పాత అప్పులను తీర్చడానికి చేసే కొత్త రుణాలను ఏమంటారు?
- ఎకానమీ
1. ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే విధాన పరమైన నిర్ణయాల సారాంశాన్ని ఏమంటారు?
ఎ) ఆర్థిక వ్యవస్థ
బి) సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ
సి) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
డి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
2. మానవ పేదరిక సూచికను యూఎన్డీపీ
ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
ఎ) 1995 బి) 1996
సి) 1997 డి) 1998
3. మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన
దేశాలను ఏమంటారు?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) నాలుగో ప్రపంచ దేశాలు
4. ఆర్థికాభివృద్ధి పరిణామ క్రమంలో ముఖ్యమైన ప్లవనదశ ఎన్నవది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
5. భూములు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలైనవి?
ఎ) ఆర్థిక మానవ మూలధనం
బి) భౌతిక మూలధనం
సి) అభౌతిక మూలధనం
డి) పైవన్నీ
6. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) అల్బర్ట్ హర్షమన్ బి) రగ్నర్ నర్క్స్
సి) రోడాన్ డి) రోస్టోవ్
7. విదేశీ వినియోగపు అలవాట్లను వెనుకబడిన దేశాలు అనుసరించడాన్ని ఏమంటారు?
ఎ) ప్రదర్శనా ప్రభావం
బి) అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం
సి) అంతర్గత ప్రదర్శనా ప్రభావం
డి) పైవన్నీ
8. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా మిగిలేది ఏది?
ఎ) నికర జాతీయోత్పత్తి
బి) నికర దేశీయోత్పత్తి
సి) స్థూల దేశీయోత్పత్తి
డి) వ్యయార్హ ఆదాయం
9. జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ఏమిటి?
ఎ) తలసరి వినియోగం
బి) వాస్తవ తలసరి ఆదాయం
సి) తలసరి ఆదాయం
డి) నామమాత్రపు తలసరి ఆదాయం
10. వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఉపకారవేతనాలు అనేవి?
ఎ) బదిలీ చెల్లింపులు బి) సబ్సిడీలు
సి) ప్రభుత్వ వ్యయం
డి) పెట్టుబడి వ్యయం
11. ఉత్పత్తి మదింపు పద్ధతికి మరొక పేరు?
ఎ) విలువ కూర్పు పద్ధతి
బి) ఇన్వెంటరీ పద్ధతి
సి) వస్తుసేవల పద్ధతి డి) పైవన్నీ
12. భారతదేశంలో మొట్టమొదటి సారిగా జాతీయాదాయాన్ని అంచనా వేసింది ఎవరు?
ఎ) దాదాభాయ్ నౌరోజి
బి) వి.ఆర్.ఆర్.వి. రావు
సి) షిర్రాస్ డి) మహలనోబీస్
13. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు?
ఎ) మార్షల్ బి) మాల్థస్
సి) కౌటిల్యుడు
డి) దాదాభాయ్ నౌరోజీ
14. ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే సగటు జనాభాను ఏమంటారు?
ఎ) జనాభా శాతం
బి) జనాభా వృద్ధి రేటు
సి) జనసాంద్రత
డి) జనాభా పెరుగుదల
15. 15 సంవత్సరాలలోపు 55 సంవత్సరాలు పైబడిన వయస్సుగల జనాభాను ఏమంటారు?
ఎ) ఉత్పాదక జనాభా
బి) అనుత్పాదక జనాభా
సి) డెమోగ్రఫీ డి) సగటు జనాభా
16. జాతీయాభివృద్ధి మండలి ఒక?
ఎ) రాజ్యాంగ సంస్థ
బి) రాజ్యాంగేతర సంస్థ
సి) శాసనేతర సంస్థ ఇ) బి, సి
17. వార్షిక ప్రణాళికకు మరొక పేరు?
ఎ) పిగ్మి ప్రణాళిక
బి) ఆర్థిక ప్రణాళిక
సి) స్వల్పకాలిక ప్రణాళిక
డి) ఎ, సి
18. ఒక దేశం తమకు కావలసిన వస్తు సేవలను తమ దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడాన్ని ఏమంటారు?
ఎ) సమ్మిళిత వృద్ధి బి) స్వయం వృద్ధి
సి) సుస్థిర వృద్ధి డి) క్రమవృద్ధి
19. నీతి ఆయోగ్ అంటే
ఎ) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
బి) నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
సి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రేడ్ ఇండియా
డి) నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్రేడ్ ఇండియా
20. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో అధికంగా ఉంది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
21. చక్రీయ నిరుద్యోగిత ఏ దేశాల్లో ఉంటుంది?
ఎ) అభివృద్ధి చెందుతున్న దేశాలు
బి) అభివృద్ధి చెందిన దేశాలు
సి) వెనుకబడిన దేశాలు డి) పైవన్నీ
22. ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని ఏమంటారు?
ఎ) నిరాపేక్ష పేదరికం
బి) సాపేక్ష పేదరికం
సి) దారిద్య్ర రేఖ డి) పైవన్నీ
23. చిన్న చిన్న నివాస ప్రాంతాల నుంచి పెద్ద నివాస ప్రాంతాలకు వలసవెళ్ళడాన్ని ఏమంటారు?
ఎ) చక్రీయ వలస బి) సోపాన వలస
సి) శాశ్వత వలస డి) వివాహపు వలస
24. రైత్వారీ పద్ధతిని ఎవరు ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) సర్ థామస్ మన్రో -1892
బి) విలియం బెంటింక్ -1792
సి) సర్థామస్ మన్రో – 1792
డి) బెంటింగ్ – 1892
25. నాబార్డ్ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు.
ఎ) 1980 జూలై 10 బి) 1982 జూలై 10
సి) 1980 జూలై 12 డి) 1982 జూలై 12
26. భారతదేశంలో హరిత విప్లవం మొదట ఏ పంటతో వచ్చింది?
ఎ) వరి బి) గోధుమ
సి) పత్తి డి) వేరుశనగ
27. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్మార్క్ గుర్తు దేనికి చిహ్నం?
ఎ) సాధారణ ధర బి) గిట్టుబాటు ధర
సి) వస్తువుధర డి) పైవన్నీ
28. కరవు, కాటకాలు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఏమంటారు?
ఎ) అనుత్పాదక రుణాలు
బి) ఉత్పాదక రుణాలు
సి) తక్కావి రుణాలు డి) పైవన్నీ
29. పెట్రోలియం ఉత్పత్తిలోని పెరుగుదలను ఏమంటారు?
ఎ) తెలుపు విప్లవం బి) నలుపు విప్లవం
సి) నీలి విప్లవం డి) గులాబీ విప్లవం
30. దేశంలో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు చేశారు?
ఎ) 1948 బి) 1947
సి) 1949 డి) 1950
31. FRRA ను ఏ విధంగా మార్చారు?
ఎ) NAMA బి) FEMA
సి) NIMA డి) SEA
32. స్టార్టప్ ఇండియా పథకాన్ని మోవీ ఎప్పుడు ప్రారంభించారు.
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2015 ఆగస్టు 15
సి) 2016 జనవరి 16
డి) 2015 జనవరి 1
33. పెట్టుబడికి ఉత్పత్తి ప్రారంభానికి మధ్యగల కాలాన్ని ఏమంటారు?
ఎ) మధ్యగత కాలం
బి) ఫరానా కాలం
సి) పెట్టుబడి కాలం డి) పైవన్నీ
34. SIDBI ఏ బ్యాంకుకు అనుబంధ బ్యాంకుగా ఏర్పడింది?
ఎ) ఐడీబీఐ బి) ఐసీఐసీఐ
సి) ఆర్బీఐ డి) ఐఎఫ్సీఐ
35. ఎగ్జిమ్ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1980 బి) 1981
సి) 1982 డి) 1983
36. వాతావరణ బీమా పథకాన్ని మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.
ఎ) బీహార్ బి) కర్ణాటక
సి) మధ్యప్రదేశ్ డి) రాజస్థాన్
37. దుకాణాల్లో పనిచేసే మహిళలు ఏ రకమైన కార్మికులు?
ఎ) స్కార్లెట్ కాలర్ కార్మికులు
బి) వైట్ కాలర్ పనివారు
సి) పింక్ కాలర్ కార్మికులు
డి) బ్లూ కాలర్ కార్మికులు
38. బడ్జెట్ అనే పదం ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) 1873 బి) 1883
సి) 1773 డి) 1893
39. సంవత్సరంలో కొంతకాలానికి మాత్రమే రూపొందించే బడ్జెట్ను ఏమంటారు?
ఎ) అనుబంధ బడ్జెట్
బి) నిర్వర్తనాధార బడ్జెట్
సి) కార్యక్రమాల బడ్జెట్
డి) కుంటిబాత్ బడ్జెట్
40. జీఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.
ఎ) 2017 జూలై 1
బి ) 2016 జూలై 1
సి) 2015 జూలై 15
డి) 2015 జూలై 15
41. పాత రుణాలను తీర్చడానికి చేసే కొత్త రుణాలను ఏమంటారు?
ఎ) రుణ విమోచనం బి) రుణ పరివర్తన
సి) స్వచ్ఛంద రుణం డి) రుణ చెల్లింపు
42. ప్రైవేటు బ్యాంకులు కలిగి ఉన్న ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) అంతర్గత ద్రవ్యం
బి) బహిర్గత ద్రవ్యం
సి) ప్రియమైన ద్రవ్యం
డి) పరపతి ద్రవ్యం
43. దేశంలోకి ప్రవహించే అధిక వడ్డీ రేటు గల ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) రిజర్వు మనీ బి) ప్రికాషనరీ మనీ
డి) హాట్ మనీ డి) క్రిప్టో మనీ
44. రెపోరేటు భావనను ఆర్బీఐ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
ఎ) 1990 బి) 1991
సి) 1992 డి) 1996
45. పరపతిని సృష్టించే బ్యాంకులు ఏవి?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీఐ
సి) వాణిజ్య బ్యాంకులు
డి) యూనియన్ బ్యాంకు
46. యూనియన్ బ్యాంకు మొదట ఏ దేశంలో ప్రారంభమైంది?
ఎ) ఇంగ్లండ్ బి) అమెరికా
సి) భారతదేశం డి) ఇటలీ
47. జె.ఎం. కీన్స్ పూర్తిపేరు ఏమిటి?
ఎ) జాన్ మేయర్ కీన్స్
బి) జాన్ మేవార్డ్ కీన్స్
సి) జోహల్ మేయర్ కీన్స్
డి) జాన్ మాల్ట్కీన్స్
48. ఫిలిఫ్స్ రేఖ ఏ విధంగా ఉంటుంది?
ఎ) ఎడమ నుంచి కుడికి కిందికి
బి) రుణాత్మక వాలుగా
సి) మూల బిందువుకు కుంభాకారంగా
డి) పైవన్నీ
49. వ్యాపార చక్రాల దశల్లో సౌభాగ్యం అనేది?
ఎ) గరిష్ఠస్థాయి దశ బి) బూమ్ దశ
సి) ఉన్నత దశ డి) పైవన్నీ
50. బ్యాంకింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థ/ అపెక్స్ బ్యాంకు ఏది?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీఐ
సి) ఐడీబీఐ డి) ఐసీఐసీఐ
51. హరిత విప్లవం పితామహుడు ఎవరు?
ఎ) వర్గీస్ కురియన్
బి) నార్మన్ బోర్లాగ్
సి) ఎం.ఎస్. స్వామినాథన్
డి) పారెటో
52. నవకల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) జె.బి.సే బి) షుంపీటర్
సి) మార్షల్ డి) కీన్స్
53. విజయ బ్యాంక్ నినాదం ఏమిటి?
ఎ) A Friend you can bank on
బి) Good People to bank with
సి) Honours your trust
డి) One family one bank
54. అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) దాదాభాయ్ నౌరోజీ
సి) అమర్త్యసేన్
డి) అభిజిత్ బెనర్జీ
55. 2011 గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతం పరిమాణం ఎంత?
ఎ) 1.5 హెక్టార్లు బి) 1.12 హెక్టార్లు
సి) 2.1 హెక్టార్లు డి) 2.5 హెక్టార్లు
56. హైదరాబాద్ భూమిశిస్తు చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది?
ఎ) 1905 బి) 1906
సి) 1907 డి) 1908
57. బచావత్ ట్రిబ్యునల్ కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి ఎప్పడు ఇచ్చింది?
ఎ) 1970 బి) 1971
సి) 1972 డి) 1973
58. సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీగా ఏ సంవత్సరంలో మారింది?
ఎ) 1920 బి) 1921
సి) 1925 డి) 1930
59. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతం?
ఎ) 69 శాతం బి) 79 శాతం
సి) 89 శాతం డి) 99 శాతం
60. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న నేల రకం ఏది?
ఎ) నల్లరేగడి బి) ఎర్రరేగడి
సి) దుబ్బనేల డి) పైవన్నీ
61. మిషన్ కాకతీయ నినాదం?
ఎ) మన ఊరు మన పాడి
బి) మన ఊరు మన జలం
సి) మన ఊరు మన చెరువు
డి) మన ఊరు మన కుంట
– పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు