ఆల్కహాల్ఎక్కువగా తీసుకునేవారు మరణించడానికి కారణం?
1. మానవ శరీర ఇంధనం
(Fuel of Human body)?
1) కార్బోహైడ్రేట్స్ 2) ప్రొటీన్స్
3) విటమిన్స్
4) ఖనిజ లవణాలు
2. కింది కార్బోహైడ్రేట్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించండి.
1) మానవ ఆహారంలో అతిముఖ్యమైనవి (60 శాతం)
2) ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారవుతాయి
3) ైగ్లెకోజన్ను జంతు చక్కెర అంటారు
4) కార్బోహైడ్రేట్స్ నుంచి ైగ్లెకోజన్ తయారీ క్లోమంలో జరుగుతుంది
3. ఏ సరళ చక్కెరను జంతువులు శక్తి కోసం వినియోగిస్తాయి?
1) సుక్రోజ్ 2) సెల్యూలోజ్
3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్
4. మానవుడిలో జీర్ణమయ్యే పిండి పదార్థాలు?
ఎ. ైగ్లెకోజన్ బి. సెల్యూలోజ్
సి. స్టార్చ్ డి. మాల్టోజ్
1) ఎ, డి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
5. మానవుడిలో అధిక శక్తినిచ్చే భవిష్యత్
నిల్వ ఆహారం?
1) కార్బోహైడ్రేట్స్ 2) మినరల్స్
3) ప్రొటీన్స్ 4) కొవ్వులు
6. కండర సంకోచానికి కావాల్సిన ఆవశ్యక మూలకం?
1) సోడియం 2) పొటాషియం
3) కాల్షియం 4) పాస్ఫరస్
7. అమైనో ఆమ్లాలకు సంబంధించినవి.
1) జంతువులకు అమైనో ఆమ్లాలు ప్రొటీన్ల ద్వారా మాత్రమే అందుతాయి
2) ఇవి యాంటీ బాడీస్ ఉత్పత్తికి మూలం
3) ఇవి శరీర నిల్వ ఆహార పదార్థాలు
4) శరీరంలో ఉత్పత్తి కాని ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య-9
8. హైపర్ విటమినోసిస్ దేనికి సంబంధించింది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-సి
3) విటమిన్-డి 4) విటమిన్-కె
9. విటమిన్-ఎ ముందు రూపం?
1) ఎర్గోస్టిరాల్ 2) కొలెస్టిరాల్
3) ప్రోత్రాంబిన్ 4) బీటా కెరోటిన్
10. కింది వాటిని జతపరచండి.
విటమిన్ రసాయననామం
ఎ. విటమిన్-ఎ 1. థయమిన్
బి. విటమిన్-బి1 2. రెటినాల్
సి. విటమిన్-బి2 3. పైరిడాక్సిన్
డి. విటమిన్-బి6 4. రైబోఫ్లావిన్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
12, ఒక వ్యక్తి నాడీ పక్షవాతం, బలహీనత, కండర నొప్పితో బాధపడుతుండటం ఏ విటమిన్ లోపం?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి1
3) విటమిన్-డి 4) విటమిన్-బి2
13. కింది వాటిని జతపరచండి.
ఎ. విటమిన్-బి12 1. సయనోకోబాలమిన్
బి. విటమిన్-సి బి. ఆస్కార్బిక్ ఆమ్లం
సి. విటమిన్-డి సి. కాల్సిఫెరాల్
డి. విటమిన్-ఇ డి. టోకోఫెరాల్
1) ఎ-4, బి-1, సి- 2, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
14. పాలలో లేని విటమిన్ ఏది?
1) విటమిన్-డి 2) విటమిన్-బి1
3) విటమిన్-సి 4) విటమిన్-బి12
15. ఏ విటమిన్ లోపం వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది?
1) విటమిన్-డి 2) విటమిన్-బి1
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12
16. శరీరంలోని కొవ్వు అతినీలలోహిత కిరణాల సమక్షంలో విటమిన్-డి గా మారే భాగం?
1) క్లోమం 2) ప్లీహం
3) మూత్రపిండం 4) కాలేయం
17. ఏ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ప్రోత్రాంబిన్ తయారీలో తోడ్పడుతుంది?
1) విటమిన్-కె 2) విటమిన్-డి
3) విటమిన్-ఇ 4) విటమిన్-బి12
18. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల కలిగే వ్యాధి?
1) స్కర్వీ 2) బెరిబెరి
3) పెల్లాగ్రా 4) గాయిటర్
19. అధిక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు మరణించడానికి కారణం?
1) గుండెపోటు 2) కాలేయ క్యాన్సర్
3) సిర్రోసిస్
4) మూత్రపిండాల ఫెయిల్యూర్
20. ఆహార సేకరణకు కారణం?
1) వివిధ జీవక్రియలకు కావలసిన
ఉష్ణశక్తి కోసం
2) వివిధ క్రియలకు కావలసిన యాంత్రిక శక్తి కోసం
3) వివిధ జీవక్రియలకు కావలసిన రసాయనశక్తి కోసం
4) హైపోథలామస్ అనే మెదడు భాగం
ప్రేరణ ఆపడానికి
21. కింది వాటిలో ఐరన్ అధికంగా ఉండి, శరీర నిర్మాణానికి తోడ్పడే ఆహారం?
1) బంగాళాదుంప 2) ఆకుకూరలు
3) పెరుగు 4) మాంసం
22. కింది వాటిలో అధిక ప్రొటీన్లు గల ఆహారం?
1) గుడ్డు 2) పప్పు
3) పాలు 4) కూరగాయలు
23. కింది వాటిలో కొవ్వు నిల్వ చేసేది?
1) ఎపిథీలియల్ కణజాలం
2) అడిపోజ్ కణజాలం
3) అంతశ్చర్మం 4) కాలేయం
24. 100 కేజీలు కలిగిన మానవుడి శరీరంలో నీటి శాతం?
1) 70 శాతం 2) 80 శాతం
3) 65 శాతం 4) 75 శాతం
25. శాకాహారుల్లో సీకమ్ (అంధనాళం) పని?
1) మానవుడిలోని అవశేష అంగం వలె
పనిచేస్తుంది
2) మానవుడిలోని చూషకాల వలె
ఆహారాన్ని పీలుస్తుంది
3) బ్యాక్టీరియాలను కలిగి పిండి పదార్థ జీర్ణక్రియలో పాల్గొంటుంది
4) జీర్ణం కాని ఆహారాన్ని సేకరించే జీర్ణాశయంలోని భాగం
26. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కన్నా పెరిగినప్పుడు అది ఇన్సులిన్ అనే హార్మోన్ సమక్షంలో కొవ్వుగా మారడాన్ని ఏమంటారు?
1) ైగ్లెకోజెనెసిస్ 2) లైపోజెనెసిస్
3) గ్లూకోనియోజెనెసిస్
4) ైగ్లెకోనియోజెనెసిస్
27. కాలేయంలో జరిగే డీ ఎమినేషన్ ప్రక్రియ
(ఆర్నిథిన్ వలయం) అంటే?
1) అదనంగా ఉన్న ప్రొటీన్స్ యూరియాగా మారడం
2) కొవ్వు, గ్లూకోజ్‌గా మారడం
3) ైగ్లెకోజన్ కార్బోహైడ్రేట్‌గా మారడం
4) ఎర్ర రక్తకణాలు పైత్యరసంగా మారడం
28. బ్రెడ్‌ను నమిలినప్పుడు తీపిగా ఉండుటకు కారణం?
1) లాలాజల గ్రంథులు క్రియావంతంగా మారి తీపి లాలాజలం ఉత్పత్తి కావడం
2) బ్రెడ్లోని గ్లూకోజ్ నీటిలో కరగడం వల్ల రుచి మొగ్గలు గ్రహించడం
3) లాలాజలం పిండి పదార్థాన్ని గ్లూకోజ్‌గా మార్చడం
4) లాలాజలం పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మార్చడం
29. పొడవైన జీర్ణ లేదా ఆహారనాళం కలిగిన జీవులు?
1) శాకాహారులు 2) మాంసాహారులు
3) సర్వభక్షకాలు 4) కీటకాలు
30. జీర్ణాశయంలో అతిగాఢత గల HCl ఉత్పత్తి చేయబడి ఆహార జీర్ణక్రియలో పాల్గొంటుంది. కానీ అది జీర్ణాశయాన్ని ప్రభావితం చేయదు. కారణం?
1) జీర్ణాశయం లోపలి పొర ఉత్పత్తి చేసే ఎంజైమ్ HCl ను తటస్థపరచడం
2) జీర్ణాశయం గోడ HCl తో ప్రభావితం కాని కొవ్వు ఆమ్లాలతో ఏర్పాటు కావడం
3) జీర్ణాశయ గోడ ఎల్లప్పుడూ
ఏర్పడుతుంది
4) జీర్ణాశయ గోడ మ్యూకస్ పొరతో
రక్షణ పొందడం
31. కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) నోరు 2) ఆహారవాహిక
3) జీర్ణాశయం 4) చిన్నపేగు
32. మానవుడి జీర్ణవ్యవస్థలో ఎంజైమ్స్ ఉత్పత్తికాని భాగాలు?
1) నోరు 2) ఆహారవాహిక
3) జీర్ణాశయం 4) పెద్దపేగు
33. ఆల్కహాల్ శోషణ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) ఆహారవాహిక 2) జీర్ణాశయం
3) చిన్నపేగు 4) పెద్దపేగు
34. కొవ్వుల జీర్ణక్రియ ప్రారంభమయ్యే, అంతమయ్యే ప్రదేశం?
1) జీర్ణాశయం 2) ఆంత్రమూలం
3) శేషాంత్రికం 4) పెద్దపేగు
35. జీర్ణక్రియ, శోషణం పూర్తయ్యే ప్రదేశం?
1) జీర్ణాశయం 2) ఆంత్రమూలం
3) చిన్నపేగు 4) పెద్దపేగు
36. కింది వాటిలో ఏ పదార్థాలకు అధిక ప్రొటీన్ ఎఫిషియన్సీ నిష్పత్తి కలదు?
1) వరి 2) కందులు
3) గోధుమ 4) మొక్కజొన్న
37. కింది వాటిని జతపరచండి.
ఎ. టయలిన్ 1. నోరు
బి. రెనిన్ 2. జీర్ణాశయం
సి. ట్రిప్సిన్ 3. క్లోమం
డి. మాల్టేజ్ 4. చిన్నపేగు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
38. కింది వాటిలో జఠర రసం లేనిది?
1) పెప్సిన్ 2) లైపేజ్
3) పప్టైడేజ్ 4) HCl
39. కింది వాటిని జతపరచండి.
ఎ. లైపేజ్ 1. సరళ పాలిపప్టైడ్స్
బి. ట్రిప్సిన్ 2. పాలి, డీ పప్టైడ్స్
సి. పెప్సిన్ 3. కొవ్వు
డి. పప్టైడేజస్ 4. ప్రొటీన్స్
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
40. పైత్యరసం విధి కానిది?
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మార్చడం
2) ఆహారాన్ని ఆమ్ల స్థితిలోకి మార్చడం
3) కొవ్వుల ఎమల్సీకరణం
4) ప్యూట్రిఫాక్షన్ నుంచి కాపాడటం
41. కింది వాటిలో అధిక జీవశాస్త్రీయ విలువ ఉన్నది?
1) పాలు 2) గుడ్డు
3) మాంసం 4) గోధుమ
42. శరీరంలో తయారు కాని ఆవశ్యక అమైనో ఆమ్లాలు?
1) లైసిస్ 2) మిథియోనిన్
3) లినోలిక్ ఆమ్లం
4) అరాఖిడోనిక్ ఆమ్లం
43. రక్తంలో అధిక కొలెస్టిరాల్ స్థాయిని పెంచేవి?
1) ఆముదం నూనె 2) సీసమ్ ఆయిల్
3) కొబ్బరినూనె 4) వేరుశనగ నూనె
44. అన్ని నత్రజని సంబంధిత వ్యర్థాల్లో తక్కువ విషతత్వం కలది?
1) యూరియా 2) అమ్మోనియా
3) యూరిక్ ఆమ్లం 4) క్రెటానిన్
45. మూత్ర విసర్జన జరిగిన వెంటనే వాసన ఉండదు. కానీ కొంతకాలం తర్వాత అధిక వాసనకు కారణం?
1) యూరియా.. యూరికామ్లంగా మారడం
2) యూరిక్ ఆమ్లం.. యూరియాగా మారడం
3) బ్యాక్టీరియా వల్ల యూరియా..
అమ్మోనియాగా మారడం
4) బ్యాక్టీరియా వల్ల యూరిక్ ఆమ్లం
క్రియాటినైన్గా మారడం
46. ఒక మధ్య వయస్సు మానవుడిలో ఒకరోజు విసర్జితమయ్యే మూత్రం?
1) 750 మిల్లీ లీటర్లు 2) ఒక లీటరు
3) 1.5 లీటర్లు 4) రెండు లీటర్లు
47. మొక్కలకు వ్యర్థాలు?
1) నీరు 2) కార్బన్ డై ఆక్సైడ్
3) ఆక్సిజన్ 4) పైవన్నీ
48. కింది వాటిని జతపరచండి.
ఎ. తెల్ల రక్తకణాలు: 1. 1:500/400
ఎర్ర రక్తకణాల నిష్పత్తి
బి. రాడ్స్: కోన్స్ 2. 2:1
సి. H2O లో H:O 3. 15:1
నిష్పత్తి
డి. నీరు: గాలిలో 4. 10:21
ఆక్సిజన్ నిష్పత్తి
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-3, సి-2, డి-4
49. క్వినైన్, మార్ఫిన్ అనేవి?
1) ఫలాల్లో నిల్వ ఆహారం
2) కాండాల్లో నిల్వచేయబడే
అత్యవసర ఆహారం
3) ద్రవాభిసరణ పీడనం సమతుల్యతను పెంచేవి
4) మొక్కల్లో వ్యర్థ పదార్థాలు
50. రీనల్ గ్రంథులు వేటిలో విసర్జక అవయవాలు?
1) మంచినీటి చేపలు 2) మొలస్కా
3) కీటకాలు 4) ఈగలు
రెవల్యూషన్స్
హరిత విప్లవం (గ్రీన్ రెవల్యూషన్)
– వ్యవసాయ, ఆహార ధాన్యాల
ఉత్పత్తి పెంచడం
శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్)
– పాల ఉత్పత్తిని పెంచడం
(ఆపరేషన్ ఫ్లడ్)
ఎల్లో రెవల్యూషన్ – నూనె గింజలు,
పప్పు ధాన్యాల
దిగుబడి పెంచడం
నీలి విప్లవం (బ్లూ రెవల్యూషన్)
– చేపల ఉత్పత్తి పెంచడం
రెడ్ రెవల్యూషన్
– మాంసం ఉత్పత్తిని పెంచడం
బ్రౌన్ రెవల్యూషన్
– మసాలా దినుసుల ఉత్పత్తిని
అభివృద్ధి పరచడం,
తోళ్ల ఉత్పత్తులను పెంచడం
గోల్డెన్ రెవల్యూషన్
– పండ్ల ఉత్పత్తి పెంచడం
గ్రే రెవల్యూషన్ – ఎరువుల ఉత్పత్తి వృద్ధి
చేయడం
సిల్వర్ రెవల్యూషన్ – కోడిగుడ్ల
ఉత్పత్తిని పెంచడం
పింక్ రెవల్యూషన్ – ఫార్మాస్యూటికల్
ఉత్పత్తుల పెంపకం,
రొయ్యల ఉత్పత్తిని పెంచడం
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
ఫోన్ : 9885113344

Capture
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






