ఏ ప్రాజెక్ట్ నీటిని భారతదేశం-నేపాల్ దేశాలు పంచుకుంటున్నాయి?
బహుళార్థసాధక ప్రాజెక్టులు
1. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) దేశంలో ప్రధానంగా మూడు పద్ధతుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు అందించబడుతున్నాయి.
బి) దేశంలో బావుల ద్వారా అత్యధికంగా నీటి పారుదల సౌకర్యాలు అందిస్తున్నారు.
సి) ఉత్తర భారతదేశంలో చెరువుల ద్వారా అత్యధికంగా నీటి పారుదల సౌకర్యాలు అందిస్తున్నారు.
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
2. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
1) ఇది గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్ట్
2) దీనిని నర్మద నదిపై నిర్మిస్తున్నారు
3) ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది
4) దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టిన వారు – మేధాపాట్కర్
3. కిందివాటిలో నర్మద ప్రాజెక్ట్ పథకంలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులేవి?
ఎ) మహేశ్వర్ బి) ఓంకారేశ్వర్
సి) సర్దార్ సరోవర్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
4. మనదేశంలో నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి గల కారణాలు ఏవి?
ఎ) అనిశ్చిత వర్షపాతం
బి) సరిపడినంత వర్షపాతం లేకపోవడం
సి) సంకర జాతి పంటల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
డి) మేలైన పంటల నమూనాను అమలు
పరచకపోవడం
5. ముల్లాపెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ర్టాల మధ్య తీవ్ర విభేదాలను సృష్టించింది?
1) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
2) కర్ణాటక, తమిళనాడు
3) తమిళనాడు, కేరళ
4) కేరళ, కర్ణాటక
6. కిందివాటిలో తప్పు వాక్యం ఏది?
ఎ) తుంగభద్ర ప్రాజెక్ట్ ఉద్దేశం
– నీటిపారుదల
2) రిహండ్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం
– నీటిపారుదల
3) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం
-నీటిపారుదల
4) బియాస్నది ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం
నీటిపారుదల
7. కిందివాటిలో విద్యుదుత్పత్తి ఆధార ప్రాజెక్ట్ ఏది?
1) బియాస్ 2) భాక్రానంగల్
3) నాగార్జున సాగర్ 4) శ్రీరాంసాగర్
8. కింది జతలను పరిశీలించండి?
వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం ప్రాజెక్ట్ /పథకం
ఎ) 10,000 హెక్టార్లకు మించి సాగు చేయగల భూమి 1) మేజర్ ఇరిగేషన్ ప్రాజ్టె
బి) 10,000 నుంచి 25,000 ఎకరాల వరకు 2. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్
సాగు చేయగల భూమి
సి) 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి 3. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
సరికాని జతలను ఎంపిక చేయండి.?
1) ఎ 2) బి 3) బి, సి 4) ఎ, సి
9. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) బెంగాల్ ప్రాంతంలో వరదలను అదుపు చేయడానికి దామోదర్ నదిలోయ ప్రాజెక్టును నిర్మించారు
బి) దామోదర్ నదిలోయ ప్రాజెక్టులో భాగంగా 7 ప్రాజెక్టులను నిర్మించాలని ప్రతిపాదన చేశారు.
సి) ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే రాష్ర్టాలు – పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి డి) ఎ, బి, సి
10. దామోదర్ నదీలోయ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రాజెక్టు ఏది?
ఎ) పంచెట్ బి) తిలయా
సి) కోనార్ డి) మైథాన్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
11. బావుల కింద పండించడం ఎక్కువగా ఏ భాగంలో జరుగుతుంది?
1) ఉత్తర మైదాన ప్రాంతం
2) ద్వీపకల్ప పీఠభూమి
3) తూర్పుతీర ప్రాంతాలు
4) పడమర తీర ప్రాంతాలు
12. కింది వాటిలో సరికానిది ఏది?
1) బియాస్ ప్రాజెక్ట్‌ను మహారాణా ప్రతాప్‌సాగర్ అని కూడా పిలుస్తారు
బి) కోసి ప్రాజెక్టు వల్ల బీహార్, భూటాన్‌లు లబ్ధి పొందుతున్నాయి
సి) గండక్ ప్రాజెక్టు వల్ల బీహార్, నేపాల్ లబ్ధి పొందుతున్నాయి
4) ఇందిరాసాగర్ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రంలో ఉంది
13. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) కోసి ప్రాజెక్టును నేపాల్, బీహార్
సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించారు
బి) గండక్ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు.
సి) దేశంలో అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ తెహ్రీ పాజెక్ట్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
14. ఐసీఏఆర్ ప్రకారం మనదేశంలో ముఖ్యమైన నేలలు ఎన్ని రకాలున్నాయి?
1) 8 2) 6 3) 10 4) 5
15. కిందివాటిని జతపరచండి?
1) జయక్వాడి ఎ) గుజరాత్
2) శారదా బి) తమిళనాడు
3) ఉకాయ్ సి) మహారాష్ట్ర
4) మెట్టూర్ డి) ఉత్తరప్రదేశ్
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
16. దేశంలో నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధికి గల అనుకూలతలు ఏవి?
1. తగినంత భూగర్భ జల లభ్యత
2) చెరువులు నిండటానికి అనువైన స్థలాకృతి
3) సుమారుగా సమతలంగా ఉన్న సేద్యపు భూమి 4) పైవన్నీ
17. ప్రతిపాదన (ఎ): చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.
కారణం(ఆర్) దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఉత్తర భారతదేశంతో పోల్చినపుడు అది బాగా వెనుకబడిన ప్రాంతం.
సరైనదాన్ని గుర్తించండి?
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’, నిజం కాని ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కాని ‘ఆర్’, నిజం
18. కిందివాటిని జపరచండి?
ప్రాజెక్టులు నదులు
1) ఎల్లంపల్లి ఎ) మహీనది
2) కదనా బి) గోదావరి
3) చనకా- కొరాటా సి) కావేరి
4) కృష్ణాసాగర్ డి) పెన్‌గంగా
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
19. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్‌కు మరోపేరు?
1) నీలం సంజీవ రెడ్డి సాగర్ ప్రాజెక్టు
2) వై.ఎస్. రాజశేఖర రెడ్డి సాగర్ ప్రాజెక్ట్
3) కోట్ల విజయ భాస్కర రెడ్డి సాగర్ ప్రాజెక్ట్
4) దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్
20. భాక్రా-నంగల్ ఏ రాష్ర్టాల సంయుక్త ప్రాజెక్ట్?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
21. కిందివాటిలో సరికానిది ఏది?
1) బాగ్లీహార్ ప్రాజెక్ట్ విషయంలో మన
దేశానికి నేపాల్‌కు మధ్య వివాదాస్పదంగా ఉంది
2) ముళ్ల పెరియార్ ప్రాజెక్ట్ విషయంలో కేరళ, తమిళనాడుకు మధ్య వివాదం ఉంది
3) మహంకాళి ఒప్పందం మనదేశం నేపాల్ దేశంతో చేసుకుంది
4) కిషన్ గంగా ప్రాజెక్ట్ విషయంలో భారత్ పాకిస్థాన్ మధ్య వివాదాస్పదంగా ఉంది.
22. కిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) తెహ్రీ ప్రాజెక్టు భగీరథపై నిర్మించారు.
బి) దీనిని వ్యతిరేకిస్తూ సుందర్‌లాల్
బహుగుణ చిప్కో ఉద్యమం చేపట్టారు.
సి) చంబల్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్,
ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్ట్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
23. దేశంలో అన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలతో ముందంజలో ఉన్న రాష్ట్రం?
1) తమిళనాడు 2) పంజాబ్
3) రాజస్థాన్ 4) మధ్యప్రదేశ్
24. కిందివాటిని జతపరచండి?
1) పోలవరం ఎ) గోదావరి
2) పులిచింతల బి) కృష్ణా
3) నాత్పా ఝాక్రి సి) సట్లెజ్
4) ఇడుక్కి డి) పెరియార్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
25. కిందివాటిలో తప్పుగా ఇచ్చినవి ఏవి?
ఎ) కోసి ప్రాజెక్టు ఇండియా, బంగ్లాదేశ్‌ల ఉమ్మడి పథకం
బి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది గోవాలో ఉంది
సి) నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్లీలో ఉన్నది
డి) నాగర్‌కోయిల్ నుంచి శ్రీలంక వెళ్ళడానికి గల్ఫ్ ఆఫ్ ఖంభట్ దాటాలి
1) బి, సి 2) ఎ, డి
3) ఎ, బి 4) ఎ, సి
26. బాగ్లీహార్ ప్రాజెక్ట్ ఏనదిపై నిర్మించారు?
1) తపతి 2) రావి
3) చీనాబ్ 4) సట్లెజ్
27. నీటి వినాశనం వల్ల జరిగే నష్టాన్ని తక్కువ అంచనా వేయలేం. బహుళార్థసాధక ప్రాజెక్టుల సేద్యపు సంభావ్యత తగ్గుతూ ఉంది. అందుకు గల ప్రధాన కారణం ఏది?
1) కొట్టుకొని పోయి అడుగున
పేరుకుపోయిన బురద ఒండ్రుమట్టి
2. వరదలు 3) భూసార వినాశం
4) భూసార పునరుద్ధరణ
28. కిందివాటిని జతపరచండి?
1) సలాల్ ఎ) జీలం
2) తుల్బుల్ బి) చీనాబ్
3) బాబ్లి సి) తపతి
4) కాక్రపార డి) గోదావరి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
29. కిందివాటిలో సరికానిది ఏది?
1) ఆల్మట్టి – కర్ణాటక
2) బాగ్లీహార్ – జమ్ము కశ్మీర్
3) నారాయణపూర్ -ఆంధ్రప్రదేశ్
4) థెయిన్ – పంజాబ్
30. ఏ ప్రాజెక్ట్ నీటిని భారతదేశం, నేపాల్ దేశాలు పంచుకుంటున్నాయి.
1) భాక్రానంగల్ 2) హీరాకుడ్
3) రామ్గంగ 4) కోసి
31. ప్రతిపాదన(ఎ) : భారతదేశంలో నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధికి తగినన్ని భౌగోళిక అవకాశాలు ఉన్నాయి.
కారణం(ఆర్): దేశంలో జీవ నదులు,
ఆనకట్టలు నిర్మించడానికి అనువైన స్థలాలు ఉన్నాయి.
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’, నిజం కాని ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కాని ‘ఆర్’, నిజం
32. గోవింద్‌సాగర్ సరస్సు ఏ ప్రాజెక్టు వద్ద ఉంది?
1) గండల్ 2) బియాస్
3) భాక్రానంగల్ 4) రిహండ్
33. కింది సాగునీటి పథకాల్లో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
ఎ) చనాకా – కొరాటా ప్రాజెక్ట్
(నిర్మాణంలో ఉంది)
బి) మత్తడి వాగు ప్రాజెక్ట్
సి) నీల్వాయి ప్రాజెక్ట్
డి) సదర్మత్ ప్రాజెక్ట్
ఇ) సాత్నాలా ప్రాజెక్ట్
1) ఎ, బి, డి, ఇ 2) ఎ, బి, ఇ
3) సి, డి, ఇ 4) ఎ, బి, సి
34. ప్రతిపాదన (ఎ) : ప్రాజెక్టులను నిర్మించడం వల్ల కృత్రిమ సరస్సులు ఏర్పడతాయి?
కారణం (ఆర్) : గోవింద వల్లభ్ పంత్ సాగర్ సరస్సు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడింది?
సరైన దాన్ని గుర్తించండి?
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవే, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’, నిజం కాని ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కాని ‘ఆర్’, నిజం
35. కిందివాటిలో సరికానిది ఏది?
1) మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్ట్
2) మనదేశంలో మొట్టమొదటిసారిగా
నిర్మించిన నదీలోయ ప్రాజెక్ట్ – దామోదర్ నదీలోయ ప్రాజెక్ట్
3) 2000 నుంచి 10,000 వరకు ఆయకట్టు గల పథకాలను మధ్యతరహా ప్రాజెక్టులు అని పిలుస్తారు
4) 25000 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టులను భారీతరహా ప్రాజెక్ట్ అని అంటారు
36. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
1) 1974 -75 సం.లో ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు.
2) దీని ముఖ్య ఉద్దేశం నీటిపారుదల
3) అలాగే దీని మరొక ఉద్దేశం నీటి పారుదల వినియోగాల మధ్యగల అంతరాన్ని పూరించడం 4) పైవన్నీ సరైనవే
37. కిందివాటిని జతపరచండి?
కాలువలు రాష్ర్టాలు
1) గోవింద్‌సాగర్ ఎ) పశ్చిమ బెంగాల్
2) కాంగసభతి బి) హిమాచల్‌ప్రదేశ్
3) బైరవని తిప్ప సి) తెలంగాణ
4) రాజోలిబండ డి) ఆంధ్రపదేశ్
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- Tags
- Nepal
- project water
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు