వాతావరణ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?
శీతోష్ణస్థితి
1. జతపరచండి
1. ఐసోహెల్ ఎ. సమాన సూర్యరశ్మి
2. ఐసోహైట్ బి. సమాన వర్షపాతం
3. ఐసోనెఫ్ సి. సమాన మేఘావృతం
4. ఐసోనిఫ్ డి. సమాన హిమపాతం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి, సి
3) ఎ, సి, బి, డి 4) ఎ, సి, డి, బి
2. కింది వాటిలో సరైనవి గుర్తించండి
1. ప్రపంచ వాతావరణ సంస్థను జెనీవాలో 1950లో ఏర్పాటు చేశారు
2. భారత వాతావరణ సంస్థను మొదట 1875లో కోల్కతాలో స్థాపించారు
3. ప్రస్తుత భారత వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం పుణెలో ఉంది
1) 1 సరైంది, 2, 3 తప్పు
2) 1, 2 సరైనవి, 3 తప్పు
3) 1 తప్పు, 2, 3 సరైనవి
4) 1, 2, 3 సరైనవి
3. కింది ప్రవచనాలను చదివి సమాధానం ఎంపిక చేయండి
1. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి-21
2. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి-22
3. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి -23
4. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం మార్చి-24
1) 1, 2, 3 సరైనవి, 4 తప్పు
2) 1, 2 తప్పు, 3, 4 సరైనవి
3) 1, 2, 3, 4 తప్పు
4) 1, 2, 3, 4 సరైనవి
4. ప్రతిపాదన (M): కర్కటరేఖ భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది
కారణం (N): భారతదేశం మధ్య గుండా వెళ్లి 2 భాగాలుగా విభజించి, ఉత్తర భారత్లో ఉప అయనరేఖా శీతోష్ణస్థితి,
దక్షిణ భారత్లో అయనరేఖా శీతోష్ణస్థితి ఏర్పడుటకు కర్కటరేఖ కారణమవుతుంది
1) (M), (N) నిజం, (N) (M)కు సరైన వివరణ కాదు
2) (M), (N) నిజం, (N) (M)కు సరైన వివరణ
3) (M) నిజం, (N) తప్పు
4) (M) తప్పు, (N) నిజం
5. ప్రవచనం (M): థార్న్థ్వైట్ జలసంతులన భావన ఆధారంగా శీతోష్ణస్థితులను వర్గీకరించారు
కారణం (N): నీటి మిగులు జలాల ఆధారంగా శీతోష్ణస్థితి వర్గీకరణనే
‘జల సంతులన భావన’కు అర్థం
1) (M), (N) సరైనవి
2) (M) సరైంది, (N) తప్పు
3) (M), (N) తప్పులు
4) (M) తప్పు, (N) సరైంది
6. ప్రతిపాదన (M): శీతోష్ణస్థితికి, వాతావరణ స్థితికి తారతమ్యం ఉంది
కారణం (N): దీర్ఘకాలిక వాతావరణ మార్పులను శీతోష్ణస్థితి అని, స్వల్పకాలిక
వాతావరణ మార్పులను వాతావరణ
స్థితి అని పిలుస్తారు
1) (M) తప్పు, (N) సరైంది
2) (M) సరైంది, (N) తప్పు
3) (M), (N) సరైనవి, (N) (M)కు సరైన వివరణ
4) (M), (N) సరైనవి, (N) (M)కు సరైన వివరణ కాదు
7. కింది వాటిని పరిశీలించి సమాధానమివ్వండి
(M) నీటి కొరత ప్రాంతాల శీతోష్ణస్థితి ‘ఆర్ధ్ర శీతోష్ణస్థితి’ (N) నీటి మిగులు ప్రాంతాల శీతోష్ణస్థితి ‘శుష్క శీతోష్ణస్థితి’
1) (M), (N) సరైనవి
2) (M), (N) తప్పు
3) (M) సరైంది, (N) తప్పు
4) (M) తప్పు, (N) సరైంది
8. ప్రతిపాదన (M): సముద్రతీరం ఆధారంగా శీతోష్ణస్థితిని 2 భాగాలుగా చేశారు
కారణం (N): సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ‘ఖండాతర్గ శీతోష్ణస్థితి’, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ‘సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి’ కలదు
1) (M), (N) సరైనవి, (N) (M)కు సరైన వివరణ
2) (M), (N) తప్పు, (N) (M)కు సరైన వివరణ కాదు
3) (M) సరైంది, (N) తప్పు, (N) (M)కు సరైన వివరణ
4) (M) సరైంది, (N) తప్పు, (N) (M)కు సరైన వివరణ కాదు
9. కింది వాటిలో సరైన సమాధానం ఎంపిక చేయండి
1. 1950 సంవత్సరపు ప్రపంచ వాతావరణ దినోత్సవ నినాదం
‘వాతావరణ స్థితి-శీతోష్ణస్థితి-నీరు’
2. 2021 సంవత్సరపు ప్రపంచ వాతావరణ దినోత్సవ నినాదం ‘సముద్రం-మన శీతోష్ణస్థితి-వాతావరణ స్థితి’
3. 2022 సంవత్సరపు ప్రపంచ వాతావరణ దినోత్సవ నినాదం ‘ముందస్తు హెచ్చరిక-ముందస్తు చర్య’
1) 1 సరైంది, 2, 3 తప్పు
2) 1, 2 సరైనవి, 3 తప్పు
3) 1, 2, 3 సరైనవి
4) 1, 2 ,3 తప్పు
10. కింది వాటిలో ఏది సరైన వివరణ?
1. శీతోష్ణస్థితి అధ్యయనాన్ని ైక్లెమటాలజీ అంటారు
2. ైక్లెమటాలజీ అనేది ైక్లెమో అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది
3. ైక్లెమో అనగా సూర్యకిరణాలు వంగి
ప్రసరించడం
4. వాతావరణ అధ్యయనాన్ని
మీటియోరాలజి అని పిలుస్తారు
1) 1, 2 సరైనవి, 3, 4 తప్పు
2) 1, 4 సరైనవి, 2, 3 తప్పు
3) 1, 2, 4 సరైనవి, 3 తప్పు
4) 1, 3, 4 సరైనవి, 2 తప్పు
11. జతపరచండి
1. భారత్లో గరిష్ఠ
ఉష్ణోగ్రత ప్రాంతం ఎ) జైసల్మీర్
2. ప్రపంచంలో కనిష్ఠ
ఉష్ణోగ్రత ప్రాంతం బి) అటకామా ఎడారి
3. భారత్లో కనిష్ఠ
వర్షపాత ప్రాంతం సి) సహారా ఎడారి
4. ప్రపంచంలో కనిష్ఠ
వర్షపాత ప్రాంతం డి) లేహ్
ఇ) చురర్
ఎఫ్) జవోస్టాక్
1) ఎ, బి, ఇ, ఎఫ్ 2) ఎ, సి, ఎఫ్, ఇ
3) ఇ, ఎఫ్, డి, బి 4) ఇ, డి, ఎఫ్, బి
12. కింది వాటిలో సరికానిది
1) 200 ఉత్తర అక్షాంశాల నుంచి 200 దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి
2) రుతుపవనాలు మే 20న
అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటాయి
3) కొరియాలెస్ బలాల ప్రభావంతో
భారత్లో మొదట రుతుపవనాలు మలబార్ తీరంలో ప్రవేశిస్తాయి
4) భారత్లో అత్యధిక వర్షపాతానికి తిరోగామి రుతుపవనాలు కారణం
13. ప్రవచనం M: శుష్క ప్రాంతాలు సంవత్సరం పొడవునా పొడిగా, వేడిగా ఉంటాయి
ప్రవచనం N: ధ్రువ ప్రాంతాలు సంవత్సరం పొడవునా చల్లగా, పొడిగా ఉంటాయి
1) M, N ప్రవచనాలు సరికావు
2) M. N ప్రవచనాలు సరైనవి
3) M ప్రవచనం సరైంది, N ప్రవచనం తప్పు
4) M ప్రవచనం తప్పు, N ప్రవచనం సరైంది
14. జత పరచండి
1. వసంత కాలం ఎ. జూలై నుంచి ఆగస్టు
2. వర్షాకాలం బి. జనవరి నుంచి
ఫిబ్రవరి
3. హేమంత కాలం సి. మార్చి నుంచి ఏప్రిల్
4. శిశిర కాలం డి. నవంబర్ నుంచి
డిసెంబర్
1) ఎ, బి, సి, డి 2) సి, ఎ, డి, బి
3) సి, ఎ, బి, డి 4) సి, బి, ఎ, డి
15. జతపరచండి
1. తిరోగమన ఎ) డిసెంబర్ నుంచి రుతుపవన కాలం ఫిబ్రవరి
2. శీతాకాలం బి) మార్చి నుంచి మే
3. పురోగామి సి) జూన్ నుంచి
రుతుపవన కాలం సెప్టెంబర్
4. వేసవికాలం డి) అక్టోబర్ నుంచి
డిసెంబర్
1) డి, ఎ, బి, సి 2) డి, బి, ఎ, సి
3) డి, ఎ, సి, బి 4) డి, సి, బి, ఎ
16. ప్రతిపాదన M: భారత్లో వేసవిలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది
కారణం N: దక్షిణ భారతదేశం సన్నగా ఉండి సముద్రంతో చుట్టబడి ఉంది. సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి వల్ల దక్షిణ భారతదేశంలో వేసవిలో ఉత్తర భారతదేశం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి
1) M, N సరికావు, N అనేది Mకు సరైన వివరణ కాదు
2) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ
3) M సరైంది, N తప్పు
4) M తప్పు, N సరైంది
17. ప్రవచనం M: చురర్, జైసల్మీర్, పిలాని, మాదపూర్ భారత్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు
కారణం N: చురర్, పిలాని, మాదపూర్, జైసల్మీర్ ప్రాంతాలు రాజస్థాన్లోని శుష్క ప్రాంతమైన థార్ ఎడారిలో ఉన్నాయి.
1) M, N సరికావు, N అనేది M కు సరైన వివరణ కాదు
2) M, సరైనది, N తప్పు, N అనేది Mకు సరైన వివరణ
3) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ
4) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ కాదు
18. జతపరచండి
1. ఉత్తరప్రదేశ్ ఎ) చెర్రీబ్లోజమ్స్
2. పశ్చిమబెంగాల్ బి) నార్వెస్టెర్స్
3. అస్సాం సి) ఆంథిస్
4. కర్ణాటక డి) కాలబైశాఖి
1) సి, డి, ఎ, బి 2) సి, ఎ, డి, బి
3) సి, బి, ఎ, డి, 4) సి, డి, బి, ఎ
19. ప్రతిపాదన M: రుతుపవనాలు ఎక్కువ భాగం పాలఘాట్ కనుమ నుంచి భారత్లో ప్రవేశిస్తాయి
కారణం N: పాలఘాట్ కనుమ అనేది హిందూ మహాసముద్రానికి దగ్గరగా ఉంది
1) M, N సరైనవి, N అనేది Mకు సరైన వివరణ కాదు
2) M సరైంది, N తప్పు
3) M తప్పు, N సరైంది
4) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ
20. ప్రతిపాదన M: అగుంబే ప్రాంతాన్ని దక్షిణ చిరపుంజిగా పిలుస్తారు
కారణం N: అగుంబే అనేది అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం. ఇది పశ్చిమ కనుమల్లోని కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో ఉంది. ఇక్కడ (769 సెం.మీ.) వర్షపాతం నమోదైంది.
1) M తప్పు, N సరైంది
2) M సరైంది, N తప్పు
3) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ
4) M, N సరైనవి, N అనేది M కు సరైన వివరణ కాదు
21. కింది వాటిలో సరికానిది
1) భారత్లో జూలై నెలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి
2) భారత్లో ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన దీవులు అమీన్ దీవులు
3) భారత్లో అత్యధిక వర్షపాతం తిరోగమన రుతుపవనాల వల్ల నమోదవుతుంది
4) భారత్లో నైరుతి రుతుపవనాల వల్ల 180% వర్షపాతం నమోదవుతుంది
22. ప్రతిపాదన M: థార్న్థ్వైట్ జల సంతులన భావనను ప్రతిపాదించాడు
కారణం N: మిగులు జలాల ఆధారంగా జల సంతులన భావనను ప్రతిపాదించాడు
1) M సరైంది, N తప్పు
2) M తప్పు, N సరైంది
3) M,N సరైనవి, N అనేది Mకు
సరైన వివరణ
4) M, N తప్పు, N అనేది M కు
సరైన వివరణ కాదు
23. కింది వాటిలో సరైన సమాధానం ఎంపిక చేయండి
1. కొప్పెన్ జర్మనీ దేశస్థుడు
2. థార్న్థ్వైట్ అమెరికా దేశస్థుడు
3. నీటికొరత ఆధారంగా కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ చేశారు
4. నీటి మిగులు, కొరత ఆధారంగా శీతోష్ణస్థితి వర్గీరణ జరిగింది
1) 1, 2, 3, 4 2) 1, 2, 3
3) 2, 3, 4 4) 1, 3, 4
24. జతపరచండి
1. గ్రీన్ కలర్ ఎ) రోడ్డు, రైల్వే, విద్యుత్ సప్లయ్ నిలుపుదల
2. ఎల్లో కలర్ బి) వరదలు, సునామీలు, భూకంపాలు
3. ఆరెంజ్ కలర్ సి) సూచనలు, సలహాలు ఉండవు
4. రెడ్ కలర్ డి) రోజువారీ
కార్యక్రమాలకు
ఆటంకం
1) ఎ, బి, సి, డి 2) డి, సి, బి, ఎ
3) డి, బి, సి, ఎ 4) సి, డి, ఎ, బి
25. జతపరచండి
1. నత్రజని ఎ) 78 శాతం
2. ప్రాణవాయువు బి) 21 శాతం
3. బొగ్గుపులుసు
వాయువు సి) 0.03 శాతం
4. నీటి ఆవిరి డి) 0.4 శాతం
1) ఎ, డి, సి, బి 2) ఎ, సి, డి, బి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి, బి, సి
26. కింది వాటిలో సరికానిది గుర్తించండి
1) ‘అటమోస్’ గ్రీకు పదం
2) వాతావరణ పొర 1000 K.M
ఎత్తు కలదు
3) వాతావరణంలో 6 K.M ఎత్తు
వరకు నీటి ఆవిరి ఉంటుంది
4) ఇటీవల ఓజోన్ పొరకు
రంధ్రం ఏర్పడినది ఆర్కిటిక్ ప్రాంతం
27. కింది వానిలో వాతావరణాన్నిప్రభావితం చేయనిది?
1) ఉష్ణోగ్రత 2) వర్షపాతం
3) ఆహారం 4) పీడనం
సవరణ: నిపుణ స్పెషల్ 6వ పేజీ తెలంగాణ జాగ్రఫీలో రెండో ప్రశ్నకు సమాధానం 1,12,077 చ.కి.మీ. గా చదువుకోగలరు.
- Tags
- climate
- study of climate
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?