జైనమతాన్ని అవలంబించిన రాష్ట్రకూట రాజు?
- జైన మతం
1. కైవల్యం అనేది ఏ మతానికి సంబంధించినది?
1) బుద్ధిజం 2) జైనిజం
3) హిందూయిజం 4) సిక్కిజం
2. మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడిని నారాయణుడి అవతారంగా పేర్కొన్న పురాణం ఏది?
1) విష్ణు పురాణం
2) భాగవత పురాణం
3) బ్రహ్మ వైవర్త పురాణం
4) ఎ, బి
3. జైనులను ప్రారంభంలో ‘నిగ్రంథులు’ అని పిలిచేవారు. నిగ్రంథులు అంటే అర్థం?
1) మార్గం చూపేవారు
2) మోక్షాన్ని ప్రసాదించేవారు
3) బంధాల నుంచి బయటపడిన వారు
4) ఏదీ కాదు
4. ప్రాచీన సమాజంలో ఏ వర్గం వారు జైన మతాన్ని ఎక్కువగా అనుసరించేవారు?
1) వర్తకులు 2) వృత్తిపని వారు
3) వ్యవసాయదారులు
4) క్షత్రియులు
5. నాలుగో బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షుడెవరు?
1) వసు మిత్రుడు 2) అశ్వ ఘోషుడు
3) నాగసేనుడు 4) ధృవసేనుడు
6. చాముండరాయ నిర్మించిన గోమఠేశ్వర/బాహుబలి విగ్రహం కర్ణాటకలోని ఏ ప్రాంతం లో ఉంది?
1) ఐహోల్ 2) శ్రావణ బెళగోళ
3) పట్టడకల్ 4) హంపి
7. కుందనాచార్యుడు రచించిన గ్రంథాలు?
1) సమయ సార 2) పంచాస్టికాయ
3) ప్రవచన సార 4) ఎ, బి, సి
8. తెలంగాణలోని ప్రముఖ జైన క్షేత్రం ఏది?
1) భువనగిరి 2) జనగామ
3) అమరావతి 4) కొలనుపాక
9. జైన మతాభిమాని అయిన ప్రముఖ కళింగ పాలకుడు ఎవరు?
1) ఖారవేలుడు 2) ప్రతాపరుద్రుడు
3) నరసింహదేవ 4) అనంతచోడగాంగ
10. కింది వాటిలో సరైనది ఏది?
1) జైనమతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య 24
2) మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు
3) చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు
4) పైవన్నీ
11. శ్రావణ బెళగోళలో ప్రాణత్యాగం చేసిన రాజు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) బిందుసారుడు
3) అజాత శత్రువు 4) భద్రబాహడు
12. ప్రజల తిరుగుబాటులో హతుడైనశాతవాహన రాజు?
1) కుంతల శాతకర్ణి 2) శాతవాహనుడు
3) శివశ్రీ శాతకర్ణి 4) పులోమావి
13. ఆంధ్రదేశం, దక్షిణ భారతంలో జైనమతం ప్రచారం చేసినవారు?
1) సింహనది
2) కొండ కుందాచార్యుడు
3) సామంత భద్ర
4) బాలక పింఛ
14. కొండ కుందాచార్యుడు జైనమతంలో ఏ శాఖలను ప్రారంభించాడు?
1) శ్వేతంబర, దిగంబర
2) బలత్కారణ, వక్రగచ్చ
3) మహాయాన, హీనయాన
4) హీనయాన, వజ్రయాన
15. జైనమతాన్ని అవలంబించిన రాష్ట్రకూట రాజు?
1) అమోఘవర్షుడు
2) నాలుగో ఇంద్రుడు
3) ఎ, బి 4) ఎవరూ కాదు
16. జైనమతంలో 1వ తీర్థంకరుడు ఎవరు?
1) మహావీరుడు 2) పార్శనాథుడు
3) వృషభనాథుడు 4) నేమినాథుడు
17. ‘కూతురు ఎప్పుడూ దురవస్థకు మూలమని’ చెబుతూ ‘కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే’అని వివరించిన గ్రంథం?
1) శతపథ బ్రహ్మణ 2) కౌశుతాకి బ్రాహ్మణ
3) తైతరేయ బ్రాహ్మణ
4) ఐతరేయ బ్రాహ్మణ
18. జైన మత వాస్తవ స్థాపకుడు?
1) రుషభనాథ 2) పార్శనాథ
3) నేమి నాథ
4) వర్ధమాన మహావీర
19. చారిత్రక జైనమత స్థాపకుడు పార్శనాథుడు ఏ ప్రాంతానికి చెందినవాడు?
1) బెనారస్ 2) పాటలీపుత్రం
3) రాజగృహం 4) వైశాలి
20. వర్ధమాన మహావీరుడు ఏ రాజు సమకాలికుడు?
1) మహా పద్మనందుడు
2) బింబిసారుడు
3) బిందుసారుడు 4) కాలాశోకుడు
21. మహావీరుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం?
1) కుంద గ్రామం 2) వైశాలి
3) గయ 4) జృంభిక గ్రామం
22. మహావీరుడి మొదటి శిష్యుడు?
1) జామాలి 2) ఆనందుడు
3) గోసల మస్కరిపుత్ర
4) భద్రబాహు
23. జైన సంఘం మొదటి థేర (అధ్యక్షుడు) ఎవరు?
1) భద్రబాహు 2) స్థూల భద్ర
3) ఆర్య సుదర్శన్ 4) జామాలి
24. ఆరో థేర అయిన భద్రబాహు మగధలో క్షామం వల్ల దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు తెలియజేస్తున్న గ్రంథం ఏది?
1) గాథాకోశ 2) పరిశిష్టపర్వన్
3) యశఃస్థిలక 4) వైరాగ్య తరంగం
25. ‘ధాన్యం ద్వారా మోక్షం పొందవచ్చునని’ భావించిన మతశాఖ ఏది?
1) జైనమతం 2) మహాయానం
3) వజ్రయానం 4) హీనయానం
26. జైనులు తమ మత సిద్ధాంతాలను ఏ భాషలో ప్రచారం చేశారు?
1) సంస్కృతం 2) పాళీ
3) ప్రాకృత 4) అర్ధమాగధి
27. మహావీరుడు ఎవరి గృహంలో మరణించాడు?
1) అజాత శత్రువు 2) ప్రసేనజిత్తు
3) ప్రద్యోతుడు 4) హస్తిపాలుడు
28. గుణదారులంటే ఎవరు?
1) బంధాల నుంచి బయట పడినవారు
2) ఇంటి నుంచి నిష్క్రమించినవారు
3) మార్గం చూపేవారు
4) మహావీరుని మతప్రచార సంఘాలకు అధిపతులు
29. జైన మతాన్ని ఏమంటారు?
1) శాద్వాదం 2) వీతరగం
3) తాత్వికచింతన 4) వేదాంతం
30. జైనుల ప్రార్థనా మందిరాలను ఏమంటారు?
1) బసది 2) విహారం
3) చైత్యం 4) పైవేవీ కాదు
31. చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించనవారు ఎవరు?
1) పార్శనాథ 2) సంభవనాథ
3) రుషభనాథ
4) వర్ధమాన మహావీర
32. ‘తీర్థంకరుడు’ అంటే అర్థం ఏమిటి?
1) మోక్షం ప్రసాదించేవాడు
2) సంసార నావ దాటించేవాడు
3) మార్గం చూపేవాడు
4) బి, సి
33. కింది వాటిలో సరైనది ఏది?
1) మొదటి జైన సంగీతి స్థూల భద్రుడి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది
2) మొదటి జైన సంగీతిలో మహావీరుడి బోధనలను 12 అంగాలుగా అర్ధమాగధి భాషలో రచించారు
3) రెండో జైన సంగీతి వల్లభి (గుజరాత్)లో దేవర్షి క్షమశ్రమణుడి అధ్యక్షతన జరిగింది
4) పైవన్నీ
34. మహావీరుడు మరణించిన ప్రదేశం?
1) కుశినగర 2) వైశాలి
3) పావా 4) రాజగృహ
35. మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది?
1) పాటలీపుత్రం 2) వల్లభి
3) జృంభిక గ్రామం 4) వైశాలి
36. జైన పండితుడు హేమచంద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) అమోఘవర్షుడు 2) కుమారపాలుడు
3) జయసింహ సిద్ధరాజు
4) ఖారవేలుడు
37. దక్షిణాదిలో జైనమతాన్ని ప్రచారం చేసినవారు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) భద్రబాహు
3) స్థూల బాహు 4) సుదర్శన్
38. జైనమతాన్ని లిచ్చవీల రాజమతంగా చేసినవారు?
1) చేతక 2) కుమారదేవ
3) అభయ 4) ఉదయనుడు
39. పంచవ్రతాల్లో చేర్చిన 5వ సూత్రం?
1) అసత్యమాడరాదు
2) ఆస్తులు కలిగి ఉండరాదు
3) బ్రహ్మచర్యం పాటించాలి
4) జీవ హింస చేయరాదు
40. సల్లేఖనమనగా?
1) పంచవ్రతాలను సరిగ్గా ఆచరించడం
2) త్రిరత్నాలపై నమ్మకం
3) తీర్థంకరులపై అచంచల విశ్వాసం
4) ఉపవాసం ద్వారా ప్రాణత్యాగం చేయడం
41. మహావీరుడు తన బోధనలు ఏ భాషలో చేశాడు?
1) అర్ధమాగధి 2) ప్రాకృతం
3) సంస్కృతం 4) మాగధి
42. పార్శనాథుని బోధనలకు మహావీరుడు చేర్చిన కొత్త అంశం?
1) అసత్య
2) అపరిగ్రహం (ఆస్తిపాస్తులు ఉండరాదు)
3) అస్తేయం (దొంగతనం చేయరాదు)
4) బ్రహ్మచర్యం
43. త్రిరత్నాలు ప్రవచించిన వారు?
1) మనువు 2) గణపద
3) గౌతమబుద్ధ 4) మహావీర
44. జైనమతంలో పోసద లేదా ఉపోసత అంటే?
1) కొత్తవారిని జైన మంతంలోకి సభ్యులుగా తీసుకునే కార్యక్రమం
2) జైన ఉపాసకులు పున్నమి రోజు ఉపవాసం ఉండటం
3) జైనులు తమ తప్పులను అంగీకరించే కార్యక్రమం
4) నియమ ఉల్లంఘనకు విధించే శిక్ష
45. పార్శనాథుడికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) కాశీ రాజ్యానికి చెందినవాడు
2) వర్ధమానుడి కంటే 250 ఏళ్ల ముందు జీవించాడు
3) పార్శనాథుడి తల్లిదండ్రులు- అశ్వసేనుడు, వామలాదేవి
4) పైవన్నీ
46. ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలను బోధించింది ఎవరు?
1) వర్ధమాన మహావీరుడు
2) బుద్ధుడు
3) పార్శనాథుడు 4) అజితనాథుడు
47. జైనమత పంచ సూత్రాల్లో నాలుగింటిని పార్శనాథుడు రూపొందించగా, వాటికి బ్రహ్మచర్య సూత్రాన్ని చేర్చింది ఎవరు?
1) వర్ధమాన మహావీరుడు
2) నేమినాథ
3) సంభవనాథ 4) అరిష్టనేమి
48. వర్ధమానుడికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1) బిరుదులు- జినుడు, మహావీర, కేవలి
2) జ్ఞానోదయం పొందిన స్థలం- జృంభిక గ్రామం
3) నిర్యాణం చెందిన ప్రాంతం- పావాపురి
4) పైవన్నీ
49. బసదులు ఏ మతానికి సంబంధించినవి?
1) బౌద్ధం 2) జైనం
3) హిందూ 4) అజీవిక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు