హైదరాబాద్ ముల్కీ – నాన్ ముల్కీ సంఘర్షణ వ్యాసం రాసినవారు?
తెలంగాణ ఉద్యమ చరిత్ర
1. త్రిలింగ/తిలింగ దేశానికి సరికాని దానిని గుర్తించండి.
ఎ) శ్రీశైలం బి) ద్రాక్షారామం
సి) వేములవాడ డి) కాళేశ్వరం
2. తెల్లాపూర్ శాసనం ఏ జిల్లాలో లభ్యమైంది?
ఎ) మెదక్ బి) సంగారెడ్డి
సి) కామారెడ్డి డి) రంగారెడ్డి
3. సరికానిది?
ఎ) గోదావరి తెలంగాణలో జన్మించదు
బి) పూర్వం గోదావరి నదిని తెలివాహ నది అని పిలిచేవారు
సి) భీమా నది గోదావరికి ఉపనది
డి) మున్నేరు నది కృష్ణకు ఉపనది
4. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి?
1. అసఫ్‌జాహీ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్, అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్
2. ఇతను హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకొని నిజాం రాజ్యం పరిపాలించారు.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
5. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.
1. నిజాం అలీఖాన్ రాజధాని హైదరాబాద్‌కు మార్చలేదు.
2. బ్రిటిష్ వారితో నిజాం అలీఖాన్ సైన్య
సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
6. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.
1. నిజాం ఉల్ ముల్క్ తర్వాత రాజ్యాన్ని
వరుసగా ముగ్గురు రాజులు (నాజర్ జంగ్,
ముజఫర్ జంగ్, సలబాత్ జంగ్) పరిపాలించారు.
2. పై ముగ్గురిలో నాజర్ జంగ్కు మాత్రమే నిజాం హోదా వచ్చింది.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
7. సరికానిది?
ఎ) సాలార్ జంగ్ 1- తురబ్ అలీఖాన్
బి) సాలార్ జంగ్ 2- లయక్ అలీ
సి) సాలార్ జంగ్ 3- యూసుఫ్ అలీ
డి) సాలార్ జంగ్ 2- 1884లో ఉర్దూ స్థానంలో పర్షియన్‌ను అధికార భాషగా
ప్రకటించారు.
8. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. సాలార్ జంగ్ సదర్ ఉల్ మహమ్ పేరుతో నలుగురు మంత్రులను నియమించాడు.
2. న్యాయ శాఖ – నవాబ్ బషీర్ ఉద్ధవ్‌లా
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
9. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. మహతమిన్ – ఇన్స్పెక్టర్
2. చౌకి – పోలీస్ స్టేషన్
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
10. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. ముల్కీ అనగా స్థానికుడు కాదు
2. స్థానికంగా ఉన్న ముస్లింలను
దక్కనీలు అంటారు.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
11. హైదరాబాద్ ముల్కీ – నాన్ ముల్కీ సంఘర్షణ వ్యాసం ఎవరు రాశారు?
ఎ) హైమాన్ డోర్ఫ్
బి) కారెన్ లియోనార్డ్
సి) J N చౌదరి డి) NOTA
12. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1888లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ విడుదల చేసిన ఫార్మాణలో మొదటిసారి ముల్కీ అనే పదాన్ని ఉపయోగించారు
2. 1888 జరిదా ప్రకారం కనీసం 12
సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడినవారు స్థానికులుగా పరిగణించబడతారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
13. 1919 ఫార్మాణ ప్రకారం ముల్కీ గుర్తింపు రావాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి?
ఎ) 12 బి) 5 సి) 8 డి) 15
14. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాం సబ్జెక్ట్ లీగ్ నినాదం ఆజాద్
హైదరాబాద్
2. Wither Hyderabad అనే పుస్తకం – సర్ నిజామత్ జంగ్
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 3 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
15. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1934 దేవదాసి వ్యవస్థను మీర్
మహబూబ్ అలీఖాన్ రద్దు చేశారు
2. 7వ నిజాం తన జన్మదినం సందర్భంగా రాజ్యంలో వెట్టిచాకిరీని నిషేధించారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
16. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1947, జూన్ 3న నిజాం జారీ చేసిన ఫార్మాణ ప్రకారం నిజాం రాజ్యం భారత్‌లో విలీనమవుతుందని ప్రకటించారు
2. 1947, జూన్ 3న నిజాం జారీ చేసిన ఫార్మాణాను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు స్వాగతించారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
17. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాం కారుపై బాంబుదాడి చేసిన వారిలో ముఖ్యుడు నారాయణరావు పవార్
2. నారాయణరావు పవార్ లా కళాశాల విద్యార్థి కాదు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
18. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాంకు ఆయుధాలు అందించినవారు సిడ్నీ కాటన్
2. కాటన్ గురించి వందేమాతరం సోదరులు కాసింరజ్వీకి తెలియజేశారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
19. ఆపరేషన్ పోలోకి సంబంధించి సరికానిది?
ఎ) కేంద్ర హోంమంత్రి – వల్లభాయ్ పటేల్
బి) భారత ప్రధానమంత్రి- నెహ్రూ
సి) నిజాం ప్రధాని- మీర్ లాయక్ అలీ
డి) సెప్టెంబర్ 17న ప్రారంభం
20. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. జేఎన్ చౌదరి పరిపాలన కాలంలో ముస్లింలపై జరిగిన దాడులను విచారించడం కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ పండిట్
సుందర్‌లాల్ కమిటీ
2. నిజాం రాజ్యంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది ప్రముఖ న్యాయవాది యనస్ సలీం
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
21. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1949, ఫిబ్రవరి 26 జేఎన్ చౌదరి ఫార్మాణ ప్రకారం నిజాం సొంత ఆస్తి
సర్ఫ్-ఏ-ఖాస్ రద్దు
2. 1949, ఫిబ్రవరి 6 ఫార్మాణ ప్రకారం ప్రభుత్వ సెలవు శుక్రవారం నుంచి
ఆదివారానికి మార్పు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
22. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. ఎంకే వెల్లోడి కేరళకు చెందిన ఐసీఎస్
అధికారి
2. హైదరాబాద్ పౌర ముఖ్యమంత్రిగా
నియమించబడ్డాడు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
23. వెల్లోడి కేబినెట్లో తప్పుగా జత పర్చబడినది?
ఎ) బూర్గుల-విద్య శాఖ
బి) వీబీ రాజు-కార్మిక శాఖ
సి) ఫూల్‌చంద్ గాంధీ-వైద్యశాఖ
డి) శేషాద్రి-వ్యవసాయ శాఖ
24. సరైనది?
ఎ) హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగినవి
బి) కాంగ్రెస్ 93 స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది
సి) పీడీఎఫ్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించింది డి) పైవన్నీ
25. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో వారు పీడీఎఫ్ నుంచి పోటీ చేశారు
2. భువనగిరి నుంచి రావి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
26. సరికానిది?
ఎ) 1952, మార్చి 6న బూర్గుల కాకుండా మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు
బి) మేల్కొటే-ఆర్థిక
సి) అన్నారవు-స్థానిక పాలన
డి) దిగంబరరావు-వ్యవసాయ
27. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. 1952, జూన్-జూలైలో మొదట
హైదరాబాద్‌లో ముల్కీ ఉద్యమం ప్రారంభం
2. హైదరాబాద్ హిత రక్షణ సమితి-రామాచారి
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
28. సరైనది?
ఎ) 1952, సెప్టెంబర్ 3న సిటీ కళాశాల సంఘటన జరిగింది
బి) ఫైరింగ్ ఉత్తర్వులు ఇచ్చింది రాంలాల్
సి) సిటీ కళాశాల ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్
డి) బి, సి
29. కింది వాటిల్లో సమాధానం ఎంపిక చేయండి
1. సిటీ కళాశాల సంఘటనలో షేక్
మహబూబ్ మరణించారు
2. ముల్కీ ఉద్యమ సమయంలో సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 3 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
30. ముల్కీ ఉద్యమం సందర్భంగా వరంగల్‌లో ఏర్పడిన విద్యార్థి కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఎవరు?
ఎ) బుచ్చయ్య బి) రామయ్య
సి) ఆనందరావు తోట
డి) జయశంకర్
31. తప్పుగా ఉన్న వాక్యం ఏది?
ఎ) యాదవులపై ఆధారపడినవారు
మందెచ్చు కళాకారులు
బి) పెరిక బండారు భక్తులు
సి) మాదిగవారిపై ఆధారపడిన వారు
బైండ్ల వారు కాదు
డి) సాధనాసురుల పోషకులు పద్మశాలివారు
32. కింది వాటి నుంచి సమాధానం రాబట్టండి
1. ఒగ్గుకథ పితామహుడు-మిద్దె రాములు
2. బుర్రకథకు గుర్తింపు తెచ్చింది
-చుక్క సత్తయ్య
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
33. కింది వాటిని పరిశీలించి సమాధానం
ఎంపిక చేయండి
1. బంగారక్క, పొలిగాడు, కేతిగాడు
అనే పాత్రలు హరికథలో ఉంటాయి
2. తోలుబొమ్మలాట గురించి భాస్కర
శతకంలో ప్రస్తావన కలదు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
34. కింది వాటిలో సమాధానం ఎంపిక చేయండి?
1. గుస్సాడీ నృత్యం పురుషులు చేస్తారు
2. గుస్సాడీ నృత్యకారుడు నాగరాజుకు పద్మశ్రీ అవార్డు వచ్చింది
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
35. కింది వాటిలో సరైన సమాధానం ఎంపిక చేయండి
1. బోనం అనగా భోజనం
2. బోనాల తంతుని ఊరడి అంటారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
36. సరికానిది?
ఎ) మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ
బి) రెండో రోజు అటుకుల బతుకమ్మ
సి) ఐదో రోజు అట్ల బతుకమ్మ
డి) ఆరవ రోజు నానాబియ్యం బతుకమ్మ
37. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. బతుకమ్మ సందర్భంగా ప్రధానంగా లక్ష్మీదేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు
2. బతుకమ్మలో తంగేడు పువ్వు ప్రధానమైనదిగా భావిస్తారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
38. కింది వాటిలో సమాధానం ఇవ్వండి
1. బొడ్డెమ్మ, బాద్రపద మాసంలో మొదలుకొని అమావాస్య వరకు ఆడుతారు
2. తీజ్ పండగను రైతులు
నిర్వహించుకుంటారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
39. కింది వాటిలో సరికానిది?
ఎ) మహిషిని యాదవులు జరుపుతారు
బి) ఈద్ ఉల్ ఫితర్ – రంజాన్
సి) రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు భోజనం చేస్తే ఇఫ్తార్
విందు అంటారు
డి) మొహర్రంను విషాద దినాలుగా
నిర్వహిస్తారు
40. సరైనవి ఏవి?
1. మిలాద్ ఉన్ నబీ – బక్రీద్
2. క్రిస్మస్ – క్రీస్తు జన్మించిన రోజు
3. అలయ్ బలయ్ – దసరా మిలావ్ అని కూడా అంటారు
4. కిన్నెర మొగిలయ్య – పద్మభూషణ్ అవార్డు
ఎ) 1 బి) 2, 3
సి) 3, 4 డి) 4, 2
టి.సురేష్‌కుమార్ టీఎస్ ఉద్యమ ఫ్యాకల్టీ కరీంనగర్
- Tags
- History of Telangana
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు