స్త్రీల హుందాతనాన్ని వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్ ?
1. దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయుటకు కింది ఏ కారణంగా అర్హుడు కాడు?
ఎ) తనకు తానే రాష్ట్రపతి అభ్యర్థి అయితే
బి) అతడు ఆపధర్మ ముఖ్యమంత్రి అయితే
సి) అతడు తన మెజార్టీ మద్దతును ఇంకా రాష్ట్ర విధాన సభలో నిరూపించుకోనపుడు .
డి) రాష్ట్ర శాసనసభలోని ఎగువసభ నుండి ఎన్నికైన సభ్యుడైతే.
2. ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులను రద్దు చేయాలని సూచించిన కమిటీ?
ఎ) కలేకర్ కమిషన్
బి) కేర్ కమిషన్
సి) రాజమన్నార్ కమిటీ
డి) దేబర్ కమిషన్
3. కింది వారిలో ఎవరు భారతదేశంలో ఏ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కాకుండానే ప్రధానిగా ఎన్నికయ్యారు?
ఎ. మొరార్జీ దేశాయ్
బి. పీవీ నరసింహారావు
సి. విపి సింగ్
డి. చంద్రశేఖర్
ఇ. చరణ్ సింగ్
ఎ) ఎ, బి, డి
బి) బి, సి, ఇ
సి) బి డి) డి
4. కింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటూ మహాభియోగ తీర్మానంలో పాలొననివారు?
ఎ) శాసనసభ సభ్యులు
బి) శాసనమండలి సభ్యులు
సి) లోక్‌సభ సభ్యులు
డి) రాజ్యసభ సభ్యులు
5. ప్రజా ప్రయోజనాల వాజ్యం అనే భావన ఎక్కడ మొదలైంది?
ఎ) కెనడా బి) ఆస్ట్రేలియా
సి) బ్రిటన్ డి) జపాన్
ఇ) అమెరికా
6. లోక్‌సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ అతన్ని మాట్లాడవద్దని మరోవ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వటాన్ని ఏమంటారు?
ఎ) ఈల్డింగ్ ది ఫోర్
బి) డేకోరం
సి) క్రాసింగ్ ది ఫోర్
డి) ఇంటర్ పేలేషన్
7. కింది వారిలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై ఏ విషయాల్లో నియంత్రణ వహించలేదు?
ఎ) ఆర్థిక విషయాలు
బి) వ్యక్తిగత విషయాలు
సి) పౌర విచారాలు
డి) శాసన వ్యవహారాలు
8. కింది వారిలో ఏ ఆదేశిక సూత్రం ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి కోసం పనిచేయాలని నిర్దేశిస్తుంది?
ఎ) 51A బి) 48A
సి) 51 డి) 50
9. లోక్‌సభ కాలపరిమితి ?
ఎ) ఒకసారి ఆరు నెలలు పొడిగించవచ్చు
బి) అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని
ఒకసారి రెండు సంవత్సరాలకు పెంచవచ్చు
సి) ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడిగించబడదు
డి) అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని
ఒక సంవత్సరం పెంచవచ్చు
10. కింది పేర్కొన్న బిల్లులలో ఏది పార్లమెంట్ ఉభయ సభలతో విడిగా ప్రత్యేక మెజార్టీతో ఆమోదం పొందవలసినది ?
ఎ) ద్రవ్య బిల్లు (మనీ బిల్లు)
బి) సాధారణ బిల్లు
సి) రాజ్యాంగ సవరణ బిల్లు
డి) ఆర్థిక బిల్లు
11. 9వ షెడ్యూల్‌ను ఏ భారత రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు?
ఎ) రెండవ రాజ్యాంగ సవరణ
బి) మొదటి రాజ్యాంగ సవరణ
సి) 42వ రాజ్యాంగ సవరణ
డి) 9వ రాజ్యాంగ సవరణ
12. భారత ప్రోటోకాల్ ప్రకారం, కింది వారిలో ఎవరు హోదా క్రమానుగతశ్రేణిలో అత్యున్నత హోదా పొందుతారు?
ఎ) రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర గవర్నర్
బి) లోక్‌సభ స్పీకర్
సి) ఉప ప్రధాని
డి) మాజీ ప్రధానమంత్రి
13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి?
ఎ) రోహిణి బి) అమరేశ్వరి
సి) మహేశ్వరి డి) మీనా కుమారి
14. భారత జనతా పార్టీ అధికార పత్రిక?
ఎ) సామ్నా బి) కమల్ సందేశ్
సి) భారత్ సందేశ్ డి) న్యూ ఏజ్
15. ఎన్నికల చిహ్నాల, గుర్తుల కేటాయింపు చట్టం?
ఎ) 1967 బి) 1970
సి) 1968 డి) 1966
16. ఏ సంవత్సరం నుండి ఏప్రిల్ 21 తేదీని సివిల్ సర్వీస్‌ల దినోత్సవం నిర్వహిస్తున్నారు?
ఎ) 2005 బి) 2007
సి) 2008 డి) 2006
17. కిచెన్ క్యాబినెట్ అంటే ?
ఎ) మాజీ మంత్రివర్గం
బి) ప్రతిపక్షంలోని షాడో మంత్రివర్గం
సి) అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విశ్వాసంతో ప్రధానమంత్రికి దగ్గరగా ఉండే మంత్రి వర్గం
డి) ఏమాత్రం ప్రాధాన్యం లేక ప్రధానమంత్రి కి దూరంగా ఉండే మంత్రివర్గం
18. రాష్ట్రపతి రాజ్యాంగ రీత్యా న్యాయ సలహా పొందే రాజ్యాంగ ఆర్టికల్?
ఎ) ఆర్టికల్ 123 బి) ఆర్టికల్ 100
సి) ఆర్టికల్ 143 డి) ఆర్టికల్ 331
19. కింది వరుస క్రమాన్ని గుర్తించండి.
ఎ. గదర్ పారీ
బి. ఖిలాఫత్ ఉద్యమం
సి. దండి యాత్ర
డి. చంపారన్ సత్యాగ్రహం
ఎ) డి, ఎ, బి, సి
బి) ఎ, డి, సి, బి
సి) డి, ఎ, సి, బి
డి) ఎ, డి, బి, సి
20. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఏ పార్టీ తరఫున రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికయ్యారు?
ఎ) అఖిల భారత ముస్లిం లీగ్
బి) భారత జాతీయ కాంగ్రెస్
సి) షెడ్యూల్ జాతుల ఫెడరేషన్
డి) భారత హిందూ మహాసభ
21. రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో ఉన్నవి?
ఎ) 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ 21 భాగాలు ఉన్నాయి
బి) 394 ఆర్టికల్స్ ఏడు షెడ్యూల్స్ 22 భాగాలు ఉన్నాయి
సి) 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ 22 భాగాలు ఉన్నాయి
డి) 395 ఆర్టికల్స్ 10 షెడ్యూల్స్ 22 భాగాలు ఉన్నాయి
22. భారత రాజ్యాంగానికి అద్దం వంటిది ఏది.
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశిక సూత్రాలు
సి) రాజ్యాంగ సవరణలు
డి) రాజ్యాంగ ప్రవేశిక
23. స్త్రీల హుందాతనాన్ని వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్ ఏది.
ఎ) ఆర్టికల్ 22 బి) ఆర్టికల్ 23
సి) ఆర్టికల్ 21 డి) ఆర్టికల్ 20
24. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టులో కేసు వేయాలంటే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వేయవచ్చు?
ఎ) ఆర్టికల్ 32 బి) ఆర్టికల్ 123
సి) ఆర్టికల్ 213 డి) ఆర్టికల్ 226
25. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అవసరమైన రిట్స్‌ను జారీ చేసే అధికారం ఏ న్యాయస్థానాలకు ఉంటుంది?
ఎ) సుప్రీంకోర్టుకు మాత్రమే
బి) హైకోర్టుకు మాత్రమే
సి) సుప్రీంకోర్టు మరియు హైకోర్టు లకు కలదు
డి) అన్ని న్యాయస్థానాలకు
26. విచారణలో ఉన్న కేసును నిలుపుదల చేయమని ఎగువ న్యాయస్థానం దిగువ న్యాయస్థానానికి జారీ చేసే రిట్?
ఎ) మాండమస్ బి) ప్రొహిబిషన్
సి) కోవారెంటు డి) హెబిఎస్ కార్పస్
27. విచారణ చేస్తున్న కేసును మరొక న్యాయస్థానానికి బదిలీ చేసే రిట్?
ఎ) సెర్షియోరరి బి) కోవారెంటు
సి) ప్రొహిబిషన్ డి) మాండమస్
28. చట్టరీత్యా అర్హత లేకుండా పదవిలో కొనసాగడాన్ని నివారించే రిట్?
ఎ) మండమస్ బి) కోవారెంటు
సి) ప్రొహీబిషన్ డి) సెర్షియోరరి
29. ఉచిత నిర్బంధ విద్యను సూచిస్తున్న ఆర్టికల్ ?
ఎ) ఆర్టికల్ 40 బి) ఆర్టికల్ 45
సి) ఆర్టికల్ 35 డి) ఆర్టికల్ 44
30. 1975 సంవత్సరంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) వివి గిరి
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి
31. కింది వాటిలో అసంబద్ధమైనది గుర్తించండి?
ఎ) చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఐ. కే గుజ్రాల్ ఉప ప్రధానిగా పనిచేశారు
బి) వి.పి సింగ్ ప్రభుత్వంలో దేవీలాల్
ఉప ప్రధానిగా పనిచేశారు
సి) చరణ్ సింగ్ ప్రభుత్వంలో వైబి చవాన్ ఉప ప్రధానిగా పనిచేశారు
డి) ఇంద్ర గాంధీ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా పనిచేశారు
32. 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్‌ని ప్రధానమంత్రి పదవికి ఆహ్వానించిన రాష్ట్రపతి?
ఎ) వివి గిరి బి) జాకీర్ హుస్సేన్
సి) బీడీ జట్టి డి) నీలం సంజీవరెడ్డి
33. కేంద్ర రాష్ర్ట సంబంధాలకు సంబంధించి 1970 సంవత్సరంలో రాజమన్నార్ సంఘాన్ని నియమించిన రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తమిళనాడు
సి) కర్ణాటక డి) కేరళ
34. మాజీ కేంద్ర మంత్రులను మాజీ ముఖ్యమంత్రిలను గవర్నర్లుగా నియమించరాదని సూచించిన కమిటీ?
ఎ) సర్కారియా కమిటీ
బి) పాలన సంస్కరణల సంఘం
సి) రాజమన్నార్ కమిటీ
డి) ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం
35. రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలనను విధించటానికి రాష్ట్రపతికి అవకాశాల్ని కల్పించే 356 ఆర్టికల్‌ను రద్దు చేయాలని సూచించిన కమిటీ?
ఎ) సర్కారియా కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) ఆనందపూర్ సాహెబ్ కమిటీ
డి) పాలన సంస్కరణల సంఘం
36. నిర్దేశిక నియమాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు?
ఎ) గోలకనాథ్ కేసు
బి) మినర్వమీల్స్ కేసు
సి) కేశవనంద భారతి కేసు
డి) ఏది కాదు
37. తన ఎన్నికలకు సంబంధించిన వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన రాష్ట్రపతి ఎవరు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
సి) జాకీర్ హుస్సేన్
డి) వివి గిరి
38. కార్మిక సంఘాలు ఏ జాబితాలోకి వస్తాయి?
ఎ) రాష్ట్ర జాబితా
బి) ఉమ్మడి జాబితా
సి) అవశిష్ట అధికారాలు
డి) కేంద్ర జాబితా
39. సమాచార హక్కు చట్టాన్ని మొదటిసారి ఆమోదించిన రాష్ర్టాలు ?
ఎ) తమిళనాడు, గోవా
బి) ఢిల్లీ, హర్యానా
సి) కర్ణాటక, కేరళ
డి) రాజస్థాన్, మహారాష్ట్ర
40. కింది వాటిలో సంబంధంలేనిది గుర్తించండి.
ఎ) లక్షద్వీప్ కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది
బి) ఢిల్లీ సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది
సి) అండమాన్ నికోబార్ కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది
డి) డామన్ డాయు ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తుంది
41. హైకోర్టు విషయంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే?
ఎ) అత్యధిక సంఖ్యలో కేసును విచారించడం
బి) అత్యధిక సంఖ్యలో కేసులను పైకోర్టుకు అప్పిళ్లుకు పంపడం
సి) కోర్టు తీర్పులను నమోదు చేసి భద్రపరచడం
డి) కోర్టు తీర్పులను వాయిదా వేయడం
42. లోక్‌సభ సమావేశాలకు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ఎవరు అధ్యక్షత వహిస్తారు?
ఎ) రాజ్యసభ చైర్మన్
బి) భారత ప్రధానమంత్రి
సి) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
డి) పానెల్ స్పీకర్ లో ఒకరు
43. రాష్ట్రస్థాయిలో ఉండే విధాన పరిషత్తు ఏర్పాటుకు సంబంధించి సరైనది గుర్తించండి ?
ఎ. 1/3 వంతు సభ్యులను విధాన సభ సభ్యులు ఎన్నుకుంటారు.
బి. 1/3 వంతు సభ్యులను పంచాయతీరాజ్ మున్సిపాలిటీల సభ్యులు ఎన్నుకుంటారు.
సి. 1/12 వంతు సభ్యులను పట్టా బద్ధులు ఎన్నుకుంటారు.
డి. 1/12 వంతు సభ్యులను
ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
ఇ. 1/6 వంతు గవర్నర్ నియమిస్తారు.
ఎ) అన్నీ సరైనవే
బి) ఎ మినహా అన్ని సరైనవి
సి) సి మినహా అన్ని సరైనవి
డి) ఎ, సి మినహా అన్ని సరైనవి
44. తాత్కాలిక స్పీకర్‌కు సంబంధించి సంబంధంలేని అంశం?
ఎ) స్పీకర్ లేని సమయంలో స్పీకర్‌గా వ్యవహరిస్తారు
డి) సాధారణ ఎన్నికల అనంతరం
లోక్‌సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి నియమిస్తాడు
సి) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులలో సీనియర్‌ను తాత్కాలిక స్పీకర్‌గా సాధారణంగా నియమిస్తారు
డి) కొత్తగా ఎన్నికయిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు
నరేష్ జాటోత్
లెక్చరర్,సిద్ధార్థ డిగ్రీ పిజి కళాశాల
నల్లగొండ.8247887267
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?