‘లౌకిక కళ నైపుణ్యం’గా ప్రసిద్ధి చెందినది?
- ఎకానమీ
1. మెదక్ చర్చిని ఏ కాలంలో నిర్మించారు?
ఎ) మొదటి ప్రపంచ యుద్ధ కాలం
బి) రెండో ప్రపంచ యుద్ధ కాలం
సి) స్వాతంత్య్ర ఉద్యమ కాలం
డి) స్వాతంత్య్రం తర్వాత కాలం
2. అజాం జాహి మిల్లు ఎక్కడ నిర్మించారు?
ఎ) మెదక్ బి) వరంగల్
సి) ఖమ్మం డి) నల్లగొండ
3. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2014 మార్చి 15
బి) 2014 ఏప్రిల్ 15
సి) 2015 మార్చి 15
డి) 2015 ఏప్రిల్ 15
4. 1956 నవంబర్ 1న రాష్ట్ర ఆర్థిక సంస్థను ఎక్కడ స్థాపించారు?
ఎ) కర్నూలు బి) హైదరాబాద్
సి) ఖమ్మం డి) వరంగల్
5. తెలంగాణలోని పోచంపల్లి ఏ విధంగా ప్రసిద్ధి చెందింది?
ఎ) తెలంగాణ కాటన్ నగరం
బి) తెలంగాణ సిల్క్ నగరం
సి) తెలంగాణ పట్టు నగరం
డి) తెలంగాణ బంగారు నగరం
6. రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) సిద్దిపేట బి) వరంగల్
సి) ములుగు డి) సంగారెడ్డి
7. తెలంగాణలోని అడవులు ఏ రకానికి చెందినవి?
ఎ) సతత హరితారణ్యాలు
బి) విశాలమైన ఆకులు కలిగిన అడవులు
సి) తేమ కలిగిన అడవులు
డి) ఆకురాల్చు అడవులు
8. తెలంగాణలోని ఏ గ్రామంలో మొదటిసారిగా బొగ్గును కనుగొన్నారు?
ఎ) బెల్లంపల్లి బి) భూపాలపల్లి
సి) రామగుండం డి) ఇల్లందు
9. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పేరు?
ఎ) జవహర్ కాలువ
బి) మహబూబ్‌నగర్
సి) లాల్ బహుదూర్ కాలువ
డి) రావు కాలువ
10. తెలంగాణలో భూమి కొనుగోలు పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2014 సెప్టెంబర్ 15
బి) 2014 ఆగస్టు 15
సి) 2015 సెప్టెంబర్ 15
డి) 2015 ఆగస్టు 15
11. తెలంగాణలో కౌలుదారు విధానాలు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
12. ఈ కిందివాటిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి మరొక పేరు?
ఎ) జమీందారి విధానం
బి) రైత్వారీ విధానం
సి) మహల్వారీ విధానం డి) ఏదీకాదు
13. భూగరిష్ఠ పరిమితి చట్టంలో ఒక యూనిట్‌గా దేన్నిభావించేవారు?
ఎ) కుటుంబం బి) గ్రామం
సి) మండలం డి) జిల్లా
14. భూ సంస్కరణల ప్రధాన లక్ష్యం
ఎ) భూ యాజమాన్యంలో అసమానతల
తొలగింపు
బి) వ్యవసాయ సాధికారత సాధించడం
సి) సామాజిక న్యాయం
డి) పైవన్నీ
15. తెలంగాణలో అధిక సంఖ్యలో గల వ్యవసాయ కమతాలు?
ఎ) సన్నకారు రైతులది
బి) చిన్న, సన్నకారు రైతులది
సి) మధ్యమిక, చిన్నరైతులది
డి) పెద్ద, మాధ్యమిక రైతులది
16. ఉపాంత వ్యవసాయ భూమి పరిమితి?
ఎ) ఒక హెక్టారు కంటే తక్కువ
బి) ఒకటి, రెండు హెక్టార్ల మధ్య
సి) రెండు, నాలుగు హెక్టార్ల మధ్య
డి) నాలుగు , పది హెక్టార్ల మధ్య
17. జైభారత్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) బ్రహ్మానంద రెడ్డి
బి) నీలం సంజీవరెడ్డి
సి) ఎన్టీ రామారావు
డి) పీవీ నరసింహారావు
18. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎన్ని టీఎంసీలు?
ఎ) 171 బి) 181
సి) 312 డి) 191
19. రాష్ట్ర ఆదాయాన్ని కొలవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయాల మదింపు పద్ధతి
డి) ఉమ్మడి పద్ధతి
20. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సహకార బ్యాంకులు?
ఎ) 540 బి) 959
సి) 969 డి) 979
21. భూ సంస్కరణల అమలుకు పూర్వం ఉన్న భూస్వామ్య విధానాలు ఏవి?
ఎ) సంస్థానాలు బి) సర్ఫేఖాస్
సి) జాగీర్థార్లు డి) పైవన్నీ
22. 2021-22 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఎంత?
ఎ) 4.5 శాతం బి) 4.97 శాతం
సి) 3.6 శాతం డి) 5.2 శాతం
23. 2021-22లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
ఎ) 15 శాతం బి) 16 శాతం
సి) 18.8 శాతం డి) 19.9 శాతం
24. సమ్మక్క సారాలమ్మ జాతర ఏ పండగ?
ఎ) జాతీయ పండగ బి) రాష్ట్ర పండగ
సి) ప్రాంతీయ పండగ
డి) స్థానిక పండగ
25. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఎంత పింఛన్ ఇస్తుంది?
ఎ) రూ. 2016 బి) రూ. 3016
సి) రూ. 1016 డి) రూ. 5016
26. తెలంగాణలో ఉపాంత కమతాల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) వరంగల్ బి కరీంనగర్
సి) మెదక్ డి) భూపాలపల్లి
27. భారతదేశంలో ఏ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నారు?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) ఏదీకాదు
28. హోటళ్లు, రెస్టారెంట్లు ఏ రంగానికి చెందినవి?
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం
డి) నాల్గవ రంగం
29. తెలంగాణలో వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్ని
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
30. తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2014 అక్టోబర్ 2
బి) 2014 అక్టోబర్ 5
సి) 2014 అక్టోబర్ 20
డి) 2015 అక్టోబర్ 20
31. ములకనూరు మహిళా సహకార డెయిరీని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2002 జనవరి బి) 2002 ఆగస్టు
సి) 2003 జనవరి డి) 2003 జూన్
32. దేన్ని పేదవాని కలప అంటారు?
ఎ) టేకు బి) వెదురు
సి) ఉసిరి డి) వేప
33. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు మారు పేరు?
ఎ) రామగుండం బి) శ్రీపాద సాగర్
సి) సింగూర్ డి) దేవాదుల
34. తెలంగాణలోని అడవులు ఎన్ని రకాలు?
ఎ) రిజర్వ్డ్ ఫారెస్ట్ (72 శాతం)
బి) రక్షిత అడవులు (26 శాతం)
సి) వర్గీకరించని అడవులు (2 శాతం)
డి) పైవన్నీ
35. కింది వాటిలో ఏ అంశాలు పంటరేటును ప్రభావితం చేస్తాయి?
ఎ) ఆర్థిక అంశాలు
బి) సాంఘిక అంశాలు
సి) భౌతిక అంశాలు డి) పైవన్నీ
36. భారతదేశపు పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర స్థానం?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
37. బహుమానంగా ఇచ్చే భూములను ఏమంటారు?
ఎ) ఖల్సాదివాని బి) మదర్ మాష్
సి) మస్రుది డి) ఇనాందార్లు
38. ‘అఖిల భారత కిసాన్ సభ’ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1916 బి) 1926
సి) 1936 డి) 1946
39. 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం కౌలుసాగు చేసే రైతులను ఏమంటారు?
ఎ) షక్మీదారు బి) అసామి షక్మీదారు
సి) సర్ఫేఖాస్ డి) గల్లాముక్తా
40. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న కూరగాయలు?
ఎ) టమాటా బి) వంకాయ
సి) బంగాళదుంప డి) బెండకాయ
41. పాక్దేశపు రాజవృక్షం అని దేనిని అంటారు?
ఎ) వెదురు బి) టేకు
సి) ఇండియన్ రోజ్ ఉడ్ డి) వేప
42. తెలంగాణలో అటవీ విస్తీర్ణం శాతం ఎంత?
ఎ) 35.46 శాతం బి) 30 శాతం
సి) 24 శాతం డి) 26.26 శాతం
43. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం ఎప్పుడు జరిగింది?
ఎ) 1874 బి) 1876
సి) 1974 డి) 1976
44. పారిశ్రామిక రంగంలో అధిక వాటా కలిగిన ఉప రంగం ఏది?
ఎ) నిర్మాణ రంగం బి) తయారీ రంగం
సి) గనులు డి) విద్యుత్
45. ఉజ్జ్జయినీ మహంకాళీ ఆలయాన్ని దేని విముక్తి కోసం నిర్మించారు?
ఎ) కలరా బి) ప్లేగు
సి) మలేరియా డి) మసూచీ
46. ఏ ప్రాంతంలో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ పార్క్ ఉంది?
ఎ) వరంగల్ బి) గుండ్లపోచంపల్లి
సి) పాశమైలారం డి) సిరిసిల్ల
47. ఏ సంవత్సరంలో టీఎస్ ఐపాస్ యాక్ట్‌ను చేశారు?
ఎ) 2013 బి) 2014
సి) 2015 డి) 2016
48. ఏ తేదీన టీఎస్ ఆర్టీసీ ఏర్పాటైంది?
ఎ) 2014 నవంబర్ 10
బి) 2015 ఏప్రిల్ 1
సి) 2015 ఏప్రిల్ 10
డి) 2016 ఏప్రిల్ 5
49. పరిశ్రమల విషయంలో దేశం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
ఎ) 8 బి) 9 సి) 10 డి) 5
50. కిందివాటిలో ఏ కళ ‘లౌకిక కళ నైపుణ్యం’గా ప్రసిద్ధి చెందినది?
ఎ) సిల్వర్ వస్తువులు బి) పెంబర్తి కళ
సి) బంజార కళ డి) బిద్రి కళ
51. కిందివాటిలో ఏ పట్టణాన్ని టెంపుల్ టౌన్‌గా పిలుస్తారు?
ఎ) సిద్దిపేట బి) ఎల్కతుర్తి
సి) హన్మకొండ డి) నిర్మల్
52. తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
ఎ) ఎన్‌హెచ్ 42 బి) ఎన్‌హెచ్ 43
సి) ఎన్‌హెచ్ 44 డి) ఎన్‌హెచ్ 45
53. కిందివాటిలో సరైనది కానిది?
ఎ) కరీంనగర్ బస్‌స్టేషన్ పేరు
బీఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్
బి) తెలంగాణలో 2వ అతి పెద్ద బస్ స్టేషన్ – కరీంనగర్
సి) ఆసియాలో 4వ అతిపెద్ద బస్ స్టేషన్-
కరీంనగర్
డి) జోతిబాపూలే బస్‌స్టేషన్ – కరీంనగర్
54. భారతదేశంలోకి ఏ దేశాల ప్రజలు అధికంగా వలస వస్తారు?
ఎ) సింగపూర్, దక్షిణ కొరియా
బి) నేపాల్, బంగ్లాదేశ్
సి) అమెరికా, ఇంగ్లాండ్ డి) పైవన్నీ
55. బ్రట్‌లాండ్ కమిషన్ తన నివేదికను ఏ పేరుతో ప్రకటించింది?
ఎ) Our Common Future
బి) Our Common Problem
సి) Our Common Planet
డి) Our Common Development
56. రాష్ట్ర ఆర్థిక సంస్థను 1956 నవంబర్ 1న ఎక్కడ స్థాపించారు?
ఎ) వరంగల్ బి) భువనగిరి
సి) హైదరాబాద్ డి) ఖమ్మం
57. తెలంగాణలో హరిత హారం ఎప్పడు ప్రారంభమైంది?
ఎ) 2014 జూన్ 5
బి) 2015 జూన్ 5
సి) 2015 ఆగస్టు 15
డి) 2015 జూలై 3
58. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మరొక పేరు?
ఎ) పోచంపాడు ప్రాజెక్ట్
బి) ప్రియదర్శిని ప్రాజెక్ట్
సి) నిజాం సాగర్ ప్రాజెక్ట్
డి) పైవన్నీ
59. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ప్రధాన కాలువలు?
ఎ) కాకతీయ కాలువ బి) లక్ష్మికాలువ
సి) సరస్వతి కాలువ డి) పైవన్నీ
60. తెలంగాణలో ‘తడి’ అనుపదం దేన్ని వివరిస్తుంది?
ఎ) అటవీ భూమి
బి) నీటి వసతి గల భూమి
సి) నీటి వసతి లేని భూమి
డి) పశువుల మేతకు ఉన్న భూమి
61. కార్పొరేట్ రంగం అంటే?
ఎ) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు
బి) వ్యక్తిగత కంపెనీలు
సి) భాగస్వామ్య కంపెనీలు
డి) పైవన్నీ
62. రియల్ ఎస్టేట్, వర్తకం ఏ రంగంలో భాగం?
ఎ) ప్రాథమిక రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) ఏవీకావు
63. కుండల తయారీ, బట్టలు నేయడం ఏ రంగానికి చెందినవి?
ఎ) వ్యవస్థీకృత రంగం
బి) అవ్యవస్థీకృత రంగం
సి) మధ్యస్థ రంగం డి) ఏదీకాదు
64. చార్మినార్ నిర్మాణం?
ఎ) 1491 బి) 1591
సి) 1691 డి) 1791
65. వేయిస్తంభాల గుడిని ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1163 బి) 1263
సి) 1363 డి) 1623
66. కులం అనే పదాన్ని మొట్టమొదటి సారిగా ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
ఎ) 1560 బి) 1561
సి) 1562 డి) 1563
సమాధానాలు
1-ఎ 2-బి 3-డి 4-బి
5-బి 6-సి 7-డి 8-డి
9-సి 10-బి 11-బి 12-ఎ
13-ఎ 14-డి 15-సి 16-ఎ
17-సి 18-సి 19-డి 20-ఎ
21-డి 22-బి 23-సి 24-బి
25-బి 26-సి 27-సి 28-సి
29-బి 30-సి 31-బి 32-బి
33-బి 34-డి 35-డి 36-ఎ
37-డి 38-సి 39-ఎ 40-ఎ
41-బి 42-సి 43-ఎ 44-బి
45-ఎ 46-బి 47-బి 48-సి
49-ఎ 50-బి 51-డి 52-సి
53-డి 54-బి 55-ఎ 56-సి
57-డి 58-ఎ 59-డి 60-బి
61-ఎ 62-సి 63-బి 64-బి
65-ఎ 66-డి
-రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని
9949562008
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు