ఇన్నోవేషన్‌కు చేయూత – డిజిటల్ నైపుణ్యాల వృద్ధి
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
ఐటీ అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ ముఖ్య కేంద్రం ఇందుకుగాను పెద్ద సంఖ్యలో నైపుణ్యత కలిగిన శ్రామికశక్తి అవసరం.దీనికి మరింత ప్రోత్సాహం అందివ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఆధారిత రంగం, ఆరోగ్య సంరక్షణ, ఏరో స్పేస్, బ్యాంకింగ్‌ల్లో నైపుణ్యత గల శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK).డిగ్రీ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్లకు పరిశ్రమకు సంబంధించిన టెక్నికల్, నాన్ టెక్నికల్ నైపుణ్యాలు అందించడం ఇటర్న్షిప్స్, ఫినిషింగ్ స్కూల్స్ మొదలగు పలురకాలైన ఇంటర్నేషనల్స్ ద్వారా పరిశ్రమకు సరిపడ నైపుణ్య కార్యక్రమాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. టాస్క్ పలు ప్రైవేట్ పరిశ్రమలతో కలిసి పనిచేస్తుంది.
టాస్క్ శిక్షణ అందిస్తున్న రంగాలు
- ఐటీ, ఐటీ ఆధారిత సేవలు
- లైఫ్ సైన్సెస్
- ఆరోగ్య సంరక్షణ
- ఏరోస్పేస్
- బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సేవలు
టాస్క్ ద్వారా 700 కాలేజీల నుంచి 3,07,847 మంది విద్యార్థులను శిక్షణకు ఎంపిచేశారు. 2918 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్నారు. వ్యవస్థాపకతను పెంపొందించడం లక్ష్యంగా మార్గనిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కింద 1329 మంది ఆరోగ్య సంరక్షణ ఉద్యోగులు శిక్షణ పొందారు.
టాస్క్ అత్యుత్తమ శిక్షణను అందించినందు కు 2021లో గ్లోబల్ ఇగ్నైట్ ఎక్స్‌లెన్స్ అవార్డును, ప్రపంచ విద్యలో యూత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ అవార్డును తీసుకుంది.
ఎఫ్-టెక్ 2.0 కార్యక్రమం ద్వారా ఏక కాలంలో అత్యధిక విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించింది.
డిజిటల్ లిటరసీ 2015 ఆగస్టు 27న జేఎన్టీయూ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
ఉద్దేశం : ఇ మెయిల్ పంపడం, సమాచారం తెలుసుకోవడం, సోషల్ మీడియా ఉపయోగించుకోవడం, ఆన్లైన్ పుస్తకాలు .
తెలంగాణ ప్రభుత్వం NASSCOM సహకారంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA)
ఆధ్వర్యంలో తెలంగాణ డిజిథాన్ పేరుతో ఈ పథకం ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్టు
నగరంలో సుమారు 3000 పబ్లిక్ లొకేషన్ల లో ఉచిత వైఫై హాట్స్పాట్లు కల్పించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ప్రస్తుతం 1000 లొకేషన్లలో ఏర్పాటు చేశారు.
ఈ హాట్స్పాట్ల ద్వారా ప్రతినెల ట్రాన్స్ఫర్ అవుతున్న డాటా 40 టి.బి
ఈ ప్రాజెక్టును 5 జిల్లా ప్రధాన కేంద్రాలకు విస్తరిస్తున్నారు.
టిస్ క్లాస్
రాష్ట్రంలోని ప్రతి హైస్కూల్లో (6-10 వరకు) డిజిటల్ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీలు అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఇది పిల్లల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందిస్తుంది. ఈకార్యక్రమం ద్వారా డిజిటల్ తరగతులను ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పాఠశాలలు -3000
ప్రస్తుతం హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన అనేక యూనిట్లు కలవు.
వీటికి అత్యంత అనుకూలమైన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పాలసీ-2016ను రూపొందించింది.
విజన్
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ను అనుకూల కేంద్రంగా మార్చడం.
మానవశక్తి అభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో అవగాహన పెంచడం, ఉపాధి కల్పించడం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఈ కంపెనీలను ఆకర్షించడం.
ప్రపంచ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల ఔట్ సోర్సింగ్ అవకాశాల్లో పెద్ద వాటాను అందుకునే విధంగా కృషి చేయడం.
ఐపీ క్రియేషన్, దాని పరిరక్షణకు లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను కల్పించడం.
ప్రజలకు దేశీయ డిజిటల్ కంటెంట్ విద్య, వినోదాన్ని ప్రోత్సహించడం.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగానికి ఉత్ప్రేరకంగా వ్యవహరించేందుకు, అధునిక వసతులతో తెలంగాణ యానిమేషన్ అండ్ గేమింగ్, ఇమేజ్ సిటీని ఏర్పాటు చేయడం.
ఈ విధానం రూరల్ టెక్నాలజీ సెంటర్లను మండలాలు లేదా గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి కంపెనీలను ప్రోత్సహించడానికి ఉద్దేశించినది.
విజన్
సెంటర్‌ను మండలం లేదా గ్రామంలో ఏర్పాటు చేయవచ్చు.
మండలం లేదా గ్రామం జనాభా 50,000 కంటే తక్కువగా ఉండాలి.
ఐటీ సెంటర్ ఏర్పాటు చేసే ప్రదేశం సమీప నగరానికి కనీసం 50 కిలోమీటర్ల దూరంలో ఉండాలి.
లక్ష్యాలు
ప్రతిజిల్లాలో ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్‌ను అభివృద్ధి చేయడం.
ఆర్టీసీల ద్వారా కనీసం 2,300 మందికి ఉపాధి కల్పించడం.
అవసరమైన నైపుణ్యాల కోసం టాస్క్ ద్వారా 10,000 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం.
రూరల్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం పలు రకాల ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ప్రభుత్వంలో డేటా ఆధారిత నిర్ణయాలకు ఉత్ప్రేరకంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ డేటా విధానాన్ని ప్రవేశ పెట్టింది.
ఈ విధంగా కింది పలు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం ఆన్లైన్లో తేలికగా లభించడమే కాకుండా ప్రభుత్వ నిర్వహణలో పారదర్శకత ప్రోత్సహిస్తుంది.
భారతదేశంలో ఓపెన్ డేటా విధానాన్ని ప్రకటించిన రెండో రాష్ట్రం తెలంగాణ.మొదటిది సిక్కిం.
లక్ష్యాలు: ఇంటర్ ఆపరేబిలిటీ, గ్రేటర్ ఇన్ఫర్మేషన్ యాక్సెసబిలిటీ కోసం ఇన్ఫర్మేషన్ వ్యవస్థను నిర్మించవలసిన అవసరాన్ని తెలియజేయడం.
ఓపెన్ స్టాండర్స్‌ను ఉపయోగించుకుని, ఓపెన్ లైసెన్స్ కింద హ్యూమన్ రీడబుల్, మెషిన్ రీడబుల్ ఫార్మాట్స్‌తో తమ డేటాను సానుకూలంగా పంచుకునేందుకు ప్రభుత్వ శాఖలు సంస్థలు/శాఖలకు సహకరించడం
ప్రతి మంత్రిత్వశాఖలో డేటా జాబితాను రూపొందించవలసిన అవసరాన్ని తెలియ జేయడం.
నెగెటివ్ జాబితాలో భాగంగా లేని నిర్దిష్టమైన డేటా సైట్లను పబ్లిక్ లిస్టింగ్ చేసే ప్రక్రియను చేపట్టడం.
ఉత్తమ ఫలితాల కోసం డేటా యూజర్లతో వ్యవహరించే ప్రకియను నిర్వహించడం.
డేటాను షేరింగ్ చేసేటప్పుడు అన్ని ప్రైవసీ, రహస్యానికి సంబంధించిన అంశాలను
పరిష్కరించడం.
రాష్ట్రంలో ఆవిష్కరణలను పెంపొందించి బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీని ఆవిష్కరించింది.
భౌతిక, మౌలిక వసతులు, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీలను అభివృద్ధి చేయడం.
ఇన్నోవేషన్లకు సుస్థిరమైన నిధుల నమూనాలు కల్పించడంపై కేంద్రీకరించడం.
విద్య తొలి దశ నుంచే అభ్యసనం, ప్రయోగాలు చేయడం, నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మానన మూలధనాన్ని అభివృద్ధి పరచడం.
ఇన్నోవేషన్‌కు నిరంతరం ప్రోత్సహిస్తూ గుర్తించడం కోసం పరిశ్రమలతో కలిసి కృషి చేయడం.
అదనపు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా గ్రామీణ, సామాజిక పారిశ్రామిక స్థలంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడం.
ప్రోత్సాహకాలు
వీటిని 100 శాతం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా పొందే అవకాశం.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచింగ్ గ్రాంట్‌ను అందజేస్తుంది.
గుర్తింపు పొందిన కేంద్రాల్లోని స్టార్టప్‌లకు 50 లక్షలకు మించని టర్నోవర్ ఉన్నవాటికి మూడేళ్ల వరకూ సీఎస్ట్యాక్స్ వ్యాట్, సీఎస్టీ రీయింబర్స్మెంట్ అంతర్జాతీయ మార్కెటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కో కంపెనీకి రూ. 5 లక్షల వరకూ ప్రోత్సాహం అందిస్తారు.
డేటా క్యాప్చరింగ్, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రంగంలో రిసెర్చ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు వసతి కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
స్మార్ట్ గవర్నెన్స్ కార్యక్రమాలను బలోపేతం చేయడం, డేటా చోదక ప్రభుత్వ నిర్ణయా లను తీసుకోవడాన్ని ప్రోత్సహించడం.
వ్యాపారాలు, పరిశ్రమలకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించే ఆధునిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం.
డేటా అనలిటిక్స్ వనరులు, ఇన్‌హౌస్ నిపుణులను పెద్ద ఎత్తున తయారు చేయడం.
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే డేటాను ఆంక్షలు లేకుండా అందుబాటులో ఉంచడం. దాని పంపిణీ, ఇంటర్ ఆపరేబిలిటీకి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ డేటా అనలిటిక్స్ సంస్థలకు ప్రాధాన్యత గల కేంద్రంగా రాష్ర్టాన్ని తయారు చేయడం.
అద్భుతమైన ఆలోచనలను ఉత్పత్తులుగా మార్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం.
పౌరులకు స్మార్ట్ సొల్యూషన్లు అందించడానికి అనలిటిక్స్‌కు సద్వినియోగం చేసుకోవడం.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో బిగ్ డేటా పెరగడం, ప్రతి ఒక్కరూ విశ్లేషణ కోసం డేటా కలెక్షన్‌పై కేంద్రీకరించేలా ఈ పాలసీని తీసుకొచ్చింది.
అంశాలు
డేటా సెంటర్లకు అవసరమైన నిర్దిష్ట వసతులు కల్పించడం.
ఆకర్షణీయ వ్యాపార వాతావరణం కల్పించడం ద్వారా ఈ రంగంలో వృద్ధి పెంపొందించడం.
రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ, విద్యుత్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం.
డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక ముఖ్యమైన రంగం.
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విధాన చట్రం నాలుగు అంశాలను కలిగి ఉంది.
లీగల్ & రెగ్యులేటరీ,
కాైంప్ల్లెయన్స్, ఎన్ఫోర్స్మెంట్,
కాైంప్ల్లెయన్స్ బిల్డింగ్,
సైబర్ సెక్యూర్ కల్చర్, వ్యాపార అభివృద్ధి
విజన్ : రాష్ర్టాన్ని సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సైబర్ సెక్యూరిటీ సంస్థలు, స్టార్టప్‌లకు కేంద్రంగా తీర్చిదిద్దడం.
సైబర్ సెక్యూరిటీ సురక్షిత సైబర్ ప్రాక్టీస్‌లపై పౌరులకు అవగాహన కల్పించడం.
సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సంస్థలకు లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం.
కీలక సమాచార ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రక్షించడం.
డేటా షేరింగ్‌ను, ఉమ్మడి పరిశోధనా ప్రయత్నాలను ప్రమోట్ చేయడం.
ప్రొఫెషనల్స్‌ను సైబర్ సెక్యూరిటీ
నైపుణ్యాలు, విజ్ఞానం అందించడం.
రాష్ట్రంతో కలిసి పనిచేసే సైబర్ వారియర్స్‌ను ఏర్పాటు చేసుకోవడం.
హైదరాబాద్ కేంద్రంగా సంవత్సరానికి
25,000 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
దేశంలో 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్
ఈ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీని ఆవిష్కరించింది.
ఇ-వేస్ట్ రిఫర్బిషింగ్, రీ సైక్లింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సహకారం.
పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లు, క్లస్టర్లలో ఈ వేస్ట్‌ను వేరుచేయడం, రీ సైక్లింగ్ కోసం కొంత స్థలాన్ని కేటాయించడం.
వ్యర్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్‌లో పాల్గొనే పని వారికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసే ప్రక్రియను సిద్ధం చేయడం.
రి ఫర్‌బిషింగ్, రీ సైక్లింగ్‌ను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం మొదటి ఐదు రీసైక్లర్స్, రిఫర్బిషర్స్కు కనీసం 5 కోట్ల మూలధన పెట్టుబడిపై రూ. 1 కోటి సబ్సిడీ అందిస్తుంది.
డిస్ మాంట్లర్స్, కలెక్షన్ సెంటర్లకు రూ. కోటి కనీస మూలధన పెట్టుబడిపై 30 లక్షల సబ్సిడీ.
జీబీకే సౌజన్యంతో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు