామి నుంచి ప్రయోగించే
బాలిస్టిక్ క్షిపణి
సి. ధనుష్ 3. అల్పశ్రేణి, ఘన ఇంధనం
ఉపరితలం నుంచి ఉపరితల
బాలిస్టిక్ క్షిపణి
డి. ప్రహర్ 4. హైపర్ సోనిక్, ఉపరితలం
నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-4, బి-2, సి-3, డి-1
14. నిషాంత్ గురించి కింది వాటిలో సరైనవి?
1. ఇది ఒక మానవరహిత వైమానిక నౌక
2. శత్రు దేశాల సమాచార సేకరణకు, నిఘా కోసం ఉపయోగిస్తారు
3. కుందేలులాంటి పరికరంతో ప్రయోగించి, పారాచూట్ ద్వారా వెనక్కి తేగల ఏర్పాటు ఉంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
15. కింది వాటిలో మానవరహిత వైమానిక (UAV) కానిది?
1. లక్ష్య 2. నిషాంత్
3. రుస్తుం 4. తేజస్
ఎ) 1, 4 బి) 3, 4
సి) 4 డి) 2
16. కింది వాటిలో బ్రహ్మోస్ గురించి సరికానిది?
1. ఇది ఒక సూపర్సోనిక్ క్రూస్ మిసైల్
2. ప్రపంచంలోకెల్లా వేగవంతమైన, శత్రు రాడార్లను ఛేదించే క్షిపణి
3. 700 కి.మీల పరిధిని కలిగి ఉంటుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3 డి) 1, 3
17. భారతదేశంలో శక్తి ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంస్థలు?
ఎ. NHPC బి. NTPC
సి. NEEPCO
ఎ) ఎ, బి బి) ఎ, సి
సి) బి, సి డి) పైవన్నీ
18. దేశంలో 2016 మే 31 నాటికి అధిక సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
ఎ) తమిళనాడు బి) రాజస్థాన్
సి) పశ్చిమబెంగాల్ డి) గుజరాత్
19. దేశంలో అత్యధికంగా వాయు శక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) తమిళనాడు
సి) మహారాష్ట్ర డి) ఛత్తీస్‌గఢ్
20. కింది వాటిలో జీవ ఇంధనాలు?
ఎ. బయో డీజిల్ బి. బయో ఇథనాల్
సి. బయో గ్యాస్ డి. బయో మాస్
ఎ) ఎ, బి, సి బి) ఎ, సి, డి
సి) ఎ, బి, డి డి) పైవన్నీ
21. కింది వాటిలో బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగపడే మొక్కలు?
ఎ) అడవి ఆముదం బి) కానుగ
సి) రావి డి) పామాయిల్
22. కిణ్వన ప్రక్రియ ద్వారా పొందే జీవ ఇంధనాలు?
ఎ. బయోడీజిల్ బి. బయో ఇథనాల్
సి. బయో గ్యాస్ డి. బయో మాస్
ఎ) ఎ, బి బి) బి
సి) బి, సి డి) పైవన్నీ
23. బయోడీజిల్ ఉత్పత్తి చేసే మొక్కను, సంబంధిత దేశాన్ని జతపరచండి.
1. అమెరికా ఎ. సోయాబీన్
2. ఫ్రాన్స్ బి. పామాయిల్
3. మలేషియా సి. కానుగ
4. ఇండియా డి. రేప్‌సీడ్ (rapeseed)
ఎ) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
24. కింది వాటిలో బయోగ్యాస్ గురించి సరైనది గుర్తించండి.
ఎ. దీనికి గల మరోపేరు – గోబర్ గ్యాస్
బి. ఇందులో గల ప్రధాన వాయువు ‘మీథేన్’
సి. బయోగ్యాస్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది
డి. పశువుల పేడ, ఆకుల నుంచి తయారు చేస్తారు
ఎ) ఎ, బి, డి బి) ఎ, బి
సి) ఎ, సి డి) పైవన్నీ
25. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించిన సంస్థలను, అవి ఉన్న ప్రదేశాల ఆధారంగా జతపరచండి.
1. నేషనల్ సెంటర్ ఫర్ ఫొటో వోల్టాయిక్ రిసెర్చ్ & ఎడ్యుకేషన్
ఎ. కోల్‌కతా
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్, టెక్నాలజీ
బి. ముంబై
3. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ
సి. అహ్మదాబాద్
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
డి. రాజస్థాన్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
26. వాయుశక్తి ఉత్పన్నంలో టర్బైన్ తిరగడానికి ఉపయోగపడే గాలికి ఉండవలసిన కనీస వేగం?
ఎ) 10 బి) 12
సి) 18 డి) పైవేవీ కావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు