లోక్‌సభ సమావేశానికి అవసరమైన కోరం ఎంత?
పాలిటీ
భారత పార్లమెంటు
జనవరి 9 తరువాయి..
11. రూల్ ఆఫ్ లాప్సే అంటే?
1) పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ పార్లమెంటు రద్దుతో రద్దు కావడం
2) సంబంధిత కమిటీ రద్దు కావడంతో మంత్రుల డిమాండ్ కూడా రద్దు కావడం
3) ఒక బిల్లు రాజ్యసభ నుంచి 14 రోజుల్లో తిరిగి పంపకపోతే ఆ బిల్లు మురిగిపోతుంది
4) ఆర్థిక సంవత్సరం చివరలో ఓటింగ్‌తో ఆమోదించిన బిల్లులన్నీ మురిగిపోతాయి
12. అమెరికాలోని ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటీవ్’లో ఒక బిల్లు రెండో పరణానికి తీసుకొనే కమిటీ ఏది?
1) సెలెక్ట్ కమిటీ
2) స్టాండింగ్ కమిటీ
3) కాన్ఫరెన్స్ కమిటీ
4) కమిటీ ఆఫ్ హెల్ హౌస్
13. కింది వివరణలు పరిశీలించి సమాధానమివ్వండి
ఎ) ఒక పార్లమెంట్ సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అవుతాడు
బి) ఒక పార్లమెంట్ సభ్యుడు తన రాజకీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడితే
ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అవుతాడు
సి) ఒక పార్లమెంట్ సభ్యుడు అధికారంలో ఉన్న తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తే తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు
డి) తాను సభ్యుడిగా ఉన్న రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే లేదా ఓటింగ్‌కు దూరంగా ఉంటే తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు
1) ఎ, బి 2) ఎ, డి
3) బి, సి 4) సి, డి
14. జత పరచండి.
ఎ) బార్డోలి కమిటీ 1. ఎన్నికల విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం
బి) శౌరి కమిటీ 2. ఈశాన్య రాష్ర్టాల్లోని కొండప్రాంతాల్లో ప్రభుత్వ విధాన నిర్మాణం
సి) గోస్వామి కమిటీ 3. నేరస్థుల, రాజకీయ నాయకుల మధ్య వ్యత్యాసాన్ని స్టడీ చేయడం
డి) చవాన్ కమిటీ 4. సమాచార హక్కు అంశాలను పరీక్షించుట
5. శాసన సభ్యుల అత్యల్ప అంచనా
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-5
15. కింది ప్రకటనల్లో సరైనది?
1) బీహార్‌లో 40 లోక్‌సభ నియోజకవర్గాలు కలవు
2) గోవాలో ఒక లోక్‌సభ నియోజకవర్గం కలదు
3) మధ్యప్రదేశ్‌లో 28 లోక్‌సభ నియోజకవర్గాలు కలవు
4) మేఘాలయలో 3 లోక్‌సభ నియోజకవర్గాలు కలవు
16. ప్రధానమంత్రి, పార్లమెంటు ఎగువ సభకు చెందినవారైతే..?
1) అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో తనకు అనుకూలంగా ఓటు వేసుకోలేడు
2) దిగువ సభలో బడ్జెట్ మీద ప్రసంగించలేడు
3) ఎగువ సభకు ఒక ప్రకటన చేయగలడు
4) దిగువ సభలో సభ్యుడు కావాలి
17. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యసభకు ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు?
1) లోక్‌సభ స్పీకర్
2) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
3) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
4) రాజ్యసభ ఎన్నుకొన్న సభ్యుడు
18. Assumption(A): 75(1) (ఎ) అధికరణం ప్రకారం కేంద్రమంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు Reason(R): 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 75(1) (ఎ) అధికరణంను చేర్చారు
1) (A) కు (R) సరైన వివరణ
2) (A) కు (A) సరైన వివరణ కాదు
3) (A) సరైంది
4) (A) సరైంది
19. భారత రాజ్యాంగాన్ని అనుసరించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలవారి సీట్ల రిజర్వేషన్ కింది దేనికి ఇవ్వలేదు?
1) లోక్‌సభ
2) రాష్ట్ర విధానసభ
3) పంచాయతీ సంస్థలు
4) రాజ్యసభ
20. భారతీయ పౌరుడు లోక్‌సభకు ఎన్నిక కావాలంటే ?
1) 21 సంవత్సరాలు దాటి ఉండాలి
2) ఏదైనా ఒక రాజకీయ పక్షానికి చెందిన సభ్యుడై ఉండాలి
3) 35 ఏళ్ల వయస్సు దాటి ఉండాలి
4) పాతికేళ్ల వయస్సు గలవారై ఉండాలి
21. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి
బి) రాష్ట్ర జాబితాలోని అంశంపై 2/3వ వంతు మెజార్టీతో రాజ్యసభ ఆమోదిస్తే కేంద్రం శాసనం చేయవచ్చు
1) ఎ సరైనది 2) బి సరైనది
3) ఎ, బి 4) ఏవీకావు
22. భారతదేశానికి సంబంధించి పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో కింది ఏ ప్రధాన సూత్రాలను అనుసరిస్తారు?
1. కేబినెట్ సభ్యుడు పార్లమెంటులో సభ్యుడై ఉండాలి
2. పార్లమెంటుపై నమ్మకం ఉన్నంత వరకు మంత్రులు పదవిలో కొనసాగుతారు
3. కేబినెట్ దేశాధినేత అధ్యక్షతన నడుస్తుంది
1) 1, 2 2) 3
3) 2, 3 4) 1, 2, 3
23. ఏ లోక్‌సభ పదవీకాలాన్ని 5 సంవత్సరాలకు మించి పొడిగించారు?
1) 4వ లోక్‌సభ 2) 6వ లోక్‌సభ
3) 7వ లోక్‌సభ 4) 5వ లోక్‌సభ
24. కింది వాటిని జతపరచండి.
రాష్ట్రం రాజ్యసభ స్థానాలు
ఎ) అస్సాం 1) 11
బి) ఆంధ్రప్రదేశ్ 2) 19
సి) మహారాష్ట్ర 3) 07
డి) కేరళ 4) 09
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
25. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నియమిస్తాడు?
1) మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు
2) ఇద్దరిని
3) 10 మందిని 4) 12 మందిని
26. కింది వాటిని జతపరచండి.
1. అతిపెద్ద నియోజకవర్గం ఎ) లఢక్
2. ఓటర్లరీత్యా పెద్ద నియోజకవర్గం బి) మల్కాజిగిరి
3. వైశాల్యం రీత్యా చిన్న నియోజకవర్గం సి) లక్షద్వీప్
4. ఓటర్ల రీత్యా చిన్న నియోజకవర్గం డి) దక్షిణ ముంబై
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
27. కింది రాష్ర్టాల లోక్‌సభ స్థానాల ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువ గల రాష్ర్టాలను అమర్చండి.
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. తమిళనాడు 4. మధ్యప్రదేశ్
1) 2, 1, 3, 4 2) 1, 2, 3, 4
3) 1, 3, 2, 4 4) 4, 3, 2, 1
28. కింది ప్రవచనాలు పరిశీలించండి.
ఎ) ప్రతిరోజు పార్లమెంటు మొదటి గంట సమయం ప్రశ్నోత్తరాల కోసం కేటాయించారు
బి) పార్లమెంటరీ సంప్రదాయాల్లో భారతదేశ విలక్షణ ఆవిష్కరణ ‘శూన్య గంట’
(జీరో అవర్)
సి) కార్యనిర్వాహక చర్యలపై న్యాయ
నియంత్రణ సహజ న్యాయం నుంచి వచ్చింది
1) ఎ నిజం, బి, సి తప్పు
2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, బి, సి తప్పు
4) ఎ, సి తప్పు.. బి సరైంది
29. రాజ్యసభ స్థానాల ఆధారంగా ఒకే ఒక స్థానం గల రాష్ర్టాలు ఏవి?
1. లక్షదీవులు 2. మేఘాలయ
3. నాగాలాండ్ 4. హిమాచల్‌ప్రదేశ్
1) 1, 2 2) 2, 3
3) 2, 3, 4 4) 3, 4
30. శాసన మండలి సభ్యులు ఎన్నుకొనే విధానం ఏది?
1. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా
2. పరోక్ష ఎన్నిక ద్వారా
3. నియామకం ద్వారా
1) 1, 2, 3 2) 1, 3
3) 2, 3 4) 1, 2
31. ఏయే రాష్ర్టాల్లో లోక్‌సభ, రాజ్యసభ స్థానాలు సమానంగా కలవు?
1) నాగాలాండ్, గోవా
2) నాగాలాండ్, మిజోరం
3) గోవా, మణిపూర్
4) సిక్కిం, మేఘాలయ
32. దేశంలో ప్రభుత్వ విత్తం మీద పార్లమెంటరీ నియంత్రణ పద్ధతి/పద్ధతులు ఏది/ఏవి?
1. వార్షిక ఆర్థిక స్టేట్మెంట్ను పార్లమెంటు ముందుంచడం
2. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే భారత ఏకీకృత నిధి నుంచి ద్రవ్యం
ఉపసంహరించడం
3. అనుబంధ గ్రాంట్లు, ఓట్-ఆన్-అకౌంట్ ఏర్పాట్లు
4. పార్లమెంటరీ బడ్జెట్ కార్యాలయం, స్థూల ఆర్థిక అంచనాలకు, వ్యయానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాన్ని నియమిత కాలానికి లేదా కనీసం సంవత్సరం మధ్యలో సమీక్షించడం
5. పార్లమెంటులో ఆర్థిక బిల్లును సమీక్షించడం
1) 1, 2, 3, 5 2) 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
33. డీ లిమిటేషన్ సంఘానికి సంబంధించి కింది స్లేట్మెంట్లు పరిశీలించండి
1. డీ లిమిటేషన్ సంఘం ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయలేం
2. డీ లిమిటేషన్ సంఘం ఉత్తర్వులను
లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచినప్పుడు ఆయా సభలు ఆ ఉత్తర్వులను
సవరణలు చేయకూడదు
1) 1 2) 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
34. కింది వాటిలో వేటి ఆమోద సమయంలో లోక్‌సభకు, రాజ్యసభకు మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పార్లమెంటు సంయుక్త సమావేశం అవసరమవుతుంది?
1. సాధారణ శాసన ఫిర్యాదు
2. ద్రవ్యబిల్లు
3. రాజ్యాంగ సవరణ బిల్లు సంకేతాలను
ఉపయోగించుకొని
1) 3 2) 1
3) 1, 3 4) 1, 2, 3
35. లోక్‌సభ స్పీకర్‌కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
1) స్పీకర్ రాష్ట్రపతి విశ్వాసం కలిగినంత వరకు పదవిలో ఉంటారు
2) అతను లోక్‌సభలో సభ్యుడు కావలసిన అవసరం లేదు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత సభ్యుడు కావచ్చు
3) లోక్‌సభ మధ్యంతరంగా రద్దయితే అతను పదవిని కోల్పోతాడు
4) అతను రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు
సమర్పించాలి
36. ప్రజాస్వామ్యానికి ఊరట కలిగించే అంశాలు కింది వాటిలో ఏవి?
1. సంకీర్ణ ప్రభుత్వం
2. రాజకీయ నైష్పత్తిక ప్రాతినిథ్యం
3. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం
మధ్య అధికార విభజన
1) 1, 2 2) 2
3) 1, 3 4) 1, 2, 3
37. భారత పార్లమెంటులో బిల్లు నిబంధనల విధానానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
1. సభ ప్రోరోగ్ అయితే పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న బిల్లు మురిగిపోదు
2. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు, లోక్‌సభ ఆమోదించని బిల్లు మురిగిపోదు
3. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు లేదా లోక్‌సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆర్టికల్ 108 ప్రకారం లోక్‌సభ రద్దు వల్ల మురిగిపోతుంది
1) 1, 2 2) 1
3) 2, 3 4) 1, 2, 3
38. జతపరచండి.
లోక్‌సభ స్పీకర్
ఎ. మొదటి 1. జీవీ మౌలాంకర్
బి. మూడవ 2. హుకుంసింగ్
సి. ఏడవ 3. రబిరే
డి. తొమ్మిదవ 4. డాక్టర్ బలరాం జక్కర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-2, బి-1, సి-4, డి-3
39. రాజ్యాంగంలోని 105వ ఆర్టికల్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, కమిటీల్లోని సభ్యుల ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక సదుపాయాలు
2) పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక
అధికారాలు, సదుపాయాలు
3) పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక అధికారాలు, సదుపాయాలు
4) రాష్ర్టాల్లోని శాసనసభలు, వాటి సభ్యుల ప్రత్యేక అధికారాలు, సదుపాయాలు
40. జతపరచండి
అధికరణ అంశం
ఎ) 54 1. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ
బి) 55 2. పదవీకాలం
సి) 56 3. రాష్ట్రపతి ఎన్నుకునే పద్ధతి
డి) 58 4. అర్హతలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-1, బి-3, సి-4, డి-2
41. లోక్‌సభ సమావేశానికి అవసరమైన కోరం ఎంత?
1) సభ్యులందరిలో 50 శాతం
2) సభ్యులందరిలో 25 శాతం
3) సభ్యులందరిలో 15 శాతం
4) సభ్యులందరిలో 10 శాతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు