గ్లూకోజ్‌ను ైగ్లెకోజన్గా మార్చే హార్మోన్, దాన్ని స్రవించే కణాలు?
బయాలజీ
59. గాయిటర్ అపస్థితి ఏ గ్రంథికి సంబంధించింది?
1) పీనియల్ 2) పారాథైరాయిడ్
3) క్లోమం 4) థైరాయిడ్
60. మానవుడిలో అయోడిన్ లోపం వల్ల కలిగే అపస్థితి?
1) అతికాయత 2) ఆక్రోమెగాలి
3) సరళ గాయిటర్
4) ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్
61. ఇన్సులిన్ అధికంగా ఎక్కించుకోవడం వల్ల కలిగే అపస్థితి ఏది?
1) డయాబెటిస్ మెల్లిటస్
2) డయాబెటిస్ ఇన్సిపిడస్
3) కీటోన్ దేహాల ఉత్పత్తి
4) ఇన్సులిన్ షాక్
62. డయాబెటిస్ ఇన్సిపిడస్కు కారణం?
1) ADH అల్పోత్పత్తి
2) ADH అధికోత్పత్తి
3) ఇన్సులిన్ అల్పస్రావం
4) ఇన్సులిన్ అధిక స్రావం
63. కింది వాటిలో నీటిలో కరిగే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) ఎపినెఫ్రిన్ 4) టెస్టోస్టిరాన్
64. కింది వాటిలో హార్మోన్ కానిది ఏది?
1) పెరుగుదల కారకం
2) గాస్ట్రిన్
3) సొమాటోస్టాటిన్
4) మెలటోనిన్
65. జీర్ణాశయం నుంచి జఠర రసం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది?
1) CCK 2) GIP
3) గాస్ట్రిన్ 4) సెక్రెటిన్
66. కింది హార్మోన్లలో భిన్నమైనది ఏది?
1) GTP 2) కొలిసిస్టోకైనిన్
3) టయలిన్ 4) గాస్ట్రిన్
67. మూత్రపిండం స్రవించే హార్మోన్ ఏది?
1) గాస్ట్రిన్ 2) సెక్రెటిన్
3) AMP 4) ఎరిత్రోపాయిటిన్
68. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్‌ను స్రవించేది ఏది?
1) అస్థిమజ్జ 2) ప్లీహం
3) బీజకోశాలు 4) మూత్రపిండాలు
69. హృదయంలోని కర్ణికా మయోసైట్లు స్రవించే హార్మోన్ ఏది?
1) ఏట్రియల్ నాట్రియూరిటిక్ కారకం
2) జఠరికా నాట్రియూరిటిక్ కారకం
3) ఎరిత్రోపాయిటిన్
4) 1, 2
70. మూత్రపిండాలు, హృదయం, జఠరికాంత్ర;నాళాల మధ్య సారూప్యత ఏమిటి?
1) నాడీస్రావకాలు
2) అన్నీ జీర్ణ గ్రంథులు
3) అన్నీ హార్మోన్లను స్రవించే వినాళ గ్రంథులు కాని అవయవాలు
4) ప్రాథమికంగా బహిస్రావక కణజాలాలు
71. కింది వాటిలో భిన్నమైన హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) ప్రొజెస్టిరాన్
3) ఈస్ట్రోజన్ 4) గ్లూకగాన్
72. ప్రొజెస్టిరాన్ నిర్వహించే విధి?
1) అబార్షన్
2) ప్రొటీన్ల జీవక్రియ
3) ప్రసవ సమయంలో గర్భాశయాన్ని వ్యాకోచింపజేయడం
4) గర్భాశయాన్ని బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపనకు సిద్ధం చేయడం
73. విధి పరంగా కార్పస్ లూటియం?
1) తాత్కాలిక వినాళ గ్రంథి
2) శాశ్వత వినాళ గ్రంథి
3) బహిస్స్రావక గ్రంథి
4) ద్వంద్వ గ్రంథి
74. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అనేవి?
1) ప్రొటీన్లు 2) ఇకోసనాయిడ్స్
3) స్టీరాయిడ్స్ 4) అమైనోఆమ్లాలు
75. అభివృద్ధి చెందిన స్త్రీ బీజకోశ పుటికలు స్రవించే హార్మోన్?
1) కార్టిసాల్ 2) రిలాక్సిన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఈస్ట్రోజన్
76. గర్భాశయంలో పిండ ప్రతిస్థాపనకు దోహదపడే హార్మోన్ ఏది?
1) టెస్టోస్టిరాన్ 2) ప్రొజెస్టిరాన్
3) రిలాక్సిన్ 4) ఈస్ట్రోజన్
77. రసాయనికంగా టెస్టోస్టిరాన్ ఒక?
1) అమైన్ 2) స్ట్రీరాయిడ్
3) ైగ్లెకో ప్రొటీన్ 4) ప్రొటీన్
78. లీడిగ్ కణాలు దేనిలో ఉంటాయి?
1) క్లోమం 2) ముష్కాలు
3) గ్రాఫియన్ పుటికలు
4) కాలేయం
79. శుక్రకణాలను ఉత్పత్తి చేయడం వల్ల ముష్కాన్ని ఏవిధంగా వర్ణిస్తారు?
1) జీర్ణగ్రంథి
2) సైటోజెనిక్ గ్రంథి (కణోత్పాదక గ్రంథి)
3) సంపూర్ణ బహిస్రావక గ్రంథి
4) సంపూర్ణ అంతఃస్రావక గ్రంథి
80. డయాబెటిస్ మెల్లిటస్కు కారణం?
1) గ్లూకగాన్ అల్పస్రావం
2) గ్లూకగాన్ అధిక స్రావం
3) ఇన్సులిన్ అధిక స్రావం
4) ఇన్సులిన్ అల్పస్రావం
81. క్లోమ గ్రంథిలోని లాంగర్‌హాన్స్ పుటికల్లో బీటా కణాల క్రియారాహిత్యం వల్ల ఏం సంభవిస్తుంది?
1) డయాబెటిస్ ఇన్సిపిడస్
2) డయాబెటిస్ మెల్లిటస్
3) పార్కిన్సన్స్ వ్యాధి
4) డయాబెటిస్ ఇంటర్మీడియా
82. రక్తంలో గ్లూకోజ్ సమతాస్థితిని సాధించే హార్మోన్ల జంట ఏది?
1) ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్
2) FSH, LH
3) ఇన్సులిన్, గ్లుకగాన్
4) మెలనిన్, మెలటోనిన్
83. రసాయన స్వభావం రీత్యా ఇన్సులిన్ ఒక?
1) అమైన్ 2) ప్రొటీన్
3) పప్టైడ్ 4) స్టీరాయిడ్
84. గ్లూకోజ్‌ను ైగ్లెకోజన్గా మార్చే హార్మోన్, దాన్ని స్రవించే కణాలు?
1) ఇన్సులిన్, బీటా కణాలు
2) ఇన్సులిన్, ఆల్ఫా కణాలు
3) గ్లూకగాన్, ఆల్ఫా కణాలు
4) గ్లూకగాన్, బీటా కణాలు
85. గ్లూకగాన్ హార్మోన్‌ను ప్రేరేపించే చర్య ఏది?
1) అతిమూత్ర వ్యాధి
2) రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడం
3) కాలేయ కణాల పెరుగుదల
4) రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం
86. క్లోమ గ్రంథిలో వరుసగా అంతఃస్రావక, బహిస్రావక ప్రాంతాలుగా పనిచేసే భాగాలు?
1) అసినై, లాంగర్‌హాన్స్ పుటికలు
2) లాంగర్‌హాన్స్ పుటికలు, అసినై
3) అసినై, వల్కలం
4) దవ్వ, లాంగర్‌హాన్స్ పుటికలు
87. ఎపినెఫ్రిన్ అనేది ఒక?
1) విటమిన్ 2) ఎంజైమ్
3) హార్మోన్ 4) ప్రతిదేహం
88. ఒత్తిడి సమయంలో హృదయ స్పందన రేటును, శ్వాసక్రియారేటును పెంచడంలో తోడ్పడే హార్మోన్ ఏది?
1) కార్టిసాల్ 2) థైరాక్సిన్
3) ఇన్సులిన్ 4) అడ్రినాలిన్
89. పోరాట/పలాయన హార్మోన్‌ను స్రవించే గ్రంథి ఏది?
1) పీనియల్ 2) థైమస్
3) ఎడ్రినల్ 4) థైరాయిడ్
90. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధిచేసే హార్మోన్ ఏది?
1) ప్రొజెస్టిరాన్ 2) టెస్టోస్టిరాన్
3) ఈస్ట్రోజన్ 4) అడ్రినాలిన్
91. కింది వాటిలో ప్రాణరక్షక హార్మోన్ ఏది?
1) లైంగిక హార్మోన్లు
2) గ్లూకోకార్టికాయిడ్లు
3) మినరలో కార్టికాయిడ్‌లు
4) 2, 3
92. అత్యవసర హార్మోన్‌గా దేన్ని పిలుస్తారు?
1) కాల్సిటోనిన్ 2) T3 హార్మోన్
3) కాటెకోలమైన్లు 4) పారాథార్మోన్
93. ప్రౌఢ జీవుల్లో క్రమంగా కుచించుకొనిపోయే గ్రంథి ఏది?
1) అధివృక్క 2) థైమస్
3) థైరాయిడ్ 4) పీనియల్
94. మానవుడిలో థైమస్ గ్రంథి నిర్వర్తించే విధి?
1) Ca+2 నియంత్రణ
2) BMR నియంత్రణ
3) రోగనిరోధకత
4) థైరోట్రోపిన్ను స్రవించడం
95. ఏ వినాళ గ్రంథి క్షీణతను వార్థక్యానికి ప్రాథమిక కారణంగా గుర్తిస్తారు?
1) థైమస్ 2) థైరాయిడ్
3) పారాథైరాయిడ్
4) న్యూరో హైపోఫైసిస్
96. థైమోసిన్ అనేది?
1) స్టీరాయిడ్ హార్మోన్
2) కొవ్వు హార్మోన్
3) అమైన్ హార్మోన్
4) పప్టైడ్ హార్మోన్
97. ఉరోస్థి దిగువన హృదయంపైన అమరిఉండే వినాళ గ్రంథి?
1) థైమస్ 2) పిట్యూటరీ
3) థైరాయిడ్ 4) పీనియల్
98. కింది వాటిలో అంతఃస్రావక గ్రంథి కానిది?
1) కాలేయం 2) క్లోమం
3) థైమస్ 4) ముష్కాలు
99. కాల్షియం సమతాస్థితిలో ప్రధాన పాత్ర వహించే వినాళ గ్రంథి?
1) పీనియల్ 2) పిట్యూటరీ
3) క్లోమం 4) పారాథైరాయిడ్
100. కాల్షియం స్థాయి నియంత్రణతో సంబంధం లేని హార్మోన్ ఏది?
1) కాల్సిటోనిన్ 2) కాల్సిట్రయాల్
3) పారాథార్మోన్ 4) థైరాక్సిన్
101. విటమిన్-డి క్రియాశీల రూపం ఏది?
1) కాల్సిటోనిన్ 2) కాల్సిట్రయాల్
3) కొలెస్టిరాల్ 4) కాటెకోలమైన్లు
102. పూర్తిస్థాయి వినాళ గ్రంథులను మాత్రమే కలిగిన జత ఏది?
1) పీనియల్ గ్రంథి, ముష్కాలు
2) పిట్యూటరీ, క్లోమం
3) స్త్రీబీజ కోశాలు, థైరాయిడ్
4) హైపోఫైసిస్, థైరాయిడ్
103. అయోడిన్‌ను కలిగి ఉండే హార్మోన్ ఏది?
1) ఇన్సులిన్ 2) గ్లూకగాన్
3) థైరాక్సిన్ 4) TCT
104. ఉష్ణోత్పాదక హార్మోన్‌గా దేన్ని పిలుస్తారు?
1) సొమాటోస్టాటిన్
2) థైరాయిడ్ హార్మోన్
3) పారాథైరాయిడ్ హార్మోన్లు
4) సెక్రెటిన్
105. T3, T4 అనేవి?
1) పారా థైరాయిడ్ హార్మోన్లు
2) థైరాయిడ్ హార్మోన్లు
3) పిట్యూటరీ హార్మోన్లు
4) థైమస్ హార్మోన్లు
106. థైరాక్సిన్ సంశ్లేషణను, విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది?
1) ACTH 2) FSH
3) LH 4) TSH
107. కింది ఏ రెండు హార్మోన్లు టైరోసిన్ ఉత్పాదకాలు?
1) FSH, GH
2) థైరాక్సిన్, అడ్రినాలిన్
3) ఇన్సులిన్, గ్లూకగాన్
4) థైరాక్సిన్, ఇన్సులిన్
108. పీనియల్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏది?
1) అడ్రినలిన్ 2) మెలటోనిన్
3) థైరాక్సిన్ 4) ఇన్సులిన్
109. పీనియల్ గ్రంథి హార్మోన్‌తో ప్రభావితం కానిది ఏది?
1) రక్త కణాల ఉత్పత్తి
2) రుతుచక్రం
3) వర్ణకాలు 4) జీవ గడియారం
110. మూత్రం గాఢతను అధికం చేసే హార్మోన్ ఏది?
1) వాసోప్రెసిన్ 2) థైరాక్సిన్
3) ఆక్సిటోసిన్ 4) రెనిన్
111. రక్తంలో ADH స్థాయి తగ్గితే కలిగే అపస్థితి?
1) అల్ప మూత్ర విసర్జన
2) అధిక మూత్ర విసర్జన
3) ప్రభావ రహితం
4) మూత్రంలో గ్లూకోజ్ విడుదల
112. వాసోప్రెసిన్కు మరో పేరు?
1) FSH 2) TSH
3) ADH 4) ACTH
113. గర్భిణుల్లో ఆక్సిటోసిన్ అధిక స్రావం వల్ల కలిగే ఫలితం?
1) హిమోగ్లోబిన్ తగ్గడం
2) అధిక పాల ఉత్పత్తి
3) అధిక రక్తపోటు
4) గర్భాశయంలో శక్తిమంతమైన
సంకోచాలు అధికమై గర్భ విచ్ఛిత్తికి
దారి తీయడం
114. MSH దేన్ని నియంత్రిస్తుంది?
1) క్షీరోత్పత్తి
2) అండోత్సర్గం
3) సర్కేడియన్ లయలు
4) చర్మం రంగు
115. మానవుడిలో క్షీరోత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది?
1) ల్యూటియోట్రోపిక్ హార్మోన్
2) ల్యూటినైజింగ్ హార్మోన్
3) వాసోప్రెసిన్
4) 1, 2
116. ప్రొలాక్టిన్ హార్మోన్‌ను ఏది స్రవిస్తుంది?
1) ఎడినో హైపోఫైసిస్
2) న్యూరో హైపోఫైసిస్
3) హైపోథలామస్
4) థైరాయిడ్
117. శుక్రజననాన్ని, స్త్రీబీజ కోశపుటికల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్?
1) LH 2) LTH
3) FSH 4) MSH
118. గొనడోట్రోఫిన్లుగా పిలిచే రెండు హార్మోన్లు?
1) FSH, TSH 2) TSH, LH
3) FSH, MSH 4) FSH, LH
119. ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్‌ను స్రవించే గ్రంథి?
1) కాలేయం 2) క్లోమం
3) పిట్యూటరీ 4) థైరాయిడ్
120. హైపోఫైసిస్ అని పిలిచే వినాళగ్రంథి ఏది?
1) థైమస్ 2) పీనియల్
3) పిట్యూటరీ 4) థైరాయిడ్
121. విడుదల, నిరోధక హార్మోన్లను స్రవించే గ్రంథి?
1) హైపోథలామస్
2) అడ్రినల్ వల్కలం
3) థైరాయిడ్
4) పిట్యూటరీ
122. కింది వాటిలో వినాళ గ్రంథి కాని అవయవం?
1) పిట్యూటరీ 2) కాలేయం
3) థైరాయిడ్
4) పారా థైరాయిడ్
123. రసాయనికంగా హార్మోన్లు వేటి నిర్మితాలు?
1) కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, కొవ్వులు
2) కార్బోహైడ్రేట్లు, న్యూక్లియోటైడ్లు
3) కొవ్వులు, విటమిన్లు
4) అమైన్లు, పప్టైడ్లు, స్టీరాయిడ్లు
124. హార్మోన్లు విచ్ఛిన్నం చెందే అవయవం ఏది?
1) కాలేయం 2) ప్లీహం
3) క్లోమం 4) పిత్తాశయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?