వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధులు
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమైన వాణిజ్య బ్యాంకులు అనేక విధులను నిర్వహిస్తున్నాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1) ప్రాథమిక విధులు
2) అనుషంగిక విధులు
వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులను గురించి గత శీర్షికలో వివరంగా నేర్చుకున్నాం ఈ శీర్షికలో వాణిజ్య బ్యాంకుల అనుషంగిక/ గౌణ విధుల గురించి వివరంగా నేర్చుకుందాం.
గౌణ విధులు (Auxiliary Functions)/ అనుషంగిక విధులు (Derivative Functions)
ఆధునిక బ్యాంకులు ప్రధానమైన విధులతో పాటు ఖాతాదారులకు ఉపయోగపడే ఎన్నో ఇతర సేవలను కూడా అందిస్తున్నాయి.
వాటిని అనుషంగిక విధులు అని గౌణ విధులు అని ద్వితీయ శ్రేణి విధులు అని కూడా అంటారు.
వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధులు రెండు రకాలుగా విభజించవచ్చు.
1. ప్రాతినిధ్యపు విధులు
2. సాధారణ ప్రజోపయోగ సేవలు
ఖాతాదారులకు ప్రతినిధులుగా, ఏజెంట్లుగాను పనిచేస్తూ బ్యాంకులు నిర్వహించే విధులను ప్రాతినిధ్యపు విధులు అని ఏజెన్సీ విధులు అని కూడా అంటారు.
ఉదా: ఖాతాదారులకు సంబంధించిన చెక్కులు, డ్రాఫ్ట్‌లను, వినిమయ బిల్లులను ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేస్తాయి.
ఖాతాదారులకు రావలసిన డివిడెంట్ల్లను, వడ్డీలను వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తాయి.
ఖాతాదారుల తరఫున బాండ్లు, వాటాలు, షేర్లు, డిబెంచర్లు, కొనుగోలు అమ్మకం చేస్తాయి.
ఖాతాదారుల సూచన మేరకు బీమా ప్రీమియం ఆదాయపన్ను చెల్లిస్తాయి.
ట్రస్టీ సేవలు అందించడం.
వాణిజ్య సేవలు, వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు కనిపించే అనేక వినియోగ సౌకర్యాలను సాధారణ ప్రజోపయోగ సేవలు అంటారు.
ఉదా: బంగారం, వెండి, విలువైన పత్రాలు భద్రంగా దాచుకోవడానికి లాకర్
సదుపాయం కల్పించడం.
నగదును డీడీలను మెయిల్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ చేయడం. వ్యాపారులు పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అందజేయడం.
చెక్కులను, డీడీలను పరపతి పత్రాలను జారీ చేయడం, ఏటీఎం సౌకర్యాలను కల్పించడం.
విద్యారుణ, గృహనిర్మాణ రుణ సౌకర్యాలను కల్పించడం.
వివిధ దేశాల కరెన్సీలను మధ్యగల మారకం రేట్లను తెలుపడం
ఎగుమతి దేశాల కరెన్సీలను మధ్యగల మారకం రేట్లను తెలుపడం.
ఎగుమతి, దిగుమతి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా విదేశీ వ్యాపారాన్ని వాణిజ్య బ్యాంకులు సులభతరం చేస్తాయి.
e-రూపీ (e-RUPI)
e-రూపీ -భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2021 ఆగస్టు 2న ప్రారంభించారు.
e-రూపీ ని అభివృద్ధి పరిచినది
ఎ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
బి) నేషనల్ హెల్త్ ఆథారిటీ
e-రూపీ నిర్వహించే సంస్థ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).
ఇ-రూపీ లక్షణాలు
ఇ-రూపీ అనేది డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే ఒక ఇ-వోచర్ విధానం
ఇ-రూపీ అనేది మొబైల్ ఫోన్ యాప్స్, ఇంటర్నెట్, కార్డ్స్ వంటివి లేకుండానే చెల్లింపులు చేయవచ్చును.
ఇ-వోచర్ పొందిన లబ్ధిదారుడు ఉద్దేశించిన అవసరం కోసం గుర్తించిన విక్రయదారుల వద్ద తాను పొందిన ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
ఇ-రూపీ అనేది డిజిటల్ కరెన్సీ కాదు, క్రిప్టో కరెన్సీ కాదు
ఇ-రూపీ క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్, పర్సన్ స్పెసిఫిక్, పర్పస్ స్పెసిఫిక్ డిజిటల్ చెల్లింపు విధానం.
ఇ-రూపీ విధానం/ సౌకర్యం అనుమతించిన బ్యాంకులు
ఎ) ఎస్బీఐ బి) హెచ్డీఎఫ్సీ
సి) యాక్సిస్ బ్యాంక్
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఇ) బ్యాంక్ ఆఫ్ బరోడా
ఎఫ్) కెనరాబ్యాంకు
జి) ఇండస్ ఇండ్ బ్యాంక్
హెచ్) ఐసీఐసీఐ బ్యాంక్
1950లో అమెరికాలో డైనర్స్ కార్డ్ మొదట క్రెడిట్ కార్డ్‌గా ప్రారంభించారు.
1966లో ఇంగ్లాండ్‌లో బార్క్లెస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.
పరపతి డిపాజిట్ల నిష్పత్తి (Credit Deposit Ratio)
ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక బ్యాంకు ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు అంటే మొత్తం పరపతిని ఆ బ్యాంకు మొత్తం డిపాజిట్లకు మధ్యగల నిష్పత్తినే క్రెడిట్ డిపాజిట్ అంటారు.
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ
దీన్ని ప్రత్యామ్నాయ కరెన్సీ అని వర్చువల్ కరెన్సీ అని సైబర్ కరెన్సీలు అని కూడా
పిలుస్తారు.
ఈ కరెన్సీని బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చెలామణి చేస్తారు.
ఈ కరెన్సీ వికేంద్రీకృత నియంత్రణను ఉపయోగిస్తుంది. ఇది పీర్ టు పీర్ సిస్టమ్
ఇది ఎవరైనా ఎక్కడైనా చెల్లింపులను పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది.
బిట్ కాయిన్
మొదటి క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్
బిట్ కాయిన్ అనేది మొదటి వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీ
ఈ బిట్ కాయిన్ 2009 సంవత్సరంలో సృష్టించారు
బిట్ కాయిన్ సృష్టికర్త సంతోషి నకమెంటో
ఆ తరువాత వివిధ రకాల ప్రత్యామ్నయ క్రిప్టో కరెన్సీలు, బిట్ కాయిన్లు వచ్చాయి.
క్రిప్టో కరెన్సీ ద్వారానే బిట్ కాయిన్ ప్రజాదరణ పొందినది.
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లకు వివిధ దేశాల ప్రభుత్వాలు చట్టపరమైన గుర్తింపు, భద్రత ఇవ్వడం లేదు.
క్రిప్టోకరెన్సీ ఉపయోగించే దేశాల్లో ఎల్. సాల్వడార్ మొదటిది స్లోవేనియా రెండోది.
క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్‌ను యూఎస్ డాలర్‌తో చట్టబద్ధమైనదిగా స్వీకరించిన అమెరికా మొదటిది.
ఈక్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్‌కు భారతదేశం ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేదు.
చట్ట వ్యతిరేక పద్ధతిలో ఆర్జించిన ఆదాయాన్ని దాచుకోవడానికి వ్యక్తులుగాని, సంస్థలుగానీ అక్రమ సంపాదనను, సక్రమ సంపాదనగా చూపడాన్ని మనీ లాండరింగ్ అంటారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని పార్లమెంటులో 1998 జూలైలో ప్రవేశ పెట్టారు.
2002లో పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపంగా ఏర్పడినది.
మొదట్లో అంటే 1946 వరకు భారతీయ రూపాయి, బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్‌తో ముడిపడి ఉంది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఏర్పడింది. దీనిలో భారతదేశం ఒక
వ్యవస్థాపక సభ్యదేశం.
ఐఎంఎఫ్‌లో భారతదేశం సభ్యదేశం అయినప్పటి నుంచి భారత రూపాయి అమెరికా డాలర్‌తో సంబంధం ఏర్పడింది. అంటే అప్పటి నుంచి భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో నిర్ణయించారు.
మొదట ఒక అమెరికా డాలర్ విలువ రూ. 3.30గా ఉంటే 1978లో అది 8.2133 కు చేరుకుంది.
2021 జూలై నాటికి ఒక డాలర్ రూ. 74.49 అయినది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ భారత రూపాయిలతో పోల్చితే 81.84 రూపాయలతో సమానం. అంటే రూపాయి విలువ పడిపోయింది.
ప్రాక్టీస్ బిట్స్
1. వాణిజ్య బ్యాంకుల విధులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
2. వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధులకు మరొక పేరు?
ఎ) ప్రాథమిక విధులు
బి) గౌణ విధులు
సి) ప్రాతినిధ్యపు విధులు
డి) సాధారణ ఉపయోగ విధులు
3. వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధులు ఏవి?
ఎ) ప్రాథమిక, ద్వితీయ విధులు
బి) అనుషంగిక గౌణ విధులు
సి) ప్రాతినిధ్య, సాధారణ ఉపయోగ విధులు
డి) పైవన్నీ
4. ప్రాతినిధ్య విధులకు మరొకపేరు?
ఎ) గౌణ విధులు బి) ఏజెన్సీ విధులు
సి) సాధారణ విధులు
డి) ద్వితీయ విధులు
5. ఖాతాదారులకు ప్రతినిధులుగా, ఏజెంట్లుగా, సలహాదారుగా పనిచేస్తూ బ్యాంకు నిర్వహించే విధులను ఏమంటారు?
ఎ) ప్రాతినిధ్య విధులు
బి) ఎజెన్సీ విధులు
సి) ఎ, బి
డి) సాధారణ ప్రజోపయోగ విధులు
6. వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు కల్పించే వివిధ రకాల విని యోగ సౌకర్యాలను ఏమంటారు?
ఎ) ప్రాతినిధ్య సేవలు
బి) ఏజెన్సీ సేవలు
సి) సాధారణ ప్రజోపయోగ సేవలు
డి) పైవన్నీ
7. ఇ-రూపీని ప్రారంభించిన ప్రధాన మంత్రి ఎవరు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) దేవెగౌడ
సి) నరేంద్ర మోడీ
డి) రాజీవ్‌గాంధీ
8. ఖాతాదారుల తరుఫున బ్యాంకు బాండ్లు, షేర్లు, డిబెంచర్లు, వాటాలను కొనడం, అమ్మడం, వాణిజ్య బ్యాంకుల ఏ విధుల కిందకు వస్తాయి?
ఎ) ప్రాతినిధ్యపు విధులు
బి) సాదారణ విధులు
సి) ప్రాథమిక విధులు డి) పైవన్నీ
9. ఖాతాదారులకు బంగారం, వెండి, విలువైన పత్రాలకు భద్రత కల్పించడం నగదు, బదిలీలు, వివిధ రుణ సౌకర్యాలు కల్పించడం, వాణిజ్య బ్యాంకులు ఏ విధుల కిందకు వస్తాయి?
ఎ) ఏజెన్సీ విధులు
బి) సాధారణ ప్రజోపయోగ సేవలు
సి) ప్రాథమిక విధులు
డి) పైవన్నీ
10. వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
11. విదేశీ వ్యాపారం, విత్త కార్యకలాపాలకు సంబంధించిన సేవలు, సౌకర్యాలను కల్పించడం అనేది వాణిజ్య బ్యాంకుల అనుషంగిక విధుల్లో ఏ సేవలో భాగం?
ఎ) ప్రాతినిద్య సేవలు
బి) సాధారణ సేవలు
సి) ఎ, బి డి) ప్రాథమిక విధులు
12. కింది వాటిలో ఇ-రూపీ సౌకర్యం అనుమతించని బ్యాంకు ఏది?
ఎ) కెనరాబ్యాంకు
బి) ఐసీఐసీఐ బ్యాంకు
సి) బ్యాంక్ ఆఫ్ బరోడా
డి) యూనియన్ బ్యాంక్
13. ఇ-రూపీని ఎప్పడు ప్రారంభించారు?
ఎ) 2020 ఆగస్టు 2
బి) 2021 ఆగస్టు 2
సి) 2021 జనవరి 4
డి) 2022 జనవరి 5
14. ఇ-రూపిని నిర్వహించే సంస్థ ఏది?
ఎ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెనాన్షియల్ సర్వీసెస్
బి) నేషనల్ హెల్త్ అథారిటీ
సి) నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
డి) పైవన్నీ
15. ఇ-రూపీ అనేది
ఎ) ఇ-మెయిల్ విధానం
బి) ఇ- ఓచర్ విధానం
సి) ఇ- ఎలక్ట్రానిక్ విధానం
డి) ఇ- క్యూఆర్ విధానం
16. ఇంగ్లండ్‌లో క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 1950 బి) 1955
సి) 1960 డి) 1966
పానుగంటి కేశవ రెడ్డి రచయిత, వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని , 9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?