ప్రణాళిక సంఘం – జాతీయాభివృద్ధి మండలి
గాంధేయ ప్రణాళిక (Gandhian plan) 1994
- గాంధీజీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని, వార్థా కమర్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన శ్రీమన్నారాయణ అగర్వాల్ 1944లో గాంధేయ ప్రణాళికను రూపొందించారు.
- గాంధేయ ప్రణాళిక రూ. 3500 కోట్ల పెట్టుబడులతో రూపొందించారు.
- ఈ ప్రణాళికలో వ్యవసాయం- చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు.
ప్రజా ప్రణాళిక (Peoples plan) 1945
- భారత కార్మిక సమాఖ్యకు చెందిన మానవేంద్ర నాథ్‌రాయ్ 1945లో ప్రజా ప్రణాళికను రూపొందించారు.
- ప్రజా ప్రణాళికను 10 సంవత్సరాల కాల వ్యవధితో రూ.15000 కోట్ల పెట్టుబడితో రూపొందించారు.
- ఈ ప్రణాళికలో వ్యవసాయం వినియోగవస్తు పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం.
- ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది.
- స్థూలంగా చెప్పాలంటే పరిశ్రమలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ప్రైవేటు రంగ పరిశ్రమలను జాతీయీకరణ చేయాలని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఎం.ఎన్.రాయ్ పేర్కొన్నారు.
పేపర్ ప్రణాళిక (Paper plan)
- స్వాతంత్య్రానికి పూర్వం రూపొందించిన ప్రణాళికలను పేపర్ప్లాన్ అంటారు. కారణం ఈ ప్రణాళికలు కాగితాలకు పరిమితమైనవే గాని వీటిని ప్రభుత్వం అమలు చేయలేదు. కారణం అప్పటికీ భారతదేశం పరాయి పాలన కింద ఉండటమే.
హై లెవల్ అడ్వయిజరీ ప్లానింగ్ బోర్డ్ 1946
- 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికలు, అభివృద్ధి సమస్యలను అధ్య యనం చేయడానికి హై లెవల్ అడ్వయిజరీ ప్లానింగ్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది.
- ఈ కమిటీ తన నివేదికలో ఒక స్థిర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
సర్వోదయ ప్రణాళిక
- స్వాతంత్య్రం తర్వాత మొదట రూపొందించిన ప్రణాళిక సర్వోదయ ప్రణాళిక.
- 1950 జనవరి 1న జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను ఆచార్య వినోబాభావే ఆశయాలకు అనుగుణంగా, గాంధీజీ సిద్ధాంతాలతో ప్రేరణ పొంది రూపొందించారు.
- ఈ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న కుటీర పరిశ్రమలు హైలెట్ చేయబడ్డాయి.
- ఇది భూసంస్కరణలు, వికేంద్రీకృత భాగస్వామ్య ప్రణాళికలతోపాటు విదేశీ సాంకేతికత నుంచి స్వేచ్ఛను కూడా నొక్కి చెప్పింది.
ప్రణాళిక సంఘం (Planning Commission)
- భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరం అని మొదట సూచించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1938)
- 1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని (NPC- National Planning committee) ఏర్పాటు చేశారు. ఈ జాతీయ ప్రణాళిక కమిటీకి కె.టి.షా కార్యదర్శిగా ఉన్నారు.
- ఈ కమిటీ తన నివేదికను 1948లో ప్రభుత్వానికి సమర్పించింది.
- ఈ కమిటీ సూచన మేరకు కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు (1950 ఫిబ్రవరి 15న) అప్పటి ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముగం షెట్టి ప్రకటించారు.
- ప్రణాళిక సంఘాన్ని 1950లో మార్చి 15న ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
- ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అంటారు.
- ఈ ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ.
- ఇది కేంద్ర ప్రభుత్వానికి సలహా పూర్వక సంస్థ మాత్రమే
- ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా భారత ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు.
- ప్రణాళిక సంఘానికి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తాడు.
- ప్రణాళిక సంఘంలో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యత్వం కలిగి ఉంటారు. ప్రధానమంత్రి, ఆర్థికశాఖ మంత్రి, ప్రణాళిక మంత్రి.
- ప్రణాళిక సంఘం సభ్యుల సంఖ్య నియామకం తొలగింపు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
- ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు – జవహర్లాల్ నెహ్రు
- ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్నందా
- ప్రణాళిక సంఘానికి చివరి అధ్యక్షులు నరేంద్రమోదీ
- ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా
- ప్రణాళిక సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- ప్రణాళిక సంఘం భవనం పేరు యోజన భవనం
- ప్రణాళిక సంఘం ప్రచురించే అధికార పత్రిక యోజన
- ఈ ప్రణాళికలను ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు.
- కేంద్ర ప్రణాళిక సంఘం ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది.
- ప్రణాళిక సంఘం ప్రణాళికలకు రూపకల్పన చేస్తుంది.
- ప్రణాళిక సంఘం ప్రణాళికలను తయారు చేసేటప్పుడు ఆయా స్థాయిలను బట్టి రూపొందిస్తుంది. అంటే కేంద్ర ప్రణాళికలను రూపొందించేటప్పుడు దేశ వనరులను బట్టి అంటే సహజ, మానవ, ఆదాయ వనరులను ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేస్తుంది.
- ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి అంతిమంగా ఆమోదించే అధికారం గలది జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ)
జాతీయాభివృద్ధి మండలి (national development council) 1952
- జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ) 1952 ఆగస్టు 6న ఏర్పడింది.
- ప్రణాళిక సంఘం మాదిరిగా జాతీయాభివృద్ధి మండలి కూడా రాజ్యాంగేతర సంస్థ. శాసనేతర సంస్థ.
- జాతీయాభివృద్ధి మండలి ఒక సలహా సంఘం మాత్రమే.
- ఎన్డీసీ అనేది కేంద్ర కార్యనిర్వాహక వర్గం సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు.
- దీని ముఖ్యవిధి ప్రణాళికల పరిశీలన, ప్రణాళికలను ఆమోదించడం.
- ఎన్డీసీ రాష్ర్టాలకు ప్రణాళిక సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది.
- జాతీయాభివృద్ధి మండలికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రధానమంత్రి.
- ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎన్డీసీకి కార్యదర్శిగా ఉంటాడు.
- ప్రారంభంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రమే ఎన్డీసీ సభ్యులుగా ఉండేవారు.
- 1967లో పరిపాలనా సంస్కరణ సంఘం చేసిన సిఫారసు మేరకు దీనిని పునర్ వ్యవస్థీకరించి, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్రణాళిక సంఘం సభ్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు.
- ప్రణాళిక ముసాయిదాకు మార్పులు చేసే అధికారం ఎన్డీసీ కలిగి ఉంటుంది.
- ప్రణాళిక సంఘం కంటే ఎన్డీసీకి ఎక్కువ అధికారాలున్నాయి.
- ఎన్డీసీని సూపర్ క్యాబినెట్‌గా 2వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన కె. సంతానం
వర్ణించారు.
Previous article
Indian Army లో జాబ్స్.. సిపాయి ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు