రాష్ట్రంలో పరిశ్రమలు..ఉత్పత్తులకు నెలవు
తెలంగాణప్రాంతం మొదటి నుంచి పరిశ్రమలకు నెలవుగా ఉంది. పరిశ్రమలను వాటి ముడి పదార్థాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1. వ్యవసాయాధారిత పరిశ్రమలు
2. అటవీ ఆధారిత పరిశ్రమలు
3. ఖనిజాధారిత పరిశ్రమలు
వ్యవసాయాధారిత పరిశ్రమలు
నూలు పరిశ్రమ
- భారతదేశంలో అతి పురాతన, అతిపెద్ద పరిశ్రమ నూలు పరిశ్రమ
- భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు 1818లో కలకత్తా సమీపంలోని ఫోర్ట్గ్లాస్టర్ వద్ద ప్రారంభమయింది. కానీ అభివృద్ధి లేక దీన్ని మూసివేశారు.
- 1854లో ముంబైలో నూలు మిల్లు ప్రారంభం అయింది. దీన్ని దేశంలో మొదటి నూలు మిల్లుగా పరిగణిస్తున్నారు.
- తెలంగాణలో ఈ పరిశ్రమ ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది.
- అజాంజాహీ మిల్లు 1934లో వరంగల్‌లో స్థాపించగా 1990లో దీన్ని మూసివేశారు.
- నటరాజ్ స్పిన్నింగ్ మిల్లు : నిర్మల్
- ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు – సదాశివపేట(1980)
- తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు – బాలానగర్ (మేడ్చల్-మల్కాజిగిరి) 1972లో ఏర్పాటు చేశారు.
- సూర్యవంశి స్పిన్నింగ్‌మిల్లు – భువనగిరి
- పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ : ఉప్పల్ (మేడ్చల్ మల్కాజిగిరి)
- దేశంలో నూలును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం – మహారాష్ట్ర
- గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్లు 1980
- కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు లిమిటెడ్- కరీంనగర్
- సంఘీ వస్త్ర పరిశ్రమ – ఉమర్ఖాన్ గూడ (రంగారెడ్డి)
- మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా – కాన్పూర్ చక్కెర పరిశ్రమ
- మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా – కోయంబత్తూర్
చక్కెర పరిశ్రమ
- దేశంలో మొదటి చక్కెర మిల్లు స్థాపించిన ప్రదేశం – చంపారన్ -1904
- తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ 1937లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో స్థాపించారు.
- ఇది ఆసియాలోకెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారం దీనికి అనుబంధంగా మరికొన్ని షుగర్ ఫ్యాక్టరీలను నెలకొల్పారు. అవి
1) జహీరాబాద్ (సంగారెడ్డి)-1973
2) మిర్యాలగూడ (నల్లగొండ) -1977
3) ముత్యంపేట (జగిత్యాల -1981
4) సారంగపూర్ (నిజామాబాద్)
- చక్కెర ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, ప్రపంచంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న దేశాలు క్యూబా, ఇండియా.
పొగాకు పరిశ్రమ
- ఈ పరిశ్రమ ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది.
- వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్టీ) ని 1920లో హైదరాబాద్‌లోని అజామాబాద్‌లో స్థాపించారు. 1983లో స్వతంత్ర సంస్థగా మారింది.
- సిగరెట్స్ (చార్మినార్ బ్రాండ్)ని తయారు చేసి సరఫరా చేస్తుంది.
- హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీని 1930లో ముషిరాబాద్లో (హైదరాబాద్) స్థాపించారు. దీన్ని గోల్కొండ బ్రాండ్ అని కూడా అంటారు.
పట్టు పరిశ్రమ
- భారతదేశంలో మొదటి పట్టు పరిశ్రమ 1832లో పశ్చిమబెంగాల్లోని హౌరా వద్ద స్థాపించారు.
- తెలంగాణలో ఆసిఫాబాద్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి)లోని గిరిజన ప్రజలు టస్సర్ సిల్కును ఉత్పత్తి చేస్తున్నారు.
- పోచంపల్లి చీరలు – యాదాద్రి భువనగిరి
- తెలంగాణ సిల్క్‌సిటీ పోచంపల్లి
- గద్వాల పట్టు చీరలు – జోగులాంబ గద్వాల
- చేనేత పరిశ్రమ – సిరిసిల్ల
- దేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక.
- సెంట్రల్ సిల్క్ బోర్డు బెంగళూరులో ఉంది.
- ప్రపంచంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా
అటవీ ఆధారిత పరిశ్రమలు
కాగితం పరిశ్రమ
సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ ఇండస్ట్రీ రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమ. దీన్ని 1935లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.
కాగితం ఉత్పత్తి 1942లో ప్రారంభమైంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ. కాగజ్‌నగర్ ప్రాంతం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు.
రేయాన్స్ పరిశ్రమ – కమలాపూర్‌లో ఏర్పాటు చేశారు.
చార్మినార్ పేపర్ మిల్ – ముత్తంగి
నాగార్జున పేపర్ మిల్ – పటాన్ చెరు
భద్రాచలం పేపర్ బోర్డు – సారపాక
దేశంలో మొదటి కాగితపు పరిశ్రమను 1832లో పశ్చిమబెంగాల్లోని షెరాన్పూర్లో ఏర్పాటు చేశారు.
దేశంలో మొదటి అధునాతన కాగితపు పరిశ్రమ 1870 బాలిగంజ్ పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు.
కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం – మహారాష్ట్ర
ైప్లెవుడ్ పరిశ్రమకాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం – యూఎస్ఏ
ఐటీసీ – పీఎస్పీడీ కాగితపు పరిశ్రమ -సారపాకలో ఏర్పాటు చేశారు.
తోలు పరిశ్రమ
భద్రాచలం పేపర్ మిల్లు – భద్రాచలం
- రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ైప్లెవుడ్ పరిశ్రమ ఉంది.
1) నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (పటాన్చెరు)
2) హైదరాబాద్ ైప్లెవుడ్ లిమిటెడ్ (నాచారం)
రాష్ట్రంలో కింది ప్రాంతాల్లో లెదర్ పార్కులు ఉన్నాయి.
- జమ్మికుంట, రుక్కాపూర్
- దండెంపల్లి
- హెచ్.ఎస్.దర్గా
- మందమర్రి
- ఖనిజ ఆధారిత పరిశ్రమలు
- స్టేషన్ ఘన్పూర్
- ఆర్మూర్
- ఇనుము -ఉక్కు పరిశ్రమ (స్పాంజ్ అండ్ ఐరన్ పరిశ్రమ)మల్లెమడుగు
- జాన్కుంట
- పోలెపల్లి తోలు పరిశ్రమ
- దుద్దెడ తోలు పరిశ్రమ
- దేశంలో తోలు పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు.
- తెలంగాణలో గల ప్రధాన ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఇనుము- ఉక్కు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ.
- దేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ : పాల్వంచ (1980) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- దేశంలో మొదటి ఇనుము ఉక్కు కార్మాగారం – పోర్టోనోవా (తమిళనాడు) 1830. ఇది 1866లో మూత పడింది.
- దేశంలో ప్రైవేటు రంగంలో మొదటిసారిగా ఏర్పడిన ఇనుము ఉక్కు కర్మాగారం : టిఐఎస్సీఓ, జంషెడ్పూర్ (జార్ఖండ్)
సిమెంట్ పరిశ్రమ
- ఈ కార్మాగారాన్ని 1907 ఆగస్టు 26న జంషెడ్జీ దోరబ్జీ టాటా (జేఆర్డీ టాటా) స్థాపించారు.
- దీనిలో దుక్క ఇనుము (PIG IRON) ఉత్పత్తి 1911లో ఉక్కు ఉత్పత్తి 1912లో ప్రారంభం అయింది,
- ప్రస్తుతం భారత్‌లో పనిచేస్తున్న అతి పురాతన ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో(TATA IRON AND STEEL COMPANY -TISCO)
- సిమెంట్ పరిశ్రమ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే సున్నపురాయి ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో లభిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగాల్లో మైనింగ్ రంగం ఒకటి.
- దక్షిణ భారతదేశం మొత్తం మీద విస్తారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
- తెలంగాణ మొదటి సిమెంట్ ఫ్యాక్టరీ – ఏసీసీ (అసోసియేట్ సిమెంట్ కంపెనీ) -మంచిర్యాల (1958)
- కేశోరాం సిమెంట్స్ – బసంత్‌నగర్ పెద్దపల్లి జిల్లా (1969)
- రాశి సిమెంట్స్ – వాడపల్లి
- మహాసిమెంట్స్ – మేళ్ళ చెరువు
- నాగార్జున సిమెంట్స్ – సింహపురి
- దక్కన్ సిమెంట్స్ – హుజూర్ నగర్ (సూర్యాపేట)
- దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ – దక్కన్ సిమెంట్స్
- దక్కన్ సిమెంట్స్ పబ్లిక్ లిమిటెడ్‌గా 1957లో అయింది. దక్కన్ సిమెంట్స్ మస్కట్ ‘దాము’.
- రాష్ట్ర ఖనిజాల అంచనా, చిన్న ఖనిజాల తవ్వకం కోసం రాష్ట్ర ఖనిజ తవ్వకాల ట్రస్టును ఏర్పాటు చేశారు. దీన్ని గనులు, ఖనిజాల చట్టం -1957 ప్రకారం ఏర్పాటు చేశారు
- జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్‌ను 2015లో ఏర్పాటు చేశారు.
- ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాలు, వారి ప్రయోజనాల కోసం కృషిచేయడం దీని ఉద్దేశం.
- దీని కింద వచ్చే నిధులను మైనింగ్ ప్రాంతాలకు సంబంధించి తాగునీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్య, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం, మౌలిక వసతులు, పునరుద్ధరణ ఇంధన శక్తి కల్పనకు ఉపయోగిస్తారు.
- 2017 డిసెంబర్ వరకు 1328.25 కోట్ల నిధులు డీఎంఎఫ్ కింద వసూలు చేశారు.
జీబీకే పబ్లికేషన్స్హైదరాబాద్, 8187826293
ప్రాక్టీస్ బిట్స్
1. ద్వితీయ రంగానికి మైనింగ్, క్వారియింగ్ కలిపితే ఏ రంగం వస్తుంది?
1) వ్యవసాయ, అనుబంధ రంగాలు
2) పారిశ్రామిక రంగం
3) సేవారంగం
4) ప్రాథమిక రంగం
2. లాక్డౌన్ కాలంలో బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రభుత్వ సహాయంతో 2 నెలల వాయిదాల్లో ఒక కార్మిక కుటుంబానికి ఎన్ని రూ.ల చొప్పున ఆర్థిక సహాయం చేసింది?
1) రూ. 10002) రూ. 2000
3) రూ. 5004) రూ. 1500
3. టీఎస్ ఐపాస్ ద్వారా 2015 నుంచి అధిక పెట్టుబడులు చూపిన రంగాలు వరుస క్రమంలో అమర్చండి?
ఎ) పారాస్యూటికల్స్ అండ్ కెమికల్స్
బి) రియల్ ఎస్టేట్ పారిశ్రామిక పార్కులు, ఐటీ బిల్డింగ్స్
సి) థర్మల్ పవర్ ప్లాంట్స్
డి) సౌర, పునరుద్ధరణ ఇంధన శక్తి
1) ఎ, బి, సి, డి 2) సి, బి, డి, ఎ
3) ఎ, డి, బి, సి4) డి, సి, బి, ఎ
4. పెట్టుబడి రాయితీ కార్యక్రమం కింద పరిశ్రమల స్థాపన వ్యయంలో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?
1) 30 శాతం2) 35 శాతం
3) 40 శాతం4) 45 శాతం
5. తెలంగాణలో టీఎస్ ఐపాస్ మెగా ప్రాజెక్టులకు ఎన్ని రోజుల్లో అనుమతి ఇవకుంటే 1000 రూపాయల జరిమానా విధిస్తారు?
1) 10 2) 15 3) 20 4) 30
6. ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్యలో అత్యధిక వాటా కలిగిన పరిశ్రమలు?
1) చిన్న తరహా పరిశ్రమలు
2) సూక్ష్మ పరిశ్రమలు
3) టిని ఇండస్ట్రీస్ 4) బి, సి
7. ఎంఎస్ఎంఈలో మొత్తం పెట్టుబడిలో, ఉపాధి కల్పనలో అత్యధిక వాటా కలిగిన పరిశ్రమ?
1) సూక్ష్మ పరిశ్రమలు
2) చిన్న తరహా పరిశ్రమలు
3) మధ్య తరహా పరిశ్రమలు
4) భారీ పరిశ్రమలు
8. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ యూనిట్లు అత్యధికంగా కలిగిన జిల్లా ఏది?
1) రంగారెడ్డి 2) సంగారెడ్డి
3) కరీంనగర్ 4) హైదరాబాద్
9. రాష్ట్రంలో సూక్ష్మ , చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)లో పెట్టుబడి అధికంగా కల్పించిన మొదటి జిల్లా?
1) రంగారెడ్డి 2) సంగారెడ్డి
3) కరీంనగర్ 4) మేడ్చల్ మల్కాజిగిరి
సమాధానాలు
1-2 2-4 3-2 4-4
5-2 6-4 7-2 8-4
9-4
1-2 2-4 3-2 4-4
5-2 6-4 7-2 8-4
9-4
Previous article
శిలల మీద పెరిగే మొక్కలను ఏమంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






