రాష్ట్రాలు-వార్తాంశాలు
లఢక్
దేశంలోనే మొట్టమొదటి డార్క్ స్కైని లఢక్‌లో ఏర్పాటు చేశారు. పరిశోధనతో పాటు ఆస్ట్రో టూరిజమ్ అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
జమ్ము కశ్మీర్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఏక గవాక్ష విధానంలో జమ్ము కశ్మీర్ చేరింది. ఈ ఘనతను సాధించిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఇదే.
నాగాలాండ్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో భాగంగా కాగిత రహిత శాసనసభగా నాగాలాండ్ అవతరించింది.
షౌక్వి రైల్వే స్టేషన్
నాగాలాండ్ రాష్ట్రంలో ఇది రెండో రైల్వే స్టేషన్. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఇదే. 1903లో బ్రిటిష్ పాలన కాలంలో దిమాపూర్ స్టేషన్‌ను నిర్మించారు.
అస్సాం
రాళ్లతో చేసిన అతిపెద్ద పాత్రలను అస్సాం రాష్ట్రంలోని డిమా హసో జిల్లా అలాగే నుచుబంగ్లో అనే ప్రాంతంలో కనుగొన్నారు. నుచుబంగ్లోలో 546 కనిపించాయి. ఈ తరహా పాత్రలు ఒకే చోట ఇన్ని కనిపించడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి.
హిమాచల్ ప్రదేశ్
దేశంలోనే తొలిసారి డ్రోన్ విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది.
వీఎల్టీడీ: రాష్ట్రంలోని అన్ని వాణిజ్య వాహనాలను వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్టీడీ)తో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ ఘనతను దక్కించుకుంది.
ఢిల్లీ
దేశంలో తొలి ఈ-వేస్ట్ ఎకో పార్క్ ఢిల్లీలో ప్రారంభించారు.
ఎఫ్‌సీఈవీ: దేశంలో మొట్టమొదటి ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. దీని పేరు మిరాయ్. జపాన్‌కు చెందిన టొయోట సంస్థ దీన్ని ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
మేఘాలయ
యూఎన్ అందించే వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డును మేఘాలయ రాష్ట్రం గెలుచుకుంది.
పంజాబ్
పాత పింఛను విధానానికి వెళ్లాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హర్యానా
సఫారి పార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ పార్క్‌ను అభివృద్ధి చేయాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురుగ్రామ్‌లో నుహ్ జిల్లా పరిధిలో ఆరావళి పర్వత శ్రేణిలో 10,000 ఎకరాల్లో ఇది విస్తరించనుంది.
హరప్పా మ్యూజియం: ప్రపంచంలోనే అతిపెద్ద హరప్పా మ్యూజియంను హర్యానాలోని రాకిఘరిలో ఏర్పాటు చేయనున్నారు.
రాజస్థాన్
పట్టణాల్లోని నైపుణ్యంలేని కార్మికుల కోసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు.
డిజిటల్ లోక్ అదాలత్: దేశంలో మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్‌ను అందించిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది.
సహకార బ్యాంక్: పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో కొనసాగే మహిళల బ్యాంకును దేశంలో తొలిసారి రాజస్థాన్‌లో ప్రారంభించారు.
గుజరాత్
నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్‌ను గుజరాత్‌లోని లోథాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.3500 కోట్లు వ్యయం చేయనున్నారు.
సెమీ కండక్టర్ విధానం: దేశంలో సెమీ కండక్టర్ విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
ఒలింపిక్ స్థాయి స్టేడియం: దేశంలో ఒలింపిక్ స్థాయి స్టేడియంను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మే 29న భూమి పూజ చేశారు.
స్టీల్ రోడ్: దేశంలో తొలిసారి స్టీల్ స్లాగ్ రోడ్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించారు.
జార్ఖండ్
జమ్‌తార అనే జిల్లాలో అన్ని పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ విధంగా గ్రంథాలయాలు ఉండటం దేశంలో ఇదే ప్రథమం.
బీహార్
దేశంలో అతిపెద్ద రబ్బర్ డ్యామ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రారంభించారు. రూ.324 కోట్లతో దీన్ని నిర్మించారు. దీనికి గయాజీ డ్యామ్ అని పేరు పెట్టారు. ఫల్గు నదిపై దీన్ని నిర్మించారు.
ఇథనాల్ ప్లాంట్: విత్తనాల ఆధారిత మొట్టమొదటి ఇథనాల్ ప్లాంట్‌ను బీహార్‌లోని పుర్నియా జిల్లాలో ప్రారంభించారు. భారత్‌లోనే ఈ తరహా ప్లాంట్ ఇదే మొదటిది.
ఒడిశా
జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.
థాయ్ చట్నీ: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో స్థానికులు చీమలతో చేసే చట్నీని థాయ్ చట్నీగా పిలుస్తారు. దీనికి జీఐ ట్యాగ్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పోషక విలువలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
మూడో కూచిపూడి నృత్యోత్సవాన్ని అక్టోబర్ 14న విజయవాడలో ప్రారంభించారు. ఇవి మూడు రోజులు కొనసాగాయి.
తమిళనాడు
చిన్నగా ఉండే లోరిస్ (ఒక జంతువు) జాతికి ఒక అభయారణ్యాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు. ఈ జంతువుకు భారత్‌లో ఇదే తొలి అభయారణ్యం. 11,806 హెక్టార్లలో ఇది విస్తరించనుంది. రాష్ట్రంలోని కారూర్, డిండిగల్ జిల్లాలో ఉంటుంది.
సీవీడ్ పార్క్: దేశంలో సీవీడ్ పార్క్‌ను ప్రారంభించిన తొలి రాష్ట్రం తమిళనాడు.
డ్యుగోంగ్ సంరక్షణ కేంద్రం: డ్యుగోంగ్ అనే జలచర సంరక్షణకు ప్రత్యేకంగా ఒక సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం తమిళనాడు.
అల్పాహారం: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఉదయం అల్పాహారాన్ని ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తుంది.
వీధి జంతువులకు అంబులెన్స్: వీధి జంతువులకు అంబులెన్స్‌ను ప్రారంభించిన దేశ మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు.
ఉత్తరాఖండ్
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు, విధి విధానాల రూపకల్పనకు ఒక కమిటీని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది.
ద్రవ దర్పణ టెలిస్కోప్: దేశంలో తొలి ద్రవ దర్పణ టెలిస్కోప్‌ను ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్దది.
ఉత్తరప్రదేశ్
డేటా సెంటర్: ఉత్తర భారత దేశంలో మొదటి డేటా సెంటర్‌ను గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.
అమృత్ సరోవర్: అమృత్ సరోవర్‌లో భాగంగా దేశంలో అత్యధిక సరస్సులు నిర్మించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 8462 సరస్సులను నిర్మించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్ ఉన్నాయి.
పారా బ్యాడ్మింటన్ అకాడమీ: దేశంలో తొలి పారా బ్యాడ్మింటన్ అకాడమీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమయ్యింది.
మహారాష్ట్ర
డబుల్ డెక్కర్ బ్రిడ్జి: ప్రపంచంలో అతి పొడవైన డబుల్ డెక్కర్ బ్రిడ్జిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్మించారు.
జీన్ బ్యాంక్ ప్రాజెక్ట్: దేశంలో మొదటి జీన్ బ్యాంక్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర.
వాటర్ ట్యాక్సీ: దేశంలో తొలిసారి వాటర్ ట్యాక్సీ సేవలను ముంబైలో అందుబాటులోకి తెచ్చారు.
ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్: పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయోరాలజీ కార్యాలయంలో ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. రుతుపవన వ్యవస్థలో వచ్చిన మార్పులను ఇక్కడ అధ్యయనం చేయనున్నారు.
కర్ణాటక
పాల ఉత్పత్తిదారుల కోసం దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక సహకార బ్యాంకును ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నందిని క్షీర సముద్ర సహకార బ్యాంక్ పేరుతో ఇది సేవలను అందించనుంది.
సైబర్ సెక్యూరిటీ హబ్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది (ఐబీఎం). ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ఇది సేవలను అందిస్తుంది.
మధ్యప్రదేశ్
వేద గడియారం: దేశంలో మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రారంభించనున్నారు. దీని ఏర్పాటుకు రూ.1.62 కోట్లు వ్యయం చేశారు.
జియోలాజికల్ పార్క్: దేశంలో మొట్టమొదటి జియోలాజికల్ పార్క్‌ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న లామ్హెట్టా గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.
కేరళ
బంగారు ధరలు: బ్యాంక్ రేట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బంగారు ధరలు ఒకేలా ఉండే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కేరళ.
పుల్లుంపరా గ్రామ పంచాయతీ: ఈ పంచాయతీలో 100 శాతం డిజిటల్ అక్షరాస్యతను సాధించారు. దేశంలో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఇదే.
ఇంటర్నెట్ సర్వీస్: ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఇదే.
ఓటీటీ: సీఎస్పీఏసీఈ పేరుతో ఓటీటీ సేవలను అందించనుంది. ఈ తరహా సేవలను అందిస్తున్న మొదటి రాష్ట్రం కేరళ.
కుంబలంగి గ్రామం: దేశంలో మొదటి శానిటరీ రహిత పంచాయతీగా కేరళలోని కుంబలంగి గ్రామ పంచాయతీ నిలిచింది.
వాటర్ మెట్రో: దేశంలో మొదటిసారి వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కేరళలోని కొచ్చిలో అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణ
విదేశీ పారిశ్రామిక పార్కులు
విదేశాల పేరిట ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కేటాయించడంతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలు, మానవ వనరులను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే శిక్షణ కేంద్రాలను స్థాపించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తొలి దశలో పది దేశాలకు చెందిన పార్కులను ఏర్పాటు చేస్తారు. ఆసియాలోని కొరియా, తైవాన్, జపాన్, ఇండోనేషియా, యూరప్‌లోని ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, ఉత్తర అమెరికాలోని కెనడా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశాల పేరిట ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం.
బూస్టర్ డోస్ పంపిణీలో అగ్రస్థానం
కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
క్రికెట్ కోచ్‌గా తెలంగాణ మహిళ
తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్ కోచ్‌గా బుర్రా లాస్య ఎంపికయ్యింది. ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ. దేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ పరీక్ష నిర్వహించగా భారత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అందులో లాస్య ఒకరు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
కృత్రిమ మేధ ఆధారిత వనరులపై గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పరిశోధనలకు పసిఫిక్ రిమ్ ఇంటర్నేషనల్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-2022 నుంచి బెస్ట్ పేపర్ రన్నరప్‌గా అవార్డు లభించింది.
వ్యవసాయ భూముల డిజిటలీకరణ
సాగు భూములను డిజిటలీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృత్రిమ మేధ వినియోగించుకుంటూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సేవ చేయవచ్చు. వ్యవసాయ భూములను గూగుల్ ద్వారా గుర్తించి వాటి మ్యాప్‌లను తయారు చేస్తారు. భూములను డిజిటలీకరించి, యజమానులు, రైతుల పేర్లను నమోదు చేస్తారు. భూముల సారం, ఆయా ప్రాంతాల్లో వాతావరణం ఏ పంటకు అనుకూలం మొదలైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు నేరుగా సమాచారం ఇచ్చేందుకు వీలుంటుంది.
గిరిజనుల జనాభా 31,77,940
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలోని గిరిజనుల జనాభా 31,77,940 ఉంది. ఇది 2011 గణాంకాల ప్రకారం చేసిన గణన. అతి ఎక్కువగా గిరిజన జనాభా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న వారి సంఖ్య 3,02,034. ఆ తర్వాత మహబూబాబాద్‌లో ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న గిరిజనులు 2,92,778.
లితిన్ కుమార్‌కు అవార్డు
దక్షిణాఫ్రికా దేశంలో ఐటీ రంగానికి చేసిన కృషికి తెలంగాణకు చెందిన లితిన్ కుమార్ నాసనికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఐటీసీ గురు ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ప్రకటించింది.
సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో మూడో స్థానం
సాఫ్ట్వేర్ ఎగమతుల్లో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానాన్ని దక్కించుకుంది. తొలి స్థానంలో కర్ణాటక ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. నాలుగు, అయిదో స్థానాల్లో వరుసగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?