టీ ఎక్కువగా మరిగితే దాని నుంచి విడుదలయ్యే హానికర పదార్థం?
(ప్లాస్టిక్లు, దారాలు, మందులు)
1. వేడి చేసినప్పుడు మెత్తబడి, చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే ప్లాస్టిక్లు?
1) థర్మోలాస్టిక్ ప్లాస్టిక్
2) థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్
3) చలన ప్లాస్టిక్ 4) ఘోస్ట్ ప్లాస్టిక్
2. కింది వాటిలో థర్మోప్లాస్టిక్ ఏది?
1) సెల్యులోజ్ ఎసిటేట్
2) పాలిథీన్
3) నైలాన్ 4) అన్నీ
3. వేడిచేసినప్పుడు గట్టిగా, దృఢంగా ఉండే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్?
1) బెకలైట్ 2) సిలికాన్ రెజిన్
3) ఇపాక్సీరెజిన్ 4) పైవన్నీ
4. జతపరచండి.
ఎ. బ్రష్‌లు 1. నైలాన్- 6, 6
బి. చేతి సంచులు 2. పీవీసీ
సి. బొమ్మలు, 3. అధిక సాంద్రత ప్లాస్టిక్ పాత్రలు పాలిథీన్
డి. పాలప్యాకెట్లు, 4. అల్పసాంద్రత రెయిన్ కోట్లు పాలిథీన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-1, బి-4, సి-3, డి-2
5. జతపరచండి
ఎ. బెకలైట్ 1. ఫినాల్+ఫార్మాల్డిహైడ్
బి. ఫోమ్ 2. యూరియా+ ఫార్మాల్డిహైడ్
సి. రేయాన్ 3. సెల్యూలోజ్
డి. కాప్రోలాక్టమ్ 4. నైలాన్-6
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4
6. కృత్రిమ దారం ఏది?
1) కాటన్ 2) సిల్క్
3) జనుము 4) నైలాన్
7. కృత్రిమ సిల్క్‌ను దేని నుంచి తయారుచేస్తారు?
1) సిల్క్ 2) సెల్యూలోజ్
3) ప్లాస్టిక్ 4) రబ్బర్
8. సహజ సిల్క్?
1) కార్బోహైడ్రేట్ 2) ప్రొటీన్
3) లిపిడ్ 4) ఏదీకాదు
9. పాలి ఎమైడ్ కానిది?
1) ఉన్ని 2) సహజ సిల్క్
3) నైలాన్ 4) కృత్రిమ సిల్క్
10. క్యారీబ్యాగ్‌ల తయారీకి ఉపయోగించే పాలిమార్?
1) నైలాన్ 2) పాలిథీన్
3) టెఫ్లాన్ 4) టెరిలీన్
11. కింది వాటిలో ఏది పోగులు (ఫైబర్స్) అనే వర్గానికి చెందుతుంది?
1) డాక్రాన్ 2) సిల్క్
3) ఉన్ని 4) పైవన్నీ
12. నాన్‌స్టిక్ పాత్రలకు పూతపూసే ‘టెఫ్లాన్’ దేని పాలిమర్?
1) వెనిగర్ 2) ఎడిపికామ్లం
3) వినైల్క్లోరైడ్ 4) టెట్రాఫ్లోరో ఇథిలీన్
13. పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ ఏది?
1) నైలాన్- 6, 6 2) పాలివినైల్క్లోరైడ్
3) టెఫ్లాన్ 4) టెరిలీన్
14. నైలాన్- 6, 6 తయారీకి అవసరమైన పదార్థాలు?
1) ఎడిపికామ్లం
2) హెక్సామిథిలీన్ డై ఎమీన్
3) ఎ, బి 4) కాప్రోలాక్టమ్
15. సహజసిద్ధంగా క్షయమయ్యే పాలిమర్ ఏది?
1) నైలాన్ 2) టెఫ్లాన్
3) సెల్యూలోజ్ 4) పీవీసీ
16. మలేరియాను తగ్గించడానికి ఉపయోగించే క్వినైన్‌ను ఏ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారు?
1) సింకోనా 2) వేప
3) రావి 4) మద్ది
17. ఆస్పిరిన్ అనేది?
1) నార్కోటిక్ 2) యాంటీపైరెటిక్
3) మత్తును కలిగిస్తుంది
4) యాంటాసిడ్
18. టీ, కాఫీలలో ఉండే ఆల్కలాయిడ్?
1) నికోటిన్ 2) కెఫిన్
3) మార్ఫిన్ 4) రిసర్పిన్
19. పొగాకులో ఉండే మాదక ద్రవ్యం?
1) నికోటిన్ 2) కెఫిన్
3) మార్ఫీన్ 4) క్వినైన్
20. టీని ఎక్కువగా మరిగిస్తే విడుదలయ్యే
హానికర పదార్థం?
1) నికోటిన్ 2) ఐసోప్రిన్
3) టేనిన్ 4) ఆస్పిరిన్
21. ఆల్కలాయిడ్‌లో ఉండే ప్రధాన మూలకం?
1) నైట్రోజన్ 2) ఐరన్
3) సిలికాన్ 4) జింక్
22. దుస్తుల మీద రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగించేది?
1) బోరాక్స్ 2) సిట్రికామ్లం
3) హైపో 4) సిల్వర్ నైట్రేట్
23. దుస్తులపై టీ, కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించేది?
1) బోరాక్స్ 2) ఉప్పు, నిమ్మకాయ
3) క్లోరిన్ 4) పైవన్నీ
24. డ్రైక్లీనింగ్‌కు ఉపయోగించే ద్రవాలు?
1) కార్బన్ టెట్రాక్లోరైడ్ 2) పెట్రోల్
3) బెంజీన్ 4) పైవన్నీ
25. సోప్లెస్ డిటర్జెంట్లను వేటి నుంచి తయారుచేస్తున్నారు?
1) పెట్రోల్ 2) ఫ్యాటీ ఆమ్లం
3) ఆల్కహాల్ 4) ఈథర్
26. ఆక్జాలికామ్లాన్ని దుస్తుల నుంచి ఏ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు?
1) రక్తం 2) తుప్పుపట్టిన ఇనుము
3) సిరా 4) టీ
27. సహజదారాలలోని అనుఘటకం ఏది?
1) సెల్యులోజ్ 2) నైలాన్
3) టెరిలీన్ 4) పాలిైస్టెరీన్
28. నల్లమందు అనే మత్తు పదార్థం ఓపియం పాపీ అనే గింజల నుంచి తయారుచేస్తారు. అందులోని రసాయనం?
1) నికోటిన్ 2) మార్ఫీన్
3) కెఫీన్ 4) ఫ్రియాన్
29. శీతల పానీయాలు తాగడం, చాక్లెట్లు తినడం వ్యసనంగా మారడానికి కారణమైన
ఆల్కలాయిడ్?
1) కెఫిన్ 2) నికోటిన్
3) మార్ఫీన్ 4) క్వినైన్
30. కింది వాటిలో ఏది కృత్రిమ పాలిమర్?
1) టెఫ్లాన్ 2) బెకలైట్
3) నైలాన్ 4) పైవన్నీ
31. అంటుకొనే ధర్మం లేని వంట పాత్రలకు పూతపూసే పదార్థం?
1) టెఫ్లాన్ 2) పీవీసీ
3) రబ్బర్ 4) సెల్యులోజ్
32. స్విచ్ బోర్డుల తయారీకి ఉపయోగించే బెకలైట్ అనేది వేటి పాలిమర్?
1) ఫినాల్ 2) ఫార్మాల్డిహైడ్
3) ఎ, బి 4) కాప్రోలాక్టమ్
33. మిరపకాయల్లో కారానికి కారణమైన పదార్థం?
1) కెఫిన్ 2) నికోటిన్
3) కాప్సెసిన్ 4) హెరాయిన్
34. సౌందర్య సాధనమైన పౌడర్‌లో ఉపయోగించే పదార్థాలు?
1) అపారదర్శకత కోసం టైటానియం డై ఆక్సైడ్
2) శోషణ కోసం కాల్షియం కార్బొనేట్
3) జారుడు గుణం కోసం టాల్క్ (మెగ్నీషియం సలికేట్) 4) పైవన్నీ
35. సెల్లోఫేన్ టేప్?
1) సెల్యులోజ్ నైట్రేట్
2) సెల్యులోజ్ ఎసిటేట్
3) రేయాన్ 4) పీవీసీ
36. యానిమల్ స్టార్చ్ అనేది?
1) స్టార్చ్ 2) సెల్యులోజ్
3) ైగ్లెకోజన్ 4) సుక్రోజ్
ఇంధనాలు
1. కింది వాటిలో శ్రేష్ఠమైన ఇంధనాలు?
1) ఘన ఇంధనాలు
2) ద్రవ ఇంధనాలు
3) వాయు ఇంధనాలు
4) శిలాజ ఇంధనాలు
2. వాతావరణానికి హాని చేయని ఇంధనం ఏది?
1) పెట్రోల్ 2) హైడ్రోజన్
3) కోక్ 4) ఎల్పీజీ
3. సహజ ఘన ఇంధనం ఏది?
1) పెట్రోల్ 2) పిడకలు
3) బయోగ్యాస్ 4) డీజిల్
4. నీలిరంగులో మండే ఇంధనం ?
1) బొగ్గు 2) ఎల్పీజీ
3) కొవ్వొత్తి 4) కిరోసిన్
5. పసుపురంగులో ప్రకాశవంతంగా మంటనిచ్చేది?
1) మైనం 2) ఎల్పీజీ
3) బొగ్గు 4) కిరోసిన్
6. కింది వాటిలో శిలాజ ఇంధనం కానిది?
1) పెట్రోల్ 2) కోక్
3) చార్కోల్ 4) డీజిల్
7. జతపరచండి.
ఎ. సీఎన్జీ, గోబర్ గ్యాస్ 1. మీథేన్
బి. ఎల్పీజీ 2. బ్యూటేన్
సి. వాటర్ గ్యాస్ 3. ఎసిటలీన్+
ఆక్సిజన్
డి. గ్యాస్ వెల్డింగ్ 4. కార్బన్
మోనాక్సైడ్+హైడ్రోజన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-1, డి-4
8. మంట రాకుండా కాలే ఇంధనం ?
1) కోక్ 2) పెట్రోల్
3) కిరోసిన్ 4) కొవ్వొత్తి మైనం
9. జతపరచండి.
ఎ. వాటర్ గ్యాస్ 1. కార్బన్ డై ఆక్సైడ్+
హైడ్రోజన్
బి. ప్రొడ్యూసర్ గ్యాస్ 2. కార్బన్
మోనాక్సైడ్+హైడ్రోజన్
సి. సహజ వాయువు 3. కార్బన్
మోనాక్సైడ్+నైట్రోజన్
డి. ఎల్పీజీ 4. మీథేన్
5. బ్యుటేన్
1) ఎ-1, బి-3, సి-4, డి-5
2) ఎ-1, బి-3, సి-5, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-5
4) ఎ-2, బి-3, సి-1, డి-5
10. పారిశ్రామిక ఇంధనాలు ఏవి?
1) ప్రొడ్యూసర్ గ్యాస్
2) వాటర్ గ్యాస్
3) సహజవాయువు 4) పైవన్నీ
11. నీలివాయువు అని దేనికి పేరు?
1) పొడ్యూసర్ గ్యాస్ 2) వాటర్ గ్యాస్
3) సీఎన్జీ 4) ఎల్పీజీ
12. మంటలో ఏ భాగానికి అత్యధిక వేడి ఉంటుంది?
1) నీలిరంగులోని అడుగుభాగం
2) నల్లని మధ్య భాగం
3) మంట చుట్టూ ప్రదేశం
4) శిఖర భాగం
13. నిశ్చితం (ఎ) – ఆక్సిజన్ స్వయంగా మండదు కారణం (ఆర్) – ఆక్సిజన్ మండటానికి సహాయం చేస్తుంది
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది. (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు. (ఆర్) సరైనది
14. దహన శీల (మండే స్వభావం కలిగిన) వాయువులు?
1) హైడ్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) మీథేన్ 4) పైవన్నీ
15. పెట్రోలియం బావుల్లో జరిగే అగ్నిప్రమాదాలను ఆర్పేది?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) నీరు
3) ఇసుక
4) సోడియం బై కార్బోనేట్
16. అగ్గిపుల్లకు ఉండే పదార్థాలు?
1) యాంటిమొనీ ట్రై సల్ఫేడ్
2) పొటాషియం క్లోరేట్
3) స్టార్చ్ 4) పైవన్నీ
17. అగ్గిపెట్టెకు ఉండే పదార్థాలు?
1) గాజుపొడి 2) ఎర్ర భాస్వరం
3) తెల్ల భాస్వరం 4) ఎ, బి
18. శ్రేష్ఠమైన ఇంధనం?
1) బొగ్గు 2) కలప
3) బయోగ్యాస్ 4) చార్కోల్
19. భూతాపానికి ప్రధాన కారణం?
1) వాహనాలు విడుదల చేసే నైట్రోజన్
ఆక్సైడ్లు
2) బొగ్గును మండించడం వల్ల విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్
3) ఇంధనాలు మండటం వల్ల విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్
4) ఏదీకాదు
20. నిశ్చితం (ఎ) – వంటనూనె కంటే పెట్రోల్ త్వరగా మండుతుంది కారణం (ఆర్) – వంటనూనె జ్వలన ఉష్ణోగ్రత పెట్రోల్ కంటే ఎక్కువ
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి.
(ఎ) కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి కానీ
(ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
21. నిశ్చితం (ఎ) – విద్యుత్ మంటలను నీటితో ఆర్పవచ్చు కారణం (ఆర్) – నీరు విద్యుత్తును తన గుండా ప్రవహింపజేస్తుంది
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి కానీ (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
22. రాకెట్ ఇంధనంగా ఉపయోగపడేది?
1) అమ్మోనియా 2) పెట్రోల్
3) ఎల్పీజీ 4) ద్రవ హైడ్రోజన్
23. గ్యాసోలిన్ అని దేనికి పేరు?
1) ఆల్కహాల్ 2) పెట్రోల్
3) కిరోసిన్ 4) ఎల్పీజీ
24. గ్యాసోహాల్ అంటే?
1) పెట్రోల్ + ఆల్కహాల్ మిశ్రమం
2) పెట్రోల్ + కిరోసిన్
3) ఎల్పీజీ + పెట్రోల్
4) ఎల్పీజీ + సీఎన్జీ
25. పెట్రోల్‌కు బహుళ కాలుష్యం లేని ప్రత్యామ్నాయ వాయు ఇంధనం ఏది?
1) బ్యుటేన్ 2) ఈథేన్
3) ఎసిటలీన్ 4) ఇథిలీన్
26. హైడ్రోజన్ ఇంధన వాహనాలు విడుదల చేసే విసర్జితంలో ఉండేది?
1) CO2 2) H2O
3) NH3 4) H2O2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు