ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢ బంధమే అభ్యసనం
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షల ప్రత్యేకం
- అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగానైనా కలిగే స్థిరమైన, శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు – బెర్న్హార్ట్
- పరిసర అవసరాలను ఎదుర్కొనటానికి సరిపడే విధంగా వ్యక్తిలో కలిగే ప్రవర్తనా మార్పును అభ్యసనం అంటారు – మర్ఫీ
- ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన, దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు
– హిల్గార్డ్ - ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ – బోగ్
- అనుభవం ద్వారా గాని, శిక్షణ ద్వారా గాని ప్రవర్తనలో కనిపించే మార్పు – గేట్స్
- పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు – డెసికో & క్రాఫర్డ్
- పై నిర్వచనాల ఆధారంగా అభ్యసనం జరిగిందని తెలుసుకోవడానికి కొన్ని అంశాలు గమనించాలి. అవి..
1. ప్రవర్తనా మార్పు
2. ఆచరణ
3. శాశ్వత మార్పు
4. పరిసరాలతో సర్దుబాటు అవడం
5. పునర్బలనంతో కూడి ఉన్నది
6. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య సంబంధం
7. అనుభవం వల్ల కాని, శిక్షణ వల్ల కాని రావచ్చు
- జన్మతః ఉన్న సామర్థ్యాలు, లక్షణాలు జీవిత పర్యంతం సరిపోవు అందువల్ల పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి తన అవసరాలు, ప్రేరణ, అభిరుచులు, వైఖరులను బట్టి నూతన అంశాలు అభ్యసిస్తారు. ఇలా జన్మతః ఉన్న లక్షణాలు కాకుండా ఇతర అంశాలను ఆర్జించుకునే ప్రక్రియను అభ్యసనం అంటారు. ఇది జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ.
- పెరుగుదల వల్ల వచ్చే మార్పులు అభ్యసనం కాదు, కానీ అనుభవం వల్ల వచ్చే ప్రతి మార్పు అభ్యసనమే.
ఉదా. శిశువు ఎత్తు పెరగకుండా ఉండడం అభ్యసనం కాదు కాని అక్షరాలు నేర్చుకోవడం అనేది అభ్యసనం - పుట్టుకతో వచ్చే సహజాతాలు, జన్యుపరమైన లక్షణాలు, ప్రతిక్రియలు అభ్యసనంగా పరిగణించలేం.
- జ్ఞానేంద్రియాల ద్వారా విషయం లేదా అనుభవాలు గ్రహించి, మెదడు ద్వారా విశ్లేషించి తదనుగుణంగా మార్పును చూపించడమే అభ్యసనం.
- అభ్యసనం సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే నిన్నటి వరకు అభ్యసించిన అనుభవాలకు ఈ రోజు జరిగిన అభ్యసనం తోడవుతుంది.
- జీవితాంతం కొనసాగే ప్రక్రియ, అభ్యసనం అందరిలో ఒకేరకంగా ఉండదు. వ్యక్తిని బట్టి మారుతుంది.
- అభ్యసనం నిరంతరం కొనసాగే ప్రక్రియ కానీ ఫలితం కాదు. ప్రతిజీవిలో అభ్యసనం కనిపిస్తుంది. అభ్యసనం గమ్య నిర్దేశక చర్య, ప్రేరణ అభ్యసనకు రహదారి వంటిది. అభ్యసనం బదలాయించబడుతుంది.
ఉదా. గణితం నేర్చుకున్నవారు భౌతిక శాస్త్రం సులువుగా అర్థం చేసుకోగలరు
అభ్యసనం వివిధ రకాలుగా ఉండవచ్చు
1. భావనా అభ్యసనం
(Conceptual Learning)
2. క్రమయుత అభ్యసనం
(Procedural Learning)
3. సాధారణీకరణ అభ్యసనం
(Generalization Learning)
4. వాస్తవిక అభ్యసనం
(Factual Learning)
5. సంసర్గ అభ్యసనం
(Association Learning)
6. వైఖరుల అభ్యసనం
(Attitudal Learning)
7. నైపుణ్యాల అభ్యసనం (Skill Learing)
8. విలువల అభ్యసనం
(Value Learning)
వ్యక్తి అభ్యసనంపై వివిధ అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి అవి…
1. శరీర సంబంధ కారకాలు
2. మానసిక సంబంధ కారకాలు
3. పాఠశాల కారకాలు
4. కుటుంబ కారకాలు
5. సామాజిక కారకాలు
6. ఆర్థిక కారకాలు
- వయస్సు, ఆరోగ్యం, పరిపక్వత, అలసట, పోషణ స్థాయి, లింగభేదం వంటివి శరీర సంబంధ కారకాలు
- ప్రేరణ, ప్రజ్ఞ, అవసరాలు, అభిరుచి, వైఖరులు, స్మృతి, ఉద్వేగాలు, అవధానం, సహజ సామర్థ్యం, గుర్తింపు పొందాలనే కోరిక, ప్రత్యక్షం వంటివి మానసిక కారకాలు
ప్రేరణ, అభ్యసనం
- అభ్యసనంలో ప్రేరణ (Motivation) ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రేరణ అనేది Movare అనే పదం నుంచి గ్రహించారు. దీని అర్థం ‘గమ్యం వైపు కదలిక’.
- ఉపాధ్యాయుడి సామర్థ్యాలు, బోధనా విధానం, పాఠశాల పరిసరాలు, క్రమశిక్షణ, అభ్యసన సామగ్రి, వినియోగం సహపాఠ్య కార్యక్రమాలు, ఆకర్షణీయమైన బోధన మొదలైనవి పాఠశాల కారకాలు.
- తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు, వైఖరులు, పిల్లల పెంపకం, పౌష్టికాహారం, పిల్లలకు కల్పించే వనరులు, తల్లిదండ్రుల విద్యాస్థాయిలు మొదలైనవి కుటుంబ కారకాలు.
- ప్రభుత్వ జోక్యం, ప్రసార మాధ్యమాలు, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, పేదరికం, నిరుద్యోగం మొదలైనవి అభ్యసనంపై ప్రభావం చూపే సామాజిక కారకాలు
అభ్యసన సిద్ధాంతాలు
- అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందని వివరించే సిద్ధాంతాలనే అభ్యసనా సిద్ధాంతాలు అంటారు. అవి.
1. సంసర్గవాద సిద్ధాంతాలు (లేదా) ప్రవర్తనా సిద్ధాంతాలు
2. గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు
3. నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు
4. సామాజిక అభ్యసనం
1. సంసర్గ సిద్ధాంతాలు
- యత్నదోష పద్ధతి (Trai & Error Method) – థారన్ డైక్
- సంప్రదాయ నిబంధనం (లేదా) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (Classical Conditioning Method or Theraphy) – పావ్లోవ్
- యాంత్రిక నిబంధన సిద్ధాంతం (Operant Conditioning) – స్కిన్నర్
నిర్మాణాత్మక సిద్ధాంతాలు
- సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాలు – వైగోట్స్కీ
- సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం
– జాన్ పియాజే
సామాజిక అభ్యసనం
- బండూరా సామాజిక అభ్యసన సిద్ధాంతం (లేదా) నమూనా అభ్యసనం (లేదా) అనుకరణ అభ్యసన సిద్ధాంతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?