నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
భారత అంతరిక్ష కార్యక్రమాలు
1. కింది వాటిలో, భూపరిశీలన, ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించే సంస్థ?
ఎ) స్పేస్ అప్లికేషన్ సెంటర్
బి) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
సి) ఇస్రో శాటిలైట్ సెంటర్
డి) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
2. కింది వాటిలో ఒకే ప్రయోగంలో 20 ఉపగ్రహాలను వాటి కక్ష్యల్లోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌక?
ఎ) PSLV-C33 బి) PSLV-C35
సి) PSLV-C34 డి) PSLV-C37
3. ప్రారంభంలో అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించింది?
ఎ) అంతరిక్ష విభాగం
బి) అణుశక్తి విభాగం
సి) INCOSPAR
డి) యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్
4. IRS శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం?
ఎ) అంతరిక్ష అన్వేషణ
బి) టెలికమ్యూనికేషన్
సి) మార్గనిర్దేశన సేవలు
డి) రిమోట్ సెన్సింగ్
5. సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్ష్యలు?
ఎ) నిమ్న భూకక్ష్యలు
బి) సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలు
సి) భూస్థిర కక్ష్యలు
డి) మధ్యస్థ భూకక్ష్యలు
6. కింది వాటిలో PSLV-C37 పేలోడ్ కానిది?
ఎ) Cartosat-2B బి) INS-1A
సి) INS-1B డి) Scatsat-1
7. కింది వాటిలో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం కానిది?
ఎ) ప్రథం (Pratham)
బి) జుగ్ను (Jugnu)
సి) ఎడ్యుశాట్ (EDUSAT)
డి) స్టడ్‌శాట్ (STUDSAT)
8. కింది వాటిలో ఏ ఉపగ్రహం స్థానాన్ని SCAT SAT-1 తో భర్తీ చేయనుంది?
ఎ) Resource Sat-1
బి) Resource Sat-2
సి) Ocean Sat-2
డి) RITSAT-1
9. కింది వాటిలో స్వదేశీ తయారీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించిన ప్రయోగం?
ఎ) GSLV-F05 బి) GSLV-D6
సి) GSLV-D5 డి) GSLV-D3
10. కింది వాటిలో చంద్రయాన్-1 పేలోడ్ కానిది?
ఎ) Hyper Spectral Imager
బి) Terrain Mapping Camera
సి) Lyman-Alpha Photometre
డి) Lunar Laser Ranging Instrument
11. కింది వాటిలో ఆస్ట్రోశాట్‌లో పేలోడ్గా ఉపయోగించేది?
ఎ) Ultra violet Imaging/ Telescope
బి) Radiation Dose Monitor
Experiment
సి) Thermal Infrared Imaging
Spectrometre
డి) Hyper Spectral Imager
12. కింది వాటిలో MOM గెలుచుకున్న అవార్డ్?
ఎ) స్పేస్ అవార్డ్-2015
బి) అంతర్జాతీయ సహకార పురస్కారం -2014
సి) స్పేస్ పయనీర్ అవార్డ్-2014
డి) స్పేస్ పయనీర్ అవార్డ్-2015
13. GAGAN పేలోడ్ అమర్చని ఉపగ్రహం?
ఎ) GSAT-8 బి) GSAT-10
సి) GSAT-15 డి) GSAT-14
14. ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతం?
ఎ) డెహ్రాడూన్ బి) హైదరాబాద్
సి) ఖరగ్‌పూర్ డి) జోధ్‌పూర్
15. కింది వాటిలో తిరువనంతపురంలో స్థాపించిన సంస్థ?
ఎ) LPSC బి) VSSC
సి) DECU డి) IISU
16. కింది వాటిలో ఇస్రో పరిశోధనా సంస్థ కానిది?
ఎ) Physical Research Laboratory
బి) ISRO Interial Systems Unit
సి) Master Control Facility Centre
డి) Space Application Centre
17. రెండు విభిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను పంపిన PSLV ప్రయోగం?
ఎ) PSLV-C35
బి) PSLV-C36
సి) PSLV-C37
డి) PSLV-C34
18. భారతదేశ మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్?
ఎ) Resource Sat-2
బి) RISAT
సి) Ocean Sat డి) Carto Sat
19. Stretched Rohini ఉపగ్రహ శ్రేణిని వాటి కక్ష్యల్లోకి చేర్చిన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక?
ఎ) SLV బి) ASLV
సి) GSLV డి) PSLV
20. భారత్‌లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి?
ఎ) ఆర్యభట్ట బి) భాస్కర-1
సి) రోహిణి డి) SROSS
21. కింది వాటిలో 17 మార్చి 2013 నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకొన్న కార్యక్రమం?
ఎ) భూపరిశీలన కార్యక్రమం
బి) భారత రిమోట్ సెన్సింగ్
సి) GAGAN డి) BHUVAN
22. కింది వాటిలో ఇస్రో పరిధిలో లేని సంస్థ?
ఎ) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
బి) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్
సి) ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
డి) స్పేస్ అప్లికేషన్ సెంటర్
23. కింది వాటిలో బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థ?
ఎ) యాంత్రిక్స్ కార్పొరేషన్
బి) ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్ట్రిక్స్ సిస్టమ్స్
సి) ఇస్రో ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్
డి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
24. కింది వాటిలో అహ్మదాబాద్‌లో స్థాపితం కాని సంస్థ?
ఎ) స్పేస్ అప్లికేషన్ సెంటర్
బి) డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ యూనిట్
సి) నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
డి) ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
25. భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచినది?
ఎ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
బి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
సి) నేషనల్ సారాభాయ్ స్పేస్ సెంటర్
డి) ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీకండక్టర్
26. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఉన్నది?
ఎ) బాలానగర్ బి) జీడిమెట్ల
సి) షాద్‌నగర్ డి) జోధ్‌పూర్
27. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ప్రాంగణం లేని ప్రాంతం?
ఎ) బాలానగర్ బి) షాద్‌నగర్
సి) జీడిమెట్ల డి) సనత్‌నగర్
28. కింది వాటిలో సరిగా జతపరచనది?
ఎ) కేంద్ర రిమోట్ సెన్సింగ్ ప్రాంతీయ కేంద్రం – నాగపూర్
బి) పశ్చిమ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం – జోధ్‌పూర్
సి) దక్షిణ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం – బెంగళూరు
డి) తూర్పు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం – పాట్నా
29. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ, ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) జీడిమెట్ల బి) జోధ్‌పూర్
సి) అహ్మదాబాద్ డి) తిరువనంతపురం
30. స్కాట్‌శాట్-1 తో భర్తీ చేస్తున్న ఉపగ్రహం?
ఎ) ఓషన్‌శాట్-1 బి) ఓషన్‌శాట్-2
సి) రిసోర్స్ శాట్-1 డి) కార్టోశాట్-1
31. భారత్‌లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య?
ఎ) 8 బి) 5 సి) 2 డి) 1
32. నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్ బి) హైదరాబాద్
సి) గాదంకి డి) బెంగళూరు
33. ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, సౌరకుటుంబ అధ్యయనాలపై పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాద్‌లో ఏర్పాటైన సంస్థ?
ఎ) నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ లేబొరేటరీ
బి) డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్
సి) స్పేస్ అప్లికేషన్ సెంటర్
డి) ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీ
34. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
ఎ) ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ – అహ్మదాబాద్
బి) ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ – అహ్మదాబాద్
సి) స్పేస్ అప్లికేషన్ సెంటర్ – అహ్మదాబాద్
డి) డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ – అహ్మదాబాద్
35. బెంగళూరులో స్థాపించిన ఇస్రో శాటిలైట్ సెంటర్‌కు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి.
వాక్యం 1- దీన్ని 1972లో ఏర్పాటు చేశారు
వాక్యం 2- తొలుత దీన్ని ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్‌గా పిలిచారు
వాక్యం 3- స్వదేశీయంగా ఉపగ్రహాల డిజైన్, అభివృద్ధి, రూపొందిచడం, పరీక్షించడం దీని ప్రధాన విధులు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
36. మొదటిసారి ప్రయోగించిన సంవత్సరం ఆధారంగా కింది ప్రయోగవాహక నౌకల్లో తప్పుగా అమర్చిన దాన్ని గుర్తించండి.
ఎ) శాటిలైట్ లాంచ్ వెహికిల్ -1979
బి) ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
– 1980
సి) జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికిల్
– 2001
డి) పోలార్ శాటలైట్ లాంచ్ వెహికిల్
-1993
37. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ASLV) దృష్ట్యా తప్పుగా ఇచ్చిన వాక్యాలు/వాక్యాన్ని గుర్తించండి.
వాక్యం 1 – ASLV నాలుగు అంచెల, ఘన ఇంధనాన్ని వినియోగించుకునే నౌక
వాక్యం 2 – 150 కిలోల బరువున్న పేలోడ్లను ఇది ప్రవేశపెడుతుంది
వాక్యం 3 – మొదట ASLVని 1987 మార్చి 24న ప్రయోగించారు
ఎ) 1 బి) 2, 3
సి) 3 డి) 2
38. కింది వాహకనౌకల్లో 8000 కిలోల బరువున్న ఉపగ్రహాలను నిమ్న భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగేది?
ఎ) PSLV-XL
బి) GSLV Mk -II
సి) GSLV-Mk 1 డి) LVM-III
39. కింది వాటిలో సరైనది గుర్తించండి.
వాక్యం 1 – GSLV Mk 3 ను LVM-3 గా పరిగణిస్తారు
వాక్యం 2 – దీని ద్వారా 4000 కిలోల బరువైన ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యల్లోకి ప్రవేశపెడతారు
వాక్యం 3 – ప్రయోగసమయంలో దీని బరువు 640000 కేజీలు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
40. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌ను కలిగిన, విఫలమైన GSLV వాహక నౌక?
ఎ) GSLV-F05
బి) GSLV-D6
సి) GSLV-D5
డి) GSLV-D3
41. 2017 ఫిబ్రవరి 15 వరకూ ప్రయోగించిన GSLV ల సంఖ్య?
ఎ) 9 బి) 10
సి) 11 డి) 12
42. PSLV నాలుగో దశలో వినియోగించే ఇంధనం?
ఎ) Hydraxyl Terminated Poly Butadine (HTPB)
బి) Un-Symmetrical Dimethyle Hydrazine (UDMH)
సి) Mono Methyl Hydrazine (MMH)
డి) బి, సి
43. కింది వాటిలో రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించిన నౌకలను గుర్తించండి.
1. PSLV-C29 2. PSLV-C31
3. PSLV-C33 4. PSLV-C35
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 4
44. కింది వాటిలో six strap-on booster మోటార్లను తొలగించగా ఏర్పడిన PSLV రూపం?
ఎ) PSLV-G బి) PSLV-CA
సి) PSLV-XL డి) LVM-III
45. PSLV ప్రయోగంలో ఉపగ్రహం చుట్టూ అమర్చిన ఉష్ణకవచం నౌక నుంచి విడివడే దశ?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
46. 2016 సెప్టెంబర్ 26న ప్రయోగించిన Scatsat-1 ఉపగ్రహ జీవిత కాలం?
ఎ) 7 సంవత్సరాలు
బి) 10 సంవత్సరాలు
సి) 5 సంవత్సరాలు
డి) 12 సంవత్సరాలు
47. PSLV-C35 ద్వారా ప్రయోగించిన, బెంగళూరులోని PES విశ్వవిద్యాలయం రూపొందించిన, రిమోట్ సెన్సింగ్ సూక్ష్మ ఉపగ్రహం?
ఎ) ప్రథమ్ బి) Scatsat-1
సి) PISAT డి) NLS-19 బరువు?
ఎ) 230000 కేజీలు
బి) 295000 కేజీలు
సి) 640000 కేజీలు
డి) 320000 కేజీలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






